మంచి నీతి కథ తెలుగులో…
Contents
పవన్
సోఫాలో నీరసంగా కూర్చుని ఎదురుగా టీపాయ్ మీద ఉన్న ప్రోగ్రెస్ కార్డును చూస్తూ ఉన్నారు పవన్ నాన్న మోహన్ ఇంతలో టీ పెట్టుకుని అక్కడికి వచ్చిన రాధ మోహన్ తో ఏవండీ.. ఏమైంది? అని అడిగింది. అందుకు మోహన్ నాకు పవన్ ని ఏం చేయాలో అర్థం కావట్లేదు వీడి భవిష్యత్తు ఏమిటో అగమ్యగోచరంగా ఉంది, తిట్టినా కొట్టినా భయపెట్టినా కూడా వీడికి చదువు మీద శ్రద్ధ రావడం లేదు ఆట్లాడితే సమయం వృధా అవుతుంది చదువు మీద కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోతున్నాడని ఆటలు మానిపించి ఆ టైంలో ట్యూషన్ కి పంపిస్తే ఇంతకుముందు వచ్చే మార్కులు కన్నా దారుణమైన మార్కులు వచ్చాయి . వీడి భవిష్యత్తు తలుచుకుంటుంటే చాలా భయంగా ఉంది ,అన్న మోహన్ మాటలు వినేసరికి రాధ మనసులో కూడా దిగులు మొదలైంది అవునండి నేను మొన్న వాళ్ళ క్లాస్ టీచర్ తో కూడా మాట్లాడాను ఆవిడ కూడా వీడు క్లాసులో అస్సలు లెసన్స్ వినడం లేదని ఎంత తిట్టినా కూడా శ్రద్ధ పెట్టట్లేదు అని చెప్పారు… ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని నిట్టూర్చింది.
ఇంతలో…
ఎవరో డోర్ బెల్ మోగించినట్లుగా అనిపించేసరికి రాధ వెళ్లి డోర్ తీసింది, ఎదురుగా మోహన్ వాళ్ళ మేనమామ రామారావు నుంచొని ఉన్నారు ఆయన చూడగానే రాధా మోహన్ ఇద్దరు ఆనందంగా రండి చాలా రోజులైంది మిమ్మల్ని చూసి వచ్చి కూర్చోండి అని ఆయన్ని ఆనందంగా ఆహ్వానించారు. ఆయన ఇంట్లోకి వచ్చి కూర్చొని ఏం లేదమ్మా నా మనవరాలు పుట్టినరోజు కి మమ్మల్ని పిలుద్దామని వచ్చాను అని చెప్పారు. అప్పుడు రాధా మోహన్ ఇద్దరు తప్పనిసరిగా వస్తామండి మీరు ఫోన్లో చెప్పిన వచ్చేవాళ్ళం కదా మీరు ఇంత దూరం రావాలా అన్నారు అప్పుడు ఆయన మోహన్ ని చూసి ఏంటి!! మోహన్ ఏంటో దిగులుగా కనిపిస్తున్నావు అని అడిగారు, అప్పుడు మోహన్ ఏం లేదు మావయ్య పవన్ అస్సలు సరిగ్గా చదవడం లేదు చెప్పిన మాట కూడా వినడం లేదు. వీడిని ఎలా దారికి తేవాలో తెలియడం లేదు ఆటలు మాన్పించినా కూడా చదవడం లేదు అని చెప్పాడు. అందుకు రామారావు గారు అదేమిటి ఆటలు ఎందుకు మాన్పించావ్ అని అడిగారు ,లేదు!! మామయ్య ఆ టైంలో అన్న వాడు శ్రద్ధగా చదువుతాడని ఆశ పడ్డాను కానీ అది కూడా అపోహనే తేలిపోయింది అన్నాడు .
అప్పుడు రామారావు గారు అది కాదురా ఈ కాలంలో చదువుతో నే కాదు ఆటలతో కూడా చాలామంది మంచిగా సెటిల్ అవుతున్నారు వాడికి ఆటిష్టమైతే ఆ ఆటలో ఎంకరేజ్ చెయ్ చదవంటావా ఎంతో కొంత చదివి పాసయ్యాడనిపిస్తే చాలు లే అని చెప్పారు.
ఆ మాటలు వినడానికి చాలా నిరాశగా అనిపించినా దానిలో కూడా నిజం లేకపోలేదు అనిపించింది మోహన్ కి సరే మావయ్య మీరు చెప్పినట్టు ప్రయత్నిస్తాను అని ఆయనతో చెప్పాడు.
మరుసటి రోజు…
మోహన్ పవన్ ని పిలిచి, పవన్ నీకే గేమ్ అంటే ఇష్టమో చెప్పు అని అడిగాడు తండ్రి నుంచి ఊహించిన ప్రశ్న వచ్చేసరికి పవన్ కొంచెం కంగారుగా అంటే నాకు క్రికెట్ అంటే ఇష్టం నాన్న మీకు తెలుసు కదా అన్నాడు. అప్పుడు మోహన్ సరే మన ఇంటి దగ్గర క్రికెట్ కోచింగ్ సెంటర్ ఉంది రేపు నుంచి నువ్వు జాయిన్ అవ్వు స్కూల్ అయిపోగానే ఒక గంట సేపు కోచింగ్ఉంటుందంట అని చెప్పాడు .
