Telugu Rhymes Lyrics…
Contents
Telugu Rhymes
chitti chilakamma:
చిట్టి చిలకమ్మా
అమ్మ కొట్టిందా
తోటకెల్లావా
పండు తెచ్చావా
గూట్లో పెట్టావా
గుటుక్కున మింగావా
బుర్రు పిట్ట బుర్రు పిట్ట తుర్రుమన్నది
పడమటింటి కాపురం చేయనన్నది
అత్త తెచ్చిన కొత్త చీర కట్టనన్నది
మామ తెచ్చిన మల్లెపూలు ముడవనన్నది
మొగిడి చేత మొట్టికాయ తింటానన్నది
మొగిడి చేత మొట్టికాయ తింటానన్నది
Chinna Pillala Rhymes..
కాకి కాకి కడవల కాకి,
కడవను తెచ్చి గంగలో ముంచి,
గంగ నాకు నీళ్ళు ఇస్తే,
నీళ్ళను తెచ్చి ఆవుకు ఇస్తే,
ఆవు నాకు పాలు ఇచ్చే
పాలను తెచ్చి అవ్వకి ఇస్తే,
అవ్వ నాకు జున్ను ఇచ్టే
జున్నును తెచ్చి పంతులుకిస్తే,
పంతులు నాకు చదువు చెప్పే
చదువును తెచ్చి మామకి ఇస్తే,
మామ నాకు పిల్లను ఇచ్చే
పిల్ల పేరు మల్లె మొగ్గ,
నా పేరు జమిందార్
LKG Rhymes in Telugu..
ఏనుగమ్మ ఏనుగు
ఎవూరేల్లింది ఏనుగు
మావురోచ్చింది ఏనుగు
ఏనుగు ఏనుగు నల్లనా
ఏనుగు కొమ్ములు తెల్లన
ఏనుగు మీద రాముడు
ఎంతో చక్కని దేవుడు
Pillala Patalu…
చల్ చల్ గుర్రం చల్ చల్
చల్ చల్ గుర్రం చల్ చల్
కుడివైపు లేదా ఎడమవైపు చల్
చల్ చల్ గుర్రం చల్ చల్
చల్ చల్ గుర్రం చల్ చల్
చల్ చల్ గుర్రం చల్ చల్
కుడివైపు లేదా ఎడమవైపు చల్
ముందుకి లేదా వెనక్కి చల్
అటు ఇటు తిరగక నువ్వు
చల్ చల్ గుర్రం చల్ చల్
Telugu Rhymes Lyrics…
Chinna Pillala Bommalu
ఏనుగమ్మ ఏనుగు
ఈ ఊరు వచ్చింది ఏనుగు
ఏనుగమ్మ ఏనుగు
మా ఊరు వచ్చింది ఏనుగు
ఏనుగమ్మ ఏనుగు
ఏమి చేసింది ఏనుగు
ఏనుగమ్మ ఏనుగు
మంచినీళ్ళు తాగింది ఏనుగు
ఏనుగు ఏనుగు నల్లన
ఏనుగు కొమ్ములు తెల్లనా
ఏనుగు మీద రాముడు
ఎంతో చక్కని దేముడు
జో అచ్యుతానంద జో జో ముకుందా..
లాలీ పరమానంద రామ గోవింద జో జో..
జో అచ్యుతానంద జో జో ముకుందా..
లాలీ పరమానంద రామ గోవింద జో జో..
Chinna Pillala abcd…
THE ALPHABET SONG
A B C D E F G
H I J K
L M N O P
L M N O P Q R S T
U V W X Y Z
X Y Z
SUGAR ON THE BREAD,
IF YOU DON’T LIKE IT,
BETTER GO TO BED.
NEXT MONDAY MORNING COME TO SCHOOL,
I WILL TEACH YOU,
A B C.
More…