Amazing Facts about Animals
Spread the love

Amazing Facts about Animals

  • వెనకకు ఎగరగలిగే ఏకైక పక్షి హమ్మింగ్ బర్డ్.
  • చేపల లో అత్యంత విషపూరితమైన చేప స్టోన్ ఫిష్.
  • ప్రపంచంలో అత్యంత ప్రాణాంతక జంతువు షార్క్ కో, పులి లో కాదు అది చాలా చిన్నదైన దోమ. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం డెంగ్యూ ,మలేరియా మరియు ఎల్లో ఫీవర్ వంటివి దోమల ద్వారా సంక్రమిస్తాయి ఈ వ్యాధుల వలన ప్రతి సంవత్సరం 7 లక్షల 25 వేల మంది మరణిస్తున్నారు.
  • ఒక సర్వే ప్రకారం మన భూమి మీద ఉన్న మనుషుల కన్నా కీటకాలు 1.4 బిలియన్ లు ఎక్కువ ఉన్నాయి.
  • ప్రపంచంలో అత్యంత తక్కువ జీవితకాలం కల్గిన జీవి మేప్లే (mayfly). ఇది 24 గంటలు మాత్రమే జీవిస్తుంది అదే సమయంలో ఇది పునరుత్పత్తి చేసి చనిపోతుంది.animal facts about animals
  • హర్నెడ్ లిజార్డ్ అనే బల్లి తన శత్రువుల నుండి తనను కాపాడుకోవడానికి తన కళ్ళ నుంచి రక్తాన్ని మూడు అడుగుల దూరం వరకు చిమ్ముతుంది ఈ చర్యను చూసి భయపడిన శత్రువులు దాని వైపు వెళ్లరు.
  • కోడిపుంజు తన చేసే శబ్దం నుండి తన చెవులను కాపాడుకోవడానికి అరిచే అప్పుడు వెనుకకు వంగుతుంది,అప్పుడు దాని చెవులు రెండూ మూసుకుపోయే అమరిక దాని శరీరం లో ఉంటుంది. అందువలన అది చేసే శబ్దం వలన దాని చెవులకు ఎటువంటి హాని కలుగదు .
  • కోలా ఎలుగుబంటి రోజుకు 24 గంటలు నిద్ర పోతుంది ఎందుకంటే అది తీసుకునే ఆహారం అయిన యూకలిప్టస్ ఆకులలో పోషకాహారం తక్కువగా పీచుపదార్థాలు ఎక్కువగా ఉంటాయి అందువలన అవి జీర్ణమవడానికి కి కోలా ఎలుగుబంటి కి ఎక్కువ శక్తి కావలసి ఉంటుంది
  • స్విఫ్ట్ పక్షులు తన జీవిత కాలంలో ఎక్కువ కాలం గాలిలో ఎగురుతూ గడుపుతాయి, అవి కిందకు దిగకుండా దాదాపు ఏడాది పొడవునా ఎగర గలవు. ఒక అధ్యయనం ప్రకారం పది నెలల వ్యవధిలో ఈ పక్షి రెండు గంటలు మాత్రమే కిందకు దిగింది అని చెప్పింది .
  • బొద్దింక తన శరీరం, తల నుంచి వేరే అయినప్పటికీ దాని శరీరం కొన్ని వారాలపాటు జీవిస్తుంది అదేవిధంగా తల కూడా కొన్ని గంటల పాటు జీవించే ఉంటుంది.
  • ఆవు రోజుకు 15 సార్లు విసర్జిస్తుంది ,ఆవు విసర్జన సహజమైన ఎరువుగా వాడతారు అని మనందరికీ తెలుసు కదా.
  • పాండాలు రోజుకు 12 నుండి 38 కిలోల వెదురును ఆహారంగా తీసుకుంటాయి.
  • నీలి తిమింగలం నాలుక కారు లేదా చిన్న ఏనుగంత బరువు ఉంటుంది.
  • అత్యంత ఎక్కువ కాలం జీవించిన జీవి మడగాస్కర్ రేడియేటర్ తాబేలు ఇది 1965లో 188 సంవత్సరాల వయస్సులో మరణించింది.
  • మన భూమి మీద అత్యంత వేగంగా పరిగెట్ట గల జీవి చిరుత ఇది ఇది గరిష్టంగా 120 kph వేగంతో పరిగెట్ట గలదు.
  • 16.పెరగ్రైన్ ఫాల్కన్ అత్యంత వేగంగా ఎగర గల పక్షి. ఇది 390 kph వేగంతో ఎగురుతుంది.facts in animals
  • బ్లాక్ మార్నింగ్ అత్యంత వేగంగా ఈదగల సముద్రపు జంతువు ఇది 130 kph వేగంతో వెళుతుంది.
  • జెయింట్ పసిఫిక్ ఆక్టోపస్ మూడు గుండెలు ,తొమ్మిది మెదడు మరియు నీలం రంగు రక్తం కలిగి ఉంటుంది.
  • ఒక ఈగ దాని శరీరం పొడవు కంటే 200 రెట్లు ఎక్కువ దూరం దూక గలదు.
  • గర్భం దాల్చి పిల్లలకు జన్మనిచ్చే ఏకైక మగ జీవి సముద్ర గుర్రం (seahorse).
