Telugu stories writing-Neethi Kathalu writing in Telugu
Spread the love

Contents

Telugu stories writing-Neethi Kathalu writing in Telugu

అదృష్టఫలం

Telugu stories writing-Neethi Kathalu writing in Telugu

అనగనగా ఒక అడవిలో ఒక కోతి ఉండేది అది ఎప్పుడూ చాలా హుషారుగా… ఒక చెట్టు నుంచి మరొక చెట్టు మీదకు దూకుతూ నచ్చినవి తింటూ పక్కనున్న కోతులతో ఆడుకుంటూ ఆనందంగా గడిపేది.
దానికి ఒకసారి కొన్ని కోతులు మాటలాడు కుంటుంటే ఒక మాట వినబడింది, అదేంటంటే!! ఈ అడవికి చాలా దూరంలో ఒక ప్రదేశంలో ఒక అద్భుతమైన పండ్ల చెట్టు ఉందని.. ఆ పండు తింటే చాలా శక్తి వస్తుందని వినబడింది. అది విన్న దగ్గర్నుంచి కోతి మనసంతా ఆ పండు మీదే ఉంది ఆలోచన వచ్చిందే తడవుగా కోతి ఆ చోటుకి ప్రయాణమైంది.
దారిలో చాలా జంతువులను దాటుకుంటూ చాలా ఉత్సాహంగా ముందుకు వెళ్ళింది కొంత దూరం వెళ్ళాక ఒక పెద్ద కొండపై మిలమిల మెరుస్తున్న ఆకులు గల ఒక చెట్టు కనబడింది దానిపై ఎర్రటి రంగులో తళ తళ లాడుతున్న ఒక పండు ఉంది. దానిని చూడంగానే కోతికి అదే తను వెతుకుతున్న ఫలమని అర్థమై దానిని ఎలాగైనా తినాలని ఉద్దేశంతో గబగబా కొండెక్కడం మొదలుపెట్టింది.
అలా వెళ్లి చెట్టుకున్న పండుకోద్దామనేంతలో “ఆగు అది మంచిది కాదు”

అని వెనకనుంచి ఒక గొంతు వినపడింది . ఎవరా అని వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఒక ముసలి కోతి ఉంది దానిని చూసిన ఈ కోతి ఎందుకు అలా చెప్తున్నావ్ ఈ పండు తింటే చాలా శక్తి వస్తుంది అంట నేను విన్నాను దీనికోసం చాలా దూరం నుంచి వచ్చాను అని చెప్పింది .
అప్పుడు ముసలి కోతి లేదు ఈ పండు తింటే చాలా ప్రమాదం జరుగుతుంది, ఈ పండు తిన్నవాళ్లందరూ రాయిలాగా మారిపోయారు అని చెప్తుంది . అప్పుడు అది అవునా నీకు ఎలా తెలుసు అని అడుగుతుంది అందుకు ముసలో కోతి ఇదిగో ఈ చుట్టుపక్కల ఉన్న ఈ రాళ్లన్నీ నీకు లాగా ఆశగా వచ్చి పండు తిని ఈ విధంగా మారిపోయాయి అని చెప్తుంది.
ఆ మాటలు విని భయపడిన కోతి భయపడి అమ్మో !!నేను కూడా ఈ ముసలి కోతి రాకపోయినా ఉంటే ఈ విధంగా మారిపోయేదాన్నేమో అని అనుకొని, ముసలి కోతికి కృతజ్ఞతలు చెప్పి అక్కడి నుంచి తను ఉండే ప్రదేశానికి వెళ్ళిపోయింది..

 

నీతి :ఏదన్న నిర్ణయం తీసుకొనే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి .

Telugu stories in writing

తెలివితక్కువతనం

ఒక రోజు అడవిలో ఒక చీమ వేగంగా పరిగెత్తు ఉంది కొంతసేపటి దానికి ఒక ఎలుక ఎదురొచ్చింది. చీమ.. చీమ… ఎందుకు అంత వేగంగా పరిగెడుతున్నావ్ అని ఎలుక అడిగింది అప్పుడు చీమ అక్కడ ఒక పెద్ద జంతువు ఉంది నాకన్నా చాలా పెద్దది అది నన్ను తినేస్తుందేమోనని చాలా తొందరగా పరిగెడుతున్నాను అంది చీమ. అప్పుడు ఎలుక అయితే అది నన్ను కూడా తినేస్తుంది ఏమో!! నేను నీతో పాటు పరిగెడతాను అంటూ ఎలుక కూడా పరుగు అందుకుంది .
చీమ ఎలుక పరిగెడుతుండగా ఒక కుందేలు వాటిని చూసి ఎందుకలా పరిగెడుతున్నారు అని అడిగింది అప్పుడు చీమ అక్కడ ఒక పెద్ద జంతువు ఉంది నాకన్నా చాలా పెద్దది అది నన్ను తినేస్తుందేమో అని పరిగెడుతున్నాను అంది… అవునవును!! అంది ఎలుక.
దాంతో భయంతో కుందేలు కూడా వాటితో పాటు పరిగడ్డం మొదలుపెట్టింది కొంత సమయం గడిచాక కొంత దూరం పరిగెత్తాక వాటికి ఒక నక్క ఎదురొచ్చింది నక్క కూడా అదే విధంగా వాటిని అడిగింది, చీమ మళ్ళీ అదే సమాధానం చెప్పింది .
వాటన్నిటితో పాటు నక్క కూడా పరిగెత్తడం మొదలెట్టింది చాలా దూరం పరిగెత్తాక అలసిపోయిన నక్క వాటితో ఇంక నా వల్ల కాదు పరిగట్టడం… నేను చాలా అలసిపోయాను , ఇంతకీ ఆ జంతువు ఏమిటి అని అడిగింది.

Telugu stories writing

అప్పుడు చీమ “అది పెద్ద గండు చీమ” నావైపే వస్తుంటే నన్ను చంపేస్తుందేమో అని భయపడ్డాను అని చెప్పింది.
కుందేలు నక్క ఎలుకకు కోపం వచ్చి గండు చీమ ఏమైనా మమల్ని తింటుందా? నువ్వు భయపడి అనవసరంగా మమ్మల్ని కూడా భయపెట్టావు అని చీమపై కోప్పడ్డాయి . అప్పుడు చీమ అది నన్ను చంపుతుందేమో అని చెప్పాను మిమ్మల్ని చంపుడుందని చెప్పానా అంది.
ఆ మాటవిని కుందేలు నక్క ఎలుక నిజమే కదా అనుకున్నాయి.

 

For more stories please visit:బాధ్యత 

error: Content is protected !!