King and Golden Mango Story in Telugu"నిర్ణయం"
Spread the love

Contents

నిర్ణయం

 

అనగనగా కొంతకాలం క్రితం మహంతి రాజ్యాన్ని సముద్రపాలుడు పరిపాలించేవాడు, తన తాత తండ్రుల నుంచి అమితమైన సంపాదన కలిగి ఉండడం వలన రాజ్యం ఎప్పుడూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా సమృద్ధిగా ఉండేది. కనుక సముద్రపాలుడికి ఎప్పుడూ పెద్దగా పరిపాలన విషయాల్లో ఇబ్బందులు ఉండేవి కాదు. ఆయన సంవత్సరంలో ఎక్కువ కాలం కొత్త కొత్త ప్రదేశాలకు విహారయాత్రలకు వెళ్తూ కొత్త కొత్త వస్తువులను సేకరించి తన రాజ్యానికి తీసుకువచ్చేవాడు.

అలా రోజులు గడుస్తున్నప్పుడు…

ఒక రోజు సాయంత్రం సముద్రపాలుడు తన ఉద్యానవనంలో నడుస్తూ ఉంటుండగా తనకు ఆలోచన తట్టింది అసలు బంగారు మామిడి పళ్ళు ఏ చెట్టు కన్నా కాస్తాయా అలా కాస్తే అవి ఏ విధంగా ఉంటాయి అనే ఆలోచన తనకు మెదిలింది, అనుకున్నదే తడవుగా తన మంత్రిని పిలిచి ఎవరైతే బంగారమామిడి పళ్ళు తీసుకొని వస్తే వారికి నా రాజ్యంలో సగభాగాన్ని ఇస్తానని చాటింపు ఇవ్వండి అని చెప్పాడు. రాజు గారి వింత ఆలోచన ,ఆయన విచిత్రమైన నిర్ణయాన్ని విన్న మంత్రి మహారాజా ఇది సరైన ఆలోచనైనా అని ప్రశ్నించాడు అందుకు సముద్రపాలుడు రాజు ఆజ్ఞ ఎవరన్నా వినవల్సిందే అని కొంచెం కఠినంగా సమాధానం చెప్పాడు తర్వాత సముద్రపాలుడు తన మనసులో అసలు అటువంటి ఫలాలు ఎక్కడన్నా ఉంటే ఈపాటికి నేను చందరించే వాడిని కదా అటువంటి ఫలాలు కచ్చితంగా ఎక్కడా ఎవరికీ దొరకవు అని అనుకుంటూ తన రాజమంద్రానికి వెళ్లిపోయాడు.

కొన్ని రోజులు గడిచాక ఒక సాయంత్రం రాజుగారు ఇక విశ్వమిద్దామని అనుకుంటుండగా ఒక సైనికుడి వచ్చి మహారాజా మీతో మాట్లాడాలని పొరుగు దేశం వారు వచ్చారు మీతో మాట్లాడాలని కొంతమంది పురుగు దేశం వారు వచ్చారు అని చెప్పాడు అందుకు మహారాజు లేదు ఈ సమయంలో నేను ఎవరితోనూ మాట్లాడను అని చెప్పి పంపించేశాడు మరికొంతసేపటికి అదే వ్యక్తి వచ్చి మహారాజా వారు మీకు అవసరమైన బంగారు మామిడి పళ్ళు తీసుకువచ్చామని చెప్పమన్నారు అని చెప్పాడు సముద్రపాలుడికి బంగారు మామిడి పళ్ళు అనేసరికి చాలా అసహనంగా అనిపించింది ఏమిటి నిజంగా వీరు బంగారు మామిడి పళ్ళు తీసుకొచ్చారా… అని మనసులో అనుకొని సరే వారిని వెంటనే నా దగ్గరికి తీసుకురా అని అతనికి ఆజ్ఞాపించాడు.

కొంత సమయం గడిచాక….

