Desha Bhakthi Geethalu
Spread the love

Desha Bhakthi Geethalu….

Contents

Desha Bhakthi Geethalu

చిన్న పిల్లలందరూ తప్పకుండా  నేర్చు కోవలసిన దేశభక్తి గేయాలు … మీ కోసం

వందేమాతరం

రచయిత :బకించంద్ర ఛటర్జీ

వందేమాతరం

వందేమాతరం

సుజలాం సుఫలాం మలయజ శీతలాం

సస్య శ్యామలాం మాతరం;వందేమాతరం

శుభ్రజ్యోత్స్నా పులకితయామినీం

పుల్లకుసుమిత ద్రుమదల శోభినీం

సుహాసినీం సుమధుర భాషిణీం

సుఖదాం వరదాం మాతరం;వందేమాతరం

భావం:

వందేమాతరం… భారత మాతా నీకు వందనం

సుజలాం సుఫలాం … గల గల పారే ప్రవాహాలతో

మలయజ శీతలాం… మలయ మారుతముల చల్లని గాలులతో

సస్య శ్యామలాం మాతరమ్… సస్య శ్యామలమైన దేశమా నీకు వందనాలు;

వందేమాతరం

శుభ్రజ్యోత్స్నా పులకితయామినీం… తెల్లని వెన్నెలలు కలిగిన రాత్రులలో

పుల్లకు సుమిత ద్రుమదల శోభి నీం… వికసించిన పువ్వులుతో పచ్చని చెట్ల శోభతో

సుహాసినీం సుమధుర భాషిణీం… స్వచ్చమైన నవ్వులు మధురమైన మాటలతో

సుఖదాం.. వరదాం.. మాతరమ్… మాకు సుఖమును వరములను ఇచ్చు తల్లీ

నీకు వందనం

వందేమాతరం


Desha Bhakthi Geethalu:

జనగణమన

రచయిత : రవీంద్రనాథ్ ఠాగూర్

జనగణమన అధినాయక జయహే!

భారత భాగ్యవిధాతా!

పంజాబ, సింధు, గుజరాత, మరాఠా,

ద్రావిడ, ఉత్కళ, వంగ!

వింధ్య, హిమాచల, యమునా, గంగ,

ఉచ్చల జలధితరంగ!

తవ శుభనామే జాగే!

తవ శుభ ఆశిష మాగే!

గాహే తవ జయ గాథా!

జనగణ మంగళదాయక జయహే భారత భాగ్యవిధాతా!

జయహే! జయహే! జయహే!

జయ జయ జయ జయహే!

భావం:

పంజాబు, గుజరాత్ ,మహారాష్ట్ర ,సింధు, లతో కూడిన పశ్చిమ తీర ప్రాంతము

తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, తుళు భాషలతో కూడిన ద్రావిడ ప్రాంతము

ఒరిస్సా మొదలైన రాష్ట్రాలతో కూడిన తూర్పు తీర ఉత్కలప్రాంతము

ఈశాన్య రాష్ట్రాలతో కూడిన బెంగాల్ ప్రాంతము..

వింధ్య హిమాలయ పర్వతాలు,

యమున గంగలు

పై కంటే ఎగసే సముద్ర తరంగాలు

ఇవన్నీ..తమరి శుభ నామమే తలుచుకుంటూ ఉన్నాయి

తమరి శుభ ఆశిస్సుల నే కోరుకుంటున్నాయి

తమరి విజయగాధనే పాడుకుంటున్నాయి

ఓ జనసమూహాల మనసుల అధినాయక.. మీకు జయము!

ఓ భారత భాగ్య విధాత, మీకు జయము! నిత్య జయము!


మా తెలుగు తల్లికి

రచయిత :శంకరంబాడి  సుందరాచారి

మా తెలుగు తల్లికి మల్లెపూదండ

మా కన్నతల్లికి మంగళారతులు,

కడుపులో బంగారు కనుచూపులో కరుణ,

చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి.

గలగలా గోదారి కదలిపోతుంటేను

బిరాబిరా క్రిష్ణమ్మ పరుగులిడుతుంటేను

బంగారు పంటలే పండుతాయీ

మురిపాల ముత్యాలు దొరులుతాయి.

అమరావతి నగర అపురూప శిల్పాలు

త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు

తిక్కయ్య కలములొ తియ్యందనాలు

నిత్యమై నిఖిలమై నిలచి వుండేదాకా

రుద్రమ్మ భుజశక్తి మల్లమ్మ పతిభక్తి

తిమ్మరసు ధీయుక్తి, కృష్ణరాయల కీర్తి

మా చెవులు రింగుమని మారుమ్రోగేదాక

నీ ఆటలే ఆడుతాం-నీపాటలే పాడుతాం

జై తెలుగు తల్లి! జై తెలుగు తల్లి! జై తెలుగు తల్లి!


For more poems ,Please visit: సుమతీ-శతకం

Desha Bhakthi Geethalu:

సరస్వతీ స్తోత్రం

రచయిత :బమ్మెర పోతన

తల్లీ  నిన్ను దలంచి పుస్తకముచేతన్ బూనితిన్ నీవు నా

యుల్లంబందున నిల్చి  జృంభణముగానుక్తుల్  సుశబ్దంబు శో

బిల్లం  బల్కుము నాదు వాక్కునను సంప్రీతిన్ జగన్మోహినీ!

ఫుల్లాబ్జాక్షి! సరస్వతీ! భగవతీ ! పూర్ణేందు బింబాననా.

భావం:

సరస్వతి నాలుక మీద తాండవిస్తేనే మనం ఏమన్నా చెప్పగలుగుతాము అని అర్థం

 


గురు బ్రహ్మ! గురు విష్ణు గురుదేవో మహేశ్వరః||

గురు సాక్షాత్ పర  బ్రహ్మ తస్మైశ్రీ.. గురవే నమః ||


మాతృదేవోభవ -పితృదేవోభవ

ఆచార్యదేవోభవ -అతిథి దేవోభవ


Desha Bhakthi Geethalu:

ఏ దేశమేగినా

రచయిత :రాయప్రోలు సుబ్బారావు

ఏ దేశమేగినా, ఎందు కాలిడినా

ఏ పీఠమెక్కినా ,ఎవ్వరేమనినా

పొగడరా! నీతల్లి భూమి భారతిని,

నిలుపరా! నీ జాతి నిండు గౌరవము!

 

ఏ పూర్వపుణ్యమో, ఏ యోగ ఫలమో!

జనియించినాడవీ  స్వర్గ ఖండమున

ఏమంచి పూవులన్‌ ప్రేమించినావో

నిను మోసె ఈ తల్లి కనక గర్భమున!

 

లేదురా ఇటువంటి భూదేవి యెందు

లేదురా మనవంటి పౌరులింకెందు!

సూర్యుని వెలుతురుల్ సోకునందాక,

ఓడల జెండాలు  ఆడునందాక!

 

అందాక గల ఈ అనంత భూతల్లిని

మన భూమి వంటి చల్లని తల్లి లేదు!

పాడరా నీ తెన్గు  బాలగీతములు

పాడరా నీ వీర భావ భారతము!


జయ జయ ప్రియ భారత

రచయిత :దేవుల పల్లి క్రిష్ణ శాస్త్రి

జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ దివ్యధాత్రి

జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ దివ్యధాత్రి

జయ జయ జయ శతసహస్ర నరనారీ హృదయనేత్రి

జయ జయ జయ శతసహస్ర నరనారీ హృదయనేత్రి

జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ దివ్యధాత్రి

 

జయ జయ సశ్యామల సుశ్యామచలాచ్చేలాంచల

జయ జయ సశ్యామల సుశ్యామచలాచ్చేలాంచల

 

జయ వసంత కుసుమలతా చలిత లలిత చూర్ణకుంతల ఆ..ఆ..

జయ మదీయ హృదయాశయ లాక్షారుణ పదయుగళా

జయ జయ ప్రియ భారత జనయిత్రీ దివ్యధాత్రి

 

జయ దిశాంత గత శకుంత దివ్య గాన పరితోషణ

జయ దిశాంత గత శకుంత దివ్య గాన పరితోషణ

జయ గాయక వైతాళిక గళ విశాల పత విహరణ.

