stories for kids in telugu
Spread the love

Contents

Stories For Kids in Telugu || కథలు తెలుగులో ||

అంతా మన మంచికే

Stories For Kids in Telugu…

stories for kids in telugu

అనగనగా ఒక అడవి పక్కన చిన్న పల్లెటూరు ఉండేది. ఆ ఊరిలో ఒక పెద్దావిడ ఒంటరిగా నివసిస్తూ ఉండేది .ఆమె తన చుట్టుపక్కల వారితో ఎంతో స్నేహంగా తలలో నాలుకలా కలిసి పోయేది.

అప్పుడు చలి కాలం ప్రారంభమైంది పెద్దావిడ ఇంట్లో చలి కాచుకోవడానికి ,వంటకి కట్టెలు అయిపోయాయి అందుకు ఆవిడ కట్టెలు తెచ్చుకోవడం కోసం పక్కనున్న అడవికి గొడ్డలి తీసుకుని బయలుదేరుతుంది.

కొంత దూరం నడిచిన తర్వాత ఆమెకు మార్గమధ్యంలో ఒక పెద్ద గుంట కనబడింది ఏమిటా అని దగ్గరకు వెళ్లి చూస్తే దానిలో ఒక మట్టి కుండ మూత పెట్టబడి ఉంది. ఆవిడ  దాని దగ్గరకు వెళ్లి కుండ పైన ఉన్న మూత తీసింది ,ఆశ్చర్యం దానిలో నిండుగా బంగారు నాణాలు ఉన్నాయి. ఆమె దానిని చూసి ఆహా నేను ఎంత అదృష్టవంతురాలిని ఈ బంగారం అంతా నాదే అనుకొని కుండ పైకి లేపింది కానీ అది చాలా బరువుగా ఉండడంతో దానిని ఇంటికి తీసుకొని వెళ్ళడానికి పక్కనున్న ఒక చిన్న బండి మీద కుండను ఉంచింది. ఆ బండికి ఉన్న తాడును పట్టుకుని లాగడం ప్రారంభించింది .

తన మనసులో ఆహా! ఎంత బంగారం, ఈ బంగారంతో నేను ఒక పెద్ద ఇల్లు కొనుక్కుంటాను దానితో పాటు ఒక మంచి చెక్క కుర్చీ కొనుక్కుంటాను , రోజూ ఆ కుర్చీలో కూర్చుని చక్కని టీ తాగుతాను అని ఊహించుకుంటూ ఉంటుంది.

అలా కొంత దూరం బండిని లాగాక ఆమెకు ఆయాసం అనిపించి వెనుకకు తిరిగి చూసింది ఆశ్చర్యం కుండలో బంగారం ఉండవలసిన స్థానంలో వెండి నాణాలు ఉన్నాయి. ఆమె వాటిని చూసి అంతా నా మంచికే జరిగింది అయినా పర్వాలేదు నేను ఒక చిన్న ఇల్లు కట్టుకుంటాను ,ఒక మంచి కుర్చీ కొనుక్కుంటాను దానిలో రోజు ఆనందంగా కూర్చుని టీ తాగుతాను ,అనుకుని మళ్లీ ఆ బండిని లాగడం ప్రారంభించింది. అలా కొంత దూరం వెళ్ళాక అలసటగా అనిపించి బండి ఆపి వెనుకకు తిరిగి చూసింది. ఈసారి వెండి నాణాలు ఉండవలసిన స్థానంలో ఒక ఇనుప ముద్ద ఆమెకు కనబడింది అప్పుడు ఆమె దానిని చూసి అంతా మంచికి జరిగింది నేను దీనిని అమ్మి వచ్చిన డబ్బుతో ఆనందంగా జీవిస్తారు అనుకొని మళ్ళీ బండి లాగడం ప్రారంభించింది. మళ్ళీ కొంత దూరం వెళ్ళాక ఆమె వెనుతిరిగి చూసింది ఇనుము ముద్ద ఉండవలసిన స్థానంలో ఒక పెద్ద బండరాయి కనబడింది, ఆమె దానిని చూచి ఆహా ఇది నా మంచికే దొరికింది ఎంతో కాలంగా నా తలుపు  మూయడానికి చాలా ఇబ్బంది పడుతున్నాను ఇప్పుడు ఈ రాయి తో నేను నా తలుపు ను మూస్తాను,అనుకొని మళ్ళీ బండి లాగడం ప్రారంభించింది .

