Contents
గుప్పెడంత మనస్సు
Guppedantha Manasu Telugu Story | Mana Katha|
శరత్ కి నిద్ర లేచిన దగ్గరనుండి ఏంటో విసుగ్గా వుంది అస్సలు ఎవరితో మాట్లాడాలని గాని ఎవ్వరిని చూడాలని గాని లేదు . ఇంతలో సెల్ ఫోన్ రింగ్ వినిపించింది ఎవరా అని చూస్తే గౌరవ్ అని వుంది ,ఆ పేరు చూడంగానే చెప్పలేనంత కోపంగా వుంది శరత్ కి .
ఇంతకీ ఆ గౌరవ్ ఎవరంటే!! శరత్ వాళ్ళ నాన్న కొలీగ్ కొడుకు ,పుట్టినప్పటి నుండి శరత్ కు కాంపిటేటర్ …
పుట్టడం మొదలు గౌరవ్ తెల్లగా నాలుగు కేజీలు పుట్టాడు మనవాడు నల్లగా మూడు కేజీలు పుట్టాడు అన్నారట చుట్టాలు . అప్పటి నుండి మా నాన్న వాళ్ళు నా కాంపిటేటర్ ని డిసైడ్ అయిపోయారు .
స్కూల్ లో మార్కులు దగ్గరనుంచి స్పోర్ట్స్ లో ప్రైజులు వరకు అన్ని పోటీయే నా జీవితానికి . ఏ ఒక్కరోజు మనశ్శాంతి ఉండదు ఇంటిలో వాళ్ళతో. నా మీద కోపం వచ్చిన ప్రతిసారి అందరు వాడే ఏకైక అస్త్రం గౌరవ్.
వాళ్ళ ఆశకు తగ్గట్టు నా చదువు అంతంత మాత్రంగానే ఏడ్చింది … ఎప్పుడూ తక్కువ మార్కులే….
నాకంటూ కొంచం మంచిగా వచ్చు అంటే!! అది పెయింటింగ్ వేయడం … నా అదృష్ట అది ఆ గౌరవ్ గాడికి రాదు (వాడికి అది టైం వేస్ట్ పని అంట)
దానిలో అన్నా నన్ను మెచ్చుకుంటారా అంటే … అదీ లేదు … రోడ్ల మీద పెయింట్ లు వేస్తావా అంటారు .
పైగా ఈరోజు డిగ్రీ రిసల్ట్ వచ్చాయి ,నాకు యధాలాపంగా రెండు సబ్జెక్టులు పోయాయి ఆ చికాకులో నేనుంటే మధ్యలో ఈ గౌరవ్ గాడి ఫోన్ ఒకటి . కోపం వచ్చి ఫోన్ పక్కకు విసిరాను అనుకోకుండా ఫోన్ బటన్ తో పాటు స్పీకర్ కూడా ఆన్ అయింది . అవతలినుంచి గౌరవ్ ఒరేయ్… శరత్, నేను నీకొక విషయం చెప్పాలి చాలా సీక్రెట్ అంటున్నాడు. మామూలుగా విషయం అంటే అంత ఆత్రం ఉండేది కాదు గాని సీక్రెట్ అనేసరికి శరత్ వెంటనే ఫోన్ అందుకొని
ఏంటిరా… చెప్పు అన్నాడు ,
అప్పుడు గౌరవ్ ఒరేయ్ నాకు మూవీస్ లో యాక్ట్ చేయాలంటే చాలా ఇష్టం అందుకే మొన్న హాలిడేస్ లో ఓ షార్ట్ ఫిలిం లో ఏక్ట్ చేశా ఈ రోజు అది రిలీజ్ అవుతుంది, నాన్న వాళ్ళు అందరూ చూసి ఏమంటారో అన్నాడు .
అది వినంగానే శరత్ కు వింతగా అనిపించింది, చిన్నగా నవ్వుతూ అందేంటిరా.. నువ్వు బాగా చదివి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతావని నేను రోడ్ల మీద బొమ్మలు గీస్తూ బతుకుతానని మానాన్న నన్ను రోజూ నానా తిట్లు తిడుతుంటే నువ్వేమో సినిమాలు అంటున్నవ్ అన్నాడు ఆత్రం ఆపుకోలేక.
Guppedantha Manasu
అవతలనుండి గౌరవ్ ,ఏమోరా … నాకు అదంతా తెలీదు మంచి మార్కులు రావాలి అన్నారు అని చదివాను మార్కులు తెచ్చుకున్నాను నా బాధ్యత అయిపోయింది .
నాకు చిన్నప్పటినుండి ఏక్టర్ అవ్వాలని ఆశ, అది తీరితేనే నాకు హప్పినెస్స్ అన్నాడు.
గౌరవ్ మాటలువింటుంటే శరత్ కి చాలా దైర్యంగా, పట్టుదలగా అనిపించింది మొదటిసారి గౌరవ్ ని మెచ్చుకోవాలి అనిపించింది.
వెంటనే నువ్వు సూపర్ రా గౌరవ్ అనుకున్నది సాధించావ్ నేను కూడా నాకు పెయింటింగ్ అంటేనే ఇష్టం అని, దానిలోనే కోర్స్ లు చేస్తానని గట్టిగా చెబుతా.. మా ఇంటిలో ,అని ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా దృడంగా అన్నాడు గౌరవతో ,అది విని గౌరవ్ All the best రా అన్నాడు… .
Guppedantha Manasu Telugu Story
చిన్న మాట…
దేవుడు మనుషులు అందరిని ఒక్కక్కరిని ఎంతో… ప్రత్యేకంగా తయారుచేసి మన తల్లిదండ్రులకు అందిస్తాడు.
ఆ అద్భుతాన్ని ఆ ప్రత్యేకతని మనం కాపాడుకోకుండా పుట్టిన దగ్గరనుంచి ప్రతి క్షణం ప్రతి నిమిషం యితరులతో మనలను మనం పోల్చుకుంటూ మనలను మనం తగ్గించుకుంటూ ,మనం బాధపడుతూ మన మనసుని బాధపెడుతూ నిరాశగా జీవిస్తూఉంటాం.
ఇందుకా దేవుడు మనలను అంత ప్రత్యేకంగా పుట్టించింది,మనకు మనం విలువ ఇవ్వనప్పుడు యితరులు మనకు విలువ ఎలా ఇస్తారు ఒక్కసారి ఆలోచిద్దాం …
అందరిలా అలా ప్రవాహం లో కొట్టుకు పోకుండా ,మన ప్రత్యేకతను మనం కాపాడుకుందాం …. మనకు నచ్చినట్టు మనం జీవిద్దాం …
జీవితం అంటే యితరులకు నచ్చినట్టు బ్రతకడం కాదు… మన మనసుకు నచ్చినట్టు మనం బ్రతుకుతూ యితరులను యిబ్బంది పెట్టకుండా ఉండడం .
ఒక మనిషి చుట్టుప్రక్కల వున్నవారు అందరూ ఆనందంగా వున్నారు అంటే ,ఆ మనిషి అందరిని ఆనందపరచడానికి తానూ సర్దుకుపోతున్నాడు అని అర్థం. అంత త్యాగం ఎవరికన్నా… అవసరమా !!
మన గుప్పెడు మనస్సుని బాధపెడితే జీవితంలో మనకు ఆనందం ఎలా దొరుకుతుంది .
Gummadi.Sireesha
For more stories please visit: సత్య కథ
Guppedantha Manasu Telugu Story