Chandamaama Kathalu తెలుగు చందమామ కథలు
Spread the love

Contents

Chandamaama Kathalu తెలుగు చందమామ కథలు :

The thirsty crow story in Telugu

తెలివైన కాకి

Chandamaama Kathalu తెలుగు చందమామ కథలు : These are the old popular moral stories for kids in Telugu

thirsty crow

ఒక రోజు చాలా ఎండగా వుంది ఒక కాకి కి చాలా దాహంగా ఉంది ,చుట్ట ప్రక్కల ఎక్కడ చూసినా నీరు దొరికే అవకాశం కనబడలేదు . నీటి కోసం వెతుకుతూ అలా ఎగురుకుంటూ వెళ్తూ వుంది ,అప్పుడు అక్కడ చిన్నకుండ కనబడింది … దానిలో అయినా కొన్ని నీళ్ళు దొరుకుతాయి ఏమో అనే ఆశతో కుండ దగ్గరకు వెళ్ళింది . అనుకున్న విధంగానే అందులో అడుగున కొన్ని నీళ్లు వున్నాయి ,హమ్మయ్య అనుకుంది కానీ … అడుగున వున్న నీరు తన ముక్కుకు అందవు కదా మరి వాటిని ఎలా తాగాలి అని  ఆలోచించడం మొదలుపెట్టింది .

అప్పుడు  కాకికి ఒక చక్కని  ఉపాయం తట్టింది .. అక్కడ చుట్టుప్రక్కల ఏమన్నా చిన్న రాళ్లు ఉన్నాయేమో వెతికి ,దొరికిన ఒక్కొక్క రాయిని కుండలో వేయసాగింది . అలా వేయగా  వేయగా కొంత సేపటికి కుండ అడుగున వున్న నీరు  పైకి వచ్చింది . అప్పుడు కాకి సంతోషంగా తన దాహం తీర్చుకుంది .

Moral: అవసరమైనప్పుడు ఆలోచన చేసినవాడే తెలివైనవాడు .

 

The fox and the crane story in Telugu

నక్క-కొంగ

cunning fox crane story

ఒక రోజు  ఒక నక్క అడవిలో అలా నడుచుకుంటూ వెళుతుంది ,దానికి ఒకచోట  ఆహారం కనబడుతుంది .  వేరే జంతువులు ఏమన్నా వచ్చి తన ఆహారం లో వాటా అడుగుతాయి ఏమో  అని, కంగారుగా  ఆహారం తినడం ప్రారంభించింది . అంతలో ఒక ఎముక దాని గొంతుకు అడ్డం పడింది , ఎంత ప్రయత్నించినా ఆ ఎముక బయటకు రాలేదు . ఏమి చేయాలో నక్కకు తోచలేదు , అంతలో అటుగా వెళుతున్న కోతిని ఆపి తనకు సాయం చేయమని అడిగింది . అప్పుడు కోతి ,నేను నీకు సహాయం చేయలేను కానీ ఎవరు సహాయం చేస్తారో చెపుతాను అంది . అప్పుడు నక్క ఎవరు నాకు సహాయం చెయ్యగలరో చెప్పవా అని అడిగింది ,అప్పుడు కోతి,కొంగ అయితే తన పొడవాటి ముక్కు తో నీ గొంతులో వున్న ఎముకను సులువుగా తీయగలదు అని చెప్పివెళ్లి పోయింది .

అప్పుడు నక్క, కొంగ దగ్గరకు వెళ్లి తనకు జరిగిన ప్రమాదం చెప్పి సహాయం చేయవలసింది గా కోరింది . దానికి కొంగ సరే  నేను నీకు సహాయం చేస్తాను దాని వలన నాకు ప్రయోజనం ఏంటి అని అడిగింది , అందుకు నక్క నేను నీకు మంచి బహుమతి ఇస్తాను అంది . కొంగ ఆనందంగా ఒప్పుకొని నక్క గొంతులోవున్న ఎముక తీసివేసింది , నక్క  హమ్మయ్య అనుకొని అక్కడనుండి నెమ్మదిగా జారుకోవాలి అనుకుంది …అంతలో కొంగ ఆపి నాకు బహుమతి ఇస్తానని ఒప్పుకొని యిప్పుడు జారుకుంటున్నావ్ ఏమిటి అని అడిగింది . నక్క గట్టిగానవ్వి , నీ తల నా నోటిలో పెట్టావ్ అయినప్పటికీ నేను నిన్ను తినలేదు .. అదే నేను నీకు ఇచ్చే గొప్ప బహుమతి అని చెప్పి వెళ్ళిపోయింది . కొంగ తన అదృష్టానికి తానే ఆనంద పడుతూ ఎగిరిపోయింది .

