Top 10 Telugu Suspense Stories for Reading
Spread the love

 

Top 10 Telugu Suspense Stories for Reading

 

Contents

Crime-1

Top 10 Telugu Suspense Stories

రేవంత్ శశిధర్ ఒక కొత్త రెస్టారెంట్ కి వెళ్లారు, అది చాలా వింతగా విచిత్రంగా ఉంది అయినా కూడా ధైర్యంగా లోపలికి వెళ్లారు అది మంచి ప్రదేశం కాదని అక్కడికి ఎవరూ వెళ్ళొద్దని వాళ్ళ స్నేహితులు చెప్పినప్పటికీ వీరు వాళ్ళ మాటలు లెక్కచేయకుండా వెళ్లారు.వెళ్లిన వెంటనే అక్కడ మూలగా ఉన్న ఒక ప్లేస్ ని సెలెక్ట్ చేసుకుని అక్కడ కూర్చున్నారు. ఇద్దరూ ఒకలాంటివే రెండు డ్రింకులు ఆర్డర్ ఇచ్చారు ,రేవంత్ కి అప్పటికే చాలా దాహంగా ఉండడంతో డ్రింక్ తెచ్చిన వెంటనే గబగబా కొన్ని సెకన్లలో తాగేశాడు కానీ శశిధర్ మాత్రం చాలా నెమ్మదిగా రేవంత్ తో మాట్లాడుతూ తాగాడు కొంతసేపటికి శశిధర్ ఉన్నట్టుండి స్పృహ తప్పి పడిపోయాడు హఠాత్తుగా జరిగిన ఆ పరిణామానికి భయపడిన రేవంత్ ఏమైంది అన్నట్లుగా శశిధర్ని పట్టుకొని చూడంగానే అతని శరీరమంతా చల్లబడిపోయింది.

ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అక్కడికి వచ్చి శశిధర్ ని పరీక్షించి అతను చనిపోయినట్లు చెప్తారు . ఆ మాట వినంగానే రేవంత్ కి చెప్పలేనంత భయం వేస్తుంది ఏం చేయాలో అర్థం కానట్టుగా శశిధర్ ని చూస్తూ ఏడుస్తూ పక్కనే కూర్చుండిపోతాడు.

అంతలో అక్కడికి వచ్చిన డాక్టర్ శశిధర్ ని పరీక్షించి అతని శరీరమంతా నీలం రంగులోకి మారిపోవడంతో అతను విషం తీసుకున్నాడని చెప్తాడు .

అక్కడే ఉన్న రేవంత్ నేనూ శశిధర్ ఒక విధమైన డ్రింకే తాగాము కానీ తను మాత్రమే ఎందుకు చనిపోయాడు అని అడుగుతాడు . అందుకు డాక్టర్ గట్టిగా నిట్టూర్చి మీరిద్దరూ ఒక విధమైన డ్రింకే తాగారు డ్రింకులో ఎటువంటి విషం లేదు కానీ డ్రింకులో వేసిన ఐస్ ముక్కల్లో విషం కలిసి ఉంది .

నువ్వు చెప్పిన దాని ప్రకారం దాహంగా ఉండడం వల్ల ,నువ్వు గబగబా తాగడం వలన నీ గ్లాసులో ఉన్న  ఐసు కరగలేదు కానీ శశిధర్ నెమ్మదిగా తాగడం వల్ల తన గ్లాసులో ఉన్న ఐసులో ఉన్న విషం అంతా తను తాగేశాడు అందుకే చనిపోయాడు అని చెప్తాడు.


Crime-2

ఉదయం 9:00 అవుతుంది అప్పుడు పోలీస్ స్టేషన్ కి ఒక ఫోన్ కాల్ వస్తుంది , దానిని రిసీవ్ చేసుకున్న ఇన్స్పెక్టర్ వినోద్ అవతలవారితో నేను వచ్చేవరకు ఎక్కడ వాళ్ల అక్కడే ఉండాలి వారిలో ఎటువంటి కదలికలు ఉండకూడదు అని చెప్పి ఫోన్ పెట్టేసి అక్కడి నుంచి ఐదు నిమిషాల్లో కాల్ వచ్చిన ప్రదేశాన్ని చేరుకుంటాడు. అక్కడ అపార్ట్మెంట్ గేట్ కి కొంత దూరంలో ఒక మహిళ చనిపోయి ఉంటుంది అపార్ట్మెంట్లో ఉన్న వారందరూ ఆమె ఈమధ్య కొత్తగా తమ అపార్ట్మెంట్లో కనిపిస్తుందని కానీ… ఎవరి ఇంటికి వస్తుందో తెలియదని చెప్తారు.

