ఉప్పుకప్పురంబు నొక్క పోలిక నుండు
Spread the love

ఉప్పుకప్పురంబు నొక్క పోలిక నుండు ;
చూడ చూడ రుచులజాడవేరు ;
పురుషులందు పుణ్య పురుషులు వేరయా!
విశ్వదాభిరామ! వినురవేమ !

 

పద్యాన్ని చిన్న పిల్లలకు మరింత చేరువ చేద్దాం అనే ఉద్దేశ్యం తో దానికి కొంత సారూప్యం లో వుండే చిన్న చిన్న సొంత కథలను రాస్తున్నాను . తప్పకుండా చెప్పండి …

Contents

ఉప్పుకప్పురంబు నొక్క పోలిక నుండు

అనగనగా ఒక ఊరిలో రేవంత్ అనే తొమ్మిది సంవత్సరాల బాబు ఉండేవాడు ,ఆ అబ్బాయి రోజంతా ఇంట్లో ఉండి మొబైల్ ఫోన్లు టీవీ చూస్తూ ఎప్పుడూ అసలు బయటికి వచ్చే వాడే కాదు. రేవంత్ ని చూసి వాళ్ళ నాన్నగారు ఎప్పుడూ బాధపడుతూ ఉండేవారు రేవంత్ కి ఎన్నిసార్లు బయటికి వెళ్లి పిల్లలతో ఆడుకో చుట్టుపక్కల వారితో స్నేహం చేయి అని ఎంత చెప్పినా … ఈ అపార్ట్మెంట్లో ఎవరు బయటికి రారు నేను ఎవరితో ఫ్రెండ్షిప్ చేయను అని అనేవాడు.
ఈ సమస్యను ఎలాగైనా పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ నాన్నగారు పక్కన ఉన్న ఒక కాలనీలో ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నారు. ఆ కాలనీలోకి మారాక ఒకరోజు ఆయన రేవంత్ అని పిలిచి” నేను ఈరోజు నుంచి నీకు ఎటువంటి ఫోన్ గాని టీవీ గాని అందుబాటులో ఉంచడం లేదు నీవు ఏం చేస్తావో అది చేయి. ఈ కాలనీలో చాలామంది పిల్లలు ఉన్నారు వాళ్లతో చక్కగా స్నేహం చేయి వాళ్ళతో ఆడుకో ఈ సెలవులంతా నువ్వు ఎంత మంది స్నేహితులు చేసుకుంటే నీకు అంత ఆనందంగా ఉంటుంది “అని చెప్పి ఆయన ఆఫీసుకి వెళ్ళిపోయారు.
ఆయన అన్న విధంగానే రెండు రోజులు రేవంత్ కి ఎటువంటి ఫోను గాని టీవీ గాని అందకుండా ఏర్పాట్లు చేశారు . రెండు రోజులుగా ఇంటిలో ఒంటరిగా ఉంటున్న రేవంత్ కి చాలావిసుగు గా అనిపించి ఇంటి బయటకు వచ్చి నుంచున్నాడు రోడ్డు మీద చాలామంది పిల్లలు ఆడుకోవడం చూసి ఇంట్లో ఎంత సేపు వున్నా నా బోర్ కొడుతుంది కొంతసేపు అలా బయటికి వెళ్లి ఆడుకుందాం అంటూ బయటికి వెళ్లాడు.
మొదటి రోజు కొంచెం కొత్తగా అనిపించినా తర్వాతా రోజు నుండి ఇష్టంగా అనిపించింది బయటకి వెళ్లడం. కొన్ని రోజులలోనే చాలామంది స్నేహితులయ్యారు, రేవంత్ ఎక్కువ సమయం బయటే గడిపేవాడు. రేవంత్ లో మార్పు చూసి వాళ్ళ నాన్నగారికి చాలా ఆనందం అనిపించింది .

