Telugu Stories to Read online in Telugu| Satya katha|
Spread the love

Contents

Satya Katha

 Stories in Telugu to Read 

 

Telugu Stories to Read online in Telugu| Satya katha|

సత్య  ఆఫీస్ కి బయలుద్దేరుతుండగా సత్య  వాళ్ళ అమ్మగారు శాంతమ్మ, సత్య … ఈ రోజు సాయంత్రం అన్నయ్య వదిన వస్తున్నారు రెండురోజులు ఉండడానికి,అసలే ఆరునెలల నుండి నువ్వు వాడితో సరిగ్గా కలవడం లేదు మాట్లాడం లేదు ఈ సారైనా కొంచం కుదుర్చుకొని రెండు రోజులు లీవ్ పెట్టు అన్నాది . 

సత్య  ఆ మాటలు విన్నాకూడా పట్టించుకోనట్టుగా అటువైపు తిరిగి నాకు అస్సలు కుదరదు అమ్మ..  మా ఓల్డ్ ఫ్రెండ్స్ అందరూ ఒక రిసార్ట్ లో కలుస్తున్నారు రేపు ,నేనుకూడా వెళ్తున్నాను రెండు రోజులు అక్కడే!! అని చెప్పి బైక్ స్టార్ట్ చేసాడు . శాంతమ్మ ఏమీ మాట్లాడకుండా అలాగే చూస్తూ వుంది.

సత్య  బైక్ పై వెళ్తూ అనుకుంటున్నాడు … అదేంటి అమ్మతో ఫ్రెండ్స్ ను కలవడానికి వెళ్తున్నాని చెప్పాను యిప్పుడు ఈ రెండురోజులు ఎక్కడ ఉండాలి అని అనుకుంటుండగా ఫోన్ రింగ్ అయ్యింది ఎవరా! అని చూస్తే కాలేజ్ ఫ్రెండ్ స్వామి అని వుంది . అబ్బా..  వీడు మళ్ళి  చేస్తున్నాడు ఏంటీ ?   ఓల్డ్ ఫ్రెండ్స్ మీట్ కి రాను అని ఎన్నిసార్లు చెప్పినా వినడం లేదు అనుకుంటూ ఫోన్ కట్ చేసాడు . కానీ మళ్ళీ మళ్ళీ స్వామి చేయడం తో విషయం ఏమిటో తెలుసుకొని రానని గట్టిగా చెబుదామని ఫోన్ లిఫ్ట్ చేసాడు. .. 

అవతల నుంచి స్వామి ఒరేయ్.. మీట్ కి శరత్ గాడు రావడం లేదంట ఆవిషయం చెబుదామని ఫోన్ చేసాను యిప్పటికైనా నువ్వు రారా … అందర్నీ కలసి చాలా రోజులయ్యింది అని బతిమిలాడినట్టు అన్నాడు . ఆమాటలు విన్న సత్య  సరే లేరా ఆఫీస్ లో లీవ్ దొరుకుతుందో
లేదో చెక్ చేసి మళ్ళీ కాల్ చేస్తాను అన్నాడు . ఇంక ఏం ప్రాబ్లెమ్ లేదు అనుకున్నాక  కొంతసేపటికి స్వామికి వస్తున్నాని మెసేజ్ చేసాడు. 

వెంటనే ఇంటికి వెళ్లి రెండుజతల బట్టలు బాగ్ లో సర్దుకొని శాంతమ్మకు చెప్పి రిసార్ట్ కు బయలుదేరాడు, అదంతా శాంతమ్మ చూస్తుందే కానీ  ఒక్క సారి కూడా సత్య  ని ఉండమని అడగలేక పోయింది. 

Telugu Stories to Read online in Telugu| Satya katha|

Resort లో….

