Children Stories in Telugu
Spread the love

Children Stories in Telugu..

Contents

రాజు తెలివి

అనగనగా దేవపురి అనే రాజ్యం ఉండేది, ఆ రాజ్యాన్ని పాలించే రాజు విజయుడు, అతను చాలా మంచి వాడు తన రాజ్యం లో ఒక్క నిరుద్యోయోగి కూడా ఉండకూడదు అనే ఉదేశ్యం తో రాజ్యం లో ఇరవై సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక వుద్యోగం కల్పించాడు ఇక తన రాజ్యం లో ఎటువంటి నిరుద్యోగి లేడని భావించాడు.

ఒక రోజు రాజుగారి దగ్గరకు ఇద్దరు వ్యక్తులు వచ్చారు ,వారిలో ఒకడు మహారాజా ! మీ మంచితనం వలన మనరాజ్యం లో నిరుద్యోగం అనేదే లేకుండా పోయింది కానీ మా యిద్దరి కొడుకుల వలన మీ ఆశకు భంగం కలిగే లాగా వుంది అని వాపోయారు.

అందుకు విజయుడు మీ సమస్యేంటో నాకు అర్థం కాలేదు ,కొంచం వివరంగా చెప్పండి అన్నాడు .

అప్పుడు ఆవ్యక్తి మహారాజా అందరిలాగే మా కొడుకులు కూడా మీరు ఏర్పరిచిన పనిలో చేరారు, కానీ వారికున్న దుర్వ్యసనాల వల్ల ఏ పనికూడా రెండురోజులుకన్నా ఎక్కువ చేయలేక పోతున్నారు అన్నాడు .

విషయం అర్థమైన రాజుగారు మరికొంతసేపు వారితో మాట్లాడి వారి కొడుకుల గురించి తెలుసుకొని , మీ సమస్య నేను తీరుస్తానని వారికి మాటిచ్చి అక్కడ నుండి పంపాడు.

 Stories in Telugu for Children

మరుసటి రోజు…

రాజుగారు భటులను ఆ ఇద్దరు వ్యక్తుల కొడుకుల దగ్గరికి పంపి వారిని ఆస్థానానికి రప్పించారు. వారిలో మొదటి వానితో చూడు నీకు చిత్రలేఖనం అంటే ఇష్టమని బాగా గీస్తావు కూడా అని తెలిసింది. ఈ రోజు నుండి నిన్ను మన ఆస్థానంలో చిత్రకారునిగా నియమిస్తున్నాను. రోజూ మన రాజ్యం లో సంచరిస్తూ నీకు నచ్చిన వాటిని మరియు పిల్లలకు ఉపయోగకరమైన వాటిని గీసి నాకు చూపించి మన పాఠశాలలో చదువుతున్న పిల్లలకు వాటి గురించి వివరించాలి.ఒకసారి గీసిన చిత్రం మళ్ళీ గీయకూడదు పని మీద శ్రద్దతగ్గితే మన వంటశాలలో పనిచేయవలసి ఉంటుంది అని చిన్న బెదిరింపు స్వరంతో చెప్పాడు .
రాజు గారు చెప్పిందంతా విన్న మొదటివాడు అబ్బా…! నా మనసుకు నచ్చిన పని ,నేను ఎంత అదృష్టవంతుణ్ణి అనుకున్నాడు మనసులో .

రాజుగారు రెండవవాడిని పిలిచి ,నీకు కుస్తీ అంటే ఇష్టం అని తెలిసింది ,ఈ రోజు నుండి నిన్ను మన ఆస్థానం లో కుస్తీ అధ్యాపకునిగా నియమిస్తున్నాను . నువ్వు ఎంత మందిని కుస్తీలో నిష్ణాతుల్ని చేస్తే నీకు అంత డబ్బు వస్తుంది , పని మీద శ్రద్ద తగ్గితే నువ్వు కూడా మన వంటశాలలో పనిచేయవలసి ఉంటుంది అన్నారు . తన మనసుకి నచ్చిన పని అవ్వడంతో రెండవవాడు కూడా రాజుగారికి కృతఙ్ఞతలు చెప్పి పనిలో చేరాడు .

 

నీతి : ఏదన్నా పని చేయడానికి మనకు ఆసక్తి కలగడం లేదంటే ఆ పని అంటే మనకు ఇష్టం లేదని అర్టం,అందుకే మనసుకు నచ్చిన పని చేయాలి అప్పుడు ఏ దుర్వ్యసనాలు అడ్డురావు .

