సుమతీ శతకం
సుమతీ శతకం అనేది పండితులకే కాకుండా పామరులకు సైతం అర్థం అయ్యే విధంగా సరళమైన పదాలతో వివరంగా ఉంటుంది . సుమతీ అంటే మంచి బుద్ధి కలవాడా అని అర్థం ,ఈ శతకాల ద్వారా సమాజానికి మంచి బుద్ధి ,చక్కని వ్యవహార శైలి నేర్పించాలని ఈ శతక ఉద్దేశ్యం .
కవి పరిచయం :
పేరు : భద్ర భూపాలుడు (బద్దెన)
పుట్టిన తేదీ : క్రీ .శ 1260
వృత్తి : కాకతీయ సామ్రాజ్యం లో చిన్న సామంతరాజు,కవి
బిరుదులు : కమలాసన,కవిబ్రహ్మ
రచనలు: నీతిశాస్త్ర ముక్తావళి,సుమతీ శతకం
సుమతీ శతకం :
- బలవంతుడ నాకేమని
పలువురతో నిగ్రహించి పలుకుట మేలా
బలవంతమైన సర్పము
చలి చీమలు చేత జిక్కి చావదె సుమతీ.!
భావం : నేను బలవంతుడిని ,నన్ను ఎవరూ ఏమి చేయలేరు అని ఎక్కువమందిని తీసిపారవేసి మాట్లాడడం మంచిదికాదు . ఎంతో బలం వున్న పాముకూడా చిన్నవైన చీమల చేతిలో ప్రాణం కోల్పోతుంది కదా .
2.వినదగు నెవ్వరు చెప్పిన
వినినంతనే వేగపడక వివరింపదగున్
గని కల్ల నిజము తెలిసిన
మనుజుడె పో నీతిపరుడు మహిలో సుమతీ.!
భావం :ఎవరు ఏమి చెప్పినా వినాలి, కానీ విన్నవెంటనే తొందరపడి ఒక నిర్థారణకు రాకూడదు . బాగా ఆలోచించి ,ఆ చెప్పినది సత్యమో ,అసత్యమో నిర్ధారించుకోవాలి … అటువంటి వాడే నీతి పరుడు .
- కనకపు సింహాసనమున
శునకము గూర్చుండ బెట్టి శుభలగ్నమునం
దొనరగ బట్టము గట్టిన
వెనుకటి గుణ మేల మాను వినరా సుమతీ.!
భావం :ఒక శుభముహూర్తాన కుక్కను తీసుకువచ్చి బంగారు సింహాసనం మీద కూర్చోబెట్టి పట్టాభిషేకం చేసినా దాని వెనుకటి గుణం పోదు. అలాగే చెడ్డవాణ్ణి ఎంత గౌరవంగా చూసినా వాడు చెడ్డగుణాన్ని వదులుకోలేడు .
- ఎప్పుడు సంపద కలిగిన
అప్పుడు బంధువులు వత్తురది ఎట్లన్నన్
తెప్పలుగ జెరువు నిండిన
కప్పలు పదివేలు చేరు గదరా సుమతీ!
భావం :చెరువునిండా నీరుచేరగానే వేల కొద్దీ కప్పలు చెరువులోకి చేరినట్టు, మనకు సంపదలు రాగానే బంధువులు మన దగ్గరకు వచ్చి చేరుతారు .
5.ఇమ్ముగ చదువని నోరును
అమ్మాయని పిలిచి అన్నమడుగని నోరును
తమ్ముల పిలువని నోరును
కుమ్మరి మను తవ్వినట్టి గుంటరా సుమతీ .!
భావం : చదివే చదువును ఇంపుగా చదవాలి . అమ్మా ! అని పిలిచి అన్నం పెట్టమని అడగాలి. నోరారా తమ్ములను పిలవాలి. అలా చేయని నోరు కుండలు చేయడానికి మట్టి కోసం కుమ్మరివాడు తవ్విన గుంత లాంటిది .అంటే ప్రయోజనం లేదని భావం.
- ఉపకారికి నుపకారము
విపరీతము గాదు సేయ వివరింపంగా
నపకారికి నుపకారము
నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతీ!
భావం :మనకి మేలు చేసిన వారికి తిరిగి మేలు చేయడం సామాన్యమైన విషయం . తనకు కీడు చేసిన వాడికి ,వాడి తప్పు చూడకుండా మేలు చేయువాడే నేర్పరి అయిన మనుస్యుడు .
- ఎప్పటికెయ్యది ప్రస్తుత
మప్పటికా మాటలాడి అన్యుల మనముల్
నొప్పింపక తానొవ్వక
తప్పించుక తిరుగు వాడు ధన్యుడు సుమతీ.!
భావం :ఏ సమయంలో ఏది అవసరమో గ్రహించి ఆ సమయంలో ఆ అవసరమైన మాటలనే మాట్లాడాలి . ఎదుటివారి మనస్సు బాధ పడకుండా ,తానూ కూడా బాధ పడకుండాతెలివిగా మసలువాడే జ్ఞానం కలవాడు.
- కూరిమి గల దినములలో
నేరము లెన్నడును కలుగనేరవు , మరియా
కూరిమి విరసంబైనను
నేరములే తోచుచుండు నిక్కము సుమతీ!
భావం :స్నేