Contents
చీమ -ఏనుగు (అంచనా )
Telugu Kathalu
Kathalu In Telugu for Kids
అనగనగా ఒక అడవిలో ఒక పెద్ద ఏనుగు ఉండేది దానికి అదే అది చాలా బలమైందని తెలివైందని అనుకుంటూ ఉండేది.
దాని కన్నా చిన్న జంతువులను అది ఎప్పుడూ ఏడిపిస్తూ బాధపెడుతూ ఉండేది అలాగే ఒక రోజు అది దారిలో వెళ్తూ ఉంటే దానికి నేల మీద చీమలు కట్టుకున్న ఒక పెద్ద పుట్ట కనిపించింది అది చూడడానికి చాలా అందంగా ఉంది దానిని చూసేసరికి ఏనుగుకి దాన్ని పాడు చేయాలని దుర్బుద్ధి పుట్టింది.
అప్పుడు ఏనుగు తన తొండం నిండుగా పక్కన చెరువులో ఉన్న నీటిని నింపుకొని చీమల పుట్ట దగ్గరకొచ్చి ఒక్కసారిగా వాటిని పుట్ట మీద జల్లింది అంతే పుట్ట మొత్తం నేలమట్టం అయిపోయింది ఉన్నట్టుండి పుట్టంతా కూలిపోయేసరికి బాధపడిన చీమలు ఏనుగును చూసి నువ్వు ఎందుకు మా ఇంటిని కూల్చి వేశావు అని అడిగాయి. !! అప్పుడు ఏనుగు అయ్యో ఇది మీ ఇల్లా అసలు నేను గమనించలేదే అని అంటూ నవ్వుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోయింది.
జరిగిన విషయానికి చీమలు చాలా బాధపడ్డాయి తర్వాత చాలా సార్లు ఏనుగు అదే విధంగా వారి పుట్టను కూల్చివేసింది అప్పుడు చీమలు లాభం లేదు ఏనుగు కి బుద్ధొచ్చేలాగా చేయాలి అనుకున్నాయి . ఒకరోజు ఏనుగు నిద్రపోతున్న సమయంలో నెమ్మదిగా చీమలన్నీ ఏనుగు తొండలలో చేరి కుట్టడం మొదలు పెట్టాయి.
ఆ బాధ తట్టుకోలేని ఏనుగు తనను వదిలిపెట్టమని ఎంత బతిమిలాడినా చీమలు దానిని వదిలిపెట్టలేదు కొంతసేపటికి అలసిపోయి కూర్చున్న ఏనుగుని చూసి చీమలన్నీ ఇక చాలు అనుకొని ఏనుగు దగ్గరకు వచ్చి చూశావా మేము నీకన్నా చిన్న జీవులమని మమ్మల్ని లోకువగా . చూసి మమ్మల్ని బాధ పెట్టావు కానీ మేము తలుచుకుంటే ఇంత పెద్దదానివైనా నిన్ను కూడా బాధ పెట్టగలం ఆ విషయం నువ్వు గుర్తుంచుకొని నీకన్నా చిన్నవాళ్లతో మంచిగా ఉంటే నీకే ఎటువంటి ఇబ్బంది కలగదు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయాయి .
ఆ రోజు నుంచి ఏనుగు తనకన్నా చిన్న జీవులు ఏమి కనపడిన వాటిని ఇబ్బంది పెట్టకుండా తన పని తాను చేసుకుంటూ అందరితో స్నేహంగా ఉంటూ జీవించింది.
ఎవరన్నా మనకన్నా చిన్నవారని ,బలహీనులని మనకన్నా డబ్బు లేని వారని మనం వారిని బాధపెడితే దానికి బదులుగా వారు కూడా మనల్ని దాని కంటే ఎక్కువగా బాధ పెట్టగలరు, కాబట్టి ఏదైనా పని చేసే ముందు మనం అది మంచిదా చెడ్డదా అని ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి.
నక్క – కోడిపుంజు (సమయస్ఫూర్తి)
Telugu Kathalu
Kathalu In Telugu for Kids
అనగనగా ఒక రోజు ఒక అడవిలో ఉన్న నక్కకు చాలా ఆకలిగా అనిపించింది దానికి చుట్టుపక్కలెక్కడ ఆహారం దొరకలేదు ఇప్పుడు నా ఆహారం కోసం ఏం చేయాలి అని ఆలోచించుకుంటూ ఉంటుంటే రాత్రి అయింది ,సరే రాత్రి అయింది కదా ఈ అడవి పక్కన ఉన్న గ్రామంలోకి వెళ్లి ఏమన్నా దొరుకుతుందేమో చూద్దాం అనుకుంటూ పక్కనే ఉన్న గ్రామంలోకి ప్రవేశించింది .
అక్కడ ఒక ఇంటి మీద ఒక కోడిపుంజు కూర్చొని ఉంది దానిని చూడంగానే నక్కకు ఆహా దీనిని ఆహారంగా తీసుకుంటే కొంచెం నా ఆకలి తీరుతుంది అనుకొని కోడిపుంజు ఉన్న ఇంటి దగ్గరికి వెళ్లి ప్రేమగా కోడి బావ.. ఏమిటి చాలా నీరసంగా కనబడుతున్నావ్ సరిగ్గా ఆహారం తీసుకోవడం లేదా ఏమిటి? ఒక్కసారి నా దగ్గరికి రా నీ ఆరోగ్యం ఎలా ఉందో నేను పరీక్షించి చెప్తాను అని తెలివిగా కోడిపుంజుతో అంది.
ఆ మాటలు విన్న కోడి పుంజు ఇంకా తెలివిగా అవును నక్క బావ చాలా నీరసంగా ఉంటుంది ఈ మధ్య ఎంత నీరసంగా అంటే నేను కనీసం ఈ ఇల్లు దిగి నీ దగ్గరికి రాలేనంత అని చెప్పింది . ఆ మాటలు విని కంగుతిన్న నక్క అమ్మో నా పథకాన్ని చాలా తొందరగానే పసిగట్టింది ఇంక ఇక్కడకు ఉండకూడదు అనుకుంటూ నెమ్మదిగా అక్కడినుంచి జారుకుంది.
కోడిపుంజు మాత్రం తన తెలివితేటలకు తానే ఆనందపడుతూ ఇంటి మీద నాట్యం చేసింది.
ఎవ్వరు తక్కువ వారు కాదు ఎవరి తెలివితేటలు వారికి ఉంటాయి కదా… దీనిని సమయస్ఫూర్తి అంటారు.
For more stories please visit: కోతి బుధ్ధి