famous stories in telugu volume 4
Spread the love

Contents

Crane and Tortoise /తెలివి తక్కువ తాబేలు

Famous Stories in Telugu Volume 4:

crane and tortoise

 

అనగనగా ఒక ఊరి చివర ఒక చిన్న చెరువు ఉండేది ,ఆ చెరువు లో ఒక తాబేలు నివసిస్తూ ఉండేది.  ఆ చెరువు లో చిన్న చిన్న చేపలను తినడానికి రోజు రెండు కొంగలు వస్తూ ఉండేవి ,ఆ విధంగా తాబేలుకు కొంగలకు మధ్య స్నేహం ఏర్పడింది . ఒకరోజు కొంగలు తాబేలు తో మిత్రమా ఈ చెరువులో నీరు రోజురోజుకి ఎండల వలన ఇంకి పోతున్నాయి, నువ్వు ఇదే విధంగా ఇక్కడ ఉన్నట్లయితే కొంతకాలానికి నువ్వు నివసించడానికి ప్రదేశం లేకుండా పోతుంది అనిచెప్పాయి .

కొంగ మాటలకు  చాలా విచారించిన తాబేలు నాకు మీరు ఏదో విధంగా సహాయం చేయండి అని అడిగింది అప్పుడు కొంగలు ఇక్కడ నుంచి కొంత దూరం లో ఒక పెద్ద చెరువు ఉన్నది దానిలో చాలా తతాబేళ్ళు  చేపలు ఇతర జీవులు చాలా జీవిస్తున్నాయి ,అది సంవత్సరం పొడుగునా నీటితో నిండుగా ఉంటుంది అని చెప్పారు . అప్పుడు తాబేలు నేను ఏ విధంగా అక్కడికి వెళ్ళగలను అని అడుగుతుంది . అప్పుడు కొంగలు  నువ్వు మేము చెప్పిన విధంగా చేసినట్లయితే నిన్ను క్షేమంగా ఆ పెద్ద చెరువు కి తీసుకొని వెళ్తాము అని చెబుతాయి . చెప్పిన విధంగానే మరుసటిరోజు కొంగలు  ఒక పెద్ద పొడవాటి కర్రను తీసుకు వస్తాయి ,అవి తాబేలుతో మిత్రమా మేము ఈ కర్రను చెరొకవైపు  మా నోటితో గట్టిగా పట్టుకుని ఉంటాం . నువ్వు మధ్యలో నీ నోటితో గట్టిగా పట్టుకో ఆ విధంగా మేము గాలిలో ఎగురుకుంటూ నిన్ను చెరువు దగ్గర దింపుతాం అని చెబుతాయి.

బయలుదేరే ముందు కొంగలు నిన్ను చూసి చాలా మంది ఊర్లో ఉన్న  పిల్లలు విచిత్రంగా గొడవ చేస్తారు నువ్వు వారిని పట్టించుకోవద్దు అని హెచ్చరిస్తాయి  తాబేలు సరే అని ఒప్పుకుంటుంది వారు ముగ్గురు ఎగరడం మొదలుపెట్టిన తర్వాత కొంత దూరం వెళ్ళాక తాబేలు గాలిలో వెళ్ళడం చూసి చిన్న పిల్లలు గట్టిగా అరవడం మొదలు పెడతారు మొదటిసారి ఆకాశంలో ఎగురుతూ ఆనందంలో ఉన్న తాబేలు పిల్లలు అరవడం చూసి కొంగలకు కృతజ్ఞతలు చెబుతామని గాలిలో నోరు తెరుస్తుంది అంతే అంత ఎత్తు నుంచి కిందపడి నేలకు గట్టిగా తగిలింది చనిపోతుంది.

Moral :మూర్ఖులను ఎవరూ బాగుచేయలేరు .