సత్య  రిసార్ట్ లోకి ఎంటరవ్వడం తోనే అప్పటికే వచ్చిన వారందరు వచ్చి పలకరించారు ,అందరితో హ్యాపీ గా మాట్లాడిన
తర్వాత  పక్కకి చూస్తే ఒక చైర్ మీద కూర్చొని తననే గమనిస్తున్న ఇంజనీరింగ్ కాలేజీ లెక్చర్ కనిపించారు ,ఆయనను చూస్తేనే సత్య  ఒళ్ళు చల్లబడి పోయింది శరీరం లో మెల్లగా ఒణుకు మొదలయ్యింది . అప్పుడు ఆయన సత్య  ను ఉద్దేశించి, ఏ.. !! సత్య  బాగా సెటిల్ అయ్యావట మీ ఫ్రెండ్స్ చెప్పారు ,వెరీ గుడ్ అన్నారు . ఆ మాటలు విని సత్య  థాంక్యూ సర్ అని ముక్తసరిగా చెప్పి అక్కడనుండి గబగబా వెళ్ళిపోయాడు. 

అక్కడవున్న స్వామిని పిలిచి ఎరా .. లెక్చరర్లు కూడా వస్తారని నువ్వునాకు చెప్పలేదు అన్నాడు . అందుకు స్వామి ఏమోరా.. బాబూ .. ఇక్కడికి వచ్చేవరకు నాకూ తెలీదు,  మన వాళ్ళే ఎవరో ఇన్వెట్ చేసారంట ,సరేలే ఒక్క  నిమిషం ఆగు మన రూప ,వాళ్ళ భర్త వస్తున్నారంట వెళ్లి వెల్కమ్ చెబుతాను అసలే కొత్త పెళ్ళి కొడుకు కదా అన్నాడు. 

 రూప అనే పేరు వినగానే సత్య  కు చాలా యిబ్బందిగా అనిపించింది, అదేంటి తను అమెరికాలో వుందికదా దీని కోసం ఇంతదూరం వస్తుంది అనుకోలేదు. అస్సలు నేను ఇక్కడకు వచ్చి చాలా పెద్దతప్పు చేసాను అనుకుంటూ ప్రక్కనే వున్న ఖాళీ లాన్ లో కుర్చీలో కూలబడ్డాడు. 

జరిగిన కథ :

సత్య , రూప ,శరత్ లు ఇంటర్ నుండి కలిసి చదువుకున్నారు ,ఇంజనీరింగ్ లో కూడా ఒకే కాలేజీ లో సీట్ వచ్చింది . ముగ్గురు చాలా స్నేహం గా ఉండేవారు ,రూప ఎప్పుడు ప్రాక్టీకల్ కోసం ల్యాబ్ కు వెళ్లినా తనకు ఏంతో  ఇష్టమైన గోల్డ్ బ్రాస్ లెట్ ను పాడవకుండా తన పర్సు లో పెట్టుకొని తీసుకువెళ్లేది ,కానీ ఆ రోజు కంగారులో  పర్సు ను క్లాస్ రూంలో మర్చిపోయి వెళ్లి పోయింది. అది గమనించిన శరత్ సత్య  తో ఒరేయ్ ఆ  బ్రాస్ లెట్ తీసుకు రారా.. మనం దాచేద్దాం బాగా ఏడిపించి సాయంత్రం యిచ్చి ఒక పార్టీ తీసుకుందాం దాని దగ్గర అన్నాడు . అదంతా విన్న సత్య  ఒద్దురా అసలే గోల్డ్ ఎవరికన్నా తెలిస్తే బాగోదు అన్నాడు ,అప్పుడు శరత్ ఏంకాదులేరా … నేను చూసుకుంటా ముందు నువెళ్ళి ఆ బ్రాస్ లెట్ తీసుకురా అన్నాడు . సత్య  బ్రాస్ లెట్ తెచ్చాక వాళ్లిద్దరూ  కూడా  ల్యాబ్ కు వెళ్లిపోయారు. 

