Thumblina story in telugu
Spread the love

Contents

తంబులిన

అనగనగా ఒక ఊరిలో ఒక మధ్య వయస్కురాలు ఉండేది ,తాను చాలా కాలంగా ఒంటరి జీవితం జీవిస్తూ ఉండేది. తనకు కూడా పిల్లలు ఉంటే ఎంత బాగుంటుంది అని తను ఎప్పుడూ బాధపడుతూ ఉండేది. రోజు రోజుకి పిల్లలు కావాలనే ఆలోచన ఎక్కువ కావడంతో ఆమె తన ఊరిలో ఉన్న ఒక మంత్రగత్తె వద్దకు వెళ్ళి తన బాధనంతా చెప్పుకుంది అప్పుడు ఆ మంత్రగత్తె తనకు ఒక విత్తనాన్ని ఇచ్చి ఇది నీ చింత తీరుస్తుంది అని చెబుతుంది.

మంత్రగత్తె ఇచ్చిన సమాధానానికి మధ్య వయస్కురాలి కి అంత సంతోషంగా అనిపించలేదు కానీ చేసేదేమీ లేక ఇంటికి వచ్చాక ఆ విత్తనాన్ని భూమిలో నాటి ఆ రోజు రాత్రి నిద్ర పోతుంది .మరునాడు ఉదయం లేచి చూసే సరికి విత్తనం వేసిన ప్రదేశంలో ఒక చిన్న మొక్క వచ్చి దానికి చాలా అందమైన ఒక మొగ్గ తొడిగి ఉంటుంది. అది చూడటానికి చాలా అందంగా ఉంటుంది దానిని చూసి మురిసిపోయిన ఆమె దగ్గరికి వెళ్లి దానిని ముద్దు పెట్టుకుంటుంది అంతే ఆ మొగ్గ చక్కగా విచ్చుకుంటుంది.

విరిసిన ఆ పువ్వులో తన బొటన వేలు అంత పరిమాణంలో ఉన్న ఒక చిన్న పాప కనబడుతుంది ,పాప చూడటానికి చాలా అందంగా ముద్దుగా ఉంటుంది ఆ పాపను చూసేసరికి ఆనందం తట్టుకోలేక నెమ్మదిగా ఆ పాపను చేతిలోనికి తీసుకుంటుంది .ఆ రోజు నుంచి ఆమె ఆ పాప తో ఎంతో ఆనందంగా గడుపుతూ ఉంటుంది తను తన పిల్లలతో ఏ విధంగా ఉండాలని ఊహించుకుంటుందో ఆ విధంగా తను ఆ పాపతో ఉంటూ ఉంటుంది.

పాప చాలా చిన్నగా ఉన్నందువలన ఆ పాపకి తంబులిన అని నామకరణం చేస్తుంది . తంబులిన నిద్ర పోవడానికి వీలుగా వాల్నట్ యొక్క పెంకును మంచంలా, పాప కప్పుకోవడం కోసం గులాబీ పువ్వు యొక్క రేకులను ,పాప నిద్రించడానికి ఈ చిన్న చిన్న పువ్వుల రేకులను వాల్నట్ లో  పరిచి అందులో పండుకో పెడుతుంది మరియు తంబులిన నీటిలో ఆడుకోవడానికి వీలుగా టులిప్ పువ్వు యొక్క రేకులతో చేసిన చిన్న పడవలో ఉంచుతుంది.

రోజూ….

పాపకు తనకు వచ్చిన కథలను చెబుతూ తను మాట్లాడే  ముద్దు ముద్దు మాటలు వింటూ జీవితం ఆనందంగా గడుపుతూ ఉంటుంది అలాగే ఆ రోజు తంబులిన ను తన వాల్నట్ మంచంలో పడుకోబెట్టి ఆమె కూడా నిద్రిస్తుంది. రోజూ తంబులిన ను గమనిస్తున్న ఒక కప్ప దీనిని ఏ విధంగా అన్న తీసుకు వెళ్లి నా కొడుకుకి బహుమతిగా ఇవ్వాలి అనుకుంటుంది, ఎప్పటినుండో అదను కోసం ఎదురు చూస్తున్న కప్ప ఆ రోజు రాత్రి తంబులిన ను తీసుకొని తన కుటుంబం ఉండే స్థలానికి వెళుతుంది.