జయ మదీయ మధురగేయ చుంబిత సుందర చరణా

 

జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ దివ్యధాత్రి

జయ జయ జయ శతసహస్ర నర నారీ హృదయనేత్రి

జయ జయ జయ శతసహస్ర నర నారీ హృదయనేత్రి

జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ దివ్యధాత్రి

telugu geeyaalu


Desha Bhakthi Geethalu:

తెలంగాణ రాష్ట్ర గీతం

జయ జయహే తెలంగాణ

రచయిత :అందెశ్రీ

జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం

ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం

తరతరాల చరిత గల తల్లీ నీరాజనం

పది జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం

జై తెలంగాణ! జై జై తెలంగాణ!!

 

పోతనదీ పురిటిగడ్డ రుద్రమదీ వీరగడ్డ

గండరగండడు కొమురం భీముడే నీ బిడ్డ

కాకతీయ కళాప్రభల కాంతి రేఖ రామప్ప

గోలుకొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినార్

జై తెలంగాణ! జైజై తెలంగాణ!!

 

జానపద జన జీవన జావళీలు జాలువార

జాతిని జాగృతపరిచే గీతాల జనజాతర

వేలకొలదిగా వీరులు నేలకొరిగిపోతెనేమి

తరుగనిదీ నీ త్యాగం మరువనిదీ శ్రమయాగం

జై తెలంగాణ! జై జై తెలంగాణ!!

 

గోదావరి కృష్ణమ్మలు తల్లీ నిన్ను తడుపంగ

పచ్చని మా నేలల్లో పసిడి సిరులు కురవంగ

సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి

ప్రత్యేక రాష్ట్రాన ప్రజల కలలు పండాలి

జై తెలంగాణ! జై జై తెలంగాణ!!

జై తెలంగాణ! జై జై తెలంగాణ!!


 సారే జహాసె అచ్ఛా

రచయిత : మొహ్మద్ ఇక్బల్

సారే జహాసె అచ్ఛా

హిందుస్తాన్ హమారా హమారా

సారే జహాసె అచ్ఛా ,

 

హమ్ బుల్ బులే హై ఇస్‌కే,

యే గుల్ సితా హమారా హమారా

సారే జహాసె అచ్ఛా

హిందుస్తాన్ హమారా హమారా

సారే జహాసె అచ్ఛా

 

పరబత్ వో సబ్ సే ఊంఛా

హమ్‌సాయా ఆస్‌మాన్ కా

పరబత్ వో సబ్ సే ఊంఛా

హమ్‌సాయా ఆస్‌మాన్ కా

వో సంతరీ హమారా

వో పాస్‌బా హమారా హమారా

 

సారే జహాసె అచ్ఛా

హిందుస్తాన్ హమారా హమారా

సారే జహాసె అచ్ఛా

 

గోదిమే ఖేల్‌తీహై ఇస్‌కీ

హజారో నదియా

గోదిమే ఖేల్‌తీహై ఇస్‌కీ

హజారో నదియా

గుల్‌షన్ హై జిన్‌కే దమ్‌సే

గుల్‌షన్ హై జిన్‌కే దమ్‌సే

రష్‌కే జినా హమారా హమారా

 

సారే జహాసె అచ్ఛా

హిందుస్తాన్ హమారా హమారా

సారే జహాసె అచ్ఛా||

 

మజ్ – హబ్ నహీ సిఖాతా

ఆపస్‌మె బైర్ రఖ్‌నా

మజ్ – హబ్ నహీ సిఖాతా

ఆపస్‌మె బైర్ రఖ్‌నా

హిందీ హై హమ్ హిందీ హై హమ్ హిందీ హై హమ్ వతన్ హై

హిందుస్తాన్ హమారా హమారా

 

మనం పిల్లకు ఈ గేయాలు నేర్పిస్తే ,దేశం గురించి ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు……. వారే అడిగి మరీ తెలుసుకుంటారు .

 

error: Content is protected !!