Find your way to happiness ||ఆనందం ||
Spread the love

Find your way to happiness ||ఆనందం ||

Contents

  ఆనందం

 

రాత్రి 10 అవుతుంది ఇంటికి ఐదు నిమిషాల దూరంలో ఉన్న బస్టాప్ లో కంపెనీ క్యాబ్ నుంచి దిగింది నవ్య.ఎందుకో చాలా చిరాకుగా ఉంది నవ్యకి ఉదయం నుంచి ఆఫీసులో పని చేసి చేసి చుట్టుపక్కల వాళ్ళతో ఏమీ మాట్లాడాలనిపించలేదు. సరే లంచ్ టైములో బోర్ గా వుంది అని ఏదన్న మంచి కామెడీ వీడియో చూసినా కూడా నవ్వు రావడం లేదు ఎటువంటి జోక్ వచ్చినా కూడా నవ్వాలి అనిపించడం లేదు.ఇష్టమైన ఫ్రెండ్స్ తో మాట్లాడినా కూడా ఏంటో ఆనందం కలగడం లేదు.

ఏంటి!! నా జీవితం ఇలా అయిపోయింది ఫస్ట్ నుంచి బాగా సెటిల్ అవ్వాలి అనుకున్నాను అనుకున్నట్లుగానే ఎంటెక్ అయిపోగానే జాబ్ వచ్చింది,అది కూడా నాకు చాలా ఇష్టమైన జాబ్, రెండు సంవత్సరాల నుంచి అదే ఉద్యోగం చేస్తున్నాను కానీ ఎందుకో నాకు ఈమధ్య అసలు ఏ విషయంలోన ఆనందంగా అనిపించట్లేదు, అసలు నేను తృప్తిగా నవ్వి ఆనందపడి ఎన్ని రోజులుఅయ్యింది అని నాకే అనుమానం కలుగుతుంది .
చిన్నప్పటినుంచి అమ్మా నాన్న అడిగినవన్నీ కొనిచ్చారు , ఎటువంటి లోటు లేకుండా  వున్నా కూడా జీవితంలో ఈ ఆనందం ఎందుకు కరువైంది ??

అనుకుంటూ నడుస్తూ ఉంది…

అంతలో హఠాత్తుగా ఒక బైకు వచ్చి రోడ్డు పక్కన ఉన్న చెట్టుని గట్టిగా ఢీకొట్టింది వెంటనే పెద్ద శబ్దం వచ్చింది, ఆ శబ్దం వినేసరికి నవ్యకు ఒక్కసారిగా గుండె ఝల్లుమంది. ఏమైందని అనుకుంటూ గబగబా పరిగెత్తుకుంటూ ఆ శబ్దం వచ్చిన వైపు వెళ్ళింది అక్కడ ఒక 30& 35 ఏళ్ల వయసున్న మహిళ తలకి బాగా దెబ్బ తగిలి రక్తం కారుతోంది, అది చూసేసరికి నవ్యకి చెప్పలేనంత భయమేసింది దడగా అనిపించింది చుట్టూ చూసింది చుట్టూ చిమ్మ చీకటి తప్ప ఏ ఒక్క మనిషి కనబడలేదు ఏం చేయాలో అర్థం కాలేదు చాలా భయంగా నెమ్మదిగా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ దెబ్బ తగిలిన మహిళ దగ్గరికి వెళ్ళింది .

ఆమె ఏమాత్రం స్పృహలో లేదు ఆమె పక్కన పడివున్న బ్యాగ్ లోంచి బయటికి వచ్చిన మొబైల్ ఫోన్ కనబడేసరికి ఆమెకు సంబందించిన ఎవరికన్నా ఫోన్ చేద్దామా అనుకుని ఆ ఫోన్ తీసుకుంది కానీ దానిలో ఫోను లాక్ చేసి ఉంది అయ్యో!! యిప్పుడు ఏంచేద్దాం అనుకుంది.  అప్పుడు తన ఫోన్ నుంచి 108 కి ఫోన్ చేద్దామని అనుకుంటుండగా అటువైపుగా ఒక ఆటో వెళుతూ కనిపించింది నవ్యకి వెంటనే గట్టిగా స్టాప్ స్టాప్ అని పరిగెత్తుకుంటా ఆటో దగ్గరికి వెళ్ళింది.
నవ్య అరుపు విని ఆటో ఆగింది నవ్య ఆటోఅతని దగ్గరికి వెళ్లి బాబు పక్కన ఒక ఆవిడ ఆక్సిడెంట్ అయ్యి పడిపోయింది కొంచెం ఆమెను హాస్పిటల్ కి తీసుకెళ్తావా అని అడిగింది . అందుకు ఆటో అతను లేదు నాకు వేరే గిరాకీ ఉంది ఈ టైంలో నా కుదరదు అనుకుంటూ ఆటో స్టార్ట్ చేయడం మొదలుపెట్టాడు అంతలో నవ్య లేదు ప్లీజ్ ఆమె అస్సలు బాగోలేదు కావాలంటే నేను కూడా నీతో పాటు వస్తాను కొంచెం సహాయం చేయవా ప్లీజ్ అని వేడుకంది.

