Aditi rao and siddharth
వివాహ బంధంతో ఒక్కటైన హీరో సిద్దార్థ్, హీరోయిన్ అదితి రావు
విలక్షణ నటుడు హీరో సిద్దార్థ్, గద్వాల సంస్థానం పాలకుడి వారసురాలు అదితి రావుల విహాహం వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని రంగనాయకస్వామి ఆలయంలో కుటుంబ సభ్యులు, బంధువులు మధ్య ఘనంగా జరిగింది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో వారి పెళ్లి ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
ఫొటోల్లో గోధుమ వర్ణం బంగారపు అంచు చీరలో కెంపుల హారంతో దాని జత బుట్టకమ్మలతో అద్భుతంగా ఉన్న వధువుకు మరింత అందం పెంచేలా ఆమె ధరించిన ముక్కెర ఉంది.
వధువుకు ఏ మాత్రం తీసిపోను అన్నట్టుగా తెలుగుదనం ఉట్టిపడేలా బంగారుపుఅంచు ఉన్న తెల్లటి పంచ ,షర్టు ధరించిన హుందాగా
ఉన్నాడు సిద్దార్థ.
వారి వివాహబంధం ధృడంగా ఉండాలని వారు కలకాలం ఆనందంగా ఉండాలని ఆశిస్తూ…