అలా…

కొంత దూరం వెళ్ళాక అలసిపోయి మళ్లీ వెనుకకు తిరిగి చూసింది అప్పుడు రాయి ఉండవలసిన స్థానంలో తనకి ఒక దూది ఉండ కనబడింది, అది ఆమె చూస్తుండగానే ఒక విచిత్ర జీవిలా తయారయింది ,అది చూడటానికి చాలా భయంకరంగా ఉంది దానిని చూసి ఆమె నువ్వు చూడడానికి చాలా విచిత్రంగా,చక్కగా ఉన్నావు నేను చాలా కాలంగా ఒంటరిగా జీవిస్తున్నాను నీవు నాతో పాటు నా ఇంట్లో ఉంటావా అని అడిగింది. అప్పుడు ఆ జీవి చాలా కోపంగా నేను నీకు మొదట బంగారం ఆశ చూపాను తరువాత దానిని తీసివేసి వెండిగా మార్చాను తర్వాత దానిని ఇనుముగా, రాయిగా మార్చాను అయినా కూడా నువ్వు ఆనందంగానే ప్రతిదానిని స్వీకరించావు అని అంటుంది. ఆ మాటలకు పెద్దావిడ జీవితంలో అన్నీ మన మంచికే జరుగుతాయి అని నేను ఎప్పుడూ నమ్ముతాను అందుకే నేను ప్రతిదానిని ఆనందంగా స్వీకరిస్తాను అని చెబుతుంది, ఆమె మాటలకు విసుగుచెందిన వింత జీవి వెంటనే మాయమైపోతుంది.

పెద్దావిడ నవ్వుకొని తన ఇంటికి వెళ్తుంది ఇంటి ముందు ఒక పెద్ద బండరాయి కనబడేసరికి అబ్బా! దీనిని నేను కుర్చీ లాగా ఉపయోగించుకుంటాను అని అనుకుంటుంది ,అప్పుడు ఆశ్చర్యంగా ఆ బండరాయి ఒక చక్కని చెక్క కుర్చీ గా మారిపోతుంది దానిని చూసి ఆమె చాలా ఆనందిస్తుంది .మరికొంత లోపలికి వెళ్ళేసరికి ఒక దగ్గర బంగారు నాణేలతో నిండిన కుండ మరో దగ్గర వెండి నాణాలతో నిండిన కుండ ఇంకో వైపు పెద్ద ఇనుప ముద్ద పెట్టబడి ఉంటాయి. ఆమె వాటన్నిటినీ చూసి మనసులో వింతజీవి కి కృతజ్ఞతలు తెలుపుతుంది.

తర్వాత ఆమె తన దగ్గర ఉన్న ధనంతో ఒక పెద్ద ఇల్లు నిర్మించుకుని ఆనందంగా జీవిస్తూ తన దగ్గర ఉన్న మిగిలిన ధనాన్ని తన చుట్టుపక్కల వారికి పంచి వారిలో కూడా ఆనందాన్ని నింపుతోంది.

Moral: జీవితంలో కొన్ని విషయాలు మన మంచికే జరుగుతాయి .


Stories For Kids in Telugu || కథలు తెలుగులో ||

సమయస్ఫూర్తి

Stories For Kids in Telugu…

stories for kids in telugu

ఒక పొలంలో మూడు గొర్రెలు మేత మేస్తూ ఉంటాయి, వాటిలో పెద్దది చాలా దృఢంగా, ఎత్తుగా ఉంటుంది. రెండవది దానికన్నా కొంచెం చిన్నది మూడవది చాలా చిన్నది.

అప్పుడు అన్నిటి  కన్నా చిన్నది మిగిలిన ఇద్దరితో కాలువకు అవతల ఉన్న పొలంలో చాలా తీయనైన గడ్డి ఉంటుందని నేను విన్నాను ,మనం ఆ కాలువ దాటి అవతలకు వెళ్లి ఆ పొలంలో ఉన్న గడ్డి తిందామా అంటుంది. అప్పుడు అన్నింటి కన్నా పెద్దది ముందు నువ్వు వెళ్లి తింటూ ఉండు తర్వాత నేను వస్తాను అని చెబుతోంది .

అప్పుడు చిన్న గొర్రె నెమ్మదిగా కాలువ పైన ఉన్న వంతెన ఎక్కుతుంది, వంతెన మధ్యలో ఉన్నప్పుడు కాలువ నుండి ఒక పెద్ద మొసలి బయటకు వచ్చి నేను నిన్ను తిందామని అనుకుంటున్నాను అని దానితో చెబుతోంది, అప్పుడు చిన్న గొర్రె  భయపడుతూ నేను చాలా చిన్న దానిని నాకు ఇంకా ఇద్దరు అన్నలు ఉన్నారు వారు నా కన్నా చాలా పెద్దగా ఉంటారు, నేను నీకు ఆహారంగా ఏవిధంగానూ సరిపోను, ఇప్పుడు నువ్వు నన్ను ఈ కాలువ దాటనిస్తే తరువాత మా అన్నలు వస్తారు అప్పుడు నువ్వు వారిని తినవచ్చు అని చెబుతుంది. చిన్న గొర్రె మాటలు వినిన మొసలి అవును ఇది చెప్పేది నిజమే కదా! తర్వాత వచ్చే పెద్ద గొర్రెలను నేను తృప్తిగా తింటాను, ఇప్పుడు దీనిని వదిలేస్తాను అనుకొని చిన్న గొర్రె తో నువ్వు వెళ్ళిపో అంటుంది.