అప్పుడు ఆటో అతను సరే.. మీరు కూడా నాతో ఉంటాను అంటున్నారు కాబట్టి వస్తాను అని చెప్పి అతను కూడా నవ్యతో పాటు వచ్చి, అతను నవ్య కలిపి ఆమెను చాలా కష్టంగా పైకి లేపి ఆటోలో కూర్చోబెట్టారు.
ఆటోలో ఆమె తల నుంచి రక్తం కారుతూనే ఉంది దాన్ని ఏం చేయాలో తెలియక నవ్య తన చున్నీతో ఆమె తల చుట్టూ కట్టింది కానీ రక్తం ఎంతగా కారుతుంది అంటే ఆ చున్నీ అంతా తడిసి ముద్దయిపోయింది .
ఆటో అతను చాలా వేగంగా తీసుకొని వెళ్లి దగ్గర్లో ఉన్న హాస్పిటల్ ముందు ఆపాడు గబగబా అతను ఆటో దిగి హాస్పిటల్ లోనికి వెళ్లి అక్కడ ఉన్న స్టాప్ ను తీసుకొని వచ్చాడు వాళ్ళు హుటాహుటిన ఆమెను స్ట్రక్చర్ పై వేసుకుని హాస్పిటల్ లోపలికి తీసుకెళ్లిపోయారు.

Find your way to happiness ||ఆనందం ||

వెంటనే…

ఆటో అతను నవ్య తో మేడం నాకిరాయి నాకు ఇస్తారా అని అడిగాడు అప్పుడు నవ్య సరే ఎంత అయింది అని అడిగింది అతను వంద రూపాయలు అని చెప్పాడు వెంటనే అతనికి వంద రూపాయలు ఇచ్చేసి బాబు నన్ను కొంచెం మా ఇంటి దగ్గర దింపుతావా అని అడిగింది అప్పుడు ఆటో అతను అదేంటి మేడం ఆమె ఎలా ఉందో మీరు చూడరా అని అడిగాడు, అప్పుడు నవ్య నాకు ఆవిడ తెలీదు రోడ్డు పక్కన యాక్సిడెంట్ అయి ఉండడంతో ఏదో ఆమె కి హెల్ప్ చెయ్యాలనిపించి తీసుకు వచ్చాను నాకు ఆమెకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పింది. ఆటో అతను సరే మేడం మీ ఇష్టం అని చెప్పినవ్యను అదే ఆటోలో తీసుకొని వెళ్లి ఇంటి దగ్గర దింపాడు . నవ్య ఇంటి ముందుకు వచ్చి డోరుబెల్ కొడుతుందేగాని కానీ చేతులు కాళ్లు ఇంకా వణుకు తగ్గలేదు.
నవ్య అమ్మ డోర్ తీసి ఏ..!! నవ్య ఇంత ఆలస్యం అయింది అని అడిగింది మళ్లీ అమ్మకు చెప్తే కంగారుపడుతుందేమో అనుకొని ఏం లేదమ్మా ఆఫీస్ లో లేట్ అయింది అని చెప్పి గబగబా గదిలోనికి వెళ్ళిపోయింది . వెంటనే స్నానం చేసి నిద్రపోదామని అనుకుందేకాని కానీ రాత్రంతా అస్సలు నిద్ర పట్టనే లేదు ఆమెకు ఎలా ఉందో?అస్సలు బ్రతికివుందో లేదో చనిపోయిందో ఏమో… రేపు ఏమన్నా ప్రాబ్లం అయితే పోలీసులు వచ్చి తనని అరెస్ట్ చేస్తారో ఏమో అని ఒకటే ఆలోచనలతో ఆ రాత్రంతా కలత నిద్రలోనే వుంది .
ఉదయం లేచేసరికి రాత్రంతా జరిగింది నిజమా కల అన్నట్లు అనిపించింది. సరే నాకు తోచిన సాయం నేను చేశాను పోలీసులు వచ్చి అడుగుతే అదే చెప్తాను అని గట్టిగా అనుకొని రెడీ అయ్యి ఆఫీస్ కి వెళ్ళింది .
ఆఫీసులో పని చేస్తుందే గాని తనకు ఏమాత్రం పనిచేయాలని అనిపించడం లేదు, ఆన్లైన్లో హాస్పిటల్ నెంబర్ చూసి ఒకసారి హాస్పిటల్ కి ఫోన్ చేసి ఆమె పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం అనుకుంది వెంటనే నెంబర్ తీసుకొని హాస్పిటల్ కి ఫోన్ చేసి, నిన్న రాత్రి ఒక ఆవిడ హాస్పిటల్లో అడ్మిట్ అయింది ఆవిడకి ఎలా ఉంది అని అవతల వ్యక్తిని అడిగింది, అవతలి వ్యక్తి ఇది చాలా పెద్ద హాస్పటల్ మేడం నిన్న రాత్రి చాలా కేసులు వచ్చి ఉంటాయి ఎవరు అని నేను ఎలా చెప్పగలను కనీసం మీరు పేషెంట్ పేరన్నా చెప్పండి అని అడిగింది . నవ్యకు ఏం చెప్పాలో తెలియక సరే ఉంటాను అని ఫోన్ పెట్టేసింది .

