Cloves benefits in Telugu..
Contents
Cloves Benefits :
లవంగం చిన్నదే… కానీ దాని పవర్ సూపర్.
రోజూ చిన్నగా ఒక లవంగం నమలితే శరీరంలో కలిగే మార్పులు ఇవే.
7 పవర్‌ఫుల్ ప్రయోజనాలు:
1. నోటి ఆరోగ్యం మెరుగుపడుతుంది
- బ్యాక్టీరియా తగ్గుతుంది.
- బ్యాడ్ బ్రెత్ తగ్గుతుంది.
- గమ్ ఇన్ఫెక్షన్ల నుంచి ప్రొటెక్షన్.
2. మెమరీ & ఫోకస్ బూస్ట్ అవుతుంది
- లవంగాల్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ →మెదడుకి రక్తప్రసరణ పెంచి,అలర్ట్‌నెస్ & క్లారిటీ ఇస్తాయి.
3. హార్ట్‌కి హెల్ప్ చేస్తుంది
- చెడు కొలెస్ట్రాల్ తగ్గడంలో సహాయపడుతుంది.
- రక్తప్రసరణ సాఫీగా జరిగేలా చేస్తుంది.
- హార్ట్ హెల్త్‌ను సపోర్ట్ చేస్తుంది.
4. ఇమ్యూనిటీ స్ట్రాంగ్
- యాంటీ మైక్రోబయల్ ప్రాపర్టీస్ →జలుబు, దగ్గు, ఫ్లూ లాంటి సీజనల్ ఇన్‌ఫెక్షన్లకి ప్రాకృతిక రక్షణ.
5. దగ్గు & శ్వాస సమస్యల నుంచి ఉపశమనం
- కఫం బయటికి రావడంలో సహాయపడుతుంది.
- గొంతులో ఇర్రిటేషన్ తగ్గుతుంది.
6.బ్లడ్ షుగర్ కంట్రోల్
- ఇన్సులిన్ పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
- చక్కెర స్థాయిలను క్రమబద్ధంగా ఉంచుతుంది.
7. యాంటీ ఆక్సిడెంట్ పవర్ ,బాడీ డిటాక్స్
- శరీరంలో హానికరమైన ఫ్రీ రాడికల్స్ తగ్గుతాయి.
- సెల్స్ హెల్త్‌గా పనిచేస్తాయి.
Cloves benefits in Telugu…
లవంగం ఎలా నమలాలి?
రోజుకు 1 లవంగం మాత్రమేతినాలి . ఉదయం ఖాళీ కడుపుతో లేదా నిద్రకు ముందు
బాగా నమిలి మింగాలి.
ఎవరికి జాగ్రత్త?
- గ్యాస్ట్రిక్ అల్సర్స్
- చిన్న పిల్లలు
- ప్రెగ్నెన్సీ / బ్రెస్ట్‌ఫీడింగ్ లో ఉన్నవారు
డాక్టర్ ని అడిగి వాడటం మంచింది.
Cloves Oil Benefits :
లవంగ నూనె (Clove Oil) పంటి నొప్పి, గొంతు ఇన్ఫెక్షన్, జీర్ణ సమస్యలు, శరీర నొప్పులు, పింపుల్స్, dandruff వంటి సమస్యలకు త్వరగా ఉపశమనం ఇచ్చే శక్తివంతమైన సహజ నూనె. ఇందులో ఉండే eugenol బ్యాక్టీరియా, వాపు, నొప్పిని తగ్గిస్తుంది. కొద్దిగా క్యారియర్ ఆయిల్‌లో కలిపి వాడితే పళ్లు, చర్మం, జుట్టు, కండరాలకు మంచి ఉపశమనం కలుగుతుంది.
క్యారియర్ ఆయిల్ అంటే?
క్యారియర్ ఆయిల్ అంటే తీవ్రంగా పనిచేసే ఎసెన్షియల్ ఆయిల్స్ (ఉదా: లవంగ నూనె, టీ ట్రీ ఆయిల్, యూకలిప్టస్ ఆయిల్) ను చర్మంపై నేరుగా రాయడానికి సేఫ్‌గా dilute చేయడానికి ఉపయోగించే సాధారణ నూనె.
ఇది ఎసెన్షియల్ ఆయిల్‌ను “carry” చేస్తుందనుకుని దీనిని carrier oil అంటారు.
సాధారణ క్యారియర్ ఆయిల్స్:
కొబ్బరి నూనె (Coconut oil)
బాదం నూనె (Almond oil)
ఆముదం నూనె (Castor oil)
ఆలివ్ ఆయిల్ (Olive oil)
జోజోబా ఆయిల్ (Jojoba oil)
అందుకే కొద్దిగా ఎసెన్షియల్ ఆయిల్ + ఎక్కువ క్యారియర్ ఆయిల్ కలిపి వాడాలి.
పుచ్చకాయ తినడం ఎంతవరకు ప్రయోజనకరం ?