Short Inspirational and Motivational Stories with Morals in Telugu
Spread the love

Short Inspirational and Motivational Stories with Morals in Telugu

Contents

Short Inspirational and Motivational Stories with Morals in Telugu

Colonel Sanders Success Story In Telugu:

1890లో జన్మించిన సాండర్స్ జీవితంలో ప్రారంభంలో అనేక సవాళ్లు మరియు ఎదురుదెబ్బలు ఎదుర్కొన్నాడు, ఇందులో పాఠశాల నుండి తప్పుకోవడం మరియు వివిధ రకాలైన చిన్న చిన్న ఉద్యోగాలు చేయడం వంటివి ఉన్నాయి. తన 40వ ఏట, అతను ఒక చిన్న రోడ్డు పక్కన రెస్టారెంట్‌ను ప్రారంభించాడు, అక్కడ అతను 11 మూలికలు మరియు సుగంధ ద్రవ్యాలతో కలిపి వేయించిన చికెన్ రెసిపీని చేశాడు.

మారుతున్న ట్రాఫిక్ రూల్స్ కారణంగా అతని రెస్టారెంట్ వ్యాపారం క్షీణించినప్పుడు, అతను తన రెసిపీని ఫ్రాంఛైజింగ్ చేయడంపై దృష్టి పెడదాం అని నిర్ణయిన్చుకున్నాడు . వివిధ రకాలైన స్వభావాలు కల భాగస్వాముల నుండి తిరస్కరణను ఎదుర్కొన్నప్పటికీ, అతను పట్టుదలతో 1952లో తన మొదటి ఫ్రాంచైజీ ఒప్పందాన్ని చేజిక్కించుకున్నాడు .

సాండర్స్ యొక్క విలక్షణమైన వేషధారణ , తెల్లటి సూట్ మరియు నలుపు టై అతని బ్రాండ్‌కు చిహ్నంగా మారింది.

తన 70వ సంవత్సరం లో కూడా, సాండర్స్ తన సొంత ఫ్రాంచైజ్ నెట్‌వర్క్‌ను కొనసాగిస్తూ మరియు అభివృద్ధి చేస్తూ ఉండేవాడు . అతను 1964లో కెంటకీ ఫ్రైడ్ చికెన్ కార్పొరేషన్‌ను $2 మిలియన్లకు అమ్మాడు , అయితే బ్రాండ్ అంబాసిడర్‌గా మాత్రం కొనసాగాడు.
సాండర్స్ తన జీవితాంతం, తిరుగులేని సంకల్పం, అనుకూలత మరియు ఎదురుదెబ్బలను అవకాశాలుగా మార్చగల సామర్థ్యాన్ని కలిగివున్నాడు మరియు ప్రదర్శించాడు కూడా .

మీరు కష్టపడి పనిచేయడానికి, నూతన ఆవిష్కరణలు చేయడానికి మరియు సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నంత వరకు, విజయం ఏ వయసులోనైనా వస్తుందని అతని కథ మనకు గుర్తు చేస్తుంది.

Short Inspirational and Motivational Stories 

Father and Son Inspirational Story:

ఒకప్పుడు ఒక వ్యక్తి వ్యాపారం చేసేవాడు. అతను తీవ్ర నష్టాలను ఎదుర్కొన్నాడు మరియు వ్యాపారాన్ని కొనసాగించడానికి తన ఆస్తులు మరియు కార్లను అమ్మేయవలసి వచ్చింది. తండ్రి పరిస్థితి చూసి కొడుకు తండ్రిని అడిగాడు, “నష్టాల్లో వున్నా నువ్వు ఇంకా వ్యాపారం ఎందుకు చేస్తున్నావ్ ? నువ్వు వ్యాపారాన్ని ఎందుకు మూసివేయకూడదు? అని . తండ్రి చిరునవ్వుతో ఇలా జవాబిచ్చాడు, “బాబు , జీవితం మనకు చాలా సవాళ్లను తెచ్చిపెట్టగలదు మరియు మనల్ని కిందకి నెట్టగలదు. అయితే మనం ఎలాంటి సవాళ్లనైనా అధిగమించగలమని నమ్మకంతో ఆశ కలిగి ఉండాలి అన్నాడు.
కొడుకు: “ఆశ మనకు ఎలా సహాయం చేస్తుంది?”

