Life Quotations Telugu
1. చుట్టూ ఎంత నెగెటివిటీ ఉన్నా…
నువ్వు అనుమతిస్తే తప్ప
అది నీ కాలి గోటిని కూడా తాకలేదు.
2. గతాన్ని వదిలేయ్..
బాధను వదిలేయ్..
భయాన్ని వదిలేయ్..
బద్దకాన్ని వదిలేయ్..
గుండెలు నిండా ధైర్యాన్ని నింపుకొని ఆత్మవిశ్వాసంతో ఒక్క అడుగు ముందుకు వెయ్యి
నీ బంగారు భవిష్యత్తు కోసం
3. 100 స్నేహాలతో పనిలేదు.. కడదాకా నిజాయితీగా నిలిచి ఉండే ఒక్క స్నేహం చాలు.
4. మన సంతోషం అనే ఖజానాకు మనమే హక్కుదారులుగా ఉండాలి. దాని తాళాన్ని ఇతరులకు అందించకూడదు.
5. నీలోనూ ఒక ఉన్నతమైన వ్యక్తి ఉన్నాడు బాహ్య ప్రపంచం కోసం అతని స్థాయి తగ్గించకు.
6. పిల్లల భవిష్యత్తు అద్భుతంగా ఉండాలంటే.. తల్లిదండ్రుల ప్రవర్తన అత్యద్భుతంగా ఉండాలి.
7.అబద్ధం అనే విషం.. కొండంత నమ్మకాన్ని చంపేస్తుంది.
8. ఈ క్షణం నువ్వు పడే కష్టం క్షమా నీ బంగారు భవిష్యత్తు కోసం నువ్వు పెడుతున్న పెట్టుబడి.
ఆనందంగా కష్టపడు నమ్మకంగా ఉండు.
9. నీకు ఆపద అవసరం వచ్చినప్పుడు ఎవరు అండగా ఉంటారో.. వారు మాత్రమే ఆప్తులు.
10. విలువ లేని వాళ్ళ దగ్గర విలువలు ఆశించకు.
నీకు విలువిచ్చే వారితో విభేదించకు.
11. మన వయస్సు పెరుగుతున్న కొద్దీ ఎదుటివారు మనలను గౌరవించాలనే ఆశ నెరవేరాలంటే… మన ప్రవర్తన మాటలు కూడా మన వయస్సుకు తగ్గట్టుగా గౌరవప్రదంగా ఉండాలి.
12.ప్రయత్నాన్ని ఆపిన రోజే నువ్వు ఓడిపోయినట్టు.
Contents
లైఫ్ కొటేషన్స్ తెలుగులో…
13. ఇతరులతో నిన్ను పోల్చుకున్న క్షణమే. నీ ఆనందానికి ఆఖరు క్షణం.
14. ప్రపంచమంతా కాదన్నా నీతో ఉండేది నీ నీడే.
అంటే నువ్వే…
నువ్వే నీ ధైర్యం..
నువ్వే నీ సైన్యం…
ఒంటరిగా పోరాడు..
గెలిచే వరకు!!
15. ఎవరి వ్యక్తిత్వాలు వారివి
ఎవరి ఆలోచనలు వారివి
అందరినీ ఒక తాటిపై తీసుకురావాలనుకోవడం మూర్ఖత్వం.
16. ద్వేషం,కోపం, ఈర్ష
ఇవి కదా నీ ప్రథమ శత్రువులు
వేరొకరిని నిందిస్తావెందుకు మరి
17. ఎవరో అవహేళన చేస్తున్నారని ఆగకు
నీ అవసరంలో ఏ ఒక్కరు అక్కరకు రారు
నువ్వు నమ్ముకున్న కష్టం తప్ప.
18. సమస్తం నీలోనే ఉంది బయట వారెవరూ నిన్ను ప్రభావితం చేయలేరు నువ్వు అనుమతిస్తే తప్ప.
19. మనల్ని మనమే మార్చుకో లేనప్పుడు పక్కవారిలో ఆ మార్పు ఆశించడం ఎంతవరకు సమంజసం.
20. ప్రపంచం నిన్ను నమ్మాలంటే ఆత్మవిశ్వాసంతో ఉండు. నీకు ఆత్మవిశ్వాసం రావాలంటే ముందు నిన్ను నువ్వు నమ్ము.
21. డబ్బును పొదుపు చేసిన వాడు జీవితంలో ఎదుగుతాడు.
మాటను అదుపుగా వాడేవారు సమాజంలో ఎదుగుతారు.
Life Quotations Telugu..
22. కష్టంలో కూడా మంచి ఉంది.
అది ఒంటరి పోరాటాన్ని నేర్పిస్తుంది.
మనలోని ధైర్యాన్ని మనకు పరిచయం చేస్తుంది.
ముఖ్యంగా మనవారు ఎవరో పరాయి వారెవరో స్పష్టంగా తెలియజేస్తుంది.
23. మన సమస్య ఇతరులది అని భావిస్తే…
ప్రతి సమస్యకు పరిష్కారం సులువుగా దొరుకుతుంది.
24. మన దగ్గర లేనిది మనం పంచలేనిది అది ప్రేమైనా స్నేహమైనా ఎదుటివారి నుంచి ఆశించడం ఎంత వరకు సబబు.
25. విశ్వాసం అనేది వెలకట్టలేనిది దానికి విలువ ఇవ్వడం నేర్చుకుందాం.
26. ఎవరిలోనైనా లోపాలు సరిదిద్ద గల సామర్థ్యం మీలో ఉంటేనే…
వాటిని విమర్శించండి.
27. ఆశ ఆశయానికి ఆరంభం అయితే…
అత్యాశ పతనానికి ప్రారంభం…
28. మనలను కష్టపెట్టిన వాళ్ళని ఎలా మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంతామో.. అలాగే మన కష్టాల్లో మనకు తోడుగా ఉందిన వాళ్ళను కూడా గుర్తు చేసుకోవడం మన బాధ్యత.
29. ఆశ మనిషిని బ్రతికిస్తుంది. ఇష్టం మనిషితో ఏదైనా చేస్తుంది.
కానీ అవసరం మనిషికి అన్ని నేర్పిస్తుంది.
30. మన ద్వేషం ఎదుటివారిని ఎంత దహించి వేస్తుందో తెలియదు కానీ మనలను మాత్రం పూర్తిగా నాశనం చేస్తుంది.
For more Quotations please check