నా పేరు చిన్ని నాకు ఆరు సంవత్సరాలు నేను ఫస్ట్ క్లాస్ చదువుతున్నాను ఇప్పటి నుండి నా ప్రయాణం మీ అందరితో పంచుకోవాలి అనుకుంటున్నాను …
Contents
What is your secret code?
“చిన్నితో ప్రయాణం” చిట్టి కథలు చిన్నపిల్లల కోసం “What is your Secret Code?” Story Series for kids
హాయ్ అండి ,
ఎలా ఉన్నారు అందరూ… ఈరోజు మీకు ఒక ముఖ్యమైన విషయం చెబుదామని వచ్చాను.
నిన్న రోజులాగే నేను తొందరగా స్కూల్ కి వెళ్ళిపోయాను స్కూల్ అయిపోయాక 3:30 కి రోజు లాగా అమ్మ రాలేదు 3:45 అవుతున్నప్పుడు మా ఇంటి పక్కనుండే అంకుల్ వచ్చి మా మేడం దగ్గర చిన్ని వాళ్ళ మమ్మీ కి హెల్త్ బాగోలేదు అందుకే నేను చిన్నిని తీసుకెళ్లడానికి వచ్చాను అని చెప్పారు.
నాకు అమ్మ రాలేదని వినగానే బాధగా అనిపించింది కానీ అంకుల్ వచ్చారు కదా తొందరగా ఇంటికి వెళ్ళిపోవచ్చు అనుకున్నా.
స్కూల్ బ్యాగ్ భుజాన్ని తగిలించుకొని వెళ్దాం అనుకున్నప్పుడు నాకు ఒకటి గుర్తొచ్చింది ,అమ్మ ఒక రోజు నాకు ఒక నెంబర్ చెప్పి ఎప్పుడన్నా నేను రానప్పుడు ఎవరైనా వచ్చి నిన్ను తీసుకువెళ్తానని చెప్తే వాళ్లని ఈ సీక్రెట్ కోడ్ చెప్పండి అని అడుగు. వాళ్ళు ఈ సీక్రెట్ కోడ్ చెప్తేనే వాళ్ళతో నువ్వు రా అని చెప్పింది.
ఇప్పుడు నాకు ఆ విషయం గుర్తొచ్చి, అంకుల్… మీకు సీక్రెట్ కోడ్ తెలుసా అని అడిగాను అప్పుడు అంకుల్ సీక్రెట్ కోడ్ ఏంటమ్మా నాకు తెలియదే అన్నారు.
అయితే నేను మీతో రాను అని గట్టిగా చెప్పాను అప్పుడు అంకుల్ అదేంటి మీ మమ్మీ నిన్ను తీసుకురమ్మన్నారు అని నేను వచ్చాను సీక్రెట్ కోడ్ ఏంటి అని అన్నారు వెంటనే నేను మేడం దగ్గరికి వెళ్లి మేడం మమ్మీ సీక్రెట్ కోడ్ చెప్తే గానీ ఎవరితోనూ ఎక్కడికి వెళ్లొద్దని చెప్పింది ఈ అంకుల్ కేమో సీక్రెట్ కూడా తెలియదంట నేను అంకుల్ తో వెళ్ళను అని చెప్పి ఈ ఏడవడం మొదలు పెట్టాను.
నా ఏడుపు చూసిన మేడంకి కూడా కొంచెం భయమేసినట్టుంది వెంటనే ఫోన్ తీసుకొని అమ్మకు ఫోన్ చేశారు.. ఫోన్ లో అమ్మ ఒకసారి చిన్నికి ఫోన్ ఇవ్వండి అంది అప్పుడు నేను ఫోన్ తీసుకొని అమ్మ… నీకు హెల్త్ బాగోలేదని అంకుల్ నన్ను ఇంటికి తీసుకెళ్తా అంటున్నారు నువ్వేమో ఈ అంకుల్ కి సీక్రెట్ కూడా చెప్పలేదు నేను ఈ అంకుల్ తో ఎలా రాను అని ఇంకా గట్టిగా ఏడ్చాను.
అప్పుడు అమ్మ అయ్యో!! సారీ అమ్మ ఒకసారి ఫోన్ అంకుల్ కి ఇవ్వు అంది, నేను ఫోన్ తీసుకెళ్లి అంకుల్ కి ఇచ్చాను అప్పుడు అమ్మ అంకుల్ తో మాట్లాడింది.
“చిన్నితో ప్రయాణం” చిట్టి కథలు చిన్నపిల్లల కోసం “What is your Secret Code?” Story Series for kids
తర్వాత…
అంకుల్ ఫోన్ మాట్లాడి నవ్వుకుంటూ నా దగ్గరికి వచ్చి 923 అని చెప్పారు వెంటనే నాకు హ్యాపీగా అనిపించింది సరే ఇప్పుడు నేను మీతో వస్తాను అని చెప్పి అంకుల్ తో పాటు ఇంటికి వెళ్లాను.
అంకుల్ బైక్ మీద తీసుకెళుతున్నారే గాని దారంతా నవ్వుతూనే ఉన్నారు, నన్ను ఇంటికి తీసుకొచ్చాక అమ్మ తో మీ చిన్ని చాలా తెలివిగా బిహేవ్ చేసింది నాకు చాలా హ్యాపీగా అనిపించింది చిన్నికి నేను ఏదైనా గిఫ్ట్ కొనిద్దాం అనుకుంటున్నాను అని చెప్పి నాకు ఒక పెద్ద డైరీ మిల్క్ చాక్లెట్ ఇచ్చారు. నాతో … చిన్ని నవ్వు చాలా తెలివిగా ప్రవర్తించావు నీ భవిష్యత్తులో కూడా ఎప్పుడూ ఇలాగే ధైర్యంగా తెలివిగా ఉండాలి అని చెప్పి అక్కడినుంచి వెళ్లారు.
అమ్మ కూడా ఆ రోజంతా నన్ను చాలా మెచ్చుకుంది అమ్మమ్మ వాళ్లకి నానమ్మ వాళ్లకి ఫోన్ చేసి విషయం కూడా చెప్పింది అందరూ నన్ను చాలా మెచ్చుకున్నారు.
మీరు కూడా అమ్మ చెప్పిన విషయాలన్నీ గుర్తుపెట్టుకోండి…
ఆంటీలు మీరు కూడా మీ పిల్లలకి ఒక సీక్రెట్ కోడ్ ఇవ్వండి .. సరే నా…
నేను చాలా హ్యాపీ …
మరి మీరు…
ఇంక వుంటాను మళ్ళీ ఇంకో రోజు కలుస్తాను
Bye…
Gummadi.Sireesha
For more kids stories please visit: YES and NO Story