తండ్రి: “సరే, నేను చూపిస్తాను!

అని తండ్రి తన కొడుకును పెద్ద బావి వద్దకు తీసుకెళ్లి దూకమని అడిగాడు. కొడుకు, భయం తో, “నాన్నా, నాకు ఈత రాదు, కాబట్టి నేను దూకలేను అన్నాడు
అయితే అతని తండ్రి కొడుకును బావిలోకి తోసి వెళ్లి ఒక మూల దాక్కున్నాడు. .
కొడుకు చాలా కష్టపడ్డాడు ,దాదాపు 5 నిమిషాలు తేలడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఆ తర్వాత నీటిలో మునిగిపోతానేమో అనుకున్నప్పుడు తండ్రి దూకి కొడుకును బావిలోంచి బయటకు తీశాడు.

మరుసటి రోజు, తండ్రి మళ్లీ తన కొడుకును బావి వద్దకు తీసుకెళ్లి మళ్లీ దూకమని అడిగాడు. కొడుకు మొదట సంకోచించి బావిలోకి దూకాడు. తండ్రి మళ్లీ వెళ్లి దాక్కున్నాడు.కొడుకు మళ్లీ నీటి పై తేలుతూ ఉండటానికి కష్టపడ్డాడు, అతను మరింత ఎక్కువసేపు ప్రయత్నించాడు . సమయం గడుస్తూనే ఉంది.20నిమిషాల తర్వాత కొడుకు తండ్రిని పిలిచాడు . అప్పుడు తండ్రి వచ్చి కొడుకును బావిలోంచి బయటకు తీశాడు.
తండ్రి తన కొడుకును అడిగాడు, “నిన్నటికంటే ఎందుకు ఎక్కువసేపు నీటిలో వున్నావ్ ?”. అని .
కొడుకు తండ్రి తో , “నిన్న, మీరు నన్ను బావిలోకి నెట్టినప్పుడు ఏమి చేయాలో నాకు తెలియదు. భయంతో నేను మునిగిపోయాను. కానీ ఈరోజు నేను నీట మునిగిపోతే నువ్వు వచ్చి నన్ను రక్షిస్తావని నాకు తెలుసు అందుకే ధైర్యంగా మరికొంతసేపు నీటిలో ఈదడానికి ప్రయత్నించాను ”.

నీతి: జీవితం మనకు అనేక సవాళ్లను తెస్తుంది. మనం దానిని అధిగమించాలనే ఆశతో మరియు మన చుట్టూ ఉన్న వ్యక్తులను విశ్వసిస్తే, మనం దానిని అధిగమించగలము.

Short Inspirational and Motivational Stories

Success story of unemployed youth:

ఒక గ్రామానికి చెందిన ఓ యువకుడు తన కుటుంబ పోషణ కోసం ఉద్యోగం కోసం ప్రక్కనున్న నగరానికి వెళ్లాడు. పెద్ద కంపెనీలో ఉద్యోగం కోసం అప్లై చేసాడు .

కొన్ని రోజుల తర్వాత ఇంటర్వ్యూకి హాజరయ్యేందుకు వెళ్లాడు. అతను అన్ని పరీక్షలను విజయవంతంగా క్లియర్ చేశాడు.

ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి , “మీరు సెలెక్ట్ అయ్యారు , తదుపరి ప్రాసెసింగ్ కోసం మీ అన్ని వివరాలను నాకు ఇవ్వండి. కస్టమర్‌లను కలవడానికి మీరు చాలా దూరం ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది కాబట్టి మీ బైక్ మంచి కండిషన్‌లో ఉందని కూడా నిర్ధారించుకోండి అన్నాడు .