Crow and Cotton Bag/ ఎవరు గొప్ప

అనగనగా సీత, గీత అనే రెండు కాకులు ఉండేవి ,అవి రెండు మంచి స్నేహితులు . ఒకరోజు అవి మాట్లాడుకుంటుండగా వారిద్దరిలో ఎవరు ఎక్కువ బలవంతులు, ఎవరు ఎక్కువ ఎత్తు ఎగర గలరు అనే విషయం మీద వారిద్దరికీ చిన్న వాగ్వివాదం నడిచింది. వారి వివాదాన్ని చూసిన మిగిలిన మిత్రులు , మేము మీ ఇద్దరికీ ఒక పోటీ నిర్వహిస్తాము ఆ పోటీలో మీరిద్దరూ రెండు సంచులు నింపుకుని వాటితో సహా ఎగరవలసి ఉంటుంది ,ఎవరు అయితే ఎక్కువ ఎత్తు ఎగరగలరో  వారే  విజేతలవుతారు అని మిగిలిన పక్షులు చెబుతాయి.

మరుసటి రోజు పోటీ ప్రారంభమయ్యే సమయానికి సీత గెలవాలనే ఉద్దేశ్యం  ఉండి ,తన సంచిని తేలికగా వుండే దూదితో  నింపుతుంది.  గీత పక్షులన్నీ చెప్పిన విధంగా తను నీతి గా ఉండాలని సంచి నిండా  ఉప్పు నింపుకుంటుంది .  పోటీ ప్రారంభమయ్యే సమయానికి రెండూ  ఒకచోట నుండి ఎగరడం మొదలుపెట్టాయి . సీత సంచిలో వున్నది దూది కనుక అది తేలికగా ఉంటుంది కనుక  సీత ఎక్కువ ఎత్తు ఎగరగలిగింది  కానీ గీత సంచిలో వున్న ఉప్పు బరువు వలన అది ఎక్కువ ఎత్తు  ఎగరలేక పోయింది.

కొంత సమయం గడిచే సరికి  వర్షం రావడం ప్రారంభించింది అప్పుడు వర్షం నీటిలో తడచిన సీత సంచి లో ఉన్న దూది  అంతా నానిపోయి దాని బరువు పెరగడం ప్రారంభించింది.,అంత బరువుతో సీత ఎక్కువ ఎత్తు ఎగరలేక పోయింది కానీ  గీత సంచి లో ఉన్న ఉప్పు నీరు పడేసరికి కరిగిపోవడం ప్రారంభించింది అందువలన సంచి మొత్తం  ఖాళీ అయి పోవడం వలన అది తేలికగా పైకి ఎగిరింది. ఆ విధంగా గీత నీతిగా తమ పందెం లో గెలిచింది సీత తన చెడ్డ ఆలోచనలు వల్ల గెలవలేకపోయింది.

అప్పుడు సీత గీత తో మిత్రమా నేను నిన్ను ఓడిద్దామని ఉద్దేశంతో ఒక తప్పు నిర్ణయం తీసుకున్నాను అందువల్లనే నేను ఇప్పుడు ఓడిపోయాను అని అంటుంది అప్పుడు గీత మిత్రమా మనం ఎప్పటికీ మంచి స్నేహితులం ఇటువంటి పోటీలు మన స్నేహాన్ని విడదీయ లేవు అని చెబుతోంది అప్పటినుండి వారిద్దరూ మరింత స్నేహంగా కలసి మెలసి ఉంటారు ఇంకెప్పుడు ఎటువంటి వివాదాలు పెట్టుకోరు.

Moral : నీతి మంతులు ఎప్పటికైనా గెలుస్తారు .


Two Pots / రెండు కుండలు

two pots story

గోపయ్య రోజూ  తన కావిడిలో రెండు మట్టి కుండలు పెట్టుకొని చెరువు దగ్గరికి వెళ్లి వాటితో నీరు తీసుకువచ్చే వాడు. అయితే ఒకరోజు వాటిలో ఒక కుండకు చిన్నదెబ్బ తగిలి దానికి రంధ్రం ఏర్పడింది. అప్పటి నుండి రంధ్రం పడిన కుండలో నీరు నింపిన అప్పటినుండి కొంచెం కొంచెం గా నీరు కారుతూ ఉండేది దానిని చూసి వేరొక కుండ అయ్యో నువ్వు చూడడానికి ఎలా అయిపోయావు..  పైగా నీ నుండి నీరు కారుతూ నే ఉంది ,నువ్వు ఇప్పుడు యజమానికి ఏ విధంగా ఉపయోగపడవు నిన్ను అనవసరంగా రోజూ  చెరువు కి తీసుకువచ్చి నీరు నింపి మళ్లీ నిన్నుమోసుకొనికి వెళుతున్నాడు.  నీలో ఉన్న నీరు మొత్తంరంద్రం  గుండా పోయి వృధా ఐపోతుంది ఇకపై  నువ్వు ఎవరికీ  ఉపయోగపడవు అని దానిని రోజు అవహేళన చేస్తూ ఉండేది.

