famous stories in telugu
Spread the love

Contents

Famous stories in Telugu:

Lion and mouse story in Telugu

సింహం – చిట్టెలుక

Famous stories in Telugu: this article explains how moral values are important in our daily life

 

famous stories in telugu

అనగనగా ఒక రోజు అడవికి రాజైన సింహం ఆదమరచి నిద్రపోతూ ఉంటుంది , ఒక చిట్టెలుక అటుగా వచ్చి సింహం నిద్రపోతుంది  అనే ధైర్యం తో దాని మీద ఎక్కి దూకుతూ ఉంటుంది. మెలుకువ వచ్చిన సింహం ఒక్క ఉదుటున చిట్టెలుకను పట్టుకుంటుంది…ఏమిటీ నేను ఆదమరచి ఉన్నంత మాత్రాన నిన్ను గమనించను అనుకున్నావా ! నా మీద ఎక్కి దూకుతున్నావ్ , ఇప్పుడే నిన్ను నా ఆహారంగా తీసుకుంటాను చూడు అంటుంది .

ఈ అనుకోని పరిణామానికి ఉలిక్కి పడిన చిట్టెలుక, మహారాజా నన్ను క్షమించండి మీకు ఆహారంగా సరిపోయేంత పెద్ద ప్రాణిని  కాను, ఇది నా మొదటి తప్పుగా భావించి నన్ను వదిలేయండి … జీవితం లో ఎప్పుడైనా మీకు అవసరమైనప్పుడు నేను మీకు సహాయం చేస్తాను అని బతిమిలాడింది. చిట్టెలుక మాటలు విని సింహం గట్టిగా నవ్వి అల్పప్రాణివి నువ్వు నాకు సహాయం చేస్తావా … కలలు కంటున్నావా నువ్వు ,అయినా ఇంత చిన్న జీవిని చంపితే మహారాజు నైన నాకే అవమానం … యిప్పుడు నిన్ను వదిలివేస్తున్నాను , ఇంకోసారి నాకు కనబడితే తప్పకుండా చంపుతాను అని చెప్పి ఎలుకను వదిలి వేసింది . చిట్టెలుక బ్రతుకు జీవుడా అంటూ పారిపోయింది .

కొన్నాళ్ళకు చిట్టెలుక అడవి మార్గం గుండా వెళుతుంటే … వలలో చిక్కుకొని నిస్సహాయంగా వున్న సింహం కనబడింది . చిట్టెలుక నెమ్మదిగా వల దగ్గరకు వెళ్ళింది, అప్పుడు  వలలో వున్న సింహం చిట్టెలుకను చూసి … ఆ రోజు నిన్ను చంపకుండా వదిలివేసిన సింహాన్ని నేనే , యిప్పుడు నాకు నీ అవసరం  వచ్చింది .వేటగాడు వచ్చేలోపు దయచేసి నన్ను కాపాడు , నా  చుట్టూవున్న ఈ వలను తెంపివేయి అని ప్రాదేయపడింది .

అప్పుడు చిట్టెలుక ఏ మాత్రం ఆలోచించకుండా తన పదునైన పళ్ళతో  ఆ వలను ముక్కలు ముక్కలు చేసింది , సింహం క్షేమంగా బయటపడింది . అప్పుడు సింహం  , చిట్టెలుక తో చిన్న ప్రాణివని అలుసుగా మాట్లాడాను .. యిప్పుడు నువ్వు కాపాడబట్టే నేను ప్రాణాలతో వున్నాను ,నన్ను క్షమించు మిత్రమా అని అంటుంది .

Moral: ఎవరినీ  తేలికగా తీసిపారవేయకూడదు ,ఎప్పుడు ఎవరి అవసరం వస్తుందో ఎవరికి  తెలుసు. 

Famous stories in Telugu

Cow and tiger story in Telugu

ఆవు- పులి

 

famous stories in telugu

ఒక రోజు ఒక ఆవుల మంద అడవిలో మేత  మేస్తుండగా , పులి ఒకటి ఆహారం కోసం అటుగా వచ్చింది..  పులిని చూసి ఆవులన్ని పారిపోయాయి  కానీ ఒక ఆవు మాత్రం పులికి దొరికి పోయింది . ఇంక ఆవుని చంపివేసి ఆహారంగా తీసుకుందాం అని పులి అనుకుంటుండగా , ఆవు పులి రాజా .. నేను మీకు ఆహారంగా అయిపోవడానికి ఏమాత్రం సంకోచించను , కానీ నాకు రోజులు కూడా నిండని ఒక చిన్నబిడ్డ వుంది .

