Telugu small Story with Moral
Spread the love

Telugu small Story with Moral

Contents

సంతోషమా నీ ఇల్లెక్కడ …?

అనగనగా ఒక ఊరిచివర రెండు ఇళ్ళు మాత్రమే ఉండేవి ఒకటి మార్కెట్లో పూల అమ్ముకొనే రాజయ్యది ఇంకొకటి ఊరిలో చాలా పేరు మోసిన వ్యాపారిది.
వ్యాపారి పెద్ద భవనం పక్కన రాజయ్య చిన్న గుడిసె ఉండడం వ్యాపారికి ఎప్పుడూ నచ్చేది కాదు ,కానీ రాజయ్య తాత ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం కొన్న స్థలం కారణంగా దానిని వ్యాపారి ఏమీ చేయలేకపోయేవాడు . రాజయ్యతో స్థలాన్ని కొందామని ఎప్పుడు బేరమాడినా రాజయ్య ఈ స్థలం తన తాత జ్ఞాపకంగా దాచుకుంటున్నానని ఎట్టి పరిస్థితిలో అమ్మనని కచ్చితంగా చెప్పేవాడు, వ్యాపారి ఇక చేసేదిలేక రాజయ్యని, తన స్థలాన్ని వదిలేశాడు.
వ్యాపారికి ఇద్దరు పిల్లలు అదేవిధంగా రాజయ్యకు కూడా ఇద్దరు పిల్లలు . రోజూ సాయంత్రం వ్యాపారి తన మేడ మీద నుంచి రాజయ్య ఇంటిని చూసి ఆశ్చర్యపోయేవాడు, ఏముంది వీడి దగ్గర? ఎందుకు వీళ్ళ కుటుంబం అంతా ఇంత ఆనందంగా ఉంది ?అని అనుకునేవాడు .

రోజు రోజుకీ..

వ్యాపారి మనసులో ఉన్న అనుమానం ఎక్కువయింది, ఎలాగైనా ఈరోజు రాజయ్య తో మాట్లాడి ఈ ఆనందానికి కారణమైన అసలు రహస్యం తెలుసుకుందాం అనుకొని ఒక రోజు బాగా పొద్దు పోయాక రాజయ్యను తమ ఇంటికి రమ్మని పిలిచాడు. రాజయ్య వెళ్లి వ్యాపారి ఇంటి ముందు నుంచొని అయ్యగారు పిలిచారంట ఎందుకు? అన్నాడు, అప్పుడు వ్యాపారి రాజయ్యా నా ఇల్లు చూశావా… నా ఇంటిలో ఎటువంటి కొదువలేదు, నా పిల్లలకు అన్ని రకాల సదుపాయాలు కల్పించాను రకరకాల బొమ్మలు కొనిచ్చాను అయినా వీరి మొఖాల్లో నీ పిల్లల ముఖంలో ఉన్నంత ఆనందం కనబడటం లేదు ఎందుకంటావ్..! అని అడిగాడు.
అందుకు రాజయ్య తెలియదయ్యా.. నా పిల్లలకు నాకు తోచినంతలో నేను అన్ని ఏర్పాటు చేశాను, ఒక తండ్రిగా వాళ్ళు ఎటువంటి కోరిక అడిగినా నా శక్తిమేరకు తీరుస్తున్నాను నా భార్య కూడా వాళ్ళు ఏమి తినాలి అనుకున్నా అన్ని రకాలైన వంటలు చేసి పెడుతుంది అంతే, మేము అంతకుమించి ఏమీ చేయట్లేదు అయ్యా అన్నాడు.
అప్పుడు వ్యాపారి అవునా అంతేనా.. సరే రేపు ఒక రోజంతా నేను మీ ఇంట్లో ఉందామనుకుంటున్నాను ఏమంటావ్ అన్నాడు ,వ్యాపారి మాటలు ఆశ్చర్యపోయని రాజయ్య అదేంటయ్యా మీరు నా ఇంట్లో ఉంటారా! మీరు వస్తానంటే నా ఈ చిన్న జీవితానికి చాలా ఆనందం అయినా కూడా మీరు వచ్చే ముందు ఒక్కసారి ఆలోచించుకోండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
అసలు రాజయ్య ఇంట్లో ఉన్న ఆనందానికి కారణం ఏంటో తెలుసుకుందామనే ఉత్సుకతతో వ్యాపారి మరుసటి రోజు 7 గంటలకే రాజయ్య ఇంటి ముందు నుంచున్నాడు.

