Contents
విశ్వాసం
Faith moral story in Telugu ||విశ్వాసం||
Faith moral story in Telugu ||విశ్వాసం||
ఒక వూరిలో ఒక వస్త్రాల వ్యాపారి ఉండేవాడు అతని వద్ద ఒక గుర్రం ఉండేది దాని పేరు జగ్గు . వ్యాపారి చిన్నతనం నుండి జగ్గు వారి వద్దే ఉండేది ,జగ్గు చాలా అందం గా దృడంగా ఉండేది వ్యాపారి ఇంటిలో ఎవరు దూర ప్రదేశాలకు వెళ్ళాలి అన్న జగ్గు బండిలోనే వెళ్లేవారు . జగ్గు చాలా జాగ్రత్తగా గమ్యానికి చేరుస్తుంది వారి నమ్మకం .
ఒకరోజు వ్యాపారి వ్యాపార నిమిత్తము ప్రక్కనున్న పెద్ద పట్టణానికి వెళ్ళవలసి వచ్చింది . అందువలన వ్యాపారి గుర్రం నడపడానికి గోపయ్యను తీసుకొని జగ్గు బండి లో బయలుదేరాడు . పెందలకడనే బయలుదేరితే చీకటి పడేవరకు ఇంటికి చేరవచ్చు అని వారి ఆలోచన ,ఆ ప్రకారమే తెల్లవారు జామునే బయలు దేరారు. అప్పటికి వాతావరణం చాలా నిర్మలంగా వుంది కానీ మార్గమధ్యం లో వర్షం మొదలయింది , ఆ పట్టణం చేరాలి అంటే మధ్యలో ఒక వంతెన దాటాలి ఆ వంతెన ఒక పెద్ద చెరువు మీద నిర్మించారు. వర్షం అప్పుడే మొదలైనందున అందరు హడావిడిగా వంతెన దాటుతున్నారు ,గోపయ్య కూడా జగ్గు సహకారం తో జాగ్రత్తగా వంతెన దిగాడు .
ఇంతలో ప్రక్కన ఎవరో పెద్ద గొంతు తో ఇలాగే ఎడతెరిపిలేకుండా వర్షం పడితే రాత్రి కి ఈ వంతెన మునిగి పోతుంది అని తన ప్రక్కనున్న మనిషి తో చెపుతున్నాడు ,ఆ మాటలు గోపయ్య చెవిలోపడ్డాయి . అదే మాట వ్యాపారితో అంటే లేదు లే మనం సాయంత్రాని కల్లా తిరుగుప్రయాణం అయిపోతాం , అయినా మన ఊరి కి వెళ్ళడానికి వేరే మార్గం వుంది అన్నాడు .
పట్టణం లో అనుకున్న పని పూర్తి చేసుకొని తిరుగు ప్రయాణం అయ్యేసరికి రాత్రి అయ్యింది , వర్షం అలాగే ఎడతెరిపి లేకుండా పడుతూనే వుంది . చీకట్లో గోపయ్య బండిని జాగ్రత్తగా నడుపుతున్నాడు,వారు వెళ్లే మార్గం అంత చెట్లతో నిండిపోయి వుంది మార్గానికి అటూయిటూ చెట్లు ఈదురు గాలులకు వేగంగా కదులుతూ వున్నాయి . ఏ చెట్టు విరిగి మీదపడుతుందా అనే అంత భయంకరంగాఉంది గాలి ,ఇంతలో పెద్ద చెట్టు విరిగినట్లు పెద్దశబ్దం వినిపించింది . గోపయ్య ,జగ్గు కళ్ళాన్ని పట్టుకొని గట్టిగా లాగాడు ఏమాత్రం ముందుకు వెళ్ళకుండా ,మెరుపు వెలుతురులో చూస్తే చెట్టు ఎక్కడో కాదు వారి గుర్రపు బండికి ముందు అడ్డంగా పడివుంది … దానిని చూసే సరికి గోపయ్య గుండె జల్లుమంది ఎంత ప్రమాదం తప్పింది అన్నాడు వ్యాపారితో . ఇంక మనం ఈ మార్గం లో ముందుకు వెళ్లలేం చెట్టు కాండం చాలాపెద్దగావుంది బండి దీనిని దాటలేదు అన్నాడు వ్యాపారి . మరి ఏంచేదాం అన్నాడు గోపయ్య,అప్పుడు వ్యాపారి ఇంక తప్పేదిలేదు మనం ఉదయం వచ్చిన మార్గం లోనే వెళ్ళాలి అన్నాడు వ్యాపారి . మళ్ళి వచ్చిన దారి లోనే నెమ్మదిగా వెనుదిరిగారు .