చాలా అందమైన తంబులిన ను చూసిన కప్ప కుమారుడు ‘నాన్న నాకు నీ బహుమతి చాలా నచ్చింది నేను నా స్నేహితురాలితో ఆడుకోవడానికి ఒక చక్కటి ఇల్లు నిర్మించుకుందాం అనుకుంటున్నాను’ ఆ ఇల్లు నిర్మాణం అయ్యేదాకా నువ్వు ఈమెను ఎక్కడైనా జాగ్రత్తగా వుంచు అని చెపుతాడు .అప్పుడు తండ్రి  కప్ప తప్పించుకోవడానికి వీలులేకుండా ఆ చెరువు లో ఉన్న ఒక తామరాకు మీద ఉంచుతుంది.తంబులిన ఎంత ప్రయత్నించినా తప్పించుకోవడం కుదరక అదే ఆకు మీద కూర్చుని ఏడుస్తూ ఉంటుంది .ఆమె ఏడుపును గమనించిన రెండు చిన్న చేపలు విషయమంతా అడిగి తెలుసుకొని మేము నిన్ను ఏవిధంగా అయినా కాపాడుతామ్ అని చెప్పి వాటి పళ్ళ తో తామరాకు కాడను కొరికి వేస్తాయి.

తామరాకు ఒక్కసారిగా నీటిలో తెగి పడడంతో అది ఒక పడవ లాగా ప్రవాహంలో కొట్టుకు పోతూ ఉంటుంది . అప్పుడు తంబులిన నాకు ఇప్పటికైనా స్వాతంత్ర్యం దొరికింది అనుకుంటుండగా ఆకాశంలో ఎగురుతున్న ఒక కందిరీగ పాపను చూసి ఆమె అందానికి ముచ్చటపడి పాపను తీసుకొని ఎగిరిపోతుంది .అది దాని నివాసానికి తీసుకువెళుతుంది ,నివాసంలో ఉన్న మిగిలిన కీటకాలు తంబిలీనా ను చూసి ఇది మన రూపురేఖలను కు ఎటువంటి సారూప్యత లేని జీవి లాగా ఉంది దీనిని మనతోపాటు ఉంచడం మాకు ఇష్టం లేదు అని మిగిలిన కీటకాలు అనడంతో కందిరీగ తంబిలీనా ను తీసుకొని ఒక పచ్చని మైదానంలో వదిలేస్తుంది.

ఎటు వెళ్ళాలో తెలియక తంబులిన అదే మైదానంలో చాలా రోజులు గడుపుతూ మంచు బిందువులో వున్న నీటిని తాగుతూ పుప్పొడి తింటూ జీవనం సాగిస్తూ ఉంటుంది. ఒకరోజు అలా నడుచుకుంటూ నడుచుకుంటూ కొంత దూరం వెళ్ళాక ఒక చక్కటి ఇల్లు కనబడుతుంది దాని ద్వారా గుండ్రంగా ఉంటుంది . అక్కడ ఎవరన్నా తనకి సహాయం చేస్తారేమో అనుకొని ఆ ద్వారాన్ని కొడుతుంది అప్పుడు ఆ ఇంట్లో ఉన్న ఎలుక తలుపు తీసి తంబులిన ను  ఇంటి లోపల కి ఆహ్వానిస్తోంది .

అప్పుడు…

ఆమె జరిగిన విషయమంతా ఎలుకకు వివరిస్తుంది అప్పుడు ఎలుక నువ్వు ఏ మాత్రం భయపడకు నీకు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు క్షేమంగా నువ్వు నా నివాసంలో ఉండవచ్చు అని చెబుతుంది, ఆ మాటలకు తంబులిన ఆనందిస్తుంది .చాలా రోజులు స్నేహంగా దాని ఇంట్లోనే ఉంటుంది కొన్ని రోజులు గడిచాక ఒక రోజు ఎలుక తంబులినతో నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు అతను చాలా ధనవంతుడు ఈరోజు నేను అతనిని మన ఇంటికి విందుకు పిలిచాడు అని చెబుతుంది.

ఆ రోజు ఎలుక స్నేహితుడు విందుకు వస్తాడు, విందులో ముగ్గురూ చాలా ఆనందంగా మాట్లాడుకుంటూ ఆహారం ఆరగిస్తూ ఉంటారు .అదే సమయంలో స్నేహితుడైన ఎలుక  తంబులిన ను తన నివాసానికి తీసుకువెళ్ళాలి అని ఆలోచిస్తాడు అదే మాటను తన మిత్రుడితో చెప్పగా ,ఆ మిత్రుడు తంబులిన తో నా స్నేహితుడు నిన్ను తన ఇంటికి తీసుకు వెళ్ళాలి అనుకుంటున్నాడు అని చెబుతాడు చేసేదేమీ లేక  సరే అని అఇష్టంగా నే ఒప్పుకుంటుంది.