Telugu small Story with Moral..

వ్యాపారిని రాజయ్య అతని భార్య సాధనంగా ఇంటిలోకి ఆహ్వానించారు. వ్యాపారికి మనసులో ఒక పేద ఇంటికి వస్తున్నానన్న ఆలోచన ఉందే తప్ప చూడడానికి ఎక్కడా పేదింటి లక్షణాలు కనబడటం లేదు ఇంటి ఇనుప గేటు చుట్టూ అల్లుకున్న సన్నజాజి తీగ, గేట్లోకి ప్రవేశించగానే మార్గానికి అటు ఇటు చక్కాగా పేర్చినట్టున్న రంగురంగుల పూల చెట్లు ,ఇంటి పక్కనే ఖాళీ స్థలంలో ఒక పెద్ద మామిడి చెట్టు దానికి హాయిగా ఊగుతున్న ఉయ్యాల మరొకవైపు బంతి, గులాబీ, చామంతి మొక్కలు దేనికవే నేనే గొప్పన్నట్టుగా తలెత్తుకొని అందంగా చూస్తున్నాయి. , ఇంటి ప్రాంగణమంతా శుభ్రంగా అలికి ముగ్గులు పెట్టి ఉంది ఏంటో.. అదంతా చూస్తుంటే ఒకింత హాయిగా ఉంది వ్యాపారి మనస్సుకి .
వ్యాపారిని లోనికి తీసుకెళ్తూనే పెరట్లో నులక మంచం మీద శుభ్రమైన ఒక దుప్పటి వేసి, అయ్యా మీరు ఇక్కడ కూర్చోండి నేను ఇప్పుడే వస్తాను అని రాజయ్య ఇంటి లోపలికి వెళ్ళాడు . వ్యాపారి ఈ ఇంటి నుంచి తన ఇంటిని చూసుకుంటూ అబ్బా! ఎంత పెద్ద ఇల్లు కట్టాను ఈ ఊర్లో నాకన్నా పెద్ద ఇల్లు ఎవ్వరికీ లేదు కదా అని మురిసిపోతున్నాడు మనస్సు లో.
ఇంతలో కమ్మటి వాసనతో నిండిన అంబలి తీసు కొని వచ్చాడు రాజయ్య మీకు ఇష్టమైతే ఇది పుచ్చుకోండి అని అంబలివున్న గ్లాస్ న వ్యాపారికి అందించాడు . వ్యాపారి ఇది ఎవరిల్లో ఏంటో అనే ఆలోచన లేకుండా దాని వాసన బట్టి రుచి ఎలా ఉంటుందో అంచనా వేద్దామనే ఆలోచనతో దాన్ని రుచి చూశాడు కళ్ళలో చిన్నగా నీళ్లుతిరిగాయి ,తన చిన్నతనంలో మేనత్త తనకు ఎంతో ఇష్టమైన బెల్లం వేసిన అంబలిని ఎవ్వరికీ తెలియకుండా చేసిచ్చేది,ఈ రుచితో ఆమె గుర్తువచ్చింది వ్యాపారికి. ఏంతో ఇష్టంగా అంబలి మొత్తం పూర్తిచేసాడు.

Telugu small Story with Moral..

