Contents
ఎవరి పని వాళ్ళే చేయాలి…
Kids stories in Telugu “ఎవరి పని వాళ్ళే చేయాలి”
కథ 1:
అనగనక ఒక అడవిలో ఒక పెద్ద నేరేడు చెట్టు ఉండేది ఆ చెట్టు మీద ఒక కోతి ఉండేది. అది రోజూ ఆ చెట్టుకున్న పళ్ళని తింటూ హాయిగా జీవించేది.
ఆ చెట్టు కింద ఒక పెద్ద చెరువు ఉండేది ఒక వ్యక్తి రోజూ వచ్చి ఆ చెరువులో వల వేసి చేపలు పట్టేవాడు రోజూ అది గమనిస్తున్న కోతికి అది చాలా సరదాగా అనిపించేది. ఏదన్నా ఒకరోజు తన కూడా అతనిలా చేపలు పట్టాలి అని నిర్ణయించుకుంది అనుకున్నట్టే ఒక రోజు చేపలు పెట్టే వ్యక్తి మధ్యాహ్నం భోజనం చేసే వేళ అయ్యేసరికి ఇంటికి వెళ్ళాడు. ఈలోపు ఇదంతా గమనిస్తున్న కోతి అబ్బ భలే అవకాశం దొరికింది అనుకుంటూ చెట్టు కిందకి వెళ్లి చేపలు పట్టేవల చేత్తో పట్టుకొని నీటిలో వేద్దాం అనుకుంది , కానీ దానికి అలవాటు లేదు కదా ఏం చేయాలో తెలియక వలను తన ఒళ్ళు మొత్తం చుట్టేసుకుంది దాన్ని ఎంత లాగినప్పటికీ అది ఇంకా గట్టిగా కోతి శరీరమంతా బిగుసుకు పోయింది.
కోతికి ఏం చేయాలో తెలీక అటు ఇటు నేలపై దొర్లుతూ ఉంటే అనుకోకుండా నీటిలో పడిపోబోయింది అంతలో భోజనం పూర్తి చేసుకొని అక్కడికి వచ్చిన చేపలు పట్టే వ్యక్తి కోతిని చుట్టుకుని ఉన్న వల ను ఒక పక్కన పట్టుకొని నీటిలో పడిపోకుండా కాపాడాడు తర్వాత మెల్లగా కోతి చుట్టూ చుట్టుకున్న వల ను తీసేసి, కోతితో “నువ్వు రోజూ చెట్టు మీద అటు ఇటు తిరుగుతూ పండ్లు తింటూ హాయిగా ఉండు నేనేమో చెరువులో చేపలు పడుతూ హాయిగా ఉంటాను. ఎవరి పని వాళ్ళు చేసుకుందాం అంతేగాని ఎప్పుడూ వేరే వాళ్ళ పనులు చేద్దామని ప్రాణమీదకు తెచ్చుకోకు అని గట్టిగా మందలించాడు . అప్పుడు కోతి కూడా అవును కదా నా పని నేను చేసుకుంటే చాలా బాగుంటుంది అనుకుంటూ మళ్లీ తన యధా స్థానమైన చెట్టు ఎక్కి కూర్చుంది.
కథ 2:
ఒకరోజు ఒక గాడిద తనమీద వున్న రెండు ఇసుక మూటలను భారంగా మోస్తూ నడుచుకుంటూ యజమానితో పాటు వెళుతుంది. దానికి రోడ్డు పక్కన చెట్టు కింద నీడలో నుంచొని పచ్చటి గడ్డిమేస్తున్న గుర్రాన్ని చూసేసరికి చాలా బాధగా అనిపించింది ఏమిటి నా జీవితం ఇలా … ఉంది ఆ గుర్రం జీవితం ఎందుకు అంత హాయిగా ఉంది, నేను కూడా ఆ గుర్రం లా జీవిస్తే ఎంత బాగుంటుంది అని మనసులో అనుకుంటూ అక్కడ నుంచి భారంగా కదిలింది.
మరుసటి రోజు గాడిద మళ్ళీ అదే దారిలో వస్తూ ఉంటే చెట్టు కింద గడ్డి ఉంది కానీ అది మేస్తున్న గుర్రం కనపడలేదు అదేంటి గుర్రం ఎక్కడికి వెళ్ళింది అనుకుంది . గాడిద మరి కొంత దూరం నడిచాక ఒక పెద్ద ఖాళీ స్థలంలో కుప్పలుగా ఉన్న గుర్రాల శవాల మధ్యలో ఆ గుర్రం కూడా శవం లా కనబడింది , అది చూడంగానే గాడిదకు చాలా భయమేసింది అప్పుడు యజమానితో ఏమైంది ఆ గుర్రానికి అని అడిగింది అప్పుడు ఆ యజమాని అది చాలా ధైర్యశాలి అయిన గుర్రం యుద్ధంలో రాజ్యం కోసం పోరాడి పోరాడి చనిపోయింది అని చెప్పాడు ఆ మాట వినేసరికి గాడిదకు చాలా సిగ్గుగా అనిపించింది, నేను రోజూ ఎంతో కష్టపడుతున్నాను అని అనుకున్నాను కానీ ఆ గుర్రం లాంటి జీవితం నాదైతే ఏదో ఒక రోజు నేను కూడా గుర్రం లాగా చనిపోయేదాన్ని . ఇప్పుడు అనిపిస్తుంది దానికన్నా నా జీవితమే నాకు ఎంతో బాగుంది అనుకుంటూ అక్కడ నుంచి నడిచింది.
దేవుడు ఎప్పుడూ ఎవరికి ఏ జీవితం బాగుంటుందో అదే నిర్ణయించి దాని ప్రకారమే మనల్ని పుట్టిస్తాడు. అది అర్థం చేసుకోకుండా ఎవరెవరితో నో మనల్ని పోల్చుకొని ఎప్పుడు ఏదో నిరాశలో గడపడం ఎంతవరకు సబబు.
For more stories please visit: Kathalu in Telugu for kids