stories in Telugu with writing for kids
Spread the love

Contents

సమస్య -పాఠం

Stories in Telugu

Stories in Telugu with Writing for kids ||సమస్య -పాఠం|| ||అభిప్రాయం||

ఒక రైతు తన కుమార్తెకు వివాహం చేసి పంపించాడు, ఒక్కతే  కుమార్తె కావడంతో చిన్నతనం నుంచి ఆమె పుట్టింట్లో చాలా గారాబంగా పెరిగింది.  ఆమెను ఒక్కసారిగా వివాహం చేసి కొత్తవారైన అత్తవారింటికి పంపడంతో…  ఆమె అత్తమామలతో వారి బంధువులతో కొత్త వారితో ఇమడలేక పోయింది.  వివాహమైన నెలరోజులకు అత్తవారింటి నుంచి చెప్పకుండా  పుట్టింటికి వచ్చింది, అనుకోకుండా ఇంటికి వచ్చిన కుమార్తెను చూసిన రైతు ఏమైందని ఆరాతీయగా.

ఆమె తండ్రితో నాకు అక్కడ చాలా ఇబ్బందిగా ఉంది, ఎవరూ  నన్ను అర్థం చేసుకోవడం లేదు పైగా నాకు అన్ని పనులు చెబుతున్నారు అని తండ్రి ముందు ఏడవడం ప్రారంభిస్తోంది.

విషయం అర్థం చేసుకున్న తండ్రి, ఆమెతో ఏమీ మాట్లాడకుండా  బయటకి వెళ్లి మూడు కుండలను వాటితో పాటు కొన్ని బంగాళదుంపలను, గుడ్లను, కొన్ని కాఫీ గింజలు తీసుకొని వచ్చాడు.  ఆయన ఆ మూడు కుండలను  పొయ్యిమీద పెట్టి ఒక్కొక్క దాంట్లో ఒక వస్తువును ఉంచాడు . ఒకదాంట్లో బంగాళదుంపలు ఇంకొక దాంట్లో గుడ్లు మరొకదాంట్లో  కాఫీ గింజలు వేసి నీళ్లు పోసి పొయ్యి వెలిగించి వాటిని వేడి చేయడం మొదలు మొదలుపెట్టాడు .

 కొంత సమయం…

అలాగే గడిచింది ,తండ్రి తన మాటలకు ఎటువంటి జవాబు చెప్పక పోవడంతో కుమార్తె అలాగే తండ్రిని చూస్తూ ఉంటుంది.  ఒక ఇరవై నిమిషాలు గడిచాక ఆమె తండ్రితో నాన్నా…  మీరు నా మాటలకు  ఎటువంటి సమాధానం చెప్పకుండా మీ పని మీరే చేసుకుంటున్నారు అని అంటుంది .

అప్పుడు రైతు మరల సమాధానం చెప్పకుండా మూడు కుండలనుంచి  దానిలో వేసిన వస్తువులను ఒకొక్కటిగా బయటికి తీసి కుమార్తె ముందుంచి ,ఒక సారి నువ్వు ఈ బంగాళదుంపలను పట్టుకుని చూడు అని చెపుతాడు అప్పుడు ఆమె వాటిని  పట్టుకొని  ఇవి చాలా మెత్తగా వున్నాయి అని చెప్తుంది, అదేవిధంగా ఈ గుడ్లను పట్టుకో అని చెప్తాడు అప్పుడు ఆమె గుడ్లను పట్టుకొని ఇవి చాలా గట్టిగా అయ్యాయి అని చెబుతోంది, తర్వాత అతను కాఫీ గింజలు వేసి మరిగించిన నీటిని ఇచ్చి ఇది ఎలా ఉంది అని అడిగితే ఆమె వాటి వాసన చూసి చాలా అద్భుతంగా ఉంది దీని వాసన అని చెబుతుంది.

అప్పుడు రైతు చూడమ్మా!!  వేడిచేయక ముందు  ఈ బంగాళదుంపలు చాలా గట్టిగా ఉన్నాయి, ఇంకా ఈ  గుడ్లు చాలా బలహీనంగా కింద పడితే పగిలిపోయే విధంగా ఉన్నాయి అదే విధంగా ఈ కాఫీ గింజలు ఎటువంటి రుచి లేని విధంగా ఉన్నాయి ,కానీ  వీటిని వేడి నీటిలో ఉడికించిన తర్వాత ఇవి వాటి స్వభావాన్ని వదిలి కొత్త స్వభావాన్ని ఏర్పర్చుకున్నాయి .

అదే విధంగా

మనిషి జీవితంలో కొన్ని కష్టాల్ని బాధల్ని, ఇబ్బందుల్ని ఎదుర్కొన్న తర్వాత వాటి వలన కొన్ని పాఠాలు నేర్చుకొని ఒక చక్కటి రూపాంతరం చెందాలి, అప్పుడే  మనిషి జీవితంలో ఎదుగుతాడు  అంతేకాని కష్టాలు వచ్చాయని మనం కృంగిపోయి మన బాధ్యతల నుంచి దూరంగా పారిపోతే  మన జీవితంలో మనకు ఎప్పటికీ ఎదుగుదల ,మార్పు ఉండదు .