  • జిరాఫీలు ఈ భూమి మీద అత్యంత పొడవైన జంతువులు ఇవి 5.8 మీటర్ల ఎత్తు వరకు వుంటాయి .
  • ఆస్ట్రిచ్ లు ఈ భూమి మీద ఉన్న అత్యంత ఎత్తయిన పక్షులు ఇవి 2.7 మీటర్ల ఎత్తు వరకు ఉంటాయి. వీటి కాళ్లు చాలా బలంగా ఉంటాయి దీన్ని ఒక్క దెబ్బతో సింహం కూడా మరణించ గలదు.
  • తెల్ల సొరచేపలు 100 లీటర్ల నీటిలో రక్తపు చుక్కలు గుర్తించగలవు మరియు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న రక్తపు బొట్టు వాసన కూడా పసిగట్ట గలవు.
  • పులి యొక్క వెనక కాళ్లు చాలా బలంగా ఉంటాయి అవి చనిపోయినప్పటికీ దాని శరీరం కాళ్ళు ఆధారంగా నిలబడి వుంటుందని ఒక అధ్యయనం చెప్పింది.
  • ఖడ్గమృగం యొక్క కొమ్ము కేరిటిన్ అనే ప్రోటీన్ తో చేయబడి  ఉంటుంది. అదే ప్రోటీన్ మన జుట్టు గోర్లు ఏర్పడడానికి ఉపయోగపడుతుంది.
  • 75 సెంటీమీటర్ల కంటే ఎక్కువ పొడవైన రెక్కలు కలిగిన డ్రాగన్ ఫ్లై ఇప్పటి వరకు జీవించి ఉన్న అతిపెద్ద కీటకం.
  • కోలా ఎలుగు బంటి యొక్క వేలిముద్రలు ఇంచుమించు మనిషి వేలిముద్రలను పోలి ఉంటాయి.
  • గొర్రెలు మనుషుల మొఖాలను గుర్తు పడతాయి.
  • ఎలక్ట్రిక్ ఈల్స్ కు గుర్రాన్ని పడగొట్టే అంత కరెంటు పాస్ చేయగల శక్తి ఉంటుంది.
  • కోకిల తన గుడ్లను వేరే పక్షుల గూటిలో దాచుకుంటుంది.
  • ఏనుగులు తన వారు చనిపోయిన స్థలాలకు వెళ్లి  విచారం వ్యక్తం చేస్తాయి.
  • గొరిల్లాలు వేటగాళ్లు అమర్చిన ఉచ్చులను చాలా సునాయాసంగా గుర్తించి నాశనం చేస్తాయి.
  • చింపాంజీలు చాలా మేధస్సు కలిగిన జీవులు ఇవి అన్ని రకములైన పనిముట్లను ఆయుధాలను తయారు చేసుకోగలం.
  • భూమి మీద ఉన్న జీవులలో 80 శాతం జీవులు ఉనికి ఇప్పటివరకు కనిపెట్టలేకపోయారు.
  • ఆస్ట్రిచ్ పక్షి గుర్రం కన్నా వేగంగా పరిగెత్తే గలదుostrich facts
  • 90శాతం ఆడ సింహాలే వేటాడతాయి.
  • ప్రపంచంలో 50 శాతం కన్నా ఎక్కువ పందులు చైనా రైతుల వద్ద ఉన్నాయి.
  • కుక్కల యొక్క కనుచూపు మనిషి కనుచూపు కన్నా ప్రభావవంతంగా ఉంటుంది .
  • సుమారు 50వేల సాలెపురుగులు ఒక ఎకరం పచ్చని ప్రదేశంలో ఉంటాయి.
  • గాలిలో ఎగరగల ఏకైక క్షీరదం గబ్బిలం.
  • గోల్డెన్ ఫిష్ ను చీకటి గదిలో ఉంచితే దాని  రంగు పాలి పోతుంది.
  • ఆవులు నిల్చొని నిద్రపో గలవు కానీ అవి కూర్చున్నప్పుడు మాత్రమే కలలు కనగలవు.
  • ఒక మొసలి 30 నుంచి 50 సంవత్సరాల మధ్య జీవించగలదు.
  • రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికన్ లు బాంబులు విసరడానికి గబ్బిలాలకు శిక్షణ ఇచ్చారు.
  • తల క్రిందులుగా ఉండి కూడా ఆహారం తిన గల జీవి ఫ్లెమింగో.
  • చీమలు తమ జీవిత కాలంలో అసలు నిద్రపోవు వాటికి కి ఊపిరితిత్తులు కూడా ఉండవు.
  • వడ్రంగి పిట్ట ఒక సెకనుకు ఇరవై సార్లు తన నోటితో చెక్కను పొడవగలదు.
  • ఏనుగు నీటి యొక్క వాసన మూడు మైళ్ల దూరం వరకు పసిగట్టి గలదు.
  • జింకలు ఎండుగడ్డి తినలేవు.
  • వెస్ట్రన్ సైఫాన్ అనేది ప్రపంచంలో అత్యంత విషపూరితమైన పాము. ఈ పాము ఒక్కసారి కాటువేయగా వచ్చిన విషంతో 100 మంది మనుషులు చనిపోతారు . ఈ పాము కాటు వేశాక 30 నిమిషాల్లో చికిత్స అందించకపోతే మనిషి చనిపోతాడు.

 

For more facts please visit: Human related facts

 

error: Content is protected !!