ఉప్పుకప్పురంబు నొక్క పోలిక నుండు

ఒకరోజు…

సాయంత్రం ఆయన వాకింగ్ కి వెళ్లి వస్తుండగా రేవంత్ తో పాటు ఉండే స్నేహితులు చెడ్డ మాటలు మాట్లాడటం ఆయనకు వినిపించింది ఆయన అటువంటి సంఘటన ఇంకో రెండు సార్లు చూశారు.
ఆయన రేవంత్ అని పిలిచి నీ స్నేహితులు మంచివారిలా నాకు అనిపించడం లేదు ఎవరన్నా మంచి పిల్లలు ఉంటే వాళ్లతో స్నేహం చేయి అని చెప్పారు అందుకు రేవంత్ గట్టిగా మొన్నటిదాకా ఎవరితోటి ఫ్రెండ్షిప్ చేయలేదని తిట్టారు ఇప్పుడేమో నేను ఫ్రెండ్షిప్ చేస్తున్న వాళ్లు చెడ్డ వాళ్లని అంటున్నారు అంతా మీ ఇష్టమేనా అంటూ అక్కడున్న చైర్ ని గట్టిగ తన్ని ఇంట్లోకి వెళ్లిపోయాడు.
రేవంత్ వాళ్ళ నాన్నగారికి జరిగిన విషయమంతా అర్థమైంది ఓహో!! చెడ్డ స్నేహితులు వల్ల రేవంత్ ప్రవర్తనలో కూడా తేడా వచ్చిందని అనిపించింది ఆయనకు.
అలా కొన్ని రోజులు గడిచాక ఒకరోజు సాయంకాలం రేవంత్ వాళ్ళ నాన్నగారికి ఉంటున్నకాలనీ ప్రెసిడెంట్ నుంచి ఫోన్ వచ్చింది మన కాలనీలో కొంతమంది పిల్లలు ఒక ఇంటి మీద రాళ్లు విసిరారంట వారిలో మీ అబ్బాయి కూడా ఉన్నాడు ఈవినింగ్ కాలనీలో మీటింగ్ పెడుతున్నాం మీరు తప్పనిసరిగా మీ భార్యతో కలిసి రావాలి అని సారాంశం . అది వినగానే రేవంత్ వాళ్ళ నాన్నగారికి చాలా అవమానంగా అనిపించింది ఆయన సాయంత్రం మీటింగ్ కి తన భార్యతో కలిసి అటెండ్ అయ్యారు అక్కడ ఉన్న స్టేజ్ మీద ఒక పదిమంది పిల్లల్ని నిల్చబెట్టారు వాళ్లలో రేవంత్ కూడా ఉన్నాడు.

ఉప్పుకప్పురంబు నొక్క పోలిక నుండు

కాలనీలో ఉన్న…

పెద్ద వాళ్ళందరూ వారికి తోచిన విధంగా అక్కడున్న పిల్లలందరినీ చాలా గట్టిగా మందలిస్తున్నారు అంతా అయిపోయాక కాలనీ ప్రెసిడెంట్ రేవంత్ వాళ్ళ వాళ్ళ నాన్నగారిని పిలిచి ఇంకొకసారి మీ అబ్బాయి ఇలాంటి పనులు చేస్తే మీరు ఈ కాలనీ వదిలి వెళ్ళిపోవాల్సి ఉంటుంది అని గట్టిగా చెప్పాడు . రేవంత్ వాళ్ళ నాన్నగారికి అవమానకరంగా అనిపించింది, సరే అండి ఇంకొకసారి ఇలాంటిది రిపీట్ అవ్వకుండా చూస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు .

ఆ విషయం జరిగాక చాలాసేపటికి రేవంత్ ఇంటికి వచ్చాడు ఎవరితో మాట్లాడకుండా తన గదిలోకి వెళ్లి నిద్రపోయాడు మరుసటిరోజు రోజు ఉదయం లేచేసరికి చాలా ఆకలిగా అనిపించింది అమ్మవాళ్ళు తిడతారనే భయంతో రాత్రంతా ఏమీ తినకుండా పండుకున్నాడు కదా అందుకు. వెంటనే లేచి ఫ్రెషప్ అయ్యి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్లి ప్లేట్లో ఇడ్లీలు వడ్డించుకుని చట్నీ వేసుకున్నాడు అది కొంచెం నోట్లో పెట్టుకునేసరికి చప్పగా అనిపించింది అమ్మా చెట్నీలో ఉప్పు వేయలేదా అని అడిగాడు. అప్పుడు వాళ్ళ అమ్మగారు అయ్యో మర్చిపోయినట్లు ఉన్నాను రా అక్కడే ఉంది వేసుకో అని చెప్పింది . రేవంత్ చూసేసరికి టేబుల్ మీద రెండు గిన్నెల్లో ఉప్పువుంది అమ్మా ఇక్కడ రెండు గిన్నెలు ఉన్నాయి ఏది ఉప్పు అని అడిగాడు. రెండు ఒకేలా ఉన్నాయి కదరా… ఏదో ఒకటి వేసుకో అని చెప్పింది రేవంత్ కి ఏది వేసుకోవాలో తెలియలేదు సరే ఎందుకన్నా మంచిది టేస్ట్ చూద్దామని ఒకటి నోట్లో పెట్టుకున్నాడు చేదుగా ఏదో వాసన వస్తున్నట్టుంది ఇంకొకటి నోట్లో పెట్టుకున్నాడు ఉప్పగా వుంది . వెంటనే అమ్మా ఒకటి ఉప్పగా ఇంకోటి చాలా చేదుగా ఉంది ఏమిటిది అని అడిగాడు.

అప్పుడు

రేవంత్ వాళ్ళ నాన్నగారు గదిలోంచి బయటకు వస్తూ రెండు తెల్లగానే ఉన్నాయి కదరా ఏదైతే ఏంటి ఏదన్నా వేసుకోవచ్చు అన్నారు అప్పుడు రేవంత్ అదేంటి నాన్న ఏది పడితే అది ఎలా వేసుకుంటావు ఒకేలా ఉందని అన్నాడు.
అప్పుడు ఆయన అదేంటి అందరూ స్నేహితులు మంచివాళ్లే… మంచి వాళ్ళో చెడ్డవాళ్ళు ఎలా తెలుస్తుంది అని అడిగావు కదా మరి ఇప్పుడు తేడా తెలిసిందా రుచి చూశాక అని అడిగారు కొంచం వ్యంగంగా అందుకు రేవంత్ తలదించుకొని అర్థమైంది నాన్న అన్నాడు . అప్పుడు రేవంత్ వాళ్ళ నాన్నగారు చూశావా చూడడానికి అందరూ మంచి వాళ్ళనే కనిపిస్తారు కానీ వారి ప్రవర్తన బట్టి మనం వారి మంచి వారు లేదో అంచనా వేసి వారితో స్నేహం చేయాలో వద్దో నిర్ణయించుకోవాలి అంతేగాని ఎవరితో పడితే వారితో స్నేహం చేసి వారికి ఉన్న చెడ్డ లక్షణాలు చెడ్డ ఆలోచనలు మనం కూడా అలవాటు చేసుకోకూడదు అని చెప్పారు .
అప్పుడు రేవంత్ సారీ నాన్న మీరు చెప్పిన మాట వినందుకు ఇకమీదట నేను వారితో స్నేహం చేయను మీకు చెడ్డ పేరు తీసుకురాను అని మాట ఇచ్చి టిఫిన్ తినడం ప్రారంభించాడు.

పిల్లలకు పద్యం అర్థం అయ్యేలా కథ చెప్పాను అనుకుంటున్నాను ,నచ్చితే పిల్లలకు తప్పకుండా చెప్పండి.

 

Gummadi.Sireesha

 

For more poems Please visit: Vemana Padyaalu

error: Content is protected !!