Moral: ఎటువంటి సందర్భమైన చెడ్డవారు తమ గుణం వదులుకోరు

Chandamaama Kathalu తెలుగు చందమామ కథలు:

Monkey and two cats story in Telugu

కోతి -పిల్లి

monkey cat story

ఒక రోజు రెండు పిల్లులకు ఒక జున్నుముక్క దొరుకుతుంది , దానిని ఎలా పంచుకోవాలో తెలీక ఒక కోతి ని సహాయం అడుగుతారు . కోతి సరే సరి సమంగా పంచాలి అంటే తక్కెడ కావాలి, మీరు వెంటనే తీసుకు రండి అని చెపుతుంది . పిల్లులు రెండు కలసి ఒక తక్కెడ  తెస్తాయి , కోతి జున్నును రెండు భాగాలుగా చేసి ఒక్కొక్క దానిలో  ఒక్కొక్క  ముక్క వేస్తుంది . రెండు తక్కెడలు సమంగా చూపించవు ,అయ్యో ఒకవైపు ఎక్కువ అయ్యిందే అని చెప్పి … ఎక్కువ అయిన వైపు కొంచం కొరికి తింటుంది . తరువాత రెండవవైపు ఎక్కువ అనిపిస్తుంది ,అప్పుడు మళ్ళీ  రెండవవైపు  కొంచం తింటుంది . అలా మళ్ళీ మళ్ళీ తక్కెడతో బరువు తూస్తూ ,ఎక్కువయ్యింది అనే నెపంతో కొంచం కొంచం  జున్నుతింటూ ఉంటుంది   . పిల్లులకు జరుగుతున్న విషయం అర్థం అయ్యేలోపు మొత్తం జున్ను అయిపోతుంది . పిల్లులు వాటి తెలివితక్కువతనానికి  వాటిని  అవే తిట్టుకుంటాయి .

Moral: అవకాశవాదులు అడుగడుగునా ఉంటారు

Chandamaama Kathalu తెలుగు చందమామ కథలు : These are the old popular moral stories for students and Childern

 

Lazy donkey story in Telugu

సోమరిపోతు గాడిద

Chandamaama Kathalu తెలుగు చందమామ కథలు

ఒక ఉప్పు వ్యాపారి దగ్గర ఒక గాడిద ఉండేది, వ్యాపారి గాడిదను బరువులు మోయడానికి ఉపయోగించేవాడు   . ఆ గాడిద చాలా బద్దకంగా ఉండేది , వ్యాపారి చెప్పిన పని ఏదీ సరిగ్గా చేసిది కాదు . వ్యాపారి  రోజూ ఉప్పు మూటను గాడిద పై పెట్టి వేరే వూరు సంతకు వెళ్లి అక్కడ ఉప్పు అమ్మేవాడు .

రోజూ లాగే  వ్యాపారి ఆ రోజు కూడా  ఉప్పు మూటను గాడిద పై పెట్టి సంతకు ప్రయాణమయ్యాడు ,మార్గమధ్యం లో ఒక వంతెన దాటవలసి వచ్చింది . అంతసేపు ఉప్పుమూట మోస్తున్న  గాడిదకు అప్పుడు  ఒక ఆలోచన వచ్చింది… వెంటనే కాలుజారినట్లు నటించి వంతెన మీదనుండి కాలువలో పడిపోయింది ,నీటిలో పడడం వలన మూటలో వున్న ఉప్పంతా కరిగిపోయి ,సంచి తేలికఅయిపోయింది గాడిదకు  సంతోషంగా  అనిపించింది . వ్యాపారి మాత్రం ఉప్పు అంతా కరిగిపోయినందుకు చాలా బాధపడ్డాడు . తరువాత చాలా సార్లు గాడిద అదేవిధంగా నీటిలో తెలీక పడినట్లు పడిపోయేది ,ఉప్పుకరిగి పోయేది … కొంత కాలానికి వ్యాపారికి గాడిద పై అనుమానం వచ్చింది ,దీనికి ఎలాయినా బుద్ధిచెప్పాలని ఒక రోజు సంచిలో ఉప్పుకు బదులు ఇసుక వేశాడు . విషయం తెలీక గాడిద రోజులాగే ఆరోజు కూడా నీటిలో పడింది ఉప్పు ఐతే కరిగిపోయేది కానీ అది ఇసుక కదా నీరు మొత్తం పీల్చుకొని బాగా బరువెక్కింది ,గాడిద వీపు మీద భారం ఎక్కువైపోయింది . చేసిది లేక అలాగే భారంగా అడుగులు వేస్తూ యజమాని ఇంటికి నడిచింది .

