nagarjuna meal
Spread the love

nagarjuna meal..

మనకు తెలిసే ఉంటుంది… నటుడు నాగార్జున ఎప్పుడూ ఫిట్‌గా కనిపిస్తారు.
వయసు 60 దాటి కూడా ఆయన ఎనర్జీ, లుక్ అన్నీ చాలా మందికి ఆశ్చర్యం కలిగిస్తాయి.

ఇది కేవలం జిమ్‌ వల్ల మాత్రమే కాదు…
ఆయన చెబుతున్న ఒక సింపుల్ అలవాటు వల్ల కూడా.

అదేంటి అంటే?
ఆయన సాయంత్రం 7 గంటలకు ముందే డిన్నర్ పూర్తి చేయడం.

ఈ చిన్న అలవాటు వల్ల శరీరానికి ఎంతమంచి ప్రయోజనాలు లభిస్తాయో చూద్దాం.

Contents

ఎందుకు త్వరగా డిన్నర్ చేయాలి?

1. రాత్రి అజీర్ణం తగ్గుతుంది

అలస్యంగా తింటే కడుపు భారంగా ఉంటుంది, గ్యాస్, బ్లోటింగ్, ఆమ్లం వంటివి వస్తాయి.
కానీ త్వరగా తింటే శరీరానికి ఆహారం జీర్ణం అయ్యేందుకు టైమ్ బాగా దొరుకుతుంది.

2. బ్లడ్ షుగర్ కంట్రోల్ అవుతుంది

గాస్ట్రోఎంటరాలజిస్టులు చెబుతున్న విషయమే …
డిన్నర్ త్వరగా చేస్తే రాత్రి బ్లడ్ షుగర్ లెవల్స్ స్టేబుల్‌గా ఉంటాయి.

3. నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది

ఎప్పుడైనా బాగా(ఎక్కువగా ) తిన్నాక వెంటనే పడుకున్నారా?
నిద్ర సరిగ్గా రాదు, అలజడి, అసౌకర్యం…
అందుకే డాక్టర్లు చెబుతారు:
పడుకునే ముందు 2–3 గంటలకే డిన్నర్ పూర్తి చేయాలి.

4. సర్కేడియన్ రిథమ్‌కు అనుకూలం

మన శరీరానికి ఒక సహజ గడియారం ఉంటుంది.
అది రాత్రి జీర్ణక్రియకన్నా విశ్రాంతి కోసం పని చేస్తుంది.
త్వరగా తింటే ఆ గడియారానికి బాగా సూట్ అవుతుంది.

5. బరువు తగ్గడానికి కూడా ఉపయోగం

జీర్ణక్రియ బాగా జరిగితే, శరీరంలో అనవసరంగా ఫ్యాట్ స్టోర్ అవదు.
ఇది బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

nagarjuna meal…

నాగార్జునలా 7 PMకి తప్పనిసరిగా తినాలా ?

లేదు, మీ నిద్ర సమయం ఏదైతే, దానికి ముందు 2–3 గంటలకే డిన్నర్ చేస్తే చాలు.

ఉదాహరణకి ..
మీరు 10 PMకి పడుకుంటే
7 PM–8 PM మధ్య తింటే సరిపోతుంది.

 

చిన్న మార్పు… పెద్ద ఫలితం

డిన్నర్ టైమ్ మార్చడం అనేది పెద్ద పని అనిపించొచ్చు.కానీ ఒక వారం ప్రయత్నించి చూడండి.
శరీరం లైట్‌గా, మంచి నిద్ర , ఉదయం ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది.

నాగార్జున లా మీరు కూడా ఫిట్‌గా ఉండాలంటే
ఇది ఫాలో అవ్వడం తప్పదు మీకు… !!

 

అనిల్ రావిపూడి మూవీ లిస్ట్

ISRO ఆవిష్కరించనున్న ఇండియా మొదటి స్పేస్ స్టేషన్ గురించి మీకు తెలుసా ??

కాబోయే వరుణ్ణి పరిచయం చేసిన నివేదిత

Break Down Hard Subjects Easily with ChatGPT and the ELI10 Technique

జుట్టు రాలిపోకుండా ఏంచేయాలి? నిపుణుల సలహా ఏంటి ?

ఇంటిలో మీ పనిని తగ్గించే నేస్తాలు

జంక్ ఫుడ్‌ని ఆరోగ్యవంతంగా మార్చే చిట్కాలు

బరువును తగ్గించే సూపర్ చీజ్ లు

డార్క్ చాక్లెట్ తినడం వల్ల జరిగే 7 అద్భుత ప్రయోజనాలు

error: Content is protected !!