వినోద్ అక్కడ ఉన్న వారందరితో మీరందరూ ఎక్కడ వారు అక్కడే ఉండండి,ఇంతకీ ఈమె చనిపోయి ఎంతసేపు అయింది అని అడుగుతాడు అప్పుడు అందరూ ఒక 15 నిమిషాలు అయి ఉంటుంది అని చెప్తారు. అప్పుడు వినోద్ మరి కొంతమంది పోలీసులు తీసుకొని అపార్ట్మెంట్లో ఒక్కొక్క ఫ్లోర్ కి వెళ్లి  అక్కడ అమ్మాయి శవం ఉన్న వైపు ఫ్లాట్ లోకి వెళ్లి అటువైపు ఉన్న కిటికీని తెరిచి, మూసి గాలిలొ కాయిన్ ని విసిరి అది ఆ రూం లో ఫ్లోర్ మీద పడ్డాక వేరే ఫ్లోర్ లో కి వెళ్లి మళ్ళీ అటువైపు రూంలో కిటికీ తెరచి ,మూసి కాయిన్ గాలిలోకి విసిరి అది నేలమీద పడ్డాక ఇంకో ఫ్లోర్ కి వెళ్ళేవాడు, అలా అన్ని ఫ్లోర్ లు చెక్ చేశాక క్రిందకు వచ్చి ఆ అమ్మాయిది ఆత్మహత్య కాదు హత్య అని చెప్పాడు.

అప్పుడు అందరూ ఎలా చెప్పారు అని ప్రశ్నిస్తే అందుకు వినోద్… నేను ఆవైపు వున్న అన్ని ఫ్లాట్ లకి వెళ్లాను అన్ని రూమ్ లో కిటికీలు మూసి ఉన్నాయి కాబట్టి అమ్మాయి ఏ ఫ్లోర్ నుంచి దూకలేదు ఆమెను ఎవరో చంపేసి ఇక్కడ పడేసారు అని చెప్పాడు.


Crime-3

Telugu Stories For Reading

ఒక అమ్మాయి వాళ్ళ అమ్మ చనిపోయాక ఖననం చేయడానికి స్మశాన వాటికకు వెళ్ళింది, అక్కడ ఆమెకు ఒక చక్కని మంచివాడైన అబ్బాయి కనబడ్డాడు కొంతసేపు మాట్లాడాక తన తల్లి కార్యక్రమాల్లో బిజీ అయిపోయింది
కార్యక్రమం తర్వాత ఆ వ్యక్తి కనబడలేదు ఆమె అతని ఫోన్ నెంబర్ తీసుకోవడం కూడా మర్చిపోయింది. తర్వాత ఆ అమ్మాయి చాలా రోజులు అతని కోసం రకరకాల ప్లేస్ లో రకరకాలుగా ప్రయత్నించింది కానీ అతను అడ్రస్ దొరకలేదు. కొన్ని రోజులు గడిచాక అమ్మాయి యొక్క అక్క కూడా చనిపోయింది అప్పుడు పోలీస్ వచ్చి ఈమె అక్కది సహజ మరణం కాదు హత్య అని నిర్ధారించాడు.

అంతేకాకుండా అక్కడ ఉన్న అమ్మాయిని అరెస్టు చేసి తన అక్కను ఆమె చంపిందని చెప్పారు అప్పుడు అందరూ అది ఎలా సాధ్యం అని అడిగినప్పుడు అతను ఇలా చెప్పాడు, ఈమె తల్లి చనిపోయినప్పుడు కర్మకాండలు కార్యక్రమంలో ఒక వ్యక్తిని పరిచయం చేసుకుంది తర్వాత అతను ఈమెకు మళ్ళీ కనబడలేదు అతని కోసం చాలా రోజుల నుంచి చాలా ప్రయత్నించింది అయినా అతని దొరకపోయేసరికి అతనిని మళ్లీ కలవాలని ఉద్దేశంతో ఈమె వాళ్ళ అక్కను హత్య చేసింది ఎందుకంటే ఆమె కర్మకాండలకు ఆ వ్యక్తి మళ్ళీ వస్తాడని ఉద్దేశంతో అప్పుడు అతని కలవచ్చని ఆలోచనతో ఇలా చేసింది అని చెప్పాడు.