అప్పుడు చిన్న గొర్రె బ్రతికిపోయాను అనుకొని కాలువ దాటి వెళ్ళి పోతుంది.

కొంతసేపటికి…

రెండవ గొర్రె కాలువ పై ఉన్న వంతెన మీదకు వస్తుంది, అప్పుడు మొసలి మళ్లీ నీటిలో నుంచి బయటకు వచ్చి నేను నిన్ను ఆహారంగా తింటాను అని అంటుంది .అప్పుడు రెండవ గొర్రె నేను నీకు ఆహారంగా సరిపోను నాకు ఒక అన్న ఉన్నాడు అతను చాలా బలిష్టంగా ఉంటాడు నువ్వు అతనిని తిన్నట్లయితే నీకు చాలా తృప్తిగా ఉంటుంది అని అంటుంది. దాని మాటలు వినే సరికి మొసలి లో ఆశ కలుగుతుంది, సరే ఇప్పుడు నువ్వు వెళ్ళిపో అని రెండవ గొర్రె వెళ్ళిపోవడానికి మొసలి అంగీకరిస్తుంది.

తమ అన్న యొక్క బలం గురించి తెలిసిన రెండు గొర్రెలు ఇప్పుడు ఏమి జరుగుతుంది అని కాలవ అవతల నుంచి గమనిస్తూ ఉంటాయి.

ఇంతలో పెద్ద గొర్రె కాలు మీద ఉన్న వంతెన మీదకు వస్తుంది, ఎప్పటి నుంచో దాని గురించి ఎదురు చూస్తున్న మొసలి నీటి నుంచి బయటకు వస్తుంది. మొసలిని చూడగానే విషయం అర్ధం అయిన గొర్రె తన బలమైన శరీరంతో మొసలి పైన ఒక్కసారిగా దూకుతుంది అంత బరువు ఒకేసారి పడేసరికి తట్టుకోలేక మొసలి అక్కడినుంచి నీటిలో దిగి బతుకుజీవుడా అంటూ పారిపోతుంది.

జరిగేదంతా పక్కనుంచి గమనిస్తున్న రెండు చిన్న గొర్రెలు తమ అన్నయ్య బలం చూసి గర్వ పడతాయి, ఆనందంగా కడుపునిండా తీయని గడ్డి తింటాయి.

Moral: అవకాశం వచ్చినప్పుడు వినియోగించుకునే వాడు తెలివైనవాడు.

 


Stories For Kids in Telugu || కథలు తెలుగులో ||

తెలివి తక్కువ కోడి

Stories For Kids in Telugu…

stories for kids in telugu

ఒక రోజు ఒక కోడి నిద్ర లేచి తన ఇంటిముందు కి వచ్చేసరికి దానికి ఒక కాగితం కనబడుతుంది, కోడి ఆ కాగితాన్ని ఆత్రంగా విప్పి చూస్తుంది దానిలో ఈ రోజు ఆకాశం కూలిపోతుంది అని రాసి ఉంటుంది. దానిని చూసి కంగారు పడిన కోడి వెంటనే కోడిపుంజు దగ్గరికి వెళ్లి జరిగిన విషయం అంతా చెబుతోంది కోడి మాటలు నమ్మిన కోడిపుంజు నిజంగా ఆకాశం కూలిపోతుందనుకొని భయపడుతుంది, అప్పుడు వారిద్దరూ కలిసి మిగిలిన వారికి విషయం చెబుదామని కంగారుగా బయలుదేరుతారు.

వారికి మార్గమధ్యంలో ఒక బాతు చెరువులో ఈత కొడుతూ కనబడుతుంది వారు దానితో ఆకాశం కూలిపోతుందని  చెబుతారు ,అది కూడా భయపడి వారితో బయలుదేరుతుంది వారు ముగ్గురు వెళుతూ ఉంటే వారికి ఒక పావురం కనబడుతుంది వారు పావురానికి కూడా జరిగిన విషయం చెబుతారు. అందరూ కలిసి హడావిడిగా తమను తాము కాపాడుకోవడానికి వెళుతూ ఉంటారు వారికి అక్కడ ఒక నక్క కనబడుతుంది ,నక్క ఎవరనే విషయం మర్చిపోయి వారు నక్కతోక జరిగిన విషయం చెబుతారు అప్పుడు నక్క భయపడకండి మీరు సురక్షితంగా ఉండే ఒక చోటు నాకు తెలుసు మనం అక్కడకు వెళ్ళి దాక్కుందాము అప్పుడు మనకు ఎటువంటి ఆపద సంభవించదు అని వాటితో నమ్మకంగా చెబుతోంది.

అసలే ప్రాణభయంతో ఉన్న వారందరూ నక్క మాటలు నమ్మి నక్క వెనకాలే వెళ్తారు . అప్పుడు నక్క ఒక గుహ చూపించి దాని లోపల వారిని ఉండమని చెప్పి తాను గుహ బయట వారికి కాపలాగా ఉంటానని చెప్పి బయటకు వెళుతుంది.