నువ్వు కూడా మా దగ్గర ఉన్నన్ని రోజులు సురక్షితమైన ఇటువంటి భాద్యతలు లేని జీవితాన్ని గడిపావు, కానీ మీ అత్త గారి ఇంటికి వెళ్ళినప్పుడు కొత్త మనుషులతో కలవలేక ,భాద్యతలు తీసుకోలేక భాదపడుతున్నావు నువ్వు ఈ  ఇబ్బందులును నీకు అనుకూలంగా మలుచుకుని నీవు అందరితో కలిసి పోయినట్లయితే కొన్ని రోజులకు  నీలో  కూడా చక్కని మార్పు వస్తుంది అని  చెప్తాడు తండ్రి.  కూతురు విషయం అర్థం చేసుకొని నమ్మకం తో పుట్టింటి  నుండి అత్తగారింటికి బయలుదేరుతుంది.

Moral : సమస్య మనకు జీవితం లో చాలా పాఠాలు నేర్పిస్తుంది,మనం సమస్యను ఎదుర్కొన్నప్పుడు మాత్రమే మనం కొత్తవిషయాలు నేర్చుకోగలం .

Stories in Telugu with Writing for kids ||సమస్య -పాఠం|| ||అభిప్రాయం||

 


అభిప్రాయం

Stories in Telugu

ఒక రోజు ఒక వ్యక్తి తన ఇరవైఐదు  సంవత్సరాల కుమారుడితో కలిసి రైలులో ప్రయాణం చేస్తూ ఉంటాడు.అతని కుమారుడు రైలు బోగీ కిటికీ వద్ద కూర్చొని బయటకు చూస్తూ నాన్నా …  ఇక్కడ ఆకాశంలో ఉన్న మబ్బులు మనం ఎంత దూరం వెళితే అంత దూరం మనతోపాటు వస్తున్నాయి చూశారా అని గట్టిగా అరుస్తూ చెబుతూ ఉంటాడు.

అదే బోగీలో వున్న భార్యాభర్తలు అతని ప్రవర్త చూసి ఎగతాళిగా నవ్వుకుంటారు .  మరికొంత సమయం అయ్యాక ఆ యువకుడు నాన్నా …  పక్షులు ఆకాశంలో ఎంత ఎత్తుగా ఎగురుతున్నాయో!!  అని అదే ఉత్సాహంతో గట్టిగా చెబుతూ ఉంటాడు. యువకుని మాటలు విని  భార్య భర్తలు చాలా విసుగుగా చూస్తారు.

మరి కొంత సమయం అయ్యాక ఆ యువకుడు నాన్నా …  చెట్లు కూడా మన కంటే వేగంగా పరిగెడుతున్నాయి చూశారా అని రెట్టింపు ఉత్సాహంతో చెబుతూ ఉంటాడు . అతని మాటలు విన్న ఆ భార్యాభర్తలు తండ్రితో, మీ అబ్బాయికి ఏదో మానసిక సమస్య ఉన్నట్లుగా అనిపిస్తుంది మీరు ఎవరన్నా చక్కని మానసిక వైద్యుని చూపించినట్లు అయితే బాగుంటుందేమో అని వ్యంగ్యంగా అంటారు.

 అప్పుడు…

ఆ యువకుని తండ్రి వారితో నా కొడుకు  గత ఇరవైఐదుసంవత్సరాలుగా తన అంధత్వం వల్ల ప్రపంచాన్ని చూడలేకపోయాడు, పది రోజుల క్రితమే వీడికి కంటిచూపుకోసం  చికిత్స చేశారు ,ఈ రోజు ఉదయమే కట్లువిప్పారు .  అందువలన వీడు ఈ ఉదయం నుంచే మొట్టమొదటిసారి ప్రపంచాన్ని చూడడం ప్రారంభించాడు ,అందుకే  ప్రతిదీ చాలా కొత్తగా వింతగా ఉంది అని చెప్తాడు.  ఆ తండ్రి మాటలు విన్న భార్యభర్తలిద్దరు ఆశ్చర్యపోయి వారి ప్రవర్తనకు వారే సిగ్గుపడి ఆ తండ్రికి ఆ యువకునికి క్షమాపణ చెప్పారు .

Moral : ఎదుటి వారి పరిస్థితి గురించి ఆలోచించకుండా, మనకు మనమే వారి గురించి ఒక అభిప్రాయానికి రాకూడదు.

 

For more Moral Stories please visit: Telugu moral Stories

Stories in Telugu with Writing for kids

 

One thought on “Stories in Telugu with Writing for kids ||సమస్య -పాఠం|| ||అభిప్రాయం||”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!