మీరుగనుక  నాకు అవకాశం ఇస్తే నేను నా బిడ్డ దగ్గరకు వెళ్లి దానికి  కడుపునిండా ఆఖరి సారి పాలిచ్చి ,తనివితీరా ముద్దాడి  … అక్కడవున్న నా మిత్రులకు నా బిడ్డను అప్పగించి ,నాబిడ్డ మంచి చెడు  చూడమని వారికి చెప్పి. మళ్ళీ వెంటనే మీ వద్దకు ఆనందంగా వస్తాను అని గద్గదమైన స్వరంతో బతిమిలాడుతూ అడిగింది .

ఆవు మాటలు విని పులి నేను నీకు అంత తెలివిలేని వాడిలా కనబడుతున్నానా … చేతికి చిక్కిన ఆహారాన్ని వదులుకుంటానని ఎలాఅనుకున్నావు అని  గంభీరంగా అడిగింది . అప్పుడు ఆవు ,పులి రాజా నామాట నమ్మండి , నేను మిమ్మల్ని మోసం చేసి బతకగలనా…నా ఈ ఆఖరి కోరిక మన్నించండి అని ప్రాదేయ పడింది . ఆవు మాటలపై కొంత నమ్మకం  కలగడంతో… పులి, సరే నిన్ను ఇప్పుడు  పంపుతున్నాను . నువ్వు తిరిగి రానట్లైతే ఈ సారి నిన్ను నీ బిడ్డను కూడా వదలను అని బెదిరించింది .ఆవు, పులికి కృతజ్ఞతలు చెప్పి పరుగు పరుగున తన బిడ్డ దగ్గరకు వెళ్ళింది ,  కన్నబిడ్డకు కడుపునిండుగా పాలిచ్చి. తన మిత్రులకు జరిగిన విషయం చెప్పి , తన బిడ్డను క్షేమంగా చూసుకోమని చెప్పి . ఆఖరిసారి బిడ్డను తనివితీరా చూసుకొని, కన్నీళ్లతో పులి వద్దకు పయనమైంది  .

ఆవు తిరిగి రావడం చూసిన పులి , ఆవు నిజాయితీకి ,మంచితనానికి ముచ్చటపడి . సరే ఈ సారికి నిన్ను వదిలివేస్తున్నా పోయి నీబిడ్డతో ఆనందంగా జీవించు  అంటుంది . పులి మాటలకు ఆశ్చర్య పడిన ఆవు , పులికి కృతజ్ఞతలు చెప్పి ఆనందంగా పరుగు పరుగున తన బిడ్డ దగ్గరకు వెళ్తుంది ..

Moral :నిజాయితీ ఎప్పుడూ గెలుస్తుంది .

Famous stories in Telugu: this article explains how moral values are important for kids

Famous stories in Telugu

Ant and Pigeon story in Telugu

చీమ -పావురం

 

famous stories in telugu

అడవిలో ఒక చెట్టుమీద ఒక పావురం కూర్చొనివుంది దానికి ఆ చెట్టుక్రింద వున్న చెరువులో ఒక చీమ మునిగిపోతూ కనబడింది,దానిని రక్షిదాం అనే ఉద్దేశ్యంతో చెట్టుకున్న ఒక ఆకు తీసి చెరువులోకి  వేసింది . చీమ ఆ ఆకుపై ఎక్కి నెమ్మదిగా ఒడ్డును చేరుకుంది , వెళ్ళిపోతూ పావురానికి కృతజ్ఞతలు తెలిపింది .

కొంత కాలం తర్వాత చీమ తన దారిలో వెళుతూ వుంటుంది , అప్పుడు ఒక వేటగాడు పావురానికి తన బాణం గురిపెట్టడం చూసింది. ఆ పావురం తనకు ఒకప్పుడు సహాయం చేసిన పావురం గా గుర్తించింది చీమ , దానికి యిప్పుడు తానూ సహాయం చేయాలి అని నిర్ణయించుకుంది . వెంటనే వేటగాని కాలు పై బలంగా కుట్టింది . చీమ కుట్టడంతో నొప్పి పెట్టి వేటగాడు గట్టిగా అరిచాడు , ఆ శబ్దానికి పావురం ఎగిరిపోయింది . వేటగాని గురి తప్పింది ,ఆ విధంగా చీమ తనకు సహాయం  చేసిన పావురాని  కి  తిరిగి మరలా సహాయం చేసి ఋణం తీర్చుకుంది.