ఉదయం అయ్యే సరికి గుహ మొత్తం ఖాళీగా ఉంటుంది కానీ, మన నక్క బావ కడుపు మాత్రం నిండుగా ఉండి బుక్తాయసం తో గుహ ముందు కూర్చొని కాగితం మీద ఈ రోజు ఆకాశం కూలిపోతుంది అని మళ్లీ రాస్తూ ఉంటాడు.

అలా తమ తెలివి తక్కువతనంతో తో క్రూరమైన నక్కను నమ్మి  కోడి మిగిలిన జీవులన్నీ తమ ప్రాణాలు కోల్పోయాయి.

Moral:  అవివేకం విచక్షణను చంపేస్తుంది.


Stories For Kids in Telugu || కథలు తెలుగులో ||

అసలైన నిధి

 

friendship story for kids

వినయ్ వేసవికాలం సెలవుల్లో తన పాత పుస్తకాలు సర్దుతూ ఉంటే తనకు ఒక నిధికి సంబంధించిన ఒక పత్రం దొరుకుతుంది, తను దానిని చూసి చాలా ఆనంద పడి ఆ నిధిని ఏ విధంగా అయినా సంపాదించాలని ఇంటినుంచి ఎవ్వరికి చెప్పకుండా బయలుదేరుతాడు.

వినయ్ నిధి గురించి వెతుకుతూ వెతుకుతూ ఒక అడవిని చేరుకుంటాడు అడవి చాలా పెద్దగా భయంకరంగా ఉంటుంది . వినయ్ కి అడవిని చూసేసరికి భయంగా అనిపించి , తనకు ఎవరైనా తోడు ఉంటే బాగుంటుంది అనిపించి అక్కడ ఉన్న ఒక సింహం దగ్గరకు వెళ్లి నేను నిధి కోసం వెతుకుతున్నాను నువ్వు నాకు ఈ అడవిలో సహాయంగా ఉంటావా అని అడుగుతాడు. వినయ్ మాటలు విన్న సింహం సరే అని ఒప్పుకుంటుంది.

అలా వారిద్దరూ కొంత దూరం వెళ్ళాక వారు ఒక పెద్ద కొండ ఎక్కవలసి వస్తోంది కొండ ఎక్కే మార్గంలో ఎటువంటి ఆపద అయినా ఉంటే ముందే తెలుస్తుంది అనే ఉద్దేశంతో వినయ్ ఒక గ్రద్దను  సహాయంగా ఉంటావా అని అడుగుతాడు అందుకు గ్రద్ద సరే అని ఒప్పుకుంటుంది.

అలా…

వారు ముగ్గురూ కొంత దూరం వెళ్ళాక ఒక ఎడారి కనబడుతుంది ఎడారిలో చాలా వేడిగా ఉండి వారికి ఏ విధంగా నడవాలో అర్థం అవ్వదు అప్పుడు అక్కడ ఉన్న ఒక ఒంటె దగ్గరకు వినయ్ వెళ్లి ఈ ఎడారిలో దారి చూపించడానికి మాకు సహాయం గా ఉంటావా అని అడుగుతాడు. అప్పుడు ఒంటె సరే అని ఒప్పుకొని వారిని తన మీద ఎక్కించు కుంటుంది అలా వారు చాలా దూరం వెళ్ళాక అక్కడ ఒక సముద్రం కనబడుతుంది సముద్రంలో ఏవిధంగా వెళ్లాలో తెలియక వారు అక్కడ ఎదురు చూస్తూ ఉంటే అక్కడకు ఒక పెద్ద తాబేలు వస్తుంది .

దానిని చూసి వినయ్ మేము ఈ సముద్ర మార్గం గుండా వెళ్లి మా గమ్యం చేరుకోవడానికి నువ్వు మాకు సహాయం చేస్తావా అని అభ్యర్థిస్తాడు అప్పుడు తాబేలు సరే అని ఒప్పుకొని తన మీద వారందరిని ఎక్కించుకొని వారు వెళ్ళవలసిన చోటుకి చేరుస్తుంది .అలా వారు ఒక దీవిలోని కి వెళతారు అక్కడ ఒక పక్షి మీరు మీకు కావలసిన గమ్యం చేరుకున్నారు అని చెబుతుంది అప్పుడు వినయ్ మాకు కావలసిన నిధి ఎక్కడ ఉంది అని అడుగుతాడు ,అప్పుడు ఆ పక్షి నీకు కావలసిన నిధి నీ  కళ్ళ ముందే ఉంది అని అంటుంది అప్పుడు వారందరూ ఒకళ్ళని ఒకళ్ళు చూసుకుంటారు .అప్పుడు పక్షి మీ అందరి స్నేహమే అసలైన నిధి అని అంటుంది .అప్పుడు పక్షి మాటల్లో భావం అర్థమైన అందరూ అవును ఈ ప్రయాణంలో మనకి చక్కటి స్నేహం దొరికింది అని అందరూ ఆనందిస్తారు.

