Small Monkey story for kids in Telugu
Contents
కోతి బుధ్ధి
అనగనగా ఒక చిన్న కోతి పిల్లవుండేది , దాని పేరు బంటి అది ఒక రోజు కడుపు నిండా చెట్టు మీద ఉన్న మామిడి పళ్ళు అన్ని తినేసింది, తిన్నాక దానికి చాలా బోర్ గా అనిపించింది ఏం చేయాలా… ఏం చేయాలా… అంటే దానికి ఒక విషయం గుర్తొచ్చింది ఒకరోజు అడవిలోకి కట్టెలు కొట్టుకోవడానికి వచ్చిన ఒక మనిషి కట్టెలు అన్ని కొట్టాక ఈ చెట్టుక్రింద కూర్చొని తన దగ్గెరవున్న కత్తితో ఒక కట్టెను తీసుకొని మంచి బొమ్మను తయారు చేసాడు అప్పుడు అది చూసినా బంటికి ఆ బొమ్మ చాలా నచ్చింది .
ఇప్పుడు ఆ విషయం గుర్తొచ్చి నేను కూడా అతనిలాగా ఒక బొమ్మ తయారు చేసుకుంటాను అని అనుకొని అనుకున్న వెంటనే ఒక కత్తి తీసుకువచ్చి కొమ్మను నెమ్మదిగా కోయడం మొదలుపెట్టింది
అంతలో అక్కడికి ఒక జింక వచ్చి హేయ్!! బంటి ఏం చేస్తున్నావ్ నువ్వు అని గట్టిగా అడిగింది.
అప్పుడు…
బంటి నేను ఆడుకుంటున్నాను నువ్వు నన్ను ఇప్పుడు ఇబ్బంది పెట్టకు వెళ్ళిపో… అని బంటి ఇంకా గట్టిగా చెప్పింది .
జింకకు కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయింది.
తర్వాత ఒక ఏనుగు వచ్చి బంటి నువ్వేం చేస్తున్నావో నీకు తెలుసా… అని అడిగింది
అందుకు బండి నేను చిన్న పిల్లోడిని ఆడుకుంటున్నాను నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకు అని మళ్లీ గట్టిగా చెప్పింది
ఆ మాటకు ఏనుగు నవ్వుకుంటూ అక్కడ నుంచి వెళ్లిపోయింది.
కొద్ది సేపటికి బంటి వాళ్ళ అమ్మ వచ్చింది వచ్చి రేయ్ నువ్వు ఏం చేస్తున్నావు తెలుసా… ఒక్కసారి ఆగు… అని గట్టిగా అరిచింది . అప్పటికే బంటి కొమ్మ విరిగి కింద పడ్డాడు కొంచెం దెబ్బ కూడా బాగానే తగిలింది.
అప్పుడు బంటి వాళ్ళ అమ్మ బంటి దగ్గరికి వచ్చి ఎవరన్నా బుద్దున్న వాళ్ళు కూర్చున్న కొమ్మను నరుక్కుంటారా అని అడిగింది. అప్పుడు గాని బంటికీ విషయం అర్థం కాలేదు!!.
మనం కూడా అంతే కదా మన చెడ్డ అలవాట్లతో మనకు ఎంతో ఆత్మవిశ్వాసానిచ్చే మన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటాం.
చెడ్డ అలవాట్లు అంటే ఏవో కాదండోయ్ … మెట్లున్న లిఫ్ట్ ఎక్కడం, వండుకోవడానికి బద్దకించి ఇన్స్టంట్ ఫుడ్స్ తినడం, అవుట్ డోర్ లో ఆడే ఆటలు మానేసి ఇంట్లో కూర్చొని హాయిగా వీడియో గేమ్స్ ఆడటం ఇలా అన్నమాట.
Sireesha.Gummadi
For more stories please visit: Stories to read
[…] For more stories please visit: కోతి బుధ్ధి […]