Moral : మన మంచితనం ,ఎప్పుడో అప్పుడు మనలను కాపాడుతుంది

 

 

Rabbit and Tortoise story in Telugu

కుందేలు- తాబేలు

Famous stories in Telugu

rabbit and tortoise story in telugu

ఒక రోజు కుందేలు ,తాబేలు తో ప్రపంచం లో నీకన్నా ఎవరు నెమ్మదిగా నడవరు అని, తన నడక విషయం లో ఎగతాళి చేసింది . తాబేలుకు చాలా బాధగా అనిపించింది , ఎలాగైనా కుందేలుకి బుద్ధి  చెప్పాలి అనుకుంది . మరుసటి రోజు కుందేలు వద్దకు వెళ్లి మనమిద్దరం పరుగు పందెం పెట్టుకుందాం ఎవరిగెలుస్తారో చూద్దాం అన్నది . తాబేలు మాటలకు కుందేలు  బాగా నవ్వి ,అందరికి తెలుసు నువ్వు చాలా నెమ్మదిగా నడుస్తావని ,అయినా కూడా మళ్ళీ నాతో పోటీ  అంటున్నావ్ . మళ్ళీ ఓడిపోతావ్ నీకు ఈ ఓటమి అవసరమా అంటుంది ,అందుకు తాబేలు ప్రయత్నించకుండా ఎవరు ఓడిపోతారో ఎలా చెపుతావ్ అంటుంది . తాబేలు కి బుద్ధివచ్చేలా చేద్దాం అని కుందేలు పోటీకి సరే  అంటుంది .

పోటీ ప్రారంభం అవుతుంది ,కుందేలు యధావిధిగా  అలవాటుగా వేగంగా పరిగెడుతూ ముందుకు వెళుతూ ఉంటుంది . తాబేలు కూడా ఏ మాత్రం తగ్గకుండా తన శక్తిమేరా నడుస్తూ ఉంటుంది , కానీ ఎంత నడిచినా కుందేలు వేగాన్ని అందుకోలేదు కదా . కుందేలు కొంతదూరం పరిగెత్తాక వెనుకకు తిరిగి చూస్తుంది ,దాని కనుచూపు మేరలో ఎక్కడా తాబేలు కనబడదు . అప్పటివరకు చాలా వేగంగా రావడం వలన కుందేలు కి  చాలా ఆకలిగా ఉంటుంది ,తాబేలు యిప్పుడప్పుడే ఇక్కడకు రాదు అని నిర్ణయించుకున్నాక .. అక్కడ దొరికిన కొన్ని దుంపలు తింటుంది అంతలో అలసట వలన నిద్ర రావడంతో ,నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటుంది .

తాబేలు నెమ్మదిగా నడుచుకుంటూ కుందేలు వున్న ప్రదేశానికి వస్తుంది ,అక్కడ కుందేలు మత్తుగా నిద్రపోవడం  చూసి… నెమ్మదిగా చప్పుడు చేయకుండా అక్కడ నుండి తెలివిగా జారుకుంటుంది .

కొంత సేపటికి కుందేలుకి మెలకువ వస్తుంది ,తాను  చాలాసేపు నిద్రపోయానని గ్రహిస్తుంది వెంటనే వేగాన్నందుకుంటుంది ,కానీ అప్పటికే తాబేలు వారి గమ్య స్థానాన్ని చేరుకుంటుంది విజయం సాధిస్తుంది .

కుందేలు తనపై తనకు ఉన్న అతివిశ్వాసంతో తాబేలుని తక్కువ అంచనా వేసినందు వలనే తానూ చిత్తుగా ఓడిపోయానని గ్రహించి తన తెలివితక్కువ తనానికి తానే  సిగ్గుపడుతుంది . తాబేలుకు క్షమాపణ చెపుతుంది .

Moral :ఎవరినీ తక్కువ అంచనా వేయకూడదు

 

For more  stories please visit: Famous stories volume 2

 Famous stories volume 3

For more  stories please visit: Famous stories volume 4

Famous stories in Telugu

u

error: Content is protected !!