Benefits of Drinking Black Coffee Without Sugar
Spread the love

Benefits of Drinking Black Coffee Without Sugar…

Contents

30 రోజుల పాటు బ్లాక్ కాఫీ షుగర్ లేకుండా తాగితే ఏమవుతుంది?

కాఫీ అంటే మనందరికీ తెలుసు, అదే బ్లాక్ కాఫీ అంటే ?

అదే అండి పంచదార, పాలు లేకుండా చేసే కాఫీని బ్లాక్ కాఫీ అంటారు. ఇది వినడానికి చాలా సాధారణ పానీయంలా అనిపిస్తుంది కానీ దీనివల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీనిలో పుష్కలంగా యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. బ్లాక్ కాఫీని ప్రతిరోజు 30 రోజులు పాటు తాగితే శరీరంలో ఏమవుతుందో తెలుసుకుందాం.

Advantages of drinking black coffee:

శక్తి మరియు ఏకాగ్రత పెరుగుతుంది

బ్లాక్ కాఫీలో ఉండే కేఫిన్ నేరుగా నాడీ వ్యవస్థను ప్రభావితం చేసి మెదడుకు ఉత్తేజాన్ని అందిస్తుంది. దీని వల్ల అలసట తగ్గి శరీరం చురుగ్గా ఉంటుంది. మనసు ఏకాగ్రత పెరిగి , ఆలోచనా సామర్థ్యం పెరుగుతుంది , మన మానసిక స్థితి (మూడ్ ) కూడా ఉల్లాసంగా మారుతుంది.

 

కాలేయానికి మేలు చేస్తుంది

దీనిని సేవించడం వల్ల హానికరమైన లివర్ ఎంజైమ్స్ తగ్గుతాయి. బ్లాక్ కాఫీ కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుతుంది,అంతే కాకుండా ఫ్యాటీ లివర్, సిర్రోసిస్ వంటి వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది అని పరిశోధనలు చెబుతున్నాయి

 

మెటాబాలిజం మెరుగుపడుతుంది

రోజూ బ్లాక్ కాఫీ తాగడం వల్ల మెటాబాలిజం కొంత పెరుగుతుంది. మన శరీరంలోని కేలరీలను త్వరగా ఖర్చు చేస్తుంది. దీని వలన ఆకలి కొంత తగ్గడం జరిగి బరువు నియంత్రణకు కూడా ఉపయోగపడుతుంది.

షుగర్ , గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది

నిత్యం బ్లాక్ కాఫీ తాగే వారిలో టైప్-2 డయాబెటిస్ వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. మరియు ఇది శరీరంలోని వుండే ఇన్‌ఫ్లమేషన్ తగ్గించి రక్త నాళాల ఆరోగ్యాన్ని మెరుగుపరచి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

 

మనసు ఉల్లాసంగా ఉంటుంది

బ్లాక్ కాఫీ తాగడం వలన దీనిలో వుండే డోపమైన్, సెరోటోనిన్ వంటివి మెదడులో “హ్యాపీ హార్మోన్స్” ను పెంచుతాయి. దీని వల్ల డిప్రెషన్ ప్రమాదం తగ్గి మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది.

 

Benefits of Drinking Black Coffee Without Sugar…

జాగ్రత్తలు తీసుకోవాల్సిన విషయాలు:

బ్లాక్ కాఫీని ఎక్కువగా తాగితే కొన్ని సమస్యలు రావచ్చు:

  • రాత్రివేళ నిద్రలేమి, ఆందోళన
  • ఖాళీ కడుపుతో తాగితే కడుపులో మంట
  • రక్తపోటు కొద్దిగా పెరగడం

ఎంత తాగాలి ?

వైద్య నిపుణుల సలహా ప్రకారం రోజుకు 2–4 కప్పులు (అధికంగా 400 మిల్లీగ్రాముల కేఫిన్) తాగడం చాలా మందికి సురక్షితం. ఉదయం లేదా మధ్యాహ్నం వరకు తాగడం మంచిది. కడుపు సమస్యలు ఉన్నవారు భోజనం తర్వాత తాగాలి.

చివరిగా…

రోజూ 30 రోజుల పాటు బ్లాక్ కాఫీ తాగితే పైన చెప్పిన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. కానీ ఏ అలవాటు అయినా పరిమితిలో ఉండాలి.అతి ఎప్పుడూ అనర్ధదాయకమే . మీ శరీరం చెప్పేది వినండి, కాఫీని ఆనందించండి, దాన్ని ఆరోగ్యకరమైన జీవనశైలిలో భాగం చేసుకోండి.

 

 

 

 

జుట్టు రాలిపోకుండా ఏంచేయాలి? నిపుణుల సలహా ఏంటి ?

ఇంటిలో మీ పనిని తగ్గించే నేస్తాలు

జంక్ ఫుడ్‌ని ఆరోగ్యవంతంగా మార్చే చిట్కాలు

బరువును తగ్గించే సూపర్ చీజ్ లు

డార్క్ చాక్లెట్ తినడం వల్ల జరిగే 7 అద్భుత ప్రయోజనాలు

పుచ్చకాయ తినడం ఎంతవరకు ప్రయోజనకరం ?

 

error: Content is protected !!