పిల్లలకు స్నేహం విలువ తెలియజేయడానికి చిన్న కల్పిత కథ.


Stories For Kids in Telugu || కథలు తెలుగులో ||

నిజం

truth story

అనగనగా ఒక పెద్ద రాజ్యం ఉంది, ఆ రాజ్యంలో రాజు గారికి లేక లేక ఒక కొడుకు జన్మిస్తాడు .రాజుగారు మొదట కొడుకు ను చూసిన వెంటనే ఆశ్చర్యపోతాడు, ఎందుకంటే అతని చెవులు ఎద్దు చెవులను పోలి ఉంటాయి. రాజుగారు తన కొడుకుని చూసి ఎంతో బాధపడి, సిగ్గుపడి తన కొడుకు ఎవరికీ కనపడకుండా ఉండే విధంగా ఒక మందిరంలో అతని ఉంచుతాడు.

తన కొడుకుని తను తప్ప ఎవరు చూడకుండా గట్టి బందోబస్తు చేస్తాడు. అలా కొన్ని రోజులు గడిచాక రాజకుమారుడి జుట్టు బాగా పెరిగిపోతుంది దానిని కత్తిరించడం రాజుగారి తరం కాదు అప్పుడు అతను ఒక తన కుమారుని జుట్టు కత్తిరించ వలసిందిగా ఒక క్షురకున్ని పిలుస్తాడు, అతను రాజకుమారుని జుట్టు కత్తిరిస్తూ అతని చెవులను చూసి ఆశ్చర్యపోతాడు.

జుట్టు కత్తిరించడం పూర్తి అయిపోయాక రాజుగారు అతనిని పిలిచి ఈ రహస్యం ఎవరికన్నా చెప్పినట్లయితే నిన్ను చెరసాలలు బంధిస్తానని అతనిని భయపెడతాడు. క్షురకుడు భయంతో నేను ఎవరికీ ఈ విషయం చెప్పనని రాజు గారికి మాటిచ్చి కొంత ధనం పుచ్చుకొని బయటకు వచ్చేస్తాడు, కానీ రహస్యం తెలిసాక అతనికి ఎవరితో అన్నా  రాజకుమారుడు విషయం పంచుకోవాలని చాలా అనిపిస్తూ ఉంటుంది. చాలా రోజులు అతను ఎవరికీ ఈ విషయం చెప్పకుండా దాచి పెడతాడు కానీ ఎవరితో అన్నా పంచుకోవాలని ఆశ తీరక ఒక పెద్ద చెట్టు దగ్గరికి వెళ్లి దాని మొదలు దగ్గర తనకు తెలిసిన రహస్యం అంత వెళ్లగక్కుతాడు ,విషయం చెప్పాక అతనికి చాలా తేలిక గా అనిపించి అక్కడనుంచి వెళ్ళి పోతాడు .

తరువాత….

కొన్ని రోజులకు ఒక డప్పు వాయించే మనిషి చెట్టు దగ్గరకు వచ్చి చెట్టు మంచిగా ఉందని దాని కాండం నరికి దానితో ఒక డప్పు చేయించుకుంటాడు. అతను ఆ డబ్బు తీసుకొని రాజ్యంలో మోగిస్తూ ఉంటే డప్పు నుంచి రాజకుమారి రహస్యం శబ్దంగా వస్తూ ఉంటుంది. డప్పు నుంచి వస్తున్న శబ్దం ద్వారా రాజ్యం లో చాలామందికి రహస్యం తెలిసిపోతుంది, కొంతమంది సైనికులు విషయం విని డప్పు వాయించే అతనిని రాజు గారి ముందు నిలబెడతారు .

అప్పుడు రాజు గారు అతనిని నీకు రహస్యం ఎలా తెలిసింది అని అడుగుతారు, అతను మహారాజా నాకు ఎటువంటి రహస్యం తెలీదు ఈ డప్పే రాజకుమారుడి రహస్యాన్ని రాజ్యమంతా చాటి చెపుతోంది అని చెబుతాడు .అతని మాటలకు కోపం వచ్చిన రాజుగారు ఇతనికి మరణ శిక్ష విధించండి  అని ఆజ్ఞ ఇస్తారు. అప్పుడు అక్కడే ఉన్న సేనాధిపతి మహారాజా రాజకుమారుని రహస్యం రాజ్యమంతా తెలిసిపోయింది మీరు ఇప్పుడు ఎంత మందిని శిక్షిస్తారు అని ధైర్యంగా రాజును ప్రశ్నిస్తాడు ,అప్పుడు రాజుగారు తన మంత్రిని పిలిచి విషయాన్ని వివరిస్తారు,అది విని  మంత్రి మహారాజా మీరు ఇంతకాలం రాజకుమారుని ఎవరికీ తెలియకుండా బంధించి మీరు ఆయనను చాలా బాధ పెట్టారు కానీ ఇప్పుడు విషయం అందరికీ తెలిసింది ఇప్పటికైనా మీరు రాకుమారుని విడుదల చేయాలని అభ్యర్థించాడు .అప్పుడు రాజు గారికి తాను ఇన్ని రోజులు రాజకుమారుని పట్ల ఎంత కఠినం గా ఉన్నది గుర్తుకు వచ్చి బాధపడి, డప్పు వాయించే అతనిని బయటకు విడుదల చేస్తాడు.

