చిన్నపిల్లల కథలు
Spread the love

Contents

చిన్నపిల్లల కథలు..

బంగారు గొడ్డలి

The Golden Axe 

చిన్నపిల్లల కథలు : These are the old popular moral stories for kids in Telugu

 

bangaaru goddali katha

అనగనగా ఒక ఊరిలో రామయ్య అనే ఒక కట్టెలు కొట్టేవాడు ఉండేవాడు . అతను రోజూ అడవికి వెళ్లి కట్టెలు కొట్టి ,వాటిని ప్రక్క వూరిలో వున్న సంతలో అమ్మి వచ్చిన డబ్బుతో తన కుటుంబాన్ని పోషించేవాడు . అతని వద్దవున్న గొడ్డలి ఒకటే తనకు జీవనాధారం .

రోజులాగే ఆరోజు కూడా రామయ్య తన గొడ్డలి తీసుకొని అడవికి బయలు దేరాడు , అడవిలో అతనికి ఒక నదిని ఆనుకొనివున్న ఒక పెద్ద చెట్టు కనబడింది ,దాని కొమ్మలు నరుకుదాం అనే ఉద్దేశ్యం తో అతను చెట్టుపైకి ఎక్కి కొమ్మలు నరకడం ప్రారంభించాడు ఇంతలో తన చేతి లో వున్న గొడ్డలి చేయిజారి నదిలో పడిపోయింది . తన జీవనాధారమైన గొడ్డలి నదిలో పడిపోవడం తో అవాక్కయిన రామయ్య అయ్యో! ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి ?నేను రేపటి నుండి నా కుటుంబాన్ని ఎలా పోషించాలి అనుకుంటూ ఏడవడం మొదలు పెట్టాడు . అలా చాలా సేపు ఏడుస్తూనే వున్నాడు ,కొంత సేపటికి అతనికి రామయ్యా … అనే పిలుపు వినిపించింది . ఈ అడవిలో ఎవరా నన్ను పిలిచేది అనుకుంటూ ,అటు ఇటు చూస్తూ వున్నాడు కానీ తనకు ఎవరు కనబడలేదు .

చిన్నపిల్లల కథలు…

ఇంతలో మళ్ళీ…

రామయ్య అనే పిలుపు వినిపించింది ,ఎవరా అనుకుంటుండగా … తన ఎదురుగా వున్న నది లోంచి ఒక దేవత ప్రత్యక్షమైంది . ఆమెను చూసి రామయ్య ఆశ్చర్యపోయాడు ,అప్పుడు దేవత నేను ఈ నదిని చాలా సేపటినుండి నువ్వు ఏడవడం నేను గమనిస్తున్నాను … నేను నీకు ఏవిధంగా సహాయం చేయగలను అని అడిగింది . అప్పుడు రామయ్య తనకు జరిగిందంతా చెప్పి తన జీవనాధారం తన గొడ్డలిని తనకు యివ్వాలని కోరాడు . అప్పుడు దేవత నీటిలోకి వెళ్లి ఒక వెండి గొడ్డలి ని తీసుకువచ్చింది ,దానిని చూసి రామయ్య అమ్మ ఇది వెండిది చాలా విలువైనది ,నాది ఇనుముతో చేసినది ,నాది నాకు ఇవ్వండి అన్నాడు వినయంగా.

మళ్ళీ దేవత నీటిలోకి వెళ్లి ఈ సారి బంగారు గొడ్డలి తీసుకొని వచ్చింది ,రామయ్యను చూసి ఇదేనా నీది అంది , అప్పుడు రామయ్య అమ్మా ఇది బంగారు గొడ్డలి నాది ఇనుముతో చేసింది ఇది నాది కాదు అన్నాడు . అప్పుడు దేవత మళ్ళీ నీటిలోకి వెళ్లి రామయ్య ఇనుప గొడ్డలితో పాటు వెండి మరియు బంగారు గొడ్డలి కూడా తీసుకు వచ్చింది . రామయ్య దేవత చేతిలో వున్న తన గొడ్డలిని చూసి చాలా సంతోషించి తన గొడ్డలి మాత్రమే తీసుకుంటాడు . అప్పుడు దేవత, రామయ్యా ..  నేను నీకు పెట్టిన ఈ పరీక్షలో నువ్వు నెగ్గావు ,నీ నిజాయితీ చూసి నాకు చాలా సంతోషం కలిగింది అందుకే ఈ వెండి మరియు బంగారు గొడ్డలిని కూడా నీకు బహుమతిగా ఇస్తున్నాను అంటుంది . రామయ్య ఎంతో సంతోషం తో ఆ రెండింటిని కూడా స్వీకరిస్తాడు దేవతకు కృతజ్ఞతలు తెలుపుతాడు.

