Contents
Chandamaama Kathalu తెలుగు చందమామ కథలు :
The thirsty crow story in Telugu
తెలివైన కాకి
Chandamaama Kathalu తెలుగు చందమామ కథలు : These are the old popular moral stories for kids in Telugu
ఒక రోజు చాలా ఎండగా వుంది ఒక కాకి కి చాలా దాహంగా ఉంది ,చుట్ట ప్రక్కల ఎక్కడ చూసినా నీరు దొరికే అవకాశం కనబడలేదు . నీటి కోసం వెతుకుతూ అలా ఎగురుకుంటూ వెళ్తూ వుంది ,అప్పుడు అక్కడ చిన్నకుండ కనబడింది … దానిలో అయినా కొన్ని నీళ్ళు దొరుకుతాయి ఏమో అనే ఆశతో కుండ దగ్గరకు వెళ్ళింది . అనుకున్న విధంగానే అందులో అడుగున కొన్ని నీళ్లు వున్నాయి ,హమ్మయ్య అనుకుంది కానీ … అడుగున వున్న నీరు తన ముక్కుకు అందవు కదా మరి వాటిని ఎలా తాగాలి అని ఆలోచించడం మొదలుపెట్టింది .
అప్పుడు కాకికి ఒక చక్కని ఉపాయం తట్టింది .. అక్కడ చుట్టుప్రక్కల ఏమన్నా చిన్న రాళ్లు ఉన్నాయేమో వెతికి ,దొరికిన ఒక్కొక్క రాయిని కుండలో వేయసాగింది . అలా వేయగా వేయగా కొంత సేపటికి కుండ అడుగున వున్న నీరు పైకి వచ్చింది . అప్పుడు కాకి సంతోషంగా తన దాహం తీర్చుకుంది .
Moral: అవసరమైనప్పుడు ఆలోచన చేసినవాడే తెలివైనవాడు .
The fox and the crane story in Telugu
నక్క-కొంగ
ఒక రోజు ఒక నక్క అడవిలో అలా నడుచుకుంటూ వెళుతుంది ,దానికి ఒకచోట ఆహారం కనబడుతుంది . వేరే జంతువులు ఏమన్నా వచ్చి తన ఆహారం లో వాటా అడుగుతాయి ఏమో అని, కంగారుగా ఆహారం తినడం ప్రారంభించింది . అంతలో ఒక ఎముక దాని గొంతుకు అడ్డం పడింది , ఎంత ప్రయత్నించినా ఆ ఎముక బయటకు రాలేదు . ఏమి చేయాలో నక్కకు తోచలేదు , అంతలో అటుగా వెళుతున్న కోతిని ఆపి తనకు సాయం చేయమని అడిగింది . అప్పుడు కోతి ,నేను నీకు సహాయం చేయలేను కానీ ఎవరు సహాయం చేస్తారో చెపుతాను అంది . అప్పుడు నక్క ఎవరు నాకు సహాయం చెయ్యగలరో చెప్పవా అని అడిగింది ,అప్పుడు కోతి,కొంగ అయితే తన పొడవాటి ముక్కు తో నీ గొంతులో వున్న ఎముకను సులువుగా తీయగలదు అని చెప్పివెళ్లి పోయింది .
అప్పుడు నక్క, కొంగ దగ్గరకు వెళ్లి తనకు జరిగిన ప్రమాదం చెప్పి సహాయం చేయవలసింది గా కోరింది . దానికి కొంగ సరే నేను నీకు సహాయం చేస్తాను దాని వలన నాకు ప్రయోజనం ఏంటి అని అడిగింది , అందుకు నక్క నేను నీకు మంచి బహుమతి ఇస్తాను అంది . కొంగ ఆనందంగా ఒప్పుకొని నక్క గొంతులోవున్న ఎముక తీసివేసింది , నక్క హమ్మయ్య అనుకొని అక్కడనుండి నెమ్మదిగా జారుకోవాలి అనుకుంది …అంతలో కొంగ ఆపి నాకు బహుమతి ఇస్తానని ఒప్పుకొని యిప్పుడు జారుకుంటున్నావ్ ఏమిటి అని అడిగింది . నక్క గట్టిగానవ్వి , నీ తల నా నోటిలో పెట్టావ్ అయినప్పటికీ నేను నిన్ను తినలేదు .. అదే నేను నీకు ఇచ్చే గొప్ప బహుమతి అని చెప్పి వెళ్ళిపోయింది . కొంగ తన అదృష్టానికి తానే ఆనంద పడుతూ ఎగిరిపోయింది .