అప్పుడు ఆ యువకుడు “సర్ , నా దగ్గర బైక్ లేదు”అన్నాడు

ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి, “బైక్ లేకుండా, మీకు ఈ ఉద్యోగం రాదు. మీరు ఇప్పుడు బయలుదేరవచ్చు.”అన్నాడు

అది విన్న యువకుడు ఇక ఏం చేయాలా అని ఆలోచిస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు .
అప్పుడు  అతని దగ్గర కొద్దిపాటి డబ్బు మాత్రమే ఉంది, అది అతనికి కొన్ని రోజులు మాత్రమే ఆహారం ఇవ్వగలదు.

కానీ అతను ఉద్యోగం లేకుండా తన గ్రామానికి తిరిగి వెళ్లాలని అనుకోవడం లేదు . ఉద్యోగం వస్తుందన్న నమ్మకంతో ఉన్నాడు.

అలా ఆలోచిస్తుండగా పెద్ద కూరగాయల మార్కెట్ వచ్చింది. అప్పుడు అతనికి ఒక ఆలోచన మెరిసింది.

ఉన్న డబ్బుతో మార్కెట్ నుంచి కూరగాయలు కొనాలని నిర్ణయించుకున్నాడు.కూరగాయలు కొన్న తర్వాత నడిచి వెళ్లి ఆ కూరగాయలను ఇంటింటికీ అమ్మడానికి వెళ్లాడు. సాయంత్రం అయ్యేసరికి ఆ కూరగాయలన్నీ అమ్ముడుపోయి మంచి లాభం పొందాడు.

దీని ద్వారా డబ్బు సంపాదించగలనన్న విశ్వాసాన్ని పొందాడు.

అప్పటి నుంచి రోజూ….

ఉదయం కూరగాయల మార్కెట్‌కి వెళ్లి తాజా కూరగాయలు కొనుక్కొని, వాటిని ఇంటింటికి తిరిగి అమ్మి తన దగ్గరవున్న కూరగాయలు అన్ని పూర్తిగా అమ్ముడు పోయే వరకు అమ్మి వచ్చేవాడు.

అతను ప్రతిరోజూ అలానే కష్టపడేవాడు, అలా కొన్ని సంవత్సరాలు గడిచాక అతని వ్యాపారం బాగా అభివృద్ధి పొందింది . అతను ఒక పెద్ద సంస్థను స్థాపించాడు .

కొన్ని సంవత్సరాల తరువాత, అతని స్నేహితులలో ఒకరు అతని పెద్ద ఇంటికి వచ్చాడు , అక్కడ అతని గ్యారేజీలో చాలా కార్లు ఉన్నాయి.

ఇది చూసిన అతని స్నేహితుడు, “నీ దగ్గర మంచి కార్ల కలెక్షన్ ఉంది, బైక్ కలెక్షన్స్ ఏమైనా ఉన్నాయా” అని అడిగాడు.

అందుకు ఆ వ్యాపారి అతని స్నేహితునితో , “నేను నా కోసం ఏ బైక్‌ను కొనుగోలు చేయలేదు.” అన్నాడు

అప్పుడు అతని స్నేహితుడు ఆశ్చర్యంగా , “నువ్వు బైక్ ఎందుకు కొనలేదు?” అని అడిగాడు.

అప్పుడు ఆ వ్యాపారి “నా దగ్గర బైక్ ఉంటే, ఈ కార్లు ఉండేవి కావు” అని సమాధానమిచ్చాడు .

 నీతి:మనం ఏదైనా కోరుకుంటే మరియు అది ఎప్పుడూ పొందకపోతే, దాని మీద మన ఆశను కోల్పోకూడదు.

విధి ఏమి ఉంచిందో మనకు తెలియదు కాబట్టి మనం మన కష్టాన్ని కొనసాగించాలి.

 

 

For more inspirational stories please visit:Valasa cooli

error: Content is protected !!