Crime-4

Top 10 Telugu Suspense Stories

అది స్కూల్లో మొదటి రోజు ఆరోజు వాళ్ల హిస్టరీ టీచర్ను ఎవరు ఎవరో హత్య చేశారు.

ఆ హత్య గురించి పోలీసులు నలుగురు వ్యక్తుల్ని అనుమానించారు వారిలో ఒకరు తోటమాలి ,ఒకరు మ్యాథ్స్ టీచర్ ,ఇంకొకరు బాస్కెట్బాల్ కోచ్ మరియు ఆ స్కూల్ ప్రిన్సిపల్.

వారిలో ఒక్కొక్కరిని పోలీసులు విచారించారు తోటమాలి నేను ఆ సమయంలో తోట బాగు చేస్తున్నాను అని చెప్పాడు ,మ్యాథ్స్ టీచర్ నేను ఆ సమయంలో పిల్లలకు హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ పెడుతున్నాను అని చెప్పాడు, బాస్కెట్బాల్ కోచ్ నేను పిల్లలతో ఆటాడిస్తున్నాను అని చెప్పాడు తర్వాత ప్రిన్సిపల్ నేను నా ఆఫీసు రూమ్ లో ఉన్నాను అని చెప్పింది .
అందరి మాటలు పోలీసు విని మ్యాథ్స్ టీచర్ హత్య చేసినట్టు నిర్ధారించి అరెస్ట్ చేశారు . ఎందుకంటే అది స్కూల్లో మొదటి రోజు ఆయన ఏ విధంగా పిల్లలకు హాఫ్ ఇయర్ ఎగ్జామ్ జరుగుతున్నాయని చెప్తాడు.


Crime-5

Top 10 Telugu Suspense Stories

ఒక సీరియల్ కిల్లర్ ఐదుగురు వేరు వేరు వ్యక్తులను కిడ్నాప్ చేసి వారందరికి కళ్ళకు గంతలు కట్టి ఒక దగ్గర కూర్చోబెట్టి ఒక్కొక్కరికి రెండు రెండు టాబ్లెట్లు ఇస్తాడు వేరొక చేతిలో ఒక గ్లాస్ నిండా నీళ్లు ఇస్తాడు.

తర్వాత అతను వారితో నేను మీకు ఇచ్చిన టాబ్లెట్లు లో ఒకటి విషం ఉన్న టాబ్లెట్ ఇంకొకటి మంచిది. అందరూ మొదట ఒక్క టాబ్లెట్ వేసుకోండి మీకు విషం ఉన్న టాబ్లెట్ వచ్చినట్లయితే మీరు చనిపోతారు అదే మీలో ఎవరికన్నా ఒకరికి మంచి టాబ్లెట్ వచ్చినట్లయితే మిగిలిన విషం ఉన్న టాబ్లెట్ నేను మింగి నేను చనిపోతాను అప్పుడు మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు అని చెప్తాడు.

అప్పుడు అందరూ ఒక్కొక్క టాబ్లెట్ వేసుకుంటారు కానీ అందరూ చనిపోతారు ఎందుకు?

ఎందుకంటే విషం అనేది అతనితో టాబ్లెట్లు లేదు వారు తగిన నీటిలో ఉంది అందుకే నీళ్లు తాగిన అందరూ చనిపోయారు


Crime-6

ఒక వ్యక్తి తన భార్యను తీసుకొని ట్రిప్ కి వెళ్తాడు. కానీ రిటర్న్ ఆ వ్యక్తి మాత్రమే వస్తాడు ఎందుకంటే ఆయన భార్య చనిపోయింది .

ఆ హత్య విషయం విచారించడానికి వచ్చిన పోలీసు ట్రావెల్ ఏజెంట్ తో మాట్లాడి ఆ భర్త తన భార్యను హత్య చేసినట్టుగా నిర్ధారిస్తాడు ఎందుకో తెలుసా….

ట్రావెల్ ఏజెంట్ చెప్పిన సమాచారం ప్రకారం ఆ వ్యక్తి ఊరు వెళ్లడానికి రెండు టికెట్లు తీసుకుంటాడు కానీ రిటర్న్ మాత్రం తనకు మాత్రమే ఒకటే టికెట్ తీసుకుంటాడు అంటే ఆ వ్యక్తి ముందే తన భార్యను హత్య చేయడానికి పథకం వేసాడన్నమాట.


