Lakshayam Telugu moral story
Spread the love

Contents

లక్ష్యం

అనగనగా ఒక పెద్ద అడవి ఉండేది, ఆ అడవి  ఒక వూరికి సమీపం లో ఉండడం వలన ఊరిలో వారు వారికి అవసరం లేని వస్తువులు అన్ని ఆ అడవిలో పారవేసేవారు . ఆవిధంగా ఒక పెద్ద స్నానాల  తొట్టె  ఒకటి ఆ అడవిలోకి చేరింది , ఆ తొట్టెను ఆవాసం గా (నివాసం) చేసుకొని చాలా  కీటకాలు ( బల్లులు,చీమలు,కందిరీగలు, తొండలు ,మిడతలు ఇంకా చాలా… )దానిలో నివసిస్తూ ఉండేవి .

ఆ తొట్టె నిర్మాణం ప్రకారం దానిలోకి చేరిన నీరు బయటకి పోయే అందుకు వీలుగా దానికి క్రింద ఒక  రంధ్రము మూతతో మూయబడి ఉండేది.ఎప్పుడైనా  వర్షం పడి  తొట్టెలోకి నీరు చేరినట్లైతే ,ఆ నీరు  బయటకు పోవడానికి క్రింద వున్న రంద్రం యొక్క మూత తీయవలసి వచ్చేది, ఆ భాద్యతను అన్ని కీటకాలు కలసి ఒక బలమైన కందిరీగకు అప్పగించాయి . ఎప్పుడు వర్షం పడి  నీరు చేరినా తొట్టె మూత తీసి ఆ కందిరీగ తన పనిని చక్కగా నిర్వర్తించేది .

అలాగే ఒకరోజు అనుకోకుండా పెద్ద గాలి దుమ్ము వర్షం రావడం తో , ఒక పుచ్చకాయ ఎక్కడినుండో గాలికి కొట్టుకుంటూ వచ్చి తొట్టెలో నీరుపోయే రంద్రానికి అడ్డంగా వచ్చి పడింది . అంతే అక్కడున్న కీటకాలు అన్నింటికీ ఆ పుచ్చకాయను చూసే సరికి చెప్పలేనంత భయం వేసింది ,దానిని అక్కడ నుండి ఎలా తీసివేయాలా అనే ఆలోచనలో పడ్డాయి .

పదుల సంఖ్యలో కొన్ని బలమైన కందిరీగలు వచ్చి దానిని కదుపుదాం అని శతవిధాలా ప్రయత్నించాయి కానీ అది ఇసుమంతైనా కదలలేదు . తరువాత రకరకాల కీటకాలు వచ్చి తమవంతు ప్రయత్నం చేశాయి కానీ ప్రయోజనం లేక పోయింది ,ఇంక ఆ పుచ్చకాయను అక్కడనుండి తీయడం తమ వల్ల  కావడం లేదని  అన్ని నిరాశచెంది అక్కడనుండి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాయి .

Lakshayam Telugu moral story for kids ||లక్ష్యం||

అప్పుడు…

అక్కడకు ఒక చిన్న చీమ వచ్చి నేను కూడా ప్రయత్నించ వచ్చా అని అడిగింది ,దానిని చూసి మిగిలిన కీటకాలు అన్ని నవ్వి ఇంత బలమైన మావల్ల కానిది నీవల్ల అవుతుందా అని  దానిని హేళన చేశాయి .

అప్పుడు చీమ వాటితో మీరు ఎలాగు ఈ తొట్టెను విడిచి వెళ్ళిపోదాం అని నిర్ణయించుకున్నారు కాబట్టి ఆఖరి  ప్రయత్నంగా నన్నుకూడా ఒక్కసారి ప్రయత్నించనివ్వండి అని వాటిని కోరింది. అప్పుడు అన్ని కీటకాలు సరే నీ ప్రయత్నం నువ్వు చేయి అని చీమకు అంగీకారం తెలిపాయి .

అప్పుడు చీమ తనతో పాటు కొన్ని వందలలో చీమలను తోడు తెచ్చుకొని కొంచం కొంచంగా పుచ్చకాయను ముక్కలుగా చేసి అక్కడనుండి తరలించడం ప్రారంభించాయి . అలా కొన్ని రోజులు నిర్విరామంగా ప్రయత్నించిన మొత్తం పుచ్చకాయను అక్కడనుండి తొలగించాయి.

చీమ నిర్విరామ  ప్రయత్నాన్ని దాని విజయాన్ని చూసిన మిగిలిన కీటకాలు అన్ని చీమను అభినందించాయి . ఏదయినా  లక్ష్యాన్ని  చేరుకోవాలి  అంటే దానికోసం పెద్ద పెద్ద ప్రణాళికలు చేసుకొని  దానిని జటిలం(కష్టతరం) చేసుకోకూడదు అని  చిన్న చిన్న ప్రణాళికల ద్వారా కూడా గమ్యాన్ని చేరవచ్చని అన్ని తెలుసుకున్నాయి .  ఆ  రోజు నుండి మిగిలిన కీటకాలన్నీ చిన్న జీవులను తక్కువ చేసి మాటలాడడం మానివేశాయి,వాటికి కూడా కొన్ని బాధ్యతలు అప్పగించాయి .

 

నీతి :

పెద్ద లక్ష్యాలు సాదించాలి అనే ఆలోచన చాలా ముఖ్యమైనది కానీ అదే సమయంలో అవి చాలా ఒత్తిడిని సృష్టిస్తాయి. మొదటి సారి దానిని సాధించడం అసాధ్యంగా అనిపించవచ్చు . అందుకే సాధించడానికి సులభమైన చిన్న లక్ష్యాలను నిర్దేశించుకోవడం ముఖ్యం అది మానసిక ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది .
చాలా సందర్భాల్లో, ఒక సమస్యను పరిష్కరించడానికి ఒకటి కంటే ఎక్కువ మార్గాలు ఉంటాయి,మనం వాటిలో కష్టమైన దాన్ని ఎంచుకొని మానసికంగా శారీరకం గా కుంగిపోవడం కన్నా, ఒక అడుగు వెనక్కి వేసి, మొత్తం పరిస్థితిని మరొకసారి పరిశీలించడం మంచిది, అప్పుడే మనకు  సరైన ఆలోచనలు వస్తాయి.

Lakshayam Telugu moral story for kids ||లక్ష్యం||

For more moral stories please visit: సమయస్ఫూర్తి

For more moral stories please visit: Top ten telugu moral stories for kids 

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!