"దొంగతనం" చిన్నితో ప్రయాణం
Spread the love

నా పేరు చిన్ని నాకు ఆరు సంవత్సరాలు నేను ఫస్ట్ క్లాస్ చదువుతున్నాను ఇప్పటి నుండి నా ప్రయాణం మీ అందరితో పంచుకోవాలి అనుకుంటున్నాను …

“దొంగతనం” చిన్నితో ప్రయాణం

 

Contents

                దొంగతనం

హాయ్ అండి అందరూ ఎలా వున్నారు ….

ఈ రోజు Saturday అందుకే అమ్మతో కలసి షాపింగ్ కి వెళ్తున్నాను నా favorite frock వేసుకొని మొన్న birthday కి అమ్మ కొన్న కలర్ ఫుల్ హ్యాండ్ బాగ్ వేసుకొని దానిలో అమ్మమ్మ యిచ్చిన హండ్రెడ్ రూపీస్ పెట్టుకొని వెళ్తున్నాను . మరి నేను కూడా చాకోలెట్స్ కొనుక్కోవాలి కదా అందుకు.

మాకు ఆటో దొరికి మేము వెళ్లేసరికి కొంచం చీకటి పడింది మార్కెట్ రోడ్ అంతా హడావిడిగా వుంది ,అమ్మ ఒకొక్క షాప్ దగ్గర ఆగి తనకు, నాకు కావలసిన ఐటమ్స్ కొంటుంది. నేను అమ్మ చేయి పట్టుకొని లాలీపప్ తింటూ అటూయిటూ చూస్తున్నాను ఇంతలో … కొంచం దూరంలో ఒక చిన్నబ్బాయి అంటే 6 ఇయర్స్ ఉండే అంత బాబు ఒక సమోసా బండి నుండి, బండి అతనికి తెలియకుండా నెమ్మదిగా సమోసా తీసుకొని హడావిడిగా నావైపు రావడం చూసాను . నాకు ఎందుకో ఆ విషయం మంచిగా అనిపించలేదు ఆ అబ్బాయి తప్పు చేసాడు అనిపించింది .
ఎందుకంటే “ఎవ్వరి వస్తువైనా మనం అడగకుండా తీసుకోకూడదు పైగా షాపు వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా ఏ వస్తువు తీసుకు రాకూడదు అది దొంగతనం అవుతుంది “అని అమ్మ చెప్పింది .

అది గుర్తుకువచ్చి వెంటనే ఆ బాబు చేయి పట్టుకొని ఆపి ,బాబు ఈ సమోసా ఎంత ? అన్నాను అప్పుడు ఆ అబ్బాయి నవ్వి
నేను కొంటె కదా నీకు చెప్పేది అన్నాడు .
అవునా ఐతే నువ్వు దొంగవన్నమాట అన్నాను
అందుకు అబ్బాయి కోపంగా పిచ్చిమాటలు మాట్లాడకు, నాకు ఆకలి వేసింది నాదగ్గర డబ్బులు లేవు అందుకే తీసుకున్న … దానికే దొంగతనం అంటావా అన్నాడు
అప్పుడు నేను అమ్మ చెప్పిన మాటలు ఆ బాబు తో చెప్పను . అవి విని నేనేమి దొంగతనం చేయలేదు అమ్మ వచ్చాక డబ్బులు అడిగి యిచ్చేస్తాను అన్నాడు వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ .

అది కాదు !! నువ్వు ఈ పని తప్పు అని తెలియక చేసావ్ ,యిప్పుడు మనం వెళ్లి ఆ అంకుల్ కి జరిగిన విషయం చెప్పి సారీ చెబుదాం అన్నాను .

“దొంగతనం” చిన్నితో ప్రయాణం…

బాబు భయం తో ఏడుస్తూ ఆ అంకుల్ నన్ను కొడతాడు నేను రాను అన్నాడు.

ఏమీ అనడు మన తప్పు మనం ఒప్పుకోవడం చాలా Great విషయం అంట స్కూల్ లో మా మేడం చెప్పారు ,ఏంకాదు నీతో పాటు నేను వస్తాను అని ఆ బాబుని తీసుకొని సమోసా బండి దగ్గరకు వెళ్లి అతనితో జరిగిన విషయం చెప్పాను .

అదంతా విన్న సమోసా బండి అంకుల్ ఆ బాబుని చూసి నువ్వు ‘ఈ మూడు సమోసా ప్యాకెట్లు తీసుకొని ఆ ప్రక్కనున్న షాపుల్లో ఇచ్చిరా’ అన్నాడు .

విషయం అర్థం కానీ బాబు ,భయంతో అంకుల్ ఏమంటాడో అని వాటిని తీసుకొని ప్రక్క షాప్ లో యిచ్చి వచ్చాడు .

అప్పుడు అంకుల్ నవ్వుతూ యిప్పుడు నువ్వు నాకు చేసిన హెల్ప్ కి నవ్వు తిన్న సమోసాకి సరిపోయింది ,కాబట్టి నువ్వు యిప్పుడు దొంగవికాదు ,మంచిగా చెప్పిన పని చేసి దానికి బదులుగా సమోసా తిన్నావు అన్నాడు .

ఆ మాట వినేసరికి నాకు ఆ బాబు కి చాలా హ్యాపీ గా అని పించింది వెంటనే అంకుల్ కి థాంక్స్ చెప్పి అక్కడనుండి అమ్మ దగ్గరకు వచ్చేసాం.

ఆ బాబు నాకు కూడా థాంక్స్ చెప్పి ,తాను ఇంకెప్పుడూ డబ్బులు ఇవ్వకుండా షాప్ లో ఏ వస్తువు తీసుకోనని తన ఫ్రెండ్స్ కి కూడా ఈవిషయం చెబుతానని, పైగా ఆ అంకుల్ అలా అంటే చాలా హ్యాపీగా అనిపించిందని చెప్పాడు .

ఇంక ఉంటానండి మీరు కూడా ఈ విషయం మీ పిల్లకు చెప్పండి.

Bye….

 

What is your secret code

error: Content is protected !!