ఇంకా వర్షం పడుతూనే వుంది …
ఉదయం చూసిన వంతెన వున్న ప్రదేశాన్నికి వచ్చారు ,వర్షం వలన వచ్చిన వరద ఉదృతి వలన వంతెన మధ్యభాగం మునిగిపోయింది . చీకట్లో అంత స్పష్టంగా ఏమీ కనబడడం లేదు ,కానీ ఎన్నో సార్లు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవడం వలన వచ్చిన అనుభవం తో గోపయ్య ముందుకు వెళదాం అనే ఉద్దేశం తో జగ్గు ని ముందుకు పంపడాని కి ప్రయత్నించాడు , అది వంతెనకు ఒక చివర అయినప్పటి కి జగ్గు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. గోపయ్య కోపంతో కళ్ళాన్ని గట్టిగా లాగాడు ,జగ్గు కి చాలా నొప్పిగా అనిపించింది కానీ అది కదలలేదు . గోపయ్య బండి క్రిందకు దిగి జగ్గుని చర్నాకోలు తో చాలా గట్టిగ కొట్టాడు ,చర్మం తెగి రక్తం వస్తుంది కానీ జగ్గు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. ఇంతలో వంతెన అవతలి వైపునుంచి ఒకవ్యక్తి గట్టిగ అరుస్తూ కనిపించాడు ,విషయం ఏమిటి అని గోపయ్య అడిగాడు . అందుకు అతను ఈ వంతెన మద్య భాగం లో విరిగి పోయింది అన్నాడు గట్టిగా ,ఆ మాట విని వ్యాపారికి ,గోపయ్యకి నోటమాట రాలేదు. మళ్ళి వెనుదిరి గారు వేరే మార్గం లో ,దారిలో చాలా దూరం వ్యాపారి కానీ గోపయ్య కానీ ఏమీ మాట్లాడలేదు.
కొంత దూరం వెళ్ళాక…
చాలా సార్లు మనుషుల కన్నా జంతువు లు చాలా తెలివైనవి అని విన్నాను కానీ ఈ రోజు ప్రత్యక్షం గా చూసాను. మన జగ్గు ఈ రోజు సమయస్ఫూర్తి తో ప్రవర్తించ బట్టే మన ముగ్గురు ప్రాణాలు నిలిచాయి అన్నాడు వ్యాపారి . మౌనంగా ఈ మాటలు వింటున్న గోపయ్య తాను జగ్గు ఎడల ఎంత కర్కశంగా ప్రవర్తించాడో గుర్తుకు వచ్చి జగ్గు వీపుపై క్షమించమన్నట్టు నెమ్మదిగా నిమిరాడు .
ఇంతలో నే వ్యాపారి ఇంటికి చేరుకున్నారు ,వ్యాపారి భార్య కంగారుగా వచ్చి ఏ ప్రమాదం జరిగిందో అని ఇంతసేపు చాలా కంగారు పడ్డాను .. క్షేమంగా వచ్చారు సంతోషం అన్నాది . అప్పుడు వ్యాపారి జగ్గు విశ్వాసం వలన మేము ప్రమాదం నుండి బయటపడ్డాం అన్నాడు.
తరువాత గోపయ్య జగ్గుని తన గుర్రపు శాలలోకి తీసుకు వెళ్ళాడు . ఆ రోజు జగ్గు ఎన్నడూ తినంత రుచికరమైన యజమానురాలు పంపిన ఆహారం తిని ఆదమరచి నిద్రపోయింది .
Moral :విశ్వాసం అనేది వెలకట్ట లేనిది దానికి విలువ యివ్వడం నేర్చుకుందాం.
Horse story….
For more stories please visit: satya katha
Faith moral story in Telugu ||విశ్వాసం|| this article explains how animals are faithful to human