Moral : నిజాయితీ గలవాడు ఎప్పుడూ గౌరవించ బడతాడు .

 

 

నాన్నా పులి

Panchatantra stories

nanna puli story

అనగనగా ఒక ఊరిలో ఒక గొర్రెల కాపరి ఉండేవాడు ,ఒక రోజు అతని కొడుకు కు బడికి  సెలవు కావడం తో కొడుకుని తీసుకొని గొర్రెలు మేపడానికి అడవికి వెళ్ళాడు . గొర్రెల వద్ద తన కొడుకుని కాపలాగావుంచి ,బాబు… ఈ  చుట్టుప్రక్కల పులి తిరుగుతూ ఉంటుంది ,ఒకవేళ నీకు పులి అలికిడిగాని వినబడితే నన్ను పిలువు నేను ఈ ప్రక్కనే మిగిలిన గొర్రెల కాపరులతో కలసి కట్టెలు కొడుతూ వుంటాను అంటాడు.

తండ్రి చెప్పిన విధంగానే చాలా సేపు గొర్రెలను చూస్తూ ఉంటాడు బాబు ,కానీ కొంత సమయం అయ్యాక విసుగుగా అనిపిస్తుంది ,అబ్బా… ఇంకెంతసేపు ఇలా ఉండాలి ,అందరిని కంగారు పెట్టేలా  ఏమన్నా చేద్దాం అనుకున్నాడు . అనుకున్నదే తడవుగా గట్టిగా “నాన్నా పులి”నాన్నా పులి ” అని అరిచాడు. పులి వచ్చిందేమో అని కంగారు పడి  బాబు తండ్రితో పాటు మిగిలినవారు కూడా  గబగబా వచ్చారు , వారిని చూసి బాబు గట్టిగా నవ్వుతూ భయపడ్డారా నేను సరదాగా అన్నాను అంటాడు. బాబు మాటలు విని అందరు ,తప్పు ఇంకెప్పుడు అలా పరాచికాలు ఆడొద్దు అని మందలించి వెళ్లి పోతారు .

ఇంకా కొంత సమయం గడిచాక మళ్ళీ బాబుకు విసుగువచ్చి , ఇంతకుముందు చేసిన విధంగా మళ్ళీ చేద్దాం అని అనుకోని ” నాన్నా  పులి” అని మళ్ళీ అందరికి వినపడే విధంగా అరుస్తాడు . అది విని అందరు ఈ సారి నిజంగా పులి వచ్చిందేమో అనుకోని మళ్ళీ అందరు వస్తారు ,బాబు చెప్పింది అబద్దం అని తెలుసుకొని ,బాబుని బాగా తిట్టి వెళ్ళిపోతారు.

చిన్నపిల్లల కథలు

ఇంకా కొంత సమయం గడిచాక..

గొర్రెల చుట్టుప్రక్కల పులి అలికిడి వినబడుతుంది బాబుకు ,వెంటనే భయం తో మళ్ళీ నాన్న పులి అని అరుస్తాడు ,కానీ పిల్లవాడు మళ్ళీ సరదాగా పిలుస్తున్నాడని భావించి ఎవరూ అక్కడికి వెళ్లరు . పులి దగ్గరకు రావడం తో బాబు భయపడి చెట్టుఎక్కి దాక్కుంటాడు . పులి మందలోని ఒక గొర్రెను చంపి తినివేసి అక్కడనుండి వెళ్ళిపోతుంది ,అదంతా పైనుంచి చూసిన బాబు భయపడిపోతాడు .

