Symptoms of dehydration in Telugu:
మన శరీరాన్ని ఎప్పుడూ హైడ్రేటెడ్ గా ఉంచుకోవడం చాలా అవసరం హైడ్రేషన్ అంటే శరీరానికి సరిపడా నీరు అందించడం. అసలు మన శరీరం హైడ్రేటెడ్ గా ఉందా లేదా డీహైడ్రేషన్ కు గురైందా తెలుసుకుని 10 సూచనలను తెలుసుకుందాం.
Contents
మన శరీరం యొక్క విధులకు సక్రమంగా నిర్వర్తించడానికి నీరు చాలా అవసరం. అసలు సరిపడా నీరు ఎందుకు తాగాలో కూడా తెలుసుకుందాం:
1.నీరు శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది, అవయవాలను రక్షిస్తుంది మరియు శరీరానికి శక్తిని ఇస్తుంది.
2. సెరోటోనిన్ ఉత్పత్తి ద్వారా మానసిక స్థితి మరియు నిద్రను నియంత్రించడం వలన హైడ్రేషన్ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
3. తగినన్ని నీటిని తీసుకోవడం వలన చర్మం ప్రకాశవంతంగా ఉంటుంది పైగా చర్మం పొడిబారినట్టుగా, చికాకుగా ఉండదు.
Symptoms of dehydration:
శరీరానికి ఎక్కువ నీరు అవసరమని తెలిపే 10 సూచనలు:
1. నోరు ఆరిపోయినట్టుగా పొడిబారిపోవడం అంటే నోటిలో తగినంత లాలాజల ఉత్పత్తి అవ్వడం లేదని అర్థం.
2. మన మూత్రం రంగు హైడ్రేషన్ స్థాయిలకు మంచి సూచిక. ముదురు పసుపు రంగు మూత్రం డీహైడ్రేషన్ ను సూచిస్తుంది.
3. తక్కువ మూత్రవిసర్జన చేయడం అనేది శరీరంలో నీటి శాతం తగ్గింది అనడానికి ఒక సూచన.
4. డీహైడ్రేషన్ మెదడుకు అందే రక్త ప్రవాహాన్ని ప్రభావితం చేస్తుంది, దీని వలన మైకము లేదా తేలికపాటి తలనొప్పి వస్తుంది.
5. శరీరం ద్రవాలు, ఎలక్ట్రోలైట్లను కోల్పోయినప్పుడు, కండరాలలో తిమ్మిరి కలుగుతుంది.
6. తలనొప్పికి డీహైడ్రేషన్ ఒక సాధారణ కారణం.
7. డీహైడ్రేషన్ వల్ల కళ్ల చుట్టూ ఉన్న చర్మం నిస్తేజంగా ఉబ్బినట్లుగా కనిపిస్తుంది.
8. తక్కువ నీటి స్థాయిలు తక్కువ రక్తపోటుకు మరియు బలహీనమైన రక్త ప్రసరణకు దారితీస్థాయి.
9. పగిలిన లేదా పొడి పెదవులు డీహైడ్రేషన్‌కు సంకేతం.
10. అప్పుడప్పుడూ ఈ డీహైడ్రేషన్ వల్ల జ్వరం కూడా సంభవిస్తుంది.
పిల్లలు నీరు తాగడం గుర్తుంచుకునేలా కొన్ని సూచనలు:
- వెరైటీ డిజైన్ లలో వుండే కప్పులు బాటిళ్లు వాళ్లకు బహుమతిగా ఇచ్చి వాటిలో నీరు తాగేలా ప్రోత్సహించండి.
- నీటి బదులు వారికీ నచ్చిన ఫ్రూట్ జ్యూస్ లు(షుగర్ లేకుండా) ఇవ్వండి.
- చెప్పిన విధంగా నీరు తాగితే వారికి చిన్న చిన్న బహుమతులు ఇవ్వండి.
- ముఖ్యంగా నీరు తాగడం వలన ప్రయోజనాలు తాగక పోవడం వలన నష్టాలు వారికి అర్ధమయ్యే రీతిలో నెమ్మదిగా వివరించండి.
- వారికి నీరు తాగడం గుర్తుచేసే విధంగా మొబైల్ లో రిమైండర్లు పెట్టండి
Symptoms of dehydration in Telugu:
సిఫార్సులు :
- నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ పురుషులకు రోజుకు 3 లీటర్లు మరియు స్త్రీలకు 2.2 లీటర్ల నీటిని తీసుకోవాలని సిఫార్సు చేస్తుంది.
- జ్వరం లేదా మూత్రం రంగును బట్టి డీహైడ్రేషన్ కు గురైనట్టు భావిస్తే లేదా పైన చెప్పిన విధంగా ఇతర లక్షణాలు కనిపిస్తే వైద్యుడిని సంప్రదించండి.
గుర్తుంచుకోండి: ఆరోగ్యకరమైన శరీరం మరియు మనస్సు కోసం నీరు చాలా ముఖ్యమైనది. హైడ్రేటెడ్‌గా ఉండటం ద్వారా, మీరు మెరుగైన శారీరక మానసిక శ్రేయస్సు, ప్రకాశవంతమైన చర్మం మరియు మెరుగైన ఆరోగ్యాన్ని పొందుతారు.
మీ ఇంటి పని తగ్గించే నేస్తాలు… మీ కోసం
జంక్ ఫుడ్‌ని ఆరోగ్యవంతంగా మార్చే చిట్కాలు
బరువును తగ్గించే సూపర్ చీజ్ లు