Moral: ఎటువంటి సందర్భమైన చెడ్డవారు తమ గుణం వదులుకోరు
Chandamaama Kathalu తెలుగు చందమామ కథలు:
Monkey and two cats story in Telugu
కోతి -పిల్లి
ఒక రోజు రెండు పిల్లులకు ఒక జున్నుముక్క దొరుకుతుంది , దానిని ఎలా పంచుకోవాలో తెలీక ఒక కోతి ని సహాయం అడుగుతారు . కోతి సరే సరి సమంగా పంచాలి అంటే తక్కెడ కావాలి, మీరు వెంటనే తీసుకు రండి అని చెపుతుంది . పిల్లులు రెండు కలసి ఒక తక్కెడ తెస్తాయి , కోతి జున్నును రెండు భాగాలుగా చేసి ఒక్కొక్క దానిలో ఒక్కొక్క ముక్క వేస్తుంది . రెండు తక్కెడలు సమంగా చూపించవు ,అయ్యో ఒకవైపు ఎక్కువ అయ్యిందే అని చెప్పి … ఎక్కువ అయిన వైపు కొంచం కొరికి తింటుంది . తరువాత రెండవవైపు ఎక్కువ అనిపిస్తుంది ,అప్పుడు మళ్ళీ రెండవవైపు కొంచం తింటుంది . అలా మళ్ళీ మళ్ళీ తక్కెడతో బరువు తూస్తూ ,ఎక్కువయ్యింది అనే నెపంతో కొంచం కొంచం జున్నుతింటూ ఉంటుంది . పిల్లులకు జరుగుతున్న విషయం అర్థం అయ్యేలోపు మొత్తం జున్ను అయిపోతుంది . పిల్లులు వాటి తెలివితక్కువతనానికి వాటిని అవే తిట్టుకుంటాయి .
Moral: అవకాశవాదులు అడుగడుగునా ఉంటారు
Chandamaama Kathalu తెలుగు చందమామ కథలు : These are the old popular moral stories for students and Childern
Lazy donkey story in Telugu
సోమరిపోతు గాడిద
ఒక ఉప్పు వ్యాపారి దగ్గర ఒక గాడిద ఉండేది, వ్యాపారి గాడిదను బరువులు మోయడానికి ఉపయోగించేవాడు . ఆ గాడిద చాలా బద్దకంగా ఉండేది , వ్యాపారి చెప్పిన పని ఏదీ సరిగ్గా చేసిది కాదు . వ్యాపారి రోజూ ఉప్పు మూటను గాడిద పై పెట్టి వేరే వూరు సంతకు వెళ్లి అక్కడ ఉప్పు అమ్మేవాడు .
రోజూ లాగే వ్యాపారి ఆ రోజు కూడా ఉప్పు మూటను గాడిద పై పెట్టి సంతకు ప్రయాణమయ్యాడు ,మార్గమధ్యం లో ఒక వంతెన దాటవలసి వచ్చింది . అంతసేపు ఉప్పుమూట మోస్తున్న గాడిదకు అప్పుడు ఒక ఆలోచన వచ్చింది… వెంటనే కాలుజారినట్లు నటించి వంతెన మీదనుండి కాలువలో పడిపోయింది ,నీటిలో పడడం వలన మూటలో వున్న ఉప్పంతా కరిగిపోయి ,సంచి తేలికఅయిపోయింది గాడిదకు సంతోషంగా అనిపించింది . వ్యాపారి మాత్రం ఉప్పు అంతా కరిగిపోయినందుకు చాలా బాధపడ్డాడు . తరువాత చాలా సార్లు గాడిద అదేవిధంగా నీటిలో తెలీక పడినట్లు పడిపోయేది ,ఉప్పుకరిగి పోయేది … కొంత కాలానికి వ్యాపారికి గాడిద పై అనుమానం వచ్చింది ,దీనికి ఎలాయినా బుద్ధిచెప్పాలని ఒక రోజు సంచిలో ఉప్పుకు బదులు ఇసుక వేశాడు . విషయం తెలీక గాడిద రోజులాగే ఆరోజు కూడా నీటిలో పడింది ఉప్పు ఐతే కరిగిపోయేది కానీ అది ఇసుక కదా నీరు మొత్తం పీల్చుకొని బాగా బరువెక్కింది ,గాడిద వీపు మీద భారం ఎక్కువైపోయింది . చేసిది లేక అలాగే భారంగా అడుగులు వేస్తూ యజమాని ఇంటికి నడిచింది .