మరుసటి రోజు రాజుగారు రాజకుమారుని ఊరేగింపుగా ఏనుగు మీద తన సైన్యంతో పాటు పంపిస్తాడు, రాజ్యంలో ప్రజలందరూ రాజకుమారుని చూసి ఆనందించి హర్షధ్వానాలు చేస్తారు. ఇన్నాళ్ళకు తనకు స్వేచ్ఛ లభించినందుకు రాజకుమారుడు ఎంతో ఆనందింస్తాడు.

Moral: నిజం నిప్పులాంటిది అది ఎంత దాచిన దాగదు.

For more kids stories please visit : Telugu stories

Stories For Kids in Telugu…


Stories For Kids in Telugu || కథలు తెలుగులో ||

తృప్తి

Stories For Kids in Telugu…

satisfaction stories for kids

అనగనగా ఒక ఊరిలో ఒక చిన్న ఇంటిలో చేపలు పట్టే వ్యక్తి మరియు అతని భార్య నివసించేవారు.అతని పేరు రమణ ,రమణ చాలా మంచివాడు, రోజూ నది వద్దకు వెళ్ళి చేపలు పట్టి వాటిని అమ్మగా వచ్చిన  డబ్బు తీసుకొని వచ్చి భార్యకు ఇచ్చేవాడు. రమణ భార్య ఎప్పుడూ చాలా అసంతృప్తిగా ఉండేది రమణ ఎంత కష్టపడి సంపాదించిన తనకు ఇంకా ఏదో కావాలనే ఆశ తో ఉండేది. రమణ మనకు ఉండే దానితో మనం తృప్తి పడాలి అని ఎంత చెప్పినా అతని  మాటలు భార్య వినిపించుకునేది కాదు.

రోజులాగే ఆ రోజూ కూడా రమణ చేపలు పట్టడానికి నది కి వెళ్ళాడు, వల నీటిలో వేశాక వలలో చేపలు పడినట్లు అనిపించి రమణ దానిని పైకి లాగుదామని ప్రయత్నించాడు కానీ వల చాలా బరువుగా అనిపించింది. వల ఇంత బరువు గా ఉంది అంటే దానిలో చాలా చేపలు ఉండి ఉంటాయని భావించి రమణ దానిని తన బలం మొత్తం ఉపయోగించి పైకి లాగాడు. కానీ ఆశ్చర్యంగా దానిలో ఒకే ఒక చేప ఉంది అది చాలా ప్రకాశవంతంగా పెద్ద పెద్ద కళ్ళతో ఉంది. రమణ దానిని చూసి ఈ ఒక్క చేప ఇంత బరువు గా ఉందా!! అసలు దీని కడుపులో ఏముందో… అని అనుకున్నాడు.

అంత లో ఆ చేప నా కడుపులో ఏమి లేదు అని సమాధానం చెప్పింది .చేప మాట్లాడేసరికి కంగారు పడిన రమణ కొంచెం దూరం జరిగి ఏమిటీ…! నువ్వు మాట్లాడతావా అన్నాడు ,అప్పుడు చేప అవును నేను మాట్లాడతాను నేను ఈ నదిలో ఉన్న చేపల రాజ్యానికి మహారాజుని అని చెప్పింది.

అప్పుడు రమణ నా వల బరువుని చూసి నేను ఈ రోజు చాలా చేపలు పట్టానని ఆశించాను కానీ నీవల్ల నా ఆశలన్నీ అడియాశలు అయ్యాయి అని అన్నాడు. అప్పుడు చేప నన్ను క్షమించు ,కానీ నీకు ఎప్పుడైనా అవసరం అయినప్పుడు నేను తప్పకుండా నీకు సహాయం గా ఉంటాను అని చెప్పింది,అప్పుడు రమణ దానిని నీటిలో కి వదిలేశాడు.

రమణ ఈ విషయాన్ని తన భార్యతో పంచుకోవాలని కంగారుగా ఇంటికి వెళ్తాడు, అక్కడ ఉన్న తన భార్య దగ్గరికి వెళ్లి నేను ఈరోజు ఒక విచిత్రమైన చేపను చూశాను అది నదిలో ఉన్న చేపలు అన్నింటికీ మహారాజు అంట అని చెపుతాడు. అప్పుడు అతని భార్య మరి నువ్వు ఆ చేపను ఏమి చేసావు? అని అడుగుతుంది .అప్పుడు రమణ నేను దానిని నీటిలో వదిలేశాను అని చెబుతాడు, రమణ మాటలకు కోపోద్రేకురాలైన రమణ భార్య ఏమిటీ…! అంత మంచి  అవకాశాన్ని ఎలా వదులుకున్నావ్ అని రమణ మీద అరుస్తుంది.