సత్య  ల్యాబ్ లో ఉంటుండగా ప్యూన్ వచ్చి లెక్చర్ పిలుస్తున్నారని చెబుతాడు , అది విన్న సత్య  ఎగ్జామ్స్ గురించి ఏమన్నా అడగడానికి ఏమో అని వెళ్ళే సరికి ఆయన ముందు రూప ఏడుస్తూ ఉంటుంది. విషయం అర్థం కానీ సత్య  ఏమైంది అని అడిగితే … లెక్చర్ సత్య  ని చూస్తూ ఏ రా ఇంటినుండి వచ్చే డబ్బులు సరిపోవడం లేదా దొంగతనం చేశావా అన్నారు ,దొంగతనం అనే  మాట వినేసరికి  సత్య  కు చాలా అవమానం గా అనిపించింది, లేదు సర్!! రూప తప్పుగా అనుకుంటుంది ,నేను శరత్ కలసి సరదాగా ఏడిపిద్దాం అని దానిని తీసాం అన్నాడు గట్టిగా (తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలనే ఉదేశ్యం తో ). ఆ మాట విన్న లెక్చర్ శరత్ ని పిలిచి విషయం అడిగితే శరత్ ఒక్కమాటకూడా మాట్లాడలేదు . శరత్ ప్రవర్తన చూసి సత్య  కు చాలా బాధగా అనిపించింది రూప మొహం చూడాలంటే సిగ్గుగా అనిపించింది . 

అప్పుడు లెక్చర్ సత్య  ని చూస్తూ నేను కెమెరా లో చూసాను కాబట్టి విషయం తెలిసింది లేకపోతె నీ దొంగతనం దొరికేది కాదు,ఇది మొదటి తప్పుకాబట్టి వొదిలేస్తున్నాను ఇంకెప్పుడైనా తప్పుచేసినట్టు తెలిస్తే ప్రిన్సిపల్ కి మీ పేరెంట్స్ కి కంప్లైంట్ ఇస్తాను అని గట్టిగా మందలించారు. తన మీద పడిన నింద భరించలేని సత్య  ఏమీ మాటలాడకుండా అక్కడనుండి వెళ్ళిపోయాడు ,కొన్ని రోజులకి రూపవాళ్ళనాన్న గారికి ట్రాన్స్వర్ అవ్వడంతో రూపా వేరే వూరు వెళ్లిపోయింది . తర్వాత శరత్ కానీ సత్య  కానీ ఎప్పుడూ మాట్లాడుకోలేదు కనీసం చూసుకోలేదు కూడా. ఈ విషయం ఆ నలుగురి మధ్యలోనే ఉండిపోయింది కానీ నింద మాత్రం యిప్పటికీ సత్య  మనసుని బాధిస్తూనే వుంది

Telugu Stories to Read online in Telugu| Satya katha|

ప్రస్తుతం.. 

ఇంతలో సత్య  కి ఎవరో వచ్చినట్టు అనిపించి వెనక్కు తిరికి చూసాడు ఎదురుగా శరత్ … సత్య ని గట్టిగా హత్తుకొని ఎన్ని సంవత్సరాలు అయ్యిందిరా ఎలావున్నావు అన్నాడు. సత్య కి వెంటనే శరత్ ని తోసేయాలని అనిపించింది కానీ ప్రక్కనే రూప ఆమె పక్కనే లెక్చర్ ఉండి వారిద్దరినే చూస్తున్నారు . 

ఏంజరుగుతుందో అర్టం కానీ సత్య  ,శరత్ ని విడిపించుకొని వెళ్తుండగా శరత్, లెక్చర్ వైపుతిరిగి సర్ ఆరోజు రూప బ్రాస్ లెట్ సరదాగా తీయమంది నేనే, కానీ మీరు చాలా సీరియస్ అయ్యేసరికి నాకు చాలా భయం వేసింది అసలే అంతంత మాత్రం చదివే నాకు మార్కులు వెయ్యరేమో అని భయం వేసి ఆ రోజు ఏమీ మాట్లాడలేదు నింద అంతా సత్య  గాడు భరించవలసి వచ్చింది . అందుకు నేను ఇన్ని సంవత్సరాలు బాధపడుతూనే వున్నాను . మొన్న రూప తన పెళ్ళికి పిలవడానికి ఫోన్ చేసినప్పుడు నేను జరిగిన విషయం చెప్పాను ,అందుకు తను కోప్పడి ఎలాగైనా మనమిద్దరం సత్య  కు సారీ చెప్పాలి అంది అందుకే ఈ మీట్ కు మేము వచ్చాము అన్నాడు. 

అదంతా విన్న లెక్చర్ సత్య  చేయి పట్టుకొని మేము ఏదయినా తప్పు జరిగినప్పుడు స్టూడెంట్స్ ప్రక్కదారి పట్టకుండా గట్టిగా మందలిస్తాము అంతే గాని మాకు మీపై అటువంటి ద్వేషం గాని కోపం గాని ఉండదు కానీ నేను తెలియక నిన్ను బాధపెట్టాను అందుకు నువ్వు నన్ను కూడా క్షమించాలి అన్నారు. 

అదంతా వింటున్న సత్య  కి చాలా ఆనందంగా అనిపించింది తాను ఇన్నిసంవత్సరాలుగా మోస్తున్న నింద అనేబరువు ఎవరో ఒక్క క్షణ్ణం లో  తీసేసినట్టు అనిపించింది . దానికి కారణమైన రూపకి శరత్ కి లెక్చర్ కి థాంక్స్ చెప్పాడు . 

అంతలో అక్కడికి వచ్చిన స్వామి ఏరా శరత్ సత్య గాడికి మంచి సర్ప్రైస్ ఇస్తానన్నావ్ యిచ్చావా అన్నాడు , అప్పుడు నలుగురూ ఒక్కసారిగా నవ్వారు జరిగిన విషయం ఎవరికీ తెలియకూడదనే  ఉద్దేశ్యం తో. 

ముగింపు …

సత్య  అక్కడున్న వారందరితో మనస్ఫూర్తిగా మాట్లాడి ఇంటికి బయలు దేరాడు , అంతలో శాంతమ్మ దగ్గరనుండి ఫోన్ వచ్చింది … ఫోన్ లో ఆమె, ఒరేయ్..  అన్నయ్య వాళ్ళు ఇంకో గంటలో వెళ్ళిపోతారంట ,ఎప్పుడో  వాడు చుట్టాలందరి ముందు ,ఇంకెన్నాళ్లు ఉద్యోగం లేకుండా వుంటావు అన్నాడని వాడిమీద కోపంతో అప్పటినుండి వాడితో మాట్లాడం మానేశావ్ .

 అస్సలు నాన్న చనిపోయాక వాడు ఎంత కష్టపడి నిన్నునన్ను చూసుకున్నాడో మర్చిపోయావా అటువంటివాడు ఒక తండ్రిలా నిన్ను మందలిస్తే నీకు తప్పయి పోయిందా అని గట్టిగా ఏడుస్తూ అడుగుతుంది . ఆమె మాటలు వింటున్న సత్య  ,అమ్మా …. నేను డ్రైవింగ్ లో వున్నాను మళ్ళీ కాల్ చేస్తాను అని చెప్పి ఫోన్ కట్ చేసాడు. 

రోడ్ కి ఒక ప్రక్కగా బైక్ ఆపి ఆలోచిస్తున్నాడు ,అవును నన్ను ఎన్నో సంవత్సరాలుగా మానసికంగా చాలా బాధ పెట్టిన పరాయివాడిన శరత్ నే నేను క్షమించాను అలాంటిది నన్ను తండ్రిలా చూసుకున్న అన్నయ్య ఒక్కమాటన్నాడని ఇన్నిరోజులు మాట్లాడకుండా ఎలావున్నాను అని తలచుకుంటే నా మీద నాకే అసహ్యం గా వుంది అనుకోని అన్నయ్యకు ఫోన్ చేసి అన్నయ్య… ఇంకో రెండు గంటల్లో వస్తాను ప్లీజ్ వుండండి అన్నాడు ,ఎన్నో రోజులుతర్వాత తమ్ముడి గొంతు విన్న అన్నయ్య ఆనందంతో  సరేరా మేము ఈ రోజు ఇక్కడే ఉంటాము  నువ్వు జాగ్రత్తగా రా అన్నాడు. 

సత్య  ప్రపంచాన్ని జయించినంత ఆనందంగా ఇంటికి బయలుదేరాడు…. 

 

GUMMADI.SIREESHA

 

For more stories please visit:పవన్

 

 

Telugu Stories to Read online in Telugu| Satya katha|

error: Content is protected !!