ఫోన్ పెట్టిందే గాని….

ఆమెకు ఎలా ఉందో అని మనస్సు మాత్రం లాగుతూనే ఉంది. ఎలాగో ఆరోజు గడిచాక తన ఫ్రెండ్ దివ్యని తీసుకొని జరిగిన విషయం అంతా చెప్పి ఒక్కసారి మనం హాస్పిటల్ కి వెళ్లి ఆమె ఎలా ఉందో చూసి ఎవరికీ తెలియకుండా వెంటనే వచ్చేద్దాం అని హాస్పిటల్ కి బయలుదేరింది .
హాస్పిటల్ రిసెప్షన్ దగ్గరికి వెళ్లి నిన్న రాత్రి ఒక మిడిల్ ఏజ్ ఆమెను యాక్సిడెంట్ అని ఇక్కడ అడ్మిట్ చేశారు ఆమెకి ఎలా ఉంది అని అడిగింది అప్పుడు రిసెప్షన్లో ఉన్న ఆవిడ రూమ్ నెంబర్ చెప్పగలరా అని అడిగింది అందుకు నవ్య నాకు తెలియదండి నిన్న నైట్ ఒక ఆవిడ అడ్మిట్ అయిందని తెలుసు ఆవిడ గురించి తెలుసుకుందామని వచ్చాను అని విసుగ్గా అంది అప్పుడు రిసెప్షన్ దగ్గర ఉన్న వ్యక్తి మేడం మీరా… మీ గురించే మేము పొద్దున్నుంచి ఎదురు చూస్తున్నాము , ప్లీజ్ మీరు ఒకసారి నాతోపాటు వస్తారా అని అడిగాడు అప్పుడు నవ్య ఆశ్చర్యంగా మీరు ఎవరు? నేను మీతో ఎందుకు రావాలి అని అడిగింది అప్పుడు ఆ వ్యక్తి మీరు రాత్రి ఒక ఆవిడని అడ్మిట్ చేశారు కదా నేను సీసీటీవీలో చూశాను ఆవిడ నా భార్య అని చెప్పాడు. సీసీటీవీ అనేసరికి నవ్యకి గుండె దడ దడ కొట్టుకోవడం మొదలెట్టింది అవునా ఏమైంది మీ ఆవిడకి అని అడిగింది అప్పుడు అతను ఏమి కాలేదు మేడం మా ఆవిడ బాగుంది.

ఒక్కసారి మిమ్మల్ని చూడాలని మా వాళ్ళందరూ అడుగుతున్నారు అని అన్నాడు అప్పుడు నవ్య మీ ఆవిడ బానే ఉంది కదా అని అడిగింది మా ఆవిడ బాగుంది మేడం మీ దయవల్ల ప్రమాదం తప్పింది అని చెప్పాడు. అప్పుడునవ్యకు కొంచెం నిశ్చింతగా అనిపించి సరే పదండి వెళ్దాం అని చెప్పి నవ్య దివ్య కలిసి ఆయనతోపాటు వెళ్లారు.

హాస్పిటల్లో ఫోర్త్ ఫ్లోర్ కి…

వెళ్లేసరికి అక్కడ కారిడార్లో ఒక పదిమంది దాకా మనుషులు ఉన్నారు వారిని చూసేసరికి నవ్యకి ఎందుకో భయంగా అనిపించింది. అతను కారిడార్ లో అడుగుపెడుతూనే ఈవిడే ఈవిడే రాత్రి గాయత్రిని హాస్పిటల్లో జాయిన్ చేసింది అని గట్టిగా అరిచాడు వెంటనే అక్కడున్న ఒక పెద్దావిడ పరిగెత్తుకుంటూ వచ్చి నవ్యను గట్టిగా పట్టుకొని ఏడవడం మొదలు పెట్టింది నవ్య కు చాలా భయంగా అనిపించింది, ఏమైంది ఎందుకు ఏడుస్తున్నారు అని అడిగింది ఆమెను అప్పుడు ఆమె నీవల్ల నా కూతురు బ్రతికిందమ్మ , నువ్వు దేవుడు పంపించినట్టే వచ్చి నా కూతుర్ని కాపాడావు అని ఇంకా గట్టిగా ఏడుస్తూనే ఉంది అంతలో చుట్టూ జనం గుమిగూడారు ,నవ్యకు ఏం చేయాలో అర్థం కాలేదు అప్పుడు ఇంకో పెద్దావిడ ఒక చిన్న పాపను తీసుకుని వచ్చి ఈ పాపకి 11 నెలలు ఇక్కడున్న బాబుకి మూడు సంవత్సరాలు వీళ్ళమ్మనే నువ్వు రాత్రి కాపాడావు అని చెప్పింది .

