who is che guevara
Spread the love

Contents

చేగువేరా  (విప్లవ కెరటం)

Who is Che Guevara ? Why he is famous? in Telugu this article explains about life of Che Guevara

 

తరచుగా మనకి అక్కడక్కడా కనిపిస్తున్న గంభీరమైన రూపం

ఎందరో ఆరాధిస్తున్న రూపం

ఉద్యమం ఎక్కడ మొదలైన అక్కడ కనిపించే రూపం

ఏముంది ఈ రూపం లో….  ఒక ఉద్యమానికి ఊపిరిపోసే అంత ,ఒక నిరాశకు ఆశాభావం జోడించే అంత,

అనే నా అన్వేషణ కి ఫలితం ఈ చేగువేరా (విప్లవ కెరటం).

చేగువేరా ఈయన అసలు పేరు ఎర్నెస్టో గువేరా ,అర్జెంటీనా లో 1928 జూన్ 14 న ఒక మధ్య తరగతి కుటుంబం లో జన్మించారు. చేగువేరా చిన్నతనం నుండి ఆస్తమా తో బాధపడేవారు . ఈయన వైద్యవిద్య చదువుతున్నప్పుడు తన స్నేహితుడితో కలసి మోటార్ సైకిల్ మీద దక్షిణ అమెరికా పర్యాటనకు వెళ్లారు . ఈ తొమ్మిదినెలల ప్రయాణం లో చేగువేరా సమాజం లో పేదరికం ఎంత దుర్భరంగా ఉందో  ,ప్రజలు ధనికుల చేతి లో అధికారుల చేతిలో ఎన్ని యిబ్బందులు పడుతున్నలో ప్రత్యక్షం గా తెలుసుకున్నాడు. విప్లవం ఒక్కటే సమాజం స్థితిగతులు మంచిగా  మార్చగలదని బలంగా నమ్మాడు.

తరువాత మళ్ళి వైద్యవిద్య కొనసాగించి 1953 లో డాక్టర్ పట్టా పొందాడు . ఆ సమయం లో క్యూబా దేశం నియంత బాటిస్టా ఆధీనం లో ఉండేది అక్కడి ప్రజలు బానిసత్వం లో జీవిస్తూ వుండే వారు , వారి విముక్తి కోసం ఫీడెల్ కాస్ట్రో పోరాటం చేస్తూవుండేవాడు . ఫీడెల్ కాస్ట్రో గురించి తెలుసుకున్న చేగువేరా ఆయన విప్లవ భావాలు నచ్చడం తో ,ఫీడెల్ కాస్ట్రో తో కలసి క్యూబా విముక్తి పోరాటం లో పాల్గొన్నాడు . 1956-1959 మధ్యలో నియంత బాటిస్టా కు  ఫీడెల్ కాస్ట్రో కు మధ్య  క్యూబా లో జరిగిన గెరిల్లా పోరాటాల్లో చేగువేరా మిలటరీ కంమాండర్ గా వ్యవహరించాడు అదేవిధంగా డాక్టర్ గాను తన  సేవలు అందించాడు. ఈ సమయం లోనే క్యూబా విప్లవకారులు  ఈయనను చే అనిపిలిచేవారు కారణం  గువేరా ఎవరినన్నా పిలిచే అప్పుడు చే అనే అర్జెంటీనా శబ్దం వాడేవాడు అందుకు అందరు ఈయనకు అలా పిలిచేవారు. 1959 లో క్యూబా లో జరిగిన తిరుగుబాటు విజయవంతం అయ్యి క్యూబా స్వతంత్ర అధికారం పొందింది .

స్వతంత్య్ర క్యూబా

కొత్త క్యూబా దేశం లో చేగువేరా జాతీయ బ్యాంకు అధ్యక్షుడు గా పనిచేశాడు తరువాత పరిశ్రమల మంత్రిగా వ్యవహరించారు. 36 ఏళ్ల వయసులో క్యూబా తరపున పాతినిధ్యం వహించి ఐక్యరాజ్య సమితి లో ప్రసంగించారు. తన అసమానమైన భావజాలం తో అక్కడ వున్నవారిని ప్రేరేపించారు . క్యూబా కి ప్రతినిధి గా ఎన్నో దేశాలు పర్యటించారు ,అదేవిధం గా 1959 లో నెహ్రు గారి ఆద్వర్యం లో మన భారత దేశాన్ని సందర్శించారు .

Who is Che Guevara

మళ్ళీ ప్రజలలోకి

క్యూబా దేశం సాధించిన విజయానికి ముగ్దుడై ఈ విజయం ,ఈ పోరాట పటిమ ,గొరిల్లా యుద్ధ విన్యాసాలు వర్ధమాన దేశాలకు పరిచయం చేయాలని విప్లవ పాఠాలు నేర్పాలనే ఉద్దేశం తో ,1965 లో తన అత్యున్నత స్థానాన్ని , గౌరవాన్ని ,హోదాని వదలి ఫీడెల్ కాస్ట్రో వద్దని వారిస్తున్నా వినకుండా దేశం విడచి వెళ్లి పోయాడు .