ఇంకెప్పుడు నీటిలో పడడం అనే సాహసం చేయలేదు ,బుద్దితెచ్చుకొని యజమానికి సహాయంగా ఉండేది.
Moral: తెలివి ఏ ఒక్కడి సొంతం కాదు
Chandamaama Kathalu తెలుగు చందమామ కథలు :
Pigeon stories in Telugu
ఐకమత్యమే బలం (పావురం కథ)
ఒక అడవిలో ఒక మర్రి చెట్టు మీద చాలా పావురాలు నివాసం ఉండేవి . ఒక వేటగాడు రోజూ వాటిని గమనించేవాడు ,వాటిని ఏదో విధంగా భందించాలని నిర్ణయించుకున్నాడు. మర్రిచెట్టుకి దగ్గర్లో పావురాల కోసమై కొన్నిధాన్యపు గింజలు చల్లాడు ,విషయం తెలియని పావురాలు అన్ని గింజలు తినడానికి అక్కడకు చేరాయి , అదనుకోసం చూస్తున్న వేటగాడు ఒక్కసారిగా వలను పావురాలపై వేశాడు… పావురాలన్నీ వలలో చిక్కుకున్నాయి .
వేటగాడు వచ్చి తమను బంధించి తీసుకు వెళ్తాడు అనే ఆలోచన వచ్చేసరికి పావురాలన్నీ భయం తో వణుకుతున్నాయి ,వాటిని చూసిన పావురాల రాజు మీరు భయపడవద్దు . ఉపాయంతో ఎటువంటి అపాయం నుండి అయినా మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఒంటరి అనుకుంటే మనం బలహీనులం కానీ , మనమంతా ఐక్యంగా ఉంటే ఈ ఆపదనుండి సులువుగా బయట పడవచ్చు అంది .ఆ మాటలకు పావురాలు అన్నిటికి ధైర్యం వచ్చింది ,వేటగాడు తమ దగ్గరకు వచ్చే సమయానికి పావురాలన్నీ మూకుమ్మడిగా ఒకేసారి తమ బలాన్నంతా కూడదీసుకుని వలతో సహా ఎగిరిపోయాయి .
అలా ఎగిరిపోతూ తమ స్నేహితుడైన ఎలుక దగ్గరకువెళ్లి జరిగిందంతా చెప్పుకువచ్చాయి ,ఎలుక తమ స్నేహితులతో కలసి వలను ముక్కలు ముక్కలుగా కొరికి వేసింది . పావురాల్ని బంధవిముక్తుల్ని చేసింది ,పావురాలన్నీ ఎలుకలకు కృతజ్ఞతలు చెప్పి సంతోషంగా
ఎగురుకుంటూ వెళ్లి పోయాయి .
Moral: ఐకమత్యమే బలం
Chandamaama Kathalu తెలుగు చందమామ కథలు :
Duck and Golden Egg Telugu Story
అత్యాశ
ఒక ముసలమ్మ దగ్గర ఒక బాతు ఉండేది ,అది రోజుకు ఒక బంగారు గుడ్డు పెట్టేది . ఆ గుడ్డును అమ్మగా వచ్చిన డబ్బుతో ,ముసలమ్మ కుటుంభం అంతా సంతోషంగా ఉండేది . ఒక రోజు ముసలమ్మఇంటికి ప్రక్క ఊరిలో వుండే తన మనవడు వచ్చాడు , అతనికి ఈ బాతు వ్యవహారం వింతగా అనిపించింది . అతనికి ఒక అత్యాశకూడా పుట్టింది ,రోజు కి ఒక గుడ్డు తీసుకొనే బదులు బాతు పొట్ట చీల్చి దానిలో వున్న అన్ని గుడ్లూ ఒకేసారి తీసుకొని ధనవంతుణ్ణి అయిపోదాం అనుకున్నాడు . అనుకున్నట్టు గానే ముసలమ్మ ఇంటిలో లేని సమయం చూసి బాతు పొట్ట చీల్చాడు … ఆశ్యర్యంగా అన్ని బాతులు లాగానే ఈ బాతు శరీరంలో కూడా రక్త మాంసాలే వున్నాయి ,బంగారు గుడ్లు లేవు . తన అత్యాశవల్ల బంగారు గుడ్లుపెట్టే బాతుని కోల్పోయానాని తెలుసుకొని పశ్చాత్తాపం తో కుమిలి పోయాడు.
Moral: అత్యాశ ఎప్పుడూ మంచి చేయదు.
For more stories please visit: Famous stories
Chandamaama Kathalu తెలుగు చందమామ కథలు