సాయంకాలం అయ్యాక తండ్రి బాబు దగ్గరకు వస్తాడు , బాబు అక్కడ కనబడక పోవడంతో … బాబుని పిలుస్తాడు ,అప్పుడు బాబు చెట్టు పైనుండి దిగి జరిగిన విషయమంతా తండ్రితో చెప్పి,నేను పులి వచ్చినప్పుడు భయపడి పిలిచాను నువ్వు ఎందుకు రాలేదు అని ఏడుస్తూ అడుగుతాడు అప్పుడు తండ్రి ,చూడు బాబు నువ్వు మొదటిరెండు సార్లు పులి వచ్చిందని మాకు అబద్దం చెప్పావ్ అందుకే నువ్వు మూడవసారి పిలిచినప్పుడు కూడా మేము అబద్దం అనుకున్నాం . అందుకే ఎప్పుడు సరదాకి కూడా అబద్దం చెప్పకూడదు . నీ సరదావలన యిప్పుడు మనం ఒక గొర్రెను పోగొట్టుకున్నాం అంటాడు . అది విని బాబుకు తన తప్పు తనకు అర్థం అవుతుంది.

Moral : సరదా అనేది ఆహ్లాదంగా ఉండాలి కానీ ప్రమాదకరంగా కాదు.

 

ఏడు చేపల కథ

Seven Fishes Story

7 fishes telugu story

అనగనగా ఒక రాజు , ఆ రాజుగారికి ఏడుగురు కొడుకులు. ఒక రోజు రాజకుమారులు అందరూ కలిసి సరదాగా చేపలు పట్టడానికి వెళ్ళారు.

ఒక్కొక్కరు ఒక్కొక్క  చేపని పట్టుకున్నారు.  ఆ చేపలను ఇంటికి తీసుకొని వెళ్లి ఎండలో ఎండపెట్టారు . ఎండలో పెట్టిన చేపల్లో అన్ని ఎండాయి  కానీ ఒక చేప ఎండలేదు.

 

 

చిన్నపిల్లల కథలు

అప్పుడు..

రాజకుమారుడు: చేపతో  ” చేప చేప నువ్వు ఎందుకు ఎండలేదు”.

చేప: “నాకు గడ్డివాము అడ్డు వచ్చింది ఎండ పడకుండా ”

రాజకుమారుడు:“గడ్డివాము గడ్డివాము నువ్వు ఎందుకు అడ్డం వచ్చావు”

గడ్డివాము :“ఆవు నన్ను తినలేదు ”

రాజకుమారుడు: “ఆవు ఆవు నువ్వు గడ్డి ఎందుకు తినలేదు ”

ఆవు: మా యజమాని నాకు గడ్డి వేయలేదు

రాజకుమారుడు: యజమాని దగ్గరికి వెళ్లి “ఆవుకు గడ్డి ఎందుకు వేయలేదు”

యజమాని :నాకు మా అమ్మ  అన్నం పెట్టలేదు అందుకే వెయ్యలేదు.

రాజకుమారుడు  : అమ్మ అమ్మ నువ్వు అన్నం ఎందుకు పెట్టలేదు అని అడిగాడు

అమ్మ: “నా చిన్న కొడుకు ఏడుస్తున్నాడు”

రాకుమారుడు : బాబు ఎందుకు ఏడుస్తున్నావ్  .

బాబు :నన్ను చీమ కుట్టింది అని ఏడుస్తాడు .

రాకుమారుడు: చీమ నువ్వు ఎందుకు కుట్టావు

చీమ :నా బంగారు పుట్టలో వేలుపెడితే నేను కుట్టనా అంటుంది.

 

ఎన్నో పాతకథలు మనం మన అమ్మమ్మలు నానమ్మలు నుంచి వింటూ వచ్చినవి ,కానీ ప్రస్తుతం వీటిగురించి తెలియని వారికి తెలియచేద్దాం అనే ఉదేశ్యం తో రాస్తున్నాను . ఇంకా మీకు గుర్తున్న పాతకథలు ఉంటే నాకు తెలుపగలరు .

 

చిన్నపిల్లల కథలు :https://telugulibrary.in/famous-stories-in-telugu/

 

 

error: Content is protected !!