7 Hacks to Make Junk Food Healthy-జంక్ ఫుడ్‌ని ఆరోగ్యవంతంగా మార్చే చిట్కాలు
Spread the love

7 Hacks to Make Junk Food Healthy

Contents

7 Hacks to Make Junk Food Healthy:

జంక్ ఫుడ్ అంటే ప్రాణం కానీ ఆరోగ్యరీత్యా తినకూడదు …!

ఇప్పుడు ఏంచేద్దాం చెప్పండి ?

సరే ఇప్పుడు నేను జంక్ ఫుడ్‌ని ఆరోగ్యవంతంగా మార్చే చిట్కాలు కొన్ని చెబుతాను…

ఫ్రైకి బదులుగా బేక్ చేయండి…

నూనె వినియోగాన్ని తగ్గించడానికి డీప్ ఫ్రై చేయడానికి బదులుగా ఓవెన్ లేదా ఎయిర్ ఫ్రైయర్ ఉపయోగించండి. ఓవెన్ తో పోల్చుకుంటే ఎయిర్ ఫ్రైయర్ ఖరీదు చాలా తక్కువ.

ఉదాహరణకు చికెన్, ఫ్రెంచ్ ఫ్రైస్ ను నూనెలో వేయించకుండా ఓవెన్ లో  సులభంగా బేక్ చేయవచ్చు.

షుగర్ తగ్గించండి….

స్వీట్‌లో, జ్యూస్‌లో, కాఫీ, టీలలో చక్కెర శాతాన్ని తగ్గించండి. దాని బదులు తేనె, బెల్లం, పటికబెల్లం, ఖర్జురాలు, మాపుల్ సిరప్ లేదా స్టెవియా వంటి సహజ స్వీటెనర్లను ఉపయోగించండి. లేదా సహజ తీపి కోసం మీ ఆహారానికి పండ్లను జోడించండి.

 

ఆరోగ్యకరమైన నూనెలను ఉపయోగించండి..

రిఫైన్డ్ ఆయిల్స్ బదులుగా నువ్వుల నూనె, వేరుశనగ నూనె, నెయ్యి, కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్, అవకాడో ఆయిల్ లేదా ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ వంటి ఆరోగ్యకరమైన నూనెలను ఎంచుకోండి.

7 Hacks to Make Junk Food Healthy

తక్కువగా…ఎక్కువగా

అధిక కేలరీలుగల ఆహారం తీసుకోవడం తగ్గించడానికి ‘తక్కువ ఆహారం ఎక్కువసార్లు తినండి’. తినడానికి చిన్న ప్లేట్లను వాడితే ఎక్కువ తిన్న ఫీలింగ్ కలుగుతుంది.

 

7 Hacks to Make Junk Food Healthy..

తక్కువ కొవ్వు కలిగిన  డైరీ ఉత్పత్తులు…

ఎక్కువ కేలరీలు ఉండే పాలు,పెరుగు బదులు వాటి ప్రత్యాన్మయాలు బాదం మిల్క్ , వోట్ మిల్క్, కొబ్బరి పాలు ఉపయీగించండి. ఎక్కువ కొవ్వు కలిగివుండే ఐస్ క్రీములను తగ్గించి కొవ్వులేని వాటిని ప్రయత్నించండి.

 

ఉప్పు తగ్గించండి….

తరచుగా వాడే ఉప్పుకు బదులుగా కళ్ళుప్పును(రాక్ సాల్ట్),హిమాలయన్ సాల్ట్ లేదా సెల్టిక్ సాల్ట్ (మినరల్ రిచ్) ను తగిన మోతాదులో వాడండి.

ఆరోగ్యకరమైన డిప్స్ మరియు సాస్‌లు..

బయట దొరికే సాస్ లు డిప్స్ లో అధిక మొత్తంలో సాల్ట్ ఉంటుంది . కొంచం ప్రయత్నిస్తే ఆరోగ్యకరమైన సాస్ లు, మయొనైజ్ లు మనమూ ఇంటిలో తయారు చేసుకువచ్చు .

 

 

మయొనైజ్  ఇంటిలో తయారు చేసుకొనే  విధానం 

సాస్ ఇంటిలో తయారు చేసుకొనే  విధానం 

 

ఈ చిన్న మార్పులు చేయడం ద్వారా, మీరు ఆరోగ్యకరమైన ఆహారాన్ని కొనసాగిస్తూనే మీకు ఇష్టమైన జంక్ ఫుడ్‌లను ఆస్వాదించవచ్చు.

 

మీ ఇంటి పని తగ్గించే నేస్తాలు…  మీ కోసం 

 

error: Content is protected !!