తెలుగు ప్రేమ కవితలు
Spread the love

తెలుగు ప్రేమ కవితలు…

Contents

 ప్రేమ కవితలు

Prema Kavithalu

నాలోని నువ్వు…
——————–
నాలోని నువ్వు…
నా హృదయ సంద్రంలో
ఉప్పొంగే అలవు నువ్వు..
నా మది బృందావనంలో
వికసించిన సౌగంధిక పుష్పానివి నువ్వు..
నా ఊహల నీలాకాశంలో ప్రసరించే
చంద్రబింబానికి నువ్వు..
నా అంతరంగపు ఆలయంలో
కొలువైన ప్రణయ దేవతవు నువ్వు..
నా మనసు నిరంతరం రాస్తున్న
ఈ కవితలకు నిత్య ప్రేరణవి నువ్వు…
నా నిరీక్షణకు ఫలితానివి నువ్వు..
నా అన్వేషణకు పరిపూర్ణమైన
ఆర్ధానివి నువ్వు..
నా గత జన్మ తపస్సుకు నేడు
నేను పొందిన అద్భుత వరానివి నువ్వు..
నిజమై నా కనుల ఎదుట దర్శనమిచ్చిన
స్వప్నానివి నువ్వు..
చీకటి కమ్మిన నా జీవిత పయనంలో
వెలిగిన అఖండ దీపానివి నువ్వు..
నా హృది సవ్వడుల శబ్దానిని నువ్వు..
దూడపాక శ్రీధర్…

 


Telugu kavithalu love….

ప్రేమ విఫల మైతే
****************
ప్రేమ విఫల మైతే..గుండె దిటవు చేసుకోవాలి
విఫలానికి కారణం విశ్లేషించి..
జాగ్రత్త పడాలి
ఈ ప్రేమ.అన్నది..ఓ ఆకర్షణ..
అదో మత్తు…
ఆ వ్యామోహపు గమ్మత్తులో..
ఆ తంతులో ఇక సర్వం చిత్తు..
అ మత్తు దిగాక, ఆకర్షణ మాయ మైనాక నిజం గ్రహించాక.
అర్ధ మవుతుంది తమ తప్పు…
ప్రేమించటం నేరం కాదు…ప్రేమ అనుకోని పొరపడటం..
.భ్రమ పడటం,త్వర పడటం, మోస పోవటం, అన్యాయ మవటం.
ఇవన్నీ తప్పులు… ..
.
ఒక వేళ విఫల మైనా భూతద్దంలో చూసి..ఏవో ఊహించి..
జీవితం చేసుకోరాదు..నాశనం
తగలెట్టుకో రాదు నిండు జీవనం
జీవితం లో పరిణతి తెచ్చుకుని.
.మంచి/చెడు గ్రహించి..జాగ్రత్త తో
అడుగు ముందుకు వేయటం
సదా క్షేమం
ఒకరిని ఇస్ట పడటం..అంటే…అది ప్రేమా/మోహమా .. ఆకర్షణా..కోరికా…స్పష్టత ఉండాలి….
ఆమూలాగ్రం పరిశీలించాక…
నచ్చితేనే….అడుగు కదపాలి
..ముందుకు వెళ్లాలి
తప్పటడుగు ఐతే….పాఠం నేర్చు కొని….చెంపలు వేస్కుని .జరిగింది..
వదిలేయాలి
కృంగుబాటు..తప్పు భావన,కల్లోలం వదిలేసి..
అదో అనుకోని ప్రమాదం…బయట పడ్డాము అనుకుని…శాంతి చెందాలి
ఆత్మ హత్యలు….కసితో…విపరీత వైపరీత్యాలు
ఎదుటి వారిపై ప్రతీకారాలు. అసలు వద్దు
అలాంటివి కల లో కూడా రానీయద్దు
గతం వదిలేసి…చక్కని అనువైన తీరైన బాటలో
సరైన ప్రణాళికలో సాగుతూ..
.నేర్చిన పాఠం తో జీవితాన్ని తీర్చి దిద్దుకుని…కొత్తదనం ఆస్వాదిస్తూ .
.నవ్వు పూవులతో..రాజాలా..
సాగి పోవాలి..
శిశిరం తరువాత వసంతం.. చీకటి వెనుక వెలుగు.. ప్రకృతి సత్యాలు
మానవ గమనానికి ప్రభోధాలు..


Telugu love kavithalu

తెలుగు ప్రేమ కవితలు…

కమ్మని కలలా కనిపించే నువ్వు
ఎప్పటికి నాకు అవుతావు చిరునవ్వు
నిన్నే ప్రేమించే నా గుండె సవ్వడి
చేరాలంటోంది నీ వెచ్చని ఒడి ”
” ఎక్కడిది ఈ వీణానాదం ..?
నన్నే అనుసరిస్తోంది నిరంతరం…
వదలలేను జీవితాంతం
నన్నో మనిషిని చేసిన గుడిగోపురం..”
” ఏమిటంత ఆలోచన…
నన్ను గురించేనా ..
ఎపుడో నీ గుండెలో చేరాను
నీ వాకిలిలో ముగ్గునైపోయాను”
” నిదుర లేస్తే
కనిపించే ఉదయం నువ్వే..
నిదురపోతే
కళ్ళనిండా నువ్వే..
” ఎదురుగా కనిపించేది
ఒట్టి ఆకాశమే…
నా హృదయంలో నిలిచింది
నీ అనంత రూపమే.”
” ఎన్ని ఉదయాలు సరిపోతాయి
నీ హృదయం ముందు
ఎంత ప్రపంచం సరితూగుతుంది
నీపై నాకున్న ప్రేమ ముందు

 

 

నాకు నచ్చిన కవితలు కొన్ని సేకరించి ఇక్కడ ఉంచుతున్నాను మీకోసం … రచయితలు ఎవరో మీకు తెలిస్తే వారి పేరు చెప్పగలరు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!