Contents
పుచ్చకాయ తినడం ఎంతవరకు ప్రయోజనకరం ?
How Healthy Is Watermelon?
పుచ్చకాయ చాలా ఆరోగ్యకరమైన ఫలం. వేసవిలో లభించే ఈ ఫలం వేడి నుండి మనలను కాపాడడమే కాకుండా శరీరానికి అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుస్తుంది.
మొదట ఇందులోని పోషకాల గురించి తెలుసుకుందాం:
- పుచ్చకాయలో 95 శాతం నీరు ఉంటుంది. వేసవిలో ఎండ వలన శరీరం నీరు కోల్పోయి డీహైడ్రేషన్‌కు గురి అవుతుంది అటువంటప్పుడు పుచ్చకాయ తినడం వల్ల శరీరానికి నీరు లభించి, డీహైడ్రేషన్ కు గురికాకుండా రక్షించబడతాం.
- ఇది దాహాన్ని తీర్చడమే కాకుండా, శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది.
- పుచ్చకాయలో విటమిన్ ఎ, బి1, బి6, సి, పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్, బయోటిన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర ఆరోగ్యాన్ని కాపాడతాయి.
- పుచ్చకాయలో ఉండే ‘లైకోపీన్’ అనే యాంటీఆక్సిడెంట్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రక్త ప్రసరణను సమన్వయం చేసి, రక్తపోటు రాకుండా రక్షిస్తుంది.
- కసరత్తు చేసే వారికి, శరీరంలో నొప్పులు రాకుండా పుచ్చకాయ సహాయపడుతుంది. ఇందులో ఉండే ‘సిట్రుల్లైన్’ అనే అమైనో యాసిడ్ కండరాల నొప్పులను తగ్గిస్తుంది.
- పుచ్చకాయలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం రాకుండా చేస్తుంది.
- పుచ్చకాయలో ఉండే విటమిన్ ఎ, సి చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతాయి. కంటి ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి.
How Healthy Is Watermelon?
పుచ్చకాయ గింజల వలన కలిగే ప్రయోజనాలు:
- ఇవి మన శరీరానికి అవసరమైన మెగ్నీషియం, పొటాషియం మరియు జింక్ వంటి ముఖ్యమైన మూలకాలతో నిండి ఉన్నాయి, ఇవి మన శరీరం ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడతాయి.
- పుచ్చకాయ గింజలు మన గుండెకు అవసరమైన మంచి కొవ్వులను కలిగి ఉంటాయి.
- కొన్ని అధ్యయనాలు మన శరీరం చక్కెరను సరిగ్గా ఉపయోగించుకోవడంలో సహాయపడతాయని చూపిస్తున్నాయి.
- వీటిలో జింక్ ఉంటుంది, ఇది మనల్ని ఆరోగ్యంగా ఉంచడానికి మరియు క్రిములతో పోరాడటానికి సహాయపడుతుంది.
- వీటిలో ఉండే పీచు మన జీర్ణవ్యవస్థలో పనులు సజావుగా సాగేందుకు సహాయంచేస్తుంది.
- ఇవి ఖనిజాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు మరియు ఫైబర్ అన్నీకలిగి ఉన్నాయి.
- కొందరు ఇవి మన బ్లడ్ షుగర్ సమన్వయంలో సహాయపడతాయని కూడా అంటున్నారు.
ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ, పుచ్చకాయ గింజలను వాటి క్యాలరీ కంటెంట్ కారణంగా అవసరం మేర మితంగా తినండి.
ఇంటిలో మీ పనిని తగ్గించే నేస్తాలు
జంక్ ఫుడ్‌ని ఆరోగ్యవంతంగా మార్చే చిట్కాలు
బరువును తగ్గించే సూపర్ చీజ్ లు
డార్క్ చాక్లెట్ తినడం వల్ల జరిగే 7 అద్భుత ప్రయోజనాలు