అప్పుడు…

రమణ నువ్వు ఏమి మాట్లాడుతున్నావు నాకు అర్థం కాలేదు..  అంటాడు ,అప్పుడు రమణ భార్య నువ్వు ఆ చేప దగ్గరకు వెళ్లి మనకు ఒక మంచి సౌకర్యవంతమైన ఇల్లు కావాలని అడుగు అంటుంది. అప్పుడు రమణ నేను ఏ విధంగా అడుగుతాను అని తన భార్యతో అంటాడు ,అప్పుడు ఆమె నువ్వు చేప ప్రాణాన్ని రక్షించావు పైగా నువ్వు ఆ చేప ని సహాయం అడగకపోతే నేను నీ దగ్గర నుండి వెళ్ళిపోతాను అని భయపెడుతుంది. భార్య అంటే అమితమైన ప్రేమ గల రమణ చేసేది లేక మళ్ళీ నది వద్దకు వెళ్ళి గట్టిగా చేపను పిలుస్తాడు. అప్పుడు చేప బయటకు వచ్చి, రమణ నేను నీకు ఏ విధమైన సహాయం చేయగలను అని అడుగుతుంది ,అందుకు రమణ తన భార్య కోరికను చేపకు వివరిస్తాడు అప్పుడు ఆ చేప నీ భార్య కోరిక ఇప్పటికే నెరవేరింది వెళ్లి చూడు అని చెప్పి నీటిలోకి మాయమై పోతుంది.

రమణ ఏమయిందో అని కంగారుగా ఇంటికి వెళ్ళే సరికి అతని భార్య ఒక చక్కటి ఇంటి ముందు నిలబడి ఉంటుంది.ఆమెను, ఇంటిని చూసి సంతోషించిన రమణ ఇప్పుడు నీకు తృప్తి గా ఉందా అని అడుగుతాడు, అప్పుడు ఆమె నేను బాగా ఆలోచించుకుని చెపుతాను అని అంటుంది. రమణ కి ఇంత మంచి ఇల్లు దొరికినప్పటికీ ఆమె ఎందుకు తృప్తిగా లేదో అర్థం కాలేదు.

మరుసటి రోజు..Stories For Kids in Telugu…

ఉదయం రమణ నిద్ర లేచే సరికి అతని భార్య రమణ దగ్గరకు వచ్చి నాకు ఇంతకన్నా పెద్ద భవనం కావాలి నువ్వు ఆ చేప వద్దకు వెళ్లి అడుగు లేకపోతే నేను చాలా బాధ పడతాను అని మళ్ళీ రమణ బెదిరిస్తుంది.

ఆ సమయం లో రమణ చేసేది లేక మళ్ళీ నది వద్దకు వెళ్లి చేపను పిలుస్తాడు అప్పుడు చేప చెప్పు రమణ నీకు ఏమి కావాలి అని అడుగుతుంది, అప్పుడు రమణ తన భార్య చెప్పిన విషయాన్ని వివరిస్తాడు అది విన్న చేప నీ భార్య ఏమి ఆశించి ఉందో అది ఆమెకు దక్కింది వెళ్లి చూడు  అని మళ్ళీ నీటిలోనికి మాయమై వెళ్ళిపోయింది .రమణ మళ్ళీ కంగారుగా ఇంటికి వెళ్ళే సరికి అతని ఇల్లు ఉండవలసిన స్థలంలో ఒక పెద్ద మందిరం ఉంది దానిలో రమణ భార్య విలాసంగా తిరుగుతూ కనబడింది రమణ ఆమె దగ్గరకు వెళ్లి ఇప్పుడు నీకు తృప్తి గా ఉందా అని అదుగుతాడు అప్పుడు ఆమె నేను ఆలోచించుకుని చెపుతాను అని మళ్ళీ అదే సమాధానం చెపుతుంది.

తర్వాత…

రోజు ఉదయం మళ్లీ ఆమె రమణ వద్దకు వచ్చి నాకు ఒక పెద్ద రాజమందిరం సేవకులు కావాలి, నాకు ఒక మహారాణి హోదా కావాలి నువ్వు వెళ్లి చేప ను అడుగు అని మళ్ళీ చెపుతుంది, రమణ చేసేదిలేక బాధగా మళ్ళీ చేప వద్దకు వెళ్లి నన్ను క్షమించు నా భార్య మళ్లీ ఇంకొక కోరిక కోరింది అని చెపుతాడు అప్పుడు చేప మీ భార్య కోరింది ఇప్పటికే జరిగిపోయింది అంటుంది. రమణ గబగబ ఇంటికి వెళ్లేసరికి తన భార్య ఒక పెద్ద రాజభవనంలో మహారాణిలా తన సింహాసనంపై కూర్చొని ఉంటుంది తన చుట్టూ కొంతమంది సేవకులు ఉంటారు. అప్పుడు రమణ ఆమె వద్దకు వెళ్లి నీకు ఇప్పుడు తృప్తి గా ఉందా అని అడుగుతాడు అప్పుడు ఆమె రాత్రంతా ఆలోచించుకొని ఉదయం చెబుతాను అని అతనితో అంటుంది ఆమె సమాధానంతో చాలా అసహనంగా అనిపించి చేసేది లేక నిద్ర ఉపక్రమిస్తాడు.