ఆ సైనికుడు ఒక పది మంది వ్యక్తులు వారి ఒక్కొక్కరి చేతిలో ఒక్కొక్క బంగారు మామిడి పండుతో రాజుగారి తోట లోనికి తీసుకొని వచ్చాడు, వారిని చూస్తూనే రాజు గారికి ఒళ్లంతా చెమటలు పట్టాయి అయ్యో !!నేను ఇటువంటి చాటింపు వేయించానేమిటి ఇప్పుడు ఈ పదిమందికి నా అర్ధరాజ్యాన్ని అప్పజెప్పాలా అనుకుంటూ సందిగ్ధం పడ్డాడు.
వారిని దగ్గరికి పిలిచి మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగాడు అందుకు వారు మహారాజా మీ శత్రురాజ్యమైన గరుడ రాజ్యం నుంచి వచ్చాము మా దగ్గర ఈ బంగారు మామిడి పండ్లు విరివిగా పండుతాయి మీకు ఆ విషయం తెలియక చాటింపు వేశారేమో అని మేము భావించాము, కానీ ఎన్నాళ్ల నుంచో మా రాజు గారి కి మీ రాజ్య ఆక్రమణ గూర్చి వున్న కోరికకు తగ్గట్టుగా మీ చాటింపు ఉండడంతో మేము మీ రాజ్యంలో సగభాగాన్ని పొందాలని ఉద్దేశంతో ఈ మామిడి పండ్లు తీసుకువచ్చాము అని చెప్పారు.

అంతా వింటున్న సముద్రపాలుడికి కాళ్ళ కింద ఉన్న భూమి అంతా కదిలినట్టుగా అనిపించింది, అతను తనలో ఉన్న భావాలన్నీ వారికి కనపడకుండా దాచి వారితో, మీరు ఈ రాత్రికి ఇక్కడే విశ్రాంతి తీసుకోండి ఉదయాన్నే నేను మీకు బహుమానాన్ని అందజేస్తాను అని చెప్పి వారిని అక్కడ నుంచి పంపించాడు .

వెంటనే….

సముద్రపాలుడు తన మంత్రిని పిలిపించి జరిగిన విషయం అంతా చెప్పి మహామంత్రి చాలా పెద్ద తప్పు చేశాను… నా అనాలోచిత ఆలోచన వలన మన అర్థరాజ్యం శత్రురాజ్యం పాలవుతుంది మీరే ఏదన్న ఉపాయం చెప్పి మన రాజ్యాన్ని నన్ను ఆదుకోండి అని వేడుకున్నాడు. అప్పుడు మంత్రి మహారాజా మీరు కంగార పడవలసిన విషయం దీనిలో ఏమీ లేదు మీరు ముందు ధైర్యంగా ఉండండి అని చెప్పాడు.

అందుకు సముద్రపాలుడు అదేంటి ఈ విధంగా మీరు అంత సులభంగా ఎలా మాట్లాడుతున్నారు అని అన్నాడు, అందుకు సముద్రపాలుడు చిన్నగా నవ్వి మహారాజా వారందరూ శత్రు రాజ్యం నుంచి వచ్చిన వారు కాదు మన భటులలోని కొందరికి అలా వేషం వేసి మన రాజ్యంలో తోటలోని మామిడి పండ్లకు బంగారు పూత పూయిఁచి మీ దగ్గరకు పంపించాను అదంతా నా ఏర్పాటు, మీరు మన ప్రాణమైన రాజ్యం గురించి దానిని బహుమానంగా ఇవ్వడం గురించి అంత చులకనగా మాట్లాడడంతో మీకు రాజ్యం కోల్పోవడం వలన కలిగే బాధ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ విధంగా ఏర్పాటు చేశాను, నేనేమన్నా తప్పు చేసి ఉంటే క్షమించండి అని రాజు గారిని వేడుకున్నాడు.

జరిగిన విషయం అంతా అర్థం చేసుకున్న సముద్రపాలుడు ఆనందం తట్టుకోలేక మంత్రిని గట్టిగా ఆలింగనం చేసుకొని నన్ను క్షమించండి మంత్రిగారు నేను మీ అంత ముందు చూపుతో తెలివిగా ఆలోచించ లేకపోయాను, మీ చక్కని ఆలోచన వలన నాకు మన రాజ్యం యొక్క విలువ, క్షణిక ఆవేశం లో తీసుకొనే నిర్ణయాల వలన కలిగే ఆపదలు కూడా తెలిసి వచ్చాయి ఇకపై ఎప్పుడు ఇటువంటి నిర్ణయాలు తీసుకోను అని చెప్పి మంత్రికి మరొక్కసారి అభినందనలు తెలియజేశాడు.

 

Gummadi.sireesh

కాకి కుందేలు నీతి కథ:

error: Content is protected !!