ఒక రోజు చాలా బాధగా అనిపించి తన యజమానితో నన్ను నువ్వు ఇంకా ఎందుకు ఉపయోగిస్తున్నావు  నా స్థానంలో వేరొక కొత్త కుండను తెచ్చుకున్నట్లు అయితే నీ శ్రమ వృధాగా పోదు..  నీరు కూడా వృధాగా పోదు…  అని బాధపడుతూ ఉంటుంది . అప్పుడు యజమాని నవ్వుతూ మనము వచ్చే మార్గమంతా పువ్వులతో పచ్చగా ఉంది చూసావా ఆ పచ్చదనం అంతా నీ వల్లనే వచ్చింది.  రోజూ నీ నుండి  నీళ్లు క్రిందకు కారడం  వలన ఆ ప్రదేశంలో ఉన్న మొక్కలు  అన్నీ చాలా అందంగా పెరిగాయి .

మరొక కుండ వున్న వైపు చూపెడుతూ , ఇటువైపు ఎటువంటి మొక్కలు లేవు ఎందుకంటే ఆ కుండ నుంచి ఎటువంటి నీరు కింద పడటం లేదు. అందువలన నువ్వు రోజు నాకు భారం గా ఉన్నావ్ అని భావించవద్దు ఎందుకంటే  ఇటు వైపు ఉన్న పచ్చని మొక్కలన్నీ  బ్రతకడానికి ఇన్ని  రంగులలో  పువ్వులు పూయడానికి  నువ్వే కారణం నీ నుండి వచ్చే నీరు అంత ఉపయోగ కరంగా ఉంది . పైగా ఇక్కడ ఉన్న పువ్వులను ప్రజలందరూ మాలగా కట్టి దేవునికి వేస్తున్నారు అంటే నీ ద్వారా వృధా గా పోయే నీరు ఎంతమందికి ఉపయోగకరంగా ఉందో నువ్వే ఆలోచించు అంటాడు.  అప్పుడు పగిలినకుండా  ఎంతో ఆనందిస్తుంది, వీరి మాటలు విన్న వేరొక కుండ ఈ కుండను  క్షమించమని అడుగుతుంది.

Moral :   కాదేది అనర్హం


Crow and Cheese/ కాకి జున్నుముక్క

అనగనగా ఒక రోజు ఒక కాకి కి జున్నుముక్క దొరుకుతుంది . అది ఆ జున్ను ముక్క ను తన నోటితో పట్టుకుని ఒక చెట్టు కొమ్మ మీద నుంచొని తిందామని ఆలోచిస్తూ ఉంటుంది.  అంతలో  అక్కడికి బాగా ఆకలిగా ఉన్న ఒక నక్క వస్తుంది ,ఆ నక్క కాకి నోటిలో ఉన్న జున్నుముక్క చూసేసరికి దాని ఆకలి ఇంకా పెరిగిపోతుంది.

అబ్బా! జున్నుముక్క ఎంత బాగుందో దీనిని ఎలాగైనా నేనే తినాలి అనుకుంటుంది అనుకున్నదే  తడవుగా  కాకి దగ్గరకు వెళ్లి కాకి బావ..  కాకి బావ…  నువ్వు పాటలు చాలా బాగా పాడతావు కదా అంటుంది అప్పుడు కాకి ఏమీ మాట్లాడకుండా అలాగే  వింటూ ఉంటుంది.  అప్పుడు నక్క నాకు తెలుసులే కాకి బావ నీకు పాటలు చాలా బాగా వచ్చు అంట నీ పాటలు వినడానికి నేను ఇక్కడకు వచ్చాను అని అబద్ధపు మాటలు చెబుతోంది .