రమణ భార్య రాత్రంతా నిద్రపోకుండా అలాగే కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు అనుకోకుండా సూర్యోదయం అవుతుంది రమణ భార్యకు సూర్యుని చూసేసరికి చెప్పలేనంత కోపం వస్తుంది ఏమిటి నేను ఇంకా నిద్రపోకుండా సూర్యుడు వచ్చేసాడు అని అనుకొని తన భర్తను నాకు సూర్యుని పైన చంద్రుడిపైన అధికారం కావాలి నేను వాటిని నియంత్రించాలి నువ్వు వెళ్లి ఆ చేపను వరం ఇవ్వమని అడుగు అని పంపిస్తుంది .నిస్సహాయంగా చేప దగ్గరకు వెళ్లి తన భార్య కోరికను చెపుతాడు అప్పుడు చేప నీ భార్య కోరుకున్నది ఇప్పటికే జరిగింది వెళ్లి చూడు అని చెపుతుంది .అప్పుడు రమణ ఏమైందో అర్థం కాక హడావిడిగా ఇంటికి వెళతాడు అక్కడ రాజభవనంలో తన భార్య ఎక్కడా కనబడదు, రమణ తన భార్య కోసం వెతికి వెతికి అలసిపోయి చేప వద్దకు వచ్చి నా భార్య ఎక్కడ వుంది  నాకు కనబడడం లేదు అని చెప్తాడు.

ఆ మాట విని …

చేప నీ భార్య ఈ విశ్వాన్ని తన ఆధీనంలో ఉంచుకుందాం అనుకుంది కానీ ఈ విశ్వం మొత్తం భగవంతుని ఆధీనంలో మాత్రమే ఉంటుంది కనుక భగవంతుడు ఏవిధంగా కనబడడో అలాగే ఇప్పటి నుండి నీ భార్య కూడా ఎవరికీ కనబడదు అని చెబుతుందు, ఆ మాటలు విని బాధ పడిన రమణ మహారాజా నన్ను ,నన్ను నా భార్యను క్షమించండి నేను నా భార్యను మళ్ళి చూడాలి అనుకుంటున్నాను అని అభ్యర్థిస్తాడు. అప్పుడు చేప వరం ఒక్కసారి ఇచ్చాక మళ్లీ నేను దానిని తిరిగి తీసుకోలేను అంటుంది, అప్పుడు రమణ నీకు సహాయం చేసింది నేను ఇప్పటివరకు నువ్వు నా భార్య కోరికలు తీర్చావు కానీ మొదటిసారి నీ ప్రాణాన్ని కాపాడిన నాకు ఒక వరం ఇవ్వు అని వేడుకుంటాడు.

అప్పుడు చేప ఇదే నేను నీకు ఇస్తున్న ఆఖరి వరం ఏమి కావాలో చెప్పు అని అంటుంది .అప్పుడు రమణ బాగా ఆలోచించి  తృప్తిగా ఆనందంగా ఉండే నా భార్యను నాకు ఇవ్వండి అని అడుగుతాడు అప్పుడు నీవు కోరుకున్నదే జరిగింది అని చెబుతోంది అప్పుడు రమణ ఆనందంగా ఇంటికి వెళతాడు. అక్కడ ఒక చక్కని ఇంట్లో ఆనందంగా నవ్వుతూ తన భార్య తన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ,ఆమె రమణనను చూసి నన్ను క్షమించండి ఇన్నాళ్ళు నా కోరికలతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను కానీ మనకు ఉన్నదాంట్లోనే మనం తృప్తిగా ఆనందంగా ఉండగలం అని నేను గుర్తించ లేక పోయాను అని రమణకు క్షమాపణలు చెపుతుంది, తన భార్య లో వచ్చిన మార్పు చూసి రమణ ఎంతో సంతోషిస్తాడు అప్పటినుంచి రమణ అతని భార్య ఎటువంటి లోటు లేకుండా ఆనందంగా జీవిస్తారు.

Moral:తృప్తి లేని వారి జీవితం లో ఆనంద క్షణాలు చాలా తక్కువగా ఉంటాయి . 

 

కథ అనేది పిల్లలకు పెద్దలకు మధ్య మంచి విషయాలు నేర్పడానికి చక్కటి వారధి ,దానిని బాధ్యత కలిగిన తల్లిదండ్రులు అందరు వినియోగిస్తారని నమ్ముతున్నాను.

Stories For Kids in Telugu…

 

 

 

 

 

 

3 thoughts on “Stories For Kids in Telugu || కథలు తెలుగులో ||”
  1. చాలా చక్కగా అర్థమయ్యే రీతిలో కథను రాసారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!