ముగ్గురు కలసి ధనవంతుడైన ఎలుక ఇంటికి వెళుతూ ఉంటే వారికి మార్గమధ్యంలో గాయపడిన ఒక పక్షి కనపడుతుంది దానిని చూచి ఎలుక మేము వెళ్ళే మార్గంలో నువ్వు ఇలా పడిపోయి ఉండడం నాకు నచ్చలేదు అని తన కాలితో ఆ పక్షిని తోసి వేస్తుంది. దాని ప్రవర్తన చూసిన తంబిలీనా ఎంతో బాధపడి వారిద్దరికీ కనబడకుండా వెళ్లి దాక్కొని ఆ పక్షిని కాపాడుతుంది దానికి అవసరమైన సపర్యలు అన్నీ చేస్తుంది దానిని జాగ్రత్తగా చూసుకుంటుంది పక్షికి అంతా నయం అయిపోయి తర్వాత  అది తంబులినతో  నేను మావాళ్ళు ఉండే ప్రదేశానికి వెళ్ళిపోదామని అనుకుంటున్నాను నీవు కూడా నాతో వస్తావా అని అడుగుతుంది. అప్పుడు తంబులిన లేదు నాకు ఈ ప్రదేశం అలవాటు అయిపోయింది నేను ఇక్కడే ఉంటాను అంటుంది అప్పుడు పక్షి తన మార్గం ఎగురుకుంటూ వెళ్లి పోతుంది.

కొన్ని రోజులకు….

తంబులిన ధనవంతుడైన ఎలుక కంటపడుతుంది అప్పుడు అది వచ్చి నేను నిన్ను తీసుకు వెళ్దామని అనుకుంటున్నాను నువ్వు నా తో నా గుహ లోనే ఉండాలి అని అడుగుతుంది అప్పుడు తంబులిన వేరే దారి ఏమీ లేక నేను నీ ఆలోచనకు ఒప్పుకుంటాను కానీ ఈ ఒక్కరోజు మాత్రం నువ్వు నన్ను స్వేచ్ఛగా వదిలేయ్ అని అడుగుతుంది.ఆమె  మాటలకు ఎలుక అంగీకరిస్తుంది .

ఆరోజు తంబులిన స్వేచ్ఛగా బతకడానికి ఇదే నాకు ఆఖరి రోజు అనుకుంటుండగా దానికి మళ్ళీ పక్షి గొంతు వినబడుతుంది. పక్షి తంబులినను  చూసి ఇప్పటికైనా నువ్వు నాతో వస్తావా అని అడుగుతే అప్పుడు తంబులిన సరే మిత్రమా అని పక్షి వీపు మీద కూర్చుంటుంది .పక్షి తంబులిన ను వీపుపై కూర్చోపెట్టుకుని అలా ఎన్నో అడవులు చెరువులు రహదారులు దాటుకుంటూ వెళ్లి ఒక ప్రదేశం దగ్గర దించుతుంది, అప్పుడు పక్షి ఇది పూలవనం దీనిని ఒక రాజు చూసుకుంటూ ఉంటాడు నీవు కూడా ఆయన అంగీకారంతో ఇక్కడ ఉండవచ్చు అని చెబుతుంది ఆ ప్రదేశమంతా ఎటువైపు చూసినా పూలతో నిండి పోయి చాలా అందంగా ఉంటుంది అప్పుడే అక్కడికి వచ్చిన రాజు తంబులినను చూసి ఇష్టపడి నువ్వు నాతో స్నేహం చేస్తావా అని అడుగుతాడు అప్పుడు తంబులిన కూడా ఆనందంగా అంగీకరిస్తుంది ఆ రోజు నుంచి  తంబులిన జీవితం ఆనందమయం అవుతుంది.

 

తంబులిన ఇది చాలా ప్రసిద్ధి చెందిన చిన్న పిల్లల కల్పితకథ ,పిల్లలు అర్థం అయ్యే విధంగా వుండాలని కొన్ని మార్పులు చేసి రాసాను .

 

ఆడియో స్టోరీ పిల్లకు తప్పకుండా వినిపించండి  యిది  పిల్లలకు చాలా నచ్చుతుందని అనుకుంటున్నాను.

Audio Story

 

For more audio stories please click here: kids Stories

 

 

 

 

 

4 thoughts on “Thumbelina Story in Telugu for Kids With Audio|| Fairy Tales ||”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!