కాకి నక్క మాటలు విని నా పాటలు అంత బాగున్నాయా! సరే నేను యిప్పుడు  ఒక పాట పాడతాను అనుకొని అప్రయత్నంగా నోరు తెరుస్తుంది అంతే నోటిలో ఉన్న జున్నుముక్క నేలపై పడుతుంది.  కింద పడిందే  తడవుగా నక్క గబగబా వచ్చి జున్నుముక్క తినేస్తుంది జరిగిన విషయం అప్పటికి గానీ అర్థం అవ్వని కాకి  ఏం చేస్తుంది పాపం, తన జున్నుముక్క నక్కకు ఆహారం అయిపోయింది కదా…

Moral :మోసపోయేవాళ్లు వున్నంతకాలం మోసం జరుగుతూనే ఉంటుంది .


Fox and Crane / నక్క మరియు కొంగ

fox and crane

ఒక అనగనగా ఒక అడవిలో ఒక కొంగ ఒక నక్క మంచి స్నేహితులు అవి ఎప్పటినుంచో కలిసి మెలసి ఉండేవి ఒకరోజు నక్క తన స్నేహితుడైన కొంగను విందుకు ఆహ్వానించింది.  కొంగ స్నేహితుడు విందుకు  ఆహ్వానించినందుకు చాలా సంతోషపడి నక్క ఇంటికి వెళ్ళింది . నక్క ఇంటిలోకి ప్రవేశిస్తూనే అక్కడ వండిన వంటకాల వాసనతో కొంగ బావ  లో ఆకలి మరింత పెరిగింది ఎలాగన్నా కడుపునిండా రుచికరమైన ఆహారం తిందామనే  ఉద్దేశ్యం తో  ఇంటి లోపలికి నడిచింది .

అక్కడ విందు ఏర్పాటు చేసిన చోట అన్నీ  పళ్ళాలు ఉండడంతో కొంగకు ఏవిధంగా అక్కడున్న రుచికరమైన పాయసం తినాలో  అర్థం కాలేదు ,కొంగ తనముక్కు తో ఆహారం తిందాం అని ఎంత ప్రయత్నించినా కుదరలేదు  చాలా బాధ పడింది ఏ  మాత్రం కొంచెం అయినా ఆహారం తినకుండా విచారంగా నక్క ఇంటిలో నుంచి బయటికి వచ్చేసింది .

మరుసటి రోజు కొంగ నక్క బావ చేసిన అవమానానికి ఎలాగైనా దానికి బుద్ధి వచ్చేలా చేద్దామనే ఉద్దేశ్యం తో నక్క బావను తన ఇంటికి  విందుకు ఆహ్వానించింది,. కొంగ  కూడా చక్కని పాయసాన్ని తయారుచేసింది నక్కబావ విందు కోసం ప్రవేశించినప్పుడు అక్కడ ఉన్న పాత్రలన్నీ పొడవైన కూజా ఆకారం లో  ఉన్నాయి వాటిలో ఉన్న పాయసాన్ని తాగాలంటే నక్కకు అసలు అనువుగా అనిపించలేదు చాలా ప్రయత్నం చేసి చేసి అలిసిపోయి , కొంగతో  మిత్రమా! నువ్వు నన్ను ఈ విధంగా అవమానించడం  ఏవిధంగా భావ్యం  అని అంటుంది . అందుకు కొంగ మిత్రమా నిన్న మీ ఇంటిలో నేను ఏ విధంగా అవమాన పడ్డానో  నీకుతెలియచేద్దామనే  ఉద్దేశ్యంతో నేను ఈ విధంగా చేశాను అని చెబుతోంది కొంగ మాటలకు జరిగిన విషయం అర్థం చేసుకున్న నక్క కొంగ ని క్షమాపణలు కోరింది . అప్పుడు కొంగ ఒక పళ్ళెం నిండుగా పాయసం తీసుకువచ్చి నక్క ముందు ఉంచుతుంది , నక్క ఆనందంగా కడుపునిండా పాయాసం తిని మరొకసారి మిత్రునికి క్షమాపణలు చెప్పింది.

Moral :సందర్భానుసారంగా  ప్రవర్తించాలి . 


