Story Series for kids
Spread the love

నా పేరు చిన్ని నాకు ఆరు సంవత్సరాలు నేను ఫస్ట్ క్లాస్ చదువుతున్నాను ఇప్పటి నుండి నా ప్రయాణం మీ అందరితో పంచుకోవాలి అనుకుంటున్నాను …

 

Contents

గెలిచేవరకు ప్రయత్నించు

Story Series for kids

“చిన్నితో ప్రయాణం” చిట్టి కథలు చిన్నపిల్లల కోసం

హాయ్ అండి ,

ఈ రోజు మండే ,అప్పుడే సండే అయిపోయింది ఈ రోజు స్కూల్ వుంది ,నాకు అస్సలు నిద్రలేవాలి అని లేదు కాని అమ్మ, లెగు లెగు అని అస్తమాటూ పిలుస్తూనే వుంది .
నేను ఇంక నిద్ర లెగుస్తున్నాను ,గబ గబా రెడీ అయ్యి స్కూల్ కి వెళ్తాను .

స్కూల్ కి ఈ రోజు కొంచెం తొందరగానే వచ్చాను.

క్లాస్ లోపలికి వెళ్లేసరికి టీచర్ టేబుల్ మీద చాలా క్లే తో చేసిన బొమ్మలు వున్నాయి,అప్పుడు గుర్తుకు వచ్చింది అయ్యో… మమ్మల్ని అందరిని టీచర్ క్లే తో నచ్చిన బొమ్మలు చేసి మండే తీసుకురమన్నారు కదా అని … బాగా చేసిన వాళ్లకు చాకోలెట్స్ ఇస్తానన్నారు.

అందుకే మా ఫ్రెండ్స్ చాలా మంది చాలా రకాల బొమ్మలు చేసి టీచర్ టేబుల్ మీద పెట్టారు,కొన్ని చూడడానికి ఎంత బాగున్నాయో…

అంతలోనే టీచర్ క్లాస్ లోనికి వచ్చి ఆ బొమ్మలను చూసి వావ్ …. ఎంత బాగా చేశారో ,ఈ రోజు బొమ్మలు చేసిన అందరికి చాకోలెట్స్ రావలసిందే అన్నారు .

నాకు చాలా భాదగా అనిపించింది !! నేను కూడా మర్చిపోకుండా ఉండవలసింది …

టీచర్ ఒక్కొక్కరి బొమ్మచూస్తూ వారిని మెచ్చుకుంటూ ఉంటే నాకు చాలా చాలా బాధగా అనిపించింది ఏడుపు కూడా
వచ్చింది .

చిన్ని: నేను రేపు ఇంతకన్నా మంచి బొమ్మ చేసుకొని వస్తాను అప్పుడు టీచర్ నన్నుకూడా మెచ్చుకుంటారు చాకొలేట్ ఇస్తారు..

సాయంత్రం…

స్కూల్ అయిపోగానే స్కూల్ బస్సు లో వెంటనే ఇంటికి వచ్చాను,

స్కూల్ బాగ్ ను ఇంటిముందు వున్న గార్డెన్ లో వున్న బెంచ్ మీద పడేసి పరిగెత్తుకుంటూ ఇంటి లోపలికి వెళ్లి  క్లే తెచ్చుకున్నాను బొమ్మచేద్దాం అని
అంతలోకి అలికిడి విని ఇంటిముందుకు వచ్చిన

అమ్మ నన్నుచూసి చిన్ని… ఎప్పుడు వచ్చావ్ ? అప్పుడే క్లే తో ఆట మొదలు పెట్టావా అంది …

చిన్ని:అవును అమ్మా ,నేను క్లే తో మంచి బొమ్మచేసి మా టీచర్ కు చూపించాలి ,అందరి కన్నా నాదే బాగుండాలి అన్నాను గట్టిగా

అప్పుడు అమ్మ ,సరే చేద్దువుగానిలే కానీ… ముందు కొంచం ఫ్రెషప్ అయ్యి ఏమన్నా తిని తర్వాత మొదలు పెట్టు అన్నది .

నేను అమ్మ చెప్పినట్లే ఫ్రెషప్ అయ్యి డ్రెస్ మార్చుకొని మళ్ళి బొమ్మ చేయడం ప్రారంభించాను . కానీ అస్సలు ఏంచేయాలో అర్థం కాలేదు .,బాగా ఆలోచించి నాకు చాలా ఇష్టమైన టెడ్డి బేర్ చేద్దాం అనుకున్నాను కానీ ఎంత ప్రయత్నించినా అది అస్సలు బాగా రావడం లేదు,

నాకు బాగా కోపం వచ్చి దానిని ప్రక్కకు విసిరేసాను అంతలో అమ్మ అక్కడకు పాలు తీసుకొని వచ్చింది .

అమ్మను చూసేసరికి నాకు చాలా బాధగా అనిపించి అమ్మా… !! ఎంత చేసినా బొమ్మ బాగా రావడం లేదు అని ఏడ్చాను.

అప్పుడు అమ్మ ,అది సరేగాని … ముందు పాలుతాగు అంది

ఏడుపుని కొంత ఆపుకొని పాలు కొంచం తాగాను ,పాలు అస్సలు రుచిగా లేవు.

అమ్మా…

నువ్వు దీనిలో పంచదార వేయలేదా అస్సలు బాగోలేవు అన్నాను

అమ్మ:అయ్యో అవునా అయితే వాటిని పాడవేయి అన్నది

అప్పుడు నేను ఎందుకు పారవేయడం వీటిలో కొంచం పంచదార వేస్తే సరిపోతుందిగా అన్నాను .

అమ్మ: అవును కదా దేనిలో అయినా చిన్న లోపం ఉంటే మనం దానిని సరిచేయవచ్చు కదా అన్నాది

ఆ మాటకు నేను ఔను కదమ్మా అన్నాను ఉత్సాహంగా

అమ్మ : అలా అయితే నువ్వు ఇంత కష్టపడి చేసిన బొమ్మ కొంచం బాగా రాలేదని ఎందుకు విసిరేశావు,దానిని కూడా సరిదిద్దవచ్చుకదా “గెలిచేవరకు ప్రయత్నించవచ్చు” కదా అంది.

అప్పుడు నాకు నిజము కదా అనిపించింది.

వెంటనే అమ్మ యిచ్చిన పంచదార కలిపిన పాలు తాగేసి ,అమ్మ సహాయంతో టెడ్డి బేర్ బొమ్మను చాలా చక్కగా చేసాను.

తరువాత రోజు క్లాస్ లో టీచర్ దానిని చూసి నన్ను చాలా బాగా మెచ్చుకొని చాకొలేట్ కూడా యిచ్చారు.

నేను చాలా హ్యాపీ …

మరి మీరు…

ఇంక వుంటాను మళ్ళీ ఇంకో రోజు కలుస్తాను

టాటా…

 

తెలుగు స్టోరీస్ ఫర్ కిడ్స్:

 

For more kids stories please visit: తంబులీనా

 

error: Content is protected !!