ఊహించిన విషయాలన్నీ వినేసరికి పవన్ ఆనందం తట్టుకోలేకపోయాడు గట్టిగా అరుచుకుంటూ థాంక్యూ నాన్న అని చెప్పి ఫ్రెండ్స్ ఆడుకోవడానికి బయటకు పరిగెత్తాడు.
మంచి నీతి కథ తెలుగులో…
కొన్ని రోజులు గడిచాక …
మోహన్ ఇంటికి వచ్చేసరికి యధావిధిగా టీపాయ్ మీద పవన్ ప్రోగ్రెస్ కార్డు కనిపించింది, అమ్మో!! ఆటలు లేకుండానే అన్ని ఫెయిల్ అయ్యాడు ఇప్పుడు ఇంక ఆట్లాడుతున్నాడు మార్కులు చూడాలంటేనే భయంగా ఉంది అనుకుంటూ దానిని పట్టించుకోకుండా ఫ్రెష్ అప్ అవ్వడానికి గది లోపలికి వెళ్ళిపోయాడు. డిన్నర్ టైం కి డైనింగ్ టేబుల్ కి వచ్చే దారిలో మళ్లీ ప్రోగ్రెస్ కార్డు కనబడింది ఎంత తప్పించుకున్నా కొన్ని తప్పవు కదా అనుకుంటూ చేతిలోకి ప్రోగ్రెస్ తీసుకున్నాడు. ఆశ్చర్యం పవన్ అన్ని సబ్జెక్టుల్లో పాస్ అయ్యాడు 45% మార్కులతో చాలా విచిత్రంగా అనిపించింది ఒకింత ఒళ్ళు కూడా జలదరించింది ,ఏమిటీ మార్కులు అనుకున్నాడు ఆనందంగా ప్రోగ్రెస్ కార్డు మీద సంతకం పెట్టి టేబుల్ మీద డిన్నర్ చేస్తున్న పవన్ ని నవ్వుతూ చూసాడు కానీ పవన్ అది ఏది పట్టదు అన్నట్టుగా తన క్రికెట్ విషయాలన్నీ అమ్మతో చెప్తున్నాడు .
అలా రోజులు గడిచే కొద్ది పవన్ మార్కుల పర్సంటేజ్ లో మార్పు వస్తోంది, ఈసారి పవన్ కి ఏకంగా 65% మార్కులు వచ్చాయి, మోహన్ ఆనందాన్ని తట్టుకోలేకపోయాడు ఈ మార్పు ఏమిటో అతనికి ఏమీ అర్థం కావడం లేదు అంతలోనే స్కూల్ నుంచి ఫోన్ వచ్చింది అవతల వైపు నుంచి క్లాస్ టీచర్ సర్.. నేను పవన్ గురించి మాట్లాడదామని ఫోన్ చేశాను అని అన్నది అందుకే మోహన్ చెప్పండి మేడం అన్నాడు అప్పుడామె ఏం లేదు సార్ పవన్ కి చాలా మంచి మార్కులు వస్తున్నాయి మీరు చదువులో మంచి గైడెన్స్ ఇస్తున్నారు అనుకుంటున్నాను ఇలాగే ఎప్పుడూ చదివేలాగా పవన్ ఎంకరేజ్ చేయండి అని చెప్పి ఫోన్ పెట్టేసింది .
ఆమె మాటలు మోహన్ కి ఏమీ అర్థం కాలేదు అదేంటి నేను స్కూల్లో బాగా చెబుతున్నారేమో అనుకున్నాను ఈవిడ ఏంటి మీరు బాగా చదివిస్తున్నారు అని క్రెడిట్ అంతా నాకిస్తుంది అనుకున్నాడు.
అంత లో పవన్ బయటినుండి పరిగెత్తుకుంటా హాల్ లోకి వచ్చి అమ్మా .. ఈరోజు రెండు సిక్స్ లు కొట్టాను తెలుసా అందరూ క్లాప్స్ కొట్టారు అని చెప్తూ స్కూల్ బ్యాగ్ ఓపెన్ చేసి హోమ్ వర్క్ బయటికి తీసి చాలా శ్రద్ధగా అందంగా రాస్తున్నాడు అది చూస్తుంటే మోహన్ కళ్ళలో నీళ్లు తిరిగాయి అంటే మనసుకు నచ్చిన పని చేస్తే చుట్టుపక్కల ఉన్నది ఏది కష్టంగా అనిపించదా. ఇష్టమైన ఆటను ఆడకుండా చదువు మీద శ్రద్ధ పెట్టమంటే తనకి చదువు కూడా కష్టంగా అనిపించింది కానీ ఇష్టమైన ఆటను ఆడమంటే దానితోపాటు కష్టంగా ఉన్న చదువు ని కూడా ఇష్టంగా మార్చుకున్నాడు, ఇదే కదా అనుకోని సంఘటన అంటే అని మోహన్ మనసులో నవ్వుకున్నాడు.
Gummadi.Sireesha
For more moral stories please click here