Cap Seller and Monkey/ కోతి -టోపీల వ్యాపారి

అనగనగా ఒక టోపిల వ్యాపారి ఉండేవాడు  అతను రోజూ ఒక అడవి దాటి వేరే ఊరికి వెళ్లి అక్కడ సంతలో టోపీలు అన్ని అమ్మి వచ్చిన డబ్బులతో తన జీవనం సాగిస్తూ ఉండేవాడు.  ఒక రోజు టోపీలన్ని సంచిలో పెట్టుకుని అడవి గుండా వెళుతూ ఉంటాడు, చాలా దూరం నడిచాక అలసటగా అనిపించి ఒక చెట్టుకింద ఆగి తను తెచ్చుకున్న ఆహారం కడుపు నిండా తిని కొంచెం సేపు నిద్ర పోతాడు .

అతను నిద్ర లేచి చూసేసరికి తన సంచిలో ఒక్క టోపీ కూడా ఉండదు ఆశ్చర్యంగా కంగారుగా చుట్టుపక్కల అంతా వెతుకుతాడు ఎక్కడా కనబడవు.  అసలు టోపీలన్ని ఎవరు తీసుకున్నారు అనుకుంటూ చెట్టు పైకి చూస్తాడు  చెట్టు మీద వున్న కోతులు అన్ని  తన టోపీలు పెట్టుకుని కనబడతాయి అతనికి ఏం చేయాలో అర్థం కాదు. క్రిందవున్న రాళ్లు తీసుకుని ఒక్కొక్క రాయి ని కోతులపై విసరడం ప్రారంభిస్తాడు కానీ కోతులు ఆ రాళ్లను తమ చేత్తో పట్టుకొని మళ్ళీ అతని మీద విసరడం మొదలుపెడతాయి .

అతనికి అప్పుడు ఒక అద్భుతమైన ఆలోచన వస్తుంది ,  తన తలపై మిగిలిన ఒకే ఒక టోపీని చేత్తో పట్టుకుని కోతుల మీదకి విసురుతాడు అంతే కోతులన్నీ తమ తలపై నున్న టోపీలు అతని మీదికి విసురుతాయి వెంటనే అతను కింద పడిన టోపీలు అన్నీ తన సంచిలో వేసుకొని  భగవంతుడా రక్షించావు అనుకుంటూ సంతకు బయలుదేరుతాడు.

Moral :సమయ స్పూర్తితో ఎటువంటి సమస్య నుండి అయినా బయట పడవచ్చు .

For more famous stories please visit: Old stories in telugu


 

Lazy Grasshopper /సోమరి మిడత

 

lazy grasshopper

 

ఒక అడవిలో ఒక చిన్న ప్రాంతంలో ఒక మిడత ఉండేది . అది రోజంతా ఆడుతూ పాడుతూ తన కాలం గడిపేది ఆకలి వేసినప్పుడు దానికి ఆ సమయంలో ఏది దొరికితే అది తింటూ జీవితం గడిపేది .  ఒక రోజు అది చెట్టు మీద ప్రశాంతంగా కూర్చొని సేదతీరుతున్నప్పుడు అటుగా వెళుతున్న చీమల దండు ని చూసి మీరు ఏం చేస్తున్నారు? అని అడిగింది.  అందుకు అవి రాబోయేది చలికాలం ఆ కాలంలో మాకు ఆహారానికి ఎటువంటి గింజలు దొరకవు అందుకు మేము ఇప్పటినుంచి వాటిని సేకరిస్తున్నామని అని చెప్పాయి .  అప్పుడు మిడత గట్టిగా నవ్వి, చలికాలం వస్తే ఆహారం దొరకదు అని ఇప్పటి నుంచి పని మొదలు పెట్టారా…  మీరు ఎంత పిచ్చి వాళ్ళు…  అని అవహీలన చేస్తుంది .

అప్పుడు చీమల లో పెద్దదైన ఒక చీమ మాకే  కాదు నీకు కూడా ఆహారం కొరత ఏర్పడుతోంది అందుకు నువ్వు కూడా ఇప్పటి నుంచి ఆహారాన్ని సేకరించి భద్రంగా దాచి పెట్టుకో అని చెప్తుంది ,కానీ వారి మాటలను మిడత లక్ష్య పెట్టలేదు.  అలా రోజులు గడిచాక చలికాలం మొదలయింది ,చీమలు వారి స్థావరం లో జాగ్రత్తగా ఉంటూ వారి ఆహారాన్ని తింటూ జీవించసాగాయి .