ఇంకెప్పుడు నీటిలో పడడం అనే సాహసం చేయలేదు ,బుద్దితెచ్చుకొని యజమానికి సహాయంగా ఉండేది.

Moral: తెలివి ఏ ఒక్కడి సొంతం కాదు

Chandamaama Kathalu తెలుగు చందమామ కథలు :

Pigeon stories in Telugu

ఐకమత్యమే బలం (పావురం కథ)

 

Chandamaama Kathalu తెలుగు చందమామ కథలు

ఒక అడవిలో ఒక మర్రి చెట్టు మీద చాలా పావురాలు నివాసం ఉండేవి . ఒక వేటగాడు రోజూ వాటిని  గమనించేవాడు ,వాటిని ఏదో విధంగా భందించాలని నిర్ణయించుకున్నాడు. మర్రిచెట్టుకి  దగ్గర్లో పావురాల కోసమై కొన్నిధాన్యపు గింజలు చల్లాడు ,విషయం తెలియని పావురాలు అన్ని గింజలు తినడానికి అక్కడకు చేరాయి , అదనుకోసం చూస్తున్న వేటగాడు ఒక్కసారిగా వలను పావురాలపై వేశాడు… పావురాలన్నీ వలలో చిక్కుకున్నాయి .

వేటగాడు వచ్చి తమను బంధించి తీసుకు వెళ్తాడు అనే ఆలోచన వచ్చేసరికి పావురాలన్నీ భయం తో వణుకుతున్నాయి ,వాటిని చూసిన పావురాల రాజు మీరు భయపడవద్దు . ఉపాయంతో ఎటువంటి అపాయం నుండి అయినా మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఒంటరి అనుకుంటే మనం బలహీనులం కానీ , మనమంతా ఐక్యంగా ఉంటే ఈ ఆపదనుండి సులువుగా బయట పడవచ్చు అంది .ఆ మాటలకు  పావురాలు అన్నిటికి ధైర్యం వచ్చింది ,వేటగాడు తమ దగ్గరకు వచ్చే సమయానికి పావురాలన్నీ మూకుమ్మడిగా ఒకేసారి తమ బలాన్నంతా కూడదీసుకుని వలతో  సహా ఎగిరిపోయాయి .

అలా ఎగిరిపోతూ తమ స్నేహితుడైన ఎలుక దగ్గరకువెళ్లి జరిగిందంతా చెప్పుకువచ్చాయి ,ఎలుక తమ స్నేహితులతో కలసి వలను ముక్కలు ముక్కలుగా కొరికి వేసింది . పావురాల్ని బంధవిముక్తుల్ని చేసింది ,పావురాలన్నీ ఎలుకలకు కృతజ్ఞతలు చెప్పి సంతోషంగా

ఎగురుకుంటూ వెళ్లి పోయాయి .

Moral: ఐకమత్యమే బలం

Chandamaama Kathalu తెలుగు చందమామ కథలు :

Duck and Golden Egg Telugu Story

అత్యాశ

Chandamaama Kathalu తెలుగు చందమామ కథలు

ఒక ముసలమ్మ దగ్గర ఒక బాతు ఉండేది ,అది రోజుకు  ఒక బంగారు గుడ్డు పెట్టేది . ఆ గుడ్డును అమ్మగా  వచ్చిన డబ్బుతో ,ముసలమ్మ కుటుంభం అంతా సంతోషంగా ఉండేది . ఒక రోజు ముసలమ్మఇంటికి ప్రక్క ఊరిలో వుండే తన మనవడు వచ్చాడు , అతనికి ఈ బాతు వ్యవహారం వింతగా అనిపించింది . అతనికి ఒక అత్యాశకూడా పుట్టింది ,రోజు కి ఒక గుడ్డు తీసుకొనే బదులు బాతు పొట్ట చీల్చి దానిలో వున్న అన్ని గుడ్లూ ఒకేసారి తీసుకొని ధనవంతుణ్ణి అయిపోదాం అనుకున్నాడు . అనుకున్నట్టు గానే ముసలమ్మ ఇంటిలో లేని సమయం చూసి బాతు పొట్ట చీల్చాడు … ఆశ్యర్యంగా అన్ని బాతులు లాగానే ఈ బాతు శరీరంలో కూడా రక్త మాంసాలే  వున్నాయి ,బంగారు గుడ్లు లేవు . తన అత్యాశవల్ల బంగారు గుడ్లుపెట్టే బాతుని కోల్పోయానాని తెలుసుకొని పశ్చాత్తాపం తో కుమిలి పోయాడు.

Moral: అత్యాశ ఎప్పుడూ మంచి చేయదు.

 

For more  stories please visit: Famous stories

 

Chandamaama Kathalu తెలుగు చందమామ కథలు

 

 

 

error: Content is protected !!