Crime-7

ఒక కెమిస్ట్రీ సైంటిస్ట్ తన సొంత లాబ్లో హత్య చేయబడ్డాడు ,అతను హత్యకు సంబంధించి పోలీసులకు ఒకటే ఆధారం దొరికింది. అది ఏమిటంటే పేపర్ మీద Nickel, carbon, oxygen ,lanthanum and Sulphur అని రాసి ఉంది.

హత్య జరిగిన రోజు ఆ ల్యాబ్ కి ముగ్గురే వ్యక్తులు వచ్చారు ఒకరు సైంటిస్ట్ చార్లీ అతని మేనల్లుడు నికోలస్ మరియు అతని భార్య.

పోలీసులు ఆ పేపర్ చూసిన వెంటనే నికోలాస్ ను అరెస్ట్ చేశారు ఎందుకంటే ఆ పేపర్ మీద ఉన్న కెమికల్స్ లో మొదటి అక్షరాలు అన్నీ కలిపితే Nicholas పేరు వస్తుంది కాబట్టి అతన్నే హత్య చేశాడని నిర్ధారించారు.


Crime-8

Top 10 Telugu Suspense Stories

ఒక వ్యక్తి ఒక గదిలో హత్య చేయబడి ఉన్నాడు ,అతని ఒక చేతిలో క్యాసెట్ రికార్డర్ మరొక చేతిలో గన్ ఉంది. అక్కడికి పోలీసులు వచ్చాక రికార్డర్ ఆన్ చేసి వింటే దానిలో చనిపోయిన వ్యక్తి “నాకు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు అందుకే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను” అని చెప్పాడు తర్వాత గన్ శబ్దం వచ్చింది.

పోలీసులు ఇది ఆత్మహత్య కాదు హత్య అని నిర్ధారించారు, ఎలా అంటే ఒక చనిపోయిన వ్యక్తి తన మాటలు మొదటినుంచి వినబడేలాగా రికార్డ్ లో రివర్స్ బటన్ నొక్కలేడు కదా.

 


Crime-9

ఒకామె తన భర్తను హత్య చేసింది అనే ఆరోపణతో కోర్టు బోనులో నిలబడింది కానీ ఆమె మాత్రం నాకు నా భర్త అంటే చాలా అభిమానం నేను ఆయన్ని హత్య చేయలేదు అని జడ్జితో వాదిస్తుంది.

ఆమె తరపు లాయర్ ఆమె చెప్పేది నిజమే ఆమె భర్త చనిపోలేదు ఎక్కడో ఉన్నాడు ఆయన కొంత సేపట్లో మన కోర్టుకు వస్తాడు కావాలంటే అందరూ అటు చూడండి అంటూ కోర్టు గుమ్మం వైపు చూపించాడు. అందరూ అటువైపు చూస్తూ కొంతసేపు ఎదురు చూస్తూ ఉన్నారు కానీ జడ్జి మాత్రం ఆమె హత్య చేసిందని నిర్ధారించి ఆమెకు శిక్ష ఖరారు చేశాడు.

ఎందుకని, ఆమె లాయర్ జడ్జి ని ప్రశ్నించగా అతను మనమందరం ఆయన వస్తాడని గుమ్మం వైపు చూస్తున్నా కానీ ఆమె మాత్రం అటువైపు చూడకుండా వేరేవైపు చూస్తోంది అంటే ఆమెకు ఆమె భర్త చనిపోయాడని ఇటువైపు రాడని కచ్చితంగా తెలుసు అందుకే ఆమె ఆశగా గుమ్మం వైపు  చూడట్లేదు అన్నాడు.


 

Crime-10

Top 10 Telugu Suspense Stories

ఒక వ్యక్తి తన వజ్రపు ఉంగరం పోయిందని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు, పోలీసులు అతని ఇంటికి వచ్చి చూసేసరికి ఒక కిటికీ అద్దం పగిలింది అదే రూమ్ లో కార్పెట్ మీద కాలి మట్టి అడుగులు ఉన్నాయి అవి అన్నీ చూసి ఉంగరం దొంగతనం చేసింది కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి అని నిర్ధారించి అతనిని అరెస్టు చేశారు.

ఎందుకంటే పగిలిన కిటికీ అద్దాలు గది బయట వైపు పడి ఉన్నాయి అంటే దొంగతనం చేసిన వ్యక్తి బయట నుంచి లోపలికి రాలేదు గదిలోపల నుంచి బయటకు వెళ్ళాడు కాబట్టి.

 

For more suspense stories please visit

error: Content is protected !!