మిడతకు మాత్రం చలికాలం ఎక్కడ ఆహారం దొరకక చలికి తట్టుకోలేక ప్రాణం పోయే విధంగా ఉండి ఎవరైనా సహాయం చేస్తే బాగుండు అనుకుంది అదే సమయానికి దానికి చీమలు గుర్తుకు వచ్చాయి కానీ వారి దగ్గరికి వెళ్లి ఆహారం అడగాలంటే చాలా మొహమాటంగా అనిపించింది ,చీమల ఉండే నివాసానికి దగ్గరకు వెళ్లి మళ్లీ వెనుదిరిగింది . మిడత అలికిడికి గమనించిన చీమలు మిడతను  వారి ఇంటిలోకి ఆహ్వానించి దానికి అవసరమైన ఆహారాన్ని అందించాయి .  ఆహారం తిన్న తర్వాత కొంచెం ఓపిక వచ్చింది మిడతకు ,అప్పుడు అది  చీమలతో నన్ను మీరు మన్నించాలి మీరు ఆ రోజు చెప్పిన విషయం నాకు అర్థం కాలేదు కానీ ఈరోజు ఇంత బాధ భరించాక  నాకు అర్థం అయ్యింది  ఇక మీదట నేను కూడా నీలాగ ఆహారాన్ని ముందుగానే సేకరిస్తాను  అని చెప్పింది ,మిడతలో మార్పును చూసి చీమలన్నీ ఆనందించాయి .

 Moral :దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టు కోవాలి .


 

 

Dog with Bone/ కుక్క -ఎముక

 

dog with bone

  ఒకరోజు ఒక కుక్క ఆహారం కోసం అటూ ఇటూ తిరుగుతూ ఊరంతా పరిగెడుతూ ఉంది . దానికి ఒక చోట ఒక మాంసపు ఎముక కనబడింది, ఆత్రంగా దాని దగ్గరికి వెళ్లి దానిని నోటితో కరచుకొని ఎక్కడన్నా ప్రశాంతంగా ఉండి తిందామని పరిగెట్టుకుంటూ ఒక చెరువు దగ్గరికి వెళ్ళింది . చెరువు దగ్గర ఒక వంతెన మీద కూర్చొని ఉంది అంతలో నీటిలో దాని ప్రతిబింబం దానికి కనబడింది కానీ ఆ కుక్కకు నీటి లో ఉన్నది తన  ప్రతిబింబం అని అది గుర్తించలేదు . అది వేరే ఒక కుక్క అని  భావించింది, దానికి నీటిలో ఉన్నకుక్క  చాలా కోపంగా ఉన్నట్లు అనిపించింది ,దీనికి కూడా ఎవరో నన్ను కోపంగా చూస్తున్నారని దీనికి కూడా చాలా కోపం వచ్చింది .

నీటిలో ఉన్న కుక్క ను ఎలాగన్నా భయపెట్టాలని అది భావించి గట్టిగా అరుద్దామని  నీటి వైపు చూస్తూ నోరు  తెరిచింది ,అంతే నోట్లో ఉన్న ఎముక వెళ్లి నీటిలో పడిపోయింది . కుక్క కు చెప్పలేనంత బాధ అనిపించింది కానీ ఏం చేస్తాం దొరికిన ఆహారం తినకుండానే చేజారి పోయింది .