ఆ చిన్న పిల్లలను చూడగానే నవ్యకు చాలా బాధగా అనిపించింది ఏమిటి!! వీళ్ళ అమ్మకా నేను నైట్ హెల్ప్ చేసింది అమ్మో రాత్రి ఆమెకు ఏమైనా అయ్యి ఉంటే పిల్లలు పరిస్థితి ఏంటి అని అనిపించింది .

Find your way to happiness ||ఆనందం ||

అప్పుడు…

అక్కడున్న వాళ్ళందరూ నవ్య చేతిని పట్టుకొని మీకు చాలా థాంక్స్ మీరు మాకు చాలా హెల్ప్ చేశారు మా కుటుంబం అంతా ఇప్పుడు హ్యాపీగా ఉందంటే మీరే కారణం రాత్రి మీరు తొందరగా హాస్పిటల్ కి తీసుకురా పోయుంటే ఆవిడ మాకు దక్కేది కాదు అని చెప్తూ అందరూ అభిమానం గా నవ్య వైపు చూసారు. ఆ కుటుంబం అంతా నవ్యకు మళ్ళీ మళ్ళీ థాంక్స్ చెప్తూనే ఉన్నారు వాళ్ళందరికీ బాయ్ చెప్పి నవ్య లిఫ్ట్ లో కిందకు వస్తుందే గాని గుండంత బరువెక్కి కళ్ళనుండి నీళ్లు కారుతూనే ఉన్నాయి.

నవ్య పరిస్థితి చూసిన దివ్యకు విషయం అర్థమైను వ్వు చాలా మంచి పని చేశావు “ఐ యామ్ ప్రౌడ్ అఫ్ యూ” అంది. నవ్య దివ్య కొంతసేపటికి ఇంటికి చేరారు . ఇంటికి వచ్చాక దివ్య నవ్య తల్లిదండ్రులకు జరిగిన విషయం అంతా చెప్పింది. ఆ విషయం విన్న నవ్య తల్లిదండ్రులు నవ్యను గట్టిగా హత్తుకొని నువ్వు ఇంత మంచి పని చేసి ఎవ్వరికి చెప్పకుండా ఎందుకు ఉన్నావు నువ్వు మా కూతురుగా పుట్టినందుకు మేము చాలా హ్యాపీగా ఉన్నాం చాలా గర్వపడుతున్నావ్ అని చెప్పారు .
నవ్యకు ఆ మాటలు చాలా ఆనందంగా అనిపించాయి సంతోషంతో మనసు నిండిపోయింది అలాగే కదలకుండా ఒక గంట సేపు కుర్చీలో ఉండిపోయింది .
ఏమిటీ .. ఇన్నాళ్లుగా నేను పొందలేని ఆనందం ఈ రోజు ఎందుకు కలిగింది .. నేను అసలు ఏం సాధించాన, అంటే ఒక మనిషికి సహాయం చేస్తే ఇంత ఆనందంగా ఉంటుందా… ఇన్నాళ్లు నేను ఈ ఆనందానికి దూరం అవడానికి కారణం!!, ఇదే నా జీవితం అని నాకు నేనే గిరి గిసుకొని ఉండడం వల్ల… ఎవరితో కలవకపోవడం వల్ల… ఎవరికి చిన్న సాయం కూడా చేయకపోవడం వలన…నేను నా సంతోషాన్ని మిస్ అయ్యాను, అని అనుకుంటూ లేదు ఈ సంతోష నాకెప్పుడూ కావాలి అంటే నేను నాకు తోచినంతలో నా చుట్టుపక్కల ఉన్నవారికి ఎప్పుడూ సహాయం చేయాలి. నేను సంతోషంగా ఉండాలి వాళ్ళని సంతోషపరచాలి అని దృఢంగా నిశ్చయించుకుని అక్కడి నుంచి తన గది లోపలికి వెళ్ళింది.

 

Gummadi.Sireesha

Find your way to happiness ||ఆనందం ||

 

For more stories please visit: బహుమతి 

error: Content is protected !!