కొంతమంది తో ఒక సైన్యం ఏర్పాటు చేసి కొంతకాలం ఆఫ్రికాలో వున్నాడు అక్కడ కొన్ని గొరిల్లా పోరాటాల్లో జరిపి విఫలమయ్యాడు.  మళ్ళి 1966 లో దక్షిణ అమెరికాలో బొలివియా లో  నిరంకుశత్వ ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా పోరాడుతున్న విప్లవకారులతో   చేతులు కలిపి ఉద్యమాన్ని కి నాయకత్వం వహించాడు .  బొలీవియాలో సైనికులకు యుద్ధం లో అంత  నైపుణ్యత లేదు అందుకని చేగువేరా తన  సైన్యం గెలుస్తుంది అనే భావన తో వున్నాడు కానీ బొలివియా సైనికులకు అగ్రరాజ్యం నుండి ఆయుధ బలం లభించడం తో చేగువేరా సైన్యం వారిని  ఎదిరించి లేక పోయింది ఒక్కక్కరుగా చనిపోయారు చేగువేరా కు కూడా బులెట్ గాయం అయింది  , అప్పటి కే  ఆస్తమా వలన చేగువేరా ఆరోగ్యం కూడా క్షీణించింది .

అదే అదనుగా చేసుకొని బొలివియన్  సైన్యం చెగువేరా ని రహస్యంగా  బంధించి ఒక పాడుబడిన గది లో ఉంచారు . బొలీవియన్ ప్రభుత్వం చెగువేరాను చంపివేయాలని ఆజ్ఞ జారీచేసింది . 1967,అక్టోబర్ 9 న బొలీవియాన్ సైనికుడు  చెగువేరాను చంపడానికి వచ్చాడు అతను చెగువేరాని చూసి మరణం సంభవిస్తుందని అనుకుంటున్నావా అన్నాడు  అందుకు చేగువేరా నేను మరణించినా నా విప్లవ భావాలు ప్రపంచమంతా జీవించేవుంటాయి అన్నాడు గంభీరంగా ,అప్పుడు సైనికుడు చెగువేరాని తొమ్మిది సార్లు తుపాకీతో కాల్చాడు …  ఆ విధంగా చేగువేరా తన తుది శ్వాస విడిచాడు

నిజమైన విప్లవ కెరటం నేలకొరిగింది కానీ ఆయన  యిచ్చిన దైర్యం ,తెగువ,జీవించలేక జీవచ్ఛవం లాగ బ్రతికేవాళ్లకు ఆయన యిచ్చిన స్ఫూర్తి మరువలేనిది .

ఒకమనిషి తనకు ఒక స్థిరమైన ,హోదా కలిగిన లోటులేని  జీవితం  ఉంటే దానిని వదిలి వెళ్లడాన్నికి ఇష్టపడడు ,తాను తన కుటుంబం తన సుఖం అనే భావనలతో వుంటాడు  అని మనం అందరం బలంగా నమ్ముతాం కానీ చేగువేరా ఆ ఆలోచన తప్పులని నిరూపిస్తూ ఒకసారి డాక్టర్ వృత్తిని వదిలి బానిసత్వం లో మగ్గిపోతున్న ప్రజల కోసం  పోరాటం ప్రారంభించాడు మరోసారి తన అత్యున్నతమైన పదవిని తృణప్రాయంగా వదలి నిరంకుశ పాలనలో వున్న ప్రాంతాల లో  ప్రజలకు విప్లవ పాఠాలు నేర్పడానికి వెళ్ళాడు. ఎలా ఎన్నో సార్లు ప్రజలకు ఉన్నత మార్గదర్శాలూ యిచ్చాడు . తన తుది శ్వాసవరకు ప్రజల కొరకు ప్రజల కోసం పోరాడాడు చరిత్రలో విప్లవ పటం  పై తనదయిన ముద్రను వేసి చిరస్ధాయిగా నిలిచాడు .

Who is Che Guevara ? Why he is famous? in Telugu this article explains about life of Che Guevara

చేగువేరా మాటలు: ఒకరి కాలు  క్రింద బానిసలా నీచంగా బ్రతికేకన్నా … లేచి నిలబడి  ప్రాణం విడచి పెట్టడం మేలు .

భయపడడం ఎప్పుడు మానేస్తామో అప్పుడు మన జీవితం మొదలైనట్లు

Sireesha.Gummadi 

 

who is Elon musk

2 thoughts on “Who is Che Guevara ? Why he is famous? in Telugu”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!