ఇంతలో మామిడి చెట్టు కింద ఉయ్యాల ఊగుతున్న రాజయ్య పిల్లలను తీక్షణంగా గమనించాడు వారి ఒంటి మీదరంగులు పోయిన బట్టలు ఉన్నాయి కానీ నిండుగా ,శుభ్రంగా ఉన్నాయి పిల్లలు కూడా ఎంతో ఆనందంగా,పుష్టిగా చూడ చక్కగా ఉన్నారు. వారి ముఖంలో ఆనందం తప్ప ఏమీ కనబడట్లేదు ఇంతలో రాజయ్య భార్య వచ్చి పిల్లలిద్దరి చుట్టూ తిరుగుతూ ఇడ్లీలు తినిపించింది ,పిల్లలిద్దరూ వద్దు వద్దు అంటేనే మొత్తం తినేశారు . అప్పుడే రాజయ్య పెరడులో తెంపుకొచ్చిన్న పూలన్నీ తీసుకొచ్చి కుప్పగా అరుగు మీద పోశాడు . పిల్లలు రాజయ్య భార్య అందరూ కలిసి వాటితో దండలు కడుతూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉన్నారు. పిల్లలు వాళ్ళ స్కూలు విశేషాలు అన్నీ చెబుతుంటే రాజయ్య రాజయ్య భార్య చాలా ఓపికతో వింటూ వాళ్లకి సమాధానం చెబుతూ ఉన్నారు.
వ్యాపారి మాత్రం వారినే గమనిస్తూ ఉన్నాడు ఇంతలోనే రెండు గంటలు గడిచిపోయాయి వ్యాపారికి ఎందుకో మనసులో చిన్న దిగులు మొదలైంది మనసంతా భారంగా అనిపించింది ఇక అక్కడ ఉండలేకపోయాడు రాజయ్యను అని పిలిచి రాజయ్యా.. ఇక నేను ఉంటాను అన్నాడు, అప్పుడు రాజయ్య అదేంటయ్యా మేము ఏమైనా తప్పు చేశామా రోజంతా ఉంటాను అన్నారు కదా అన్నాడు
అప్పుడు వ్యాపారి లేదు రాజయ్య నాకు ఒక పని గుర్తొచ్చింది అర్జెంటుగా వెళ్లాలి అనుకుంటూ తన ఇంటికి బయలుదేరాడు.

ఇంటికి వెళ్లి…

భారంగా మంచంపై నడుమువాల్చిన వ్యాపారికి రాజయ్య ఇంటి వాతావరణం చాలా ఆలోచనలు రేకెత్తించింది,పనిచేస్తే గాని రోజూ పూట గడవడం కూడా కష్టంగా ఉండే ఒక పేదవాడి కుటుంబం ఇంత ఆనందంగా ఉందంటే కారణం డబ్బు కాదా డబ్బు లేకుండా కూడా ఇంత ఆనందంగా ఉండొచ్చా ?అంత శుభ్రమైన జీవితం గడపవచ్చా?మనుషులు అంత కల్మషం లేకుండా మాట్లాడుకోవచ్చా? ఈ ఆనందం అంతా వారి ప్రవర్తనలో ఉందా! మంచి ప్రవర్తన ఉంటే డబ్బు లేకపోయినా ఆనందంగా గడపవచ్చా అని ఆలోచిస్తూ ఉంటే తను తన పిల్లలతో రోజుకి ఎంత సమయం గడుపుతున్నది తన భార్యతో ఏ విధంగా మాట్లాడుతున్నది గుర్తుకువచ్చి బాధపడ్డాడు .

పిల్లలకి ఆనందం కొనే బొమ్మల వలన చేసే ఆడంబరాల వలన వస్తుంది అనుకున్నాను కానీ తల్లిదండ్రులుగా మేము వాళ్ళతో ఎంత సమయం గడుపుతున్నామొ అనేదానిమీద ఆధారపడుతుందని రాజయ్య కుటుంబాన్ని చూస్తే గాని నాకు అర్థం కాలేదు అనుకొని నేను కూడా డబ్బుతో ఆనందాన్ని కొనాలనే ఆలోచించకుండా ఇకపై నా కుటుంబంతో ఎంత సమయాన్నిగడపాలి వారితో ఎలా ప్రవర్తించాలి అనేదానిమీద దృష్టిసారిస్తాను అనుకొని అక్కడి నుంచి ఆనందంగా, పిల్లలతో గడపడానికివెళ్ళాడు.

 

నీతి : ఆనందం అనేది ధర పెట్టి కొనేది కాదు ,మనకు మనమే సృష్టించుకొనేది.

 

చందమామకథలు

Short inspirational story

Small moral story for kids

సింహం తోడేలు

 

 

error: Content is protected !!