Moral :తన కోపమే తన శత్రువు


Ugely Duckling / అందవికారమైన బాతు

ఒక అడవిలో బాతు  ఒకటి ఉండేది ,అది ఎన్నో రోజులుగా తన గుడ్ల నుంచి పిల్లలు ఎప్పుడు బయటకు వస్తాయా అని ఎదురు చూస్తూ ఉంటుంది . ఒకరోజు ఆ సమయం రానే వస్తుంది అప్పుడు అన్ని గుడ్ల నుంచి  తెల్లగా ఉన్న బాతు పిల్లలు బయటకు వస్తాయి కానీ ఒక గుడ్డు నుంచి మాత్రం బూడిద రంగులో ఉన్న బాతుపిల్ల బయటకు వస్తుంది. తల్లికి రంగుతో సంబంధం లేదు అందరు బిడ్డలు తన బిడ్డలే కాబట్టి అన్ని బాతు పిల్లలకు సమాన ప్రేమ అందిస్తుంది . కానీ మిగిలిన బాతు పిల్లలు బూడిద రంగులో ఉన్న బాతు పిల్లలు చూసి అసహ్యించుకుంటూ  ఉంటాయి నీ రంగు బాగోలేదు మేము నీతో ఆడుకోము  అని బాతుపిల్ల ను భాదపెడుతూ   దానిని దూరంగా ఉంచుతాయి .

ఎప్పుడు వారితో కలిసి ఆడుకోవాలని ప్రయత్నించినా  మిగిలిన బాతు పిల్లలు బూడిదరంగు పిల్లను దగ్గరకు రానివ్వరు, ఇంక అటువంటి ప్రదేశంలో ఉండటం ఇష్టంలేక దూరంగా వెళ్లి పోతుంది .

బూడిదరంగు బాతుపిల్ల  ఒక చెరువు గట్టున కూర్చొని బాధపడుతూ ఉంటుంది అప్పుడు  ఆ చెరువు దగ్గరకు ఒక వ్యక్తి వస్తాడు ఆయన బాతుపిల్ల ను  చూసి ఇష్టపడి దానిని ఇంటికి తీసుకువెళ్లి చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు . ఏ ఒక్క రోజు ఇంటి నుండి బయటకు రావడానికి బాతుపిల్ల ఇష్టపడదు , అలాగే తన యజమానితో పాటూ ఇంటిలో నే ఉంటుంది.అలా చాలా రోజులు గడుస్తాయి.  ఒక రోజు తన యజమాని బయటికి వెళ్లి ఎంతకీ రాకపోయేసరికి యజమానిని వెతకడానికి బయటకు వస్తుంది.  యజమాని ఎప్పుడూ  చెరువు వద్దకు వెళ్తాడు కనుక యజమాని ని వెతుక్కుంటూ చెరువు దగ్గరకు వెళ్తుంది, దూరంగా తన యజమాని కనబడేసరికి ఎంతో ఆనందిస్తుంది.

ఈలోపు అక్కడ చెరువులో కొన్ని హంసలు వెళ్ళడం చూస్తుంది, ఆహా! ఈ హంసల గుంపు ఎంత అందంగా ఉంది..  నేను మాత్రమే ఎందుకు  అందవికారంగా ఉన్నాను అని బాధపడుతూ తన రూపాన్ని చెరువులో నీటిలో చూసుకుంటుంది . ఆశ్చర్యంగా అది  హంసల రూపాన్ని కలిగి ఉండడంతో… దానికి విషయం అర్థమవుతుంది . ఓహో నేను  హంస అందుకే చిన్నతనంలో నా రూపం బాతురూపాన్ని  పోలి లేదు కానీ ఆ విషయం నాకు అర్థం కాక నా రూపాన్ని నేనే తిట్టుకుంటూ ఇన్ని రోజులు చాలా బాధపడ్డాను.  నేను ఎంత తప్పు చేశాను అని తనలో తాను అనుకొని, చెరువు దగ్గరకు వచ్చిన హంసల గుంపు తో  తన కూడాకలిసి  ఆనందంగా వెళ్ళి పోతుంది.

Moral : ఎవరి ప్రత్యేకత వారిది ,ఎవరిని వారు కించపరచుకోకూడదు .

 

ఈ కథలు అన్ని మనం చిన్నతనం నుండి విన్నవే కానీ ఇప్పటి తరానికి మళ్ళీ పరిచయం చేద్దాం అనే ఉద్దేశ్యంతో రాసాను . ఇంకా మీకు గుర్తువున్న పాత కథలు ఏమన్నా ఉంటే comment రూపం లో గుర్తుచేయగలరు.

 

 

 

 

 

One thought on “Famous Stories in Telugu Volume 4”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!