Pros and Cons of Eating Raw Garlic:
Contents
వెలుల్లి వల్ల కలిగే ప్రయోజనాలు :
అధిక మోతాదులో ఎల్లిసిన్ : వెల్లుల్లిలోని ముఖ్యమైన ఔషధ గుణాలు కలిగించే పదార్థం ఎల్లిసిన్. పచ్చి వెల్లుల్లి తినడం ద్వారా ఎక్కువ ఎల్లిసిన్ శరీరంలోకి చేరుతుంది. ఇది గుండె ఆరోగ్యానికి, రక్తపోటు నియంత్రణకు, రోగనిరోధక శక్తి పెంపొందించడానికి సహాయపడుతుంది.
జీర్ణక్రియ: తక్కువ మోతాదులో వెల్లుల్లి ముక్కలు తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇది
ప్రేగుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
జలుబు, ఫ్లూ నివారణ: వెల్లుల్లిలోని యాంటీ బాక్టీరియల్ (Antibacterial) మరియు యాంటీ ఫంగల్ (Antifungal) గుణాలు జలుబు, ఫ్లూ వంటి వ్యాధులను నివారించడంలో సహాయపడతాయి.
మధుమేహ నియంత్రణ : కొన్ని పరిశోధనలు వెల్లుల్లి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుందని సూచిస్తున్నాయి.
Pros and Cons of Eating Raw Garlic:
వెలుల్లి వల్ల కలిగే నష్టాలు :
జీర్ణ సమస్యలు : వెల్లుల్లిలోని ఘాటైన పదార్థాలు జీర్ణవ్యవస్థను చికాకు పెడతాయి కారణం, గుండెల్లో మంట, గ్యాస్, అతిసారం వంటి సమస్యలు కలిగించవచ్చు.
రక్తం గడ్డకట్టే సమస్య: వెల్లుల్లి రక్తం గడ్డకట్టకుండా చేసే గుణాన్ని కలిగి ఉంటుంది. రక్తం గడ్డకట్టకుండా చేసే మందులు వాడేవారు వైద్యుడిని సంప్రదించకుండా వెల్లుల్లి తినకపోవడమే మంచిది.
దుర్వాసన: వెల్లుల్లి తినడం వల్ల ఎక్కువ సేపు నోటి నుండి దుర్వాసన వస్తుంది.
గర్భిణీ స్త్రీలు మరియు పాలిచ్చే అమ్మలు : గర్భిణీ స్త్రీలు మరియు పాలిచ్చే అమ్మలు వైద్యుడి సలహా తీసుకొని వీటిని తినడం మంచిది.
ఇంటిలో మీ పనిని తగ్గించే నేస్తాలు
జంక్ ఫుడ్‌ని ఆరోగ్యవంతంగా మార్చే చిట్కాలు
బరువును తగ్గించే సూపర్ చీజ్ లు
డార్క్ చాక్లెట్ తినడం వల్ల జరిగే 7 అద్భుత ప్రయోజనాలు
పుచ్చకాయ తినడం ఎంతవరకు ప్రయోజనకరం ?