Meanings:

నిరుద్యోయోగి meaning in English : Unemployed

దుర్వ్యసనాలు meaning in English : Addictions


Children Stories in Telugu:

***NEW STORY ***

అత్యాశ

అనగనగా ఒక చిన్న అడవి ఉండేది ఆ అడవిలో అన్ని జంతువులూ పక్షులో కలసి మెలసి ఉండేవి. అదే అడవిలో ఒక కోతి వుండేది దానికి చాలా మంది మిత్రులు ఉండేవారు అది అందరితో కలసి మెలసి ఆనందంగా ఉండేది,ఎవరితో గొడవ పడేది కాదు ఎవరైనా గొడవకు వెళితే వారికి దూరంగా వెళ్ళేది అలా వుండే కోతికి ఒక రోజు బంగారు రంగులో వుండే ఒక చిన్న పెట్టె ఒక చెట్టు తొర్రలో దొరికింది. దానిని తెరుద్దామని ఎంత ప్రయత్నించినా గాని అది తెరుచు కోలేదు .
ఇంతలో దానికి దాని తాత చెప్పిన ఒక విషయం గుర్తుకు వచ్చింది ,అక్షయ పాత్ర అని ఒకటి ఉండేదని అది బంగారు వర్ణం లో ఉండేదని , దానిలో ఏ పదార్ధం వేసినా అది అయిపోయేది కాదని తనకు అలాటిది దొరికితే జీవితం లో ఈ తిండి కష్టాలు ఉండవని చెప్పింది. అంతే కాకుండా దాని వల్ల అందరిలో గొప్పపేరు కూడా వస్తుంది అంది.

ఆ విషయం గుర్తు రాగానే కోతిలో ఎప్పుడూలేని భయం మొదలయింది , అమ్మో ఈ పెట్టకూడా అలాంటి అద్భుతమైందేమో ,దీని గురించి నాకు వివరించడానికి నా సొంతవాళ్ళేవ్వరూ దగ్గరలో లేరు ,ఇక్కడ ఆహారం బాగా దొరుకుతుందని ఇక్కడకు వలస వచ్చాను. దీన్ని వేరే ఎవరైనా చూస్తే నాదగ్గరనుండి లాక్కుంటారు, వారి అడవిలో దొరికింది కాబట్టి వారిదే అని అంటారు అనుకొని,ఎవ్వరూ చూడకుండా అక్కడనుండి మెల్లగా జారుకుందాం అనుకుంది,

అంతలోనే….

అక్కడకు దాని స్నేహితులు వచ్చాయి ,ఓయ్..! మిత్రమా ఆడుకుందామా అన్నాయ్ ,అస్సలే ఈ పెట్టె కంగారులో వున్న కోతికి ఏమి సమాధానం చెప్పాలో అర్థంకాక వారు తన స్నేహితులనే విషయం కూడా మర్చిపోయి వారిని ఎలా అయినా అక్కడనుండి వెళ్లిపోయేలా చేద్దాం అనే ఉదేశ్యం తో ‘ నాకు మీకులాగా పని ఏమి లేదు అనుకున్నారా,నా పని చెడగొట్టడానికి వచ్చారు బుద్ధిలేకుండా అంది ‘కోపంగా .
కోతి మాటలు విని బాధపడిన వేరొక కోతి కోపంగా ,మొదట మా స్నేహం కావాలని అభ్యర్థించింది నువ్వే ,ఇన్నేళ్ళ మన స్నేహాన్ని ఇంత చులకన చేస్తావని మేము ఊహించలేదు ఇకపై మేమెవ్వరం నీస్నేహితులం కావు నువ్వు కూడా మా అడవిలో ఇంకెప్పుడు కనిపించకు అంది గట్టిగా .
ఆ మాటలు విన్న కోతి హమ్మయ్య! నాకు యిదే కావాలి అని ఎవ్వరూ చూడకుండా ఆ పెట్టె పట్టుకొని తన వారు వుండే అడవికి వెళ్ళింది .
అక్కడ అందరి ముందు గొప్పగా చెప్పి పెట్టె ఉంచింది ,అందరూకలసి అతి కష్టం మీద పెట్టె తెరిచారు .

దాని లోపల రాగి నాణాలు తప్ప ఏమీ లేక పోవడం చూసి ఖంగుతిన్న కోతి, అయ్యో…! ఈ నిరుపయోగమైన పెట్టెకోసం చక్కని ఆహారం యిచ్చే అడవిని మంచి స్నేహితులను ఒదులుకున్నానా అని బాధపడింది.

నీతి : దురాశ దుఃఖానికి చేటు ,అంటే ఎక్కడో ఆనందం దొరుకుతుందని మన చుట్టూ వున్న వాళ్ళని నిర్లక్ష్యం చేయడం.

 

 

Gummadi.Sireesha

 

 

 

 

 

 

Yes And No stories in Telugu for Kids

చందమామ కథలు

Kids Moral Stories in Telugu

Real friend short-story for kids in Telugu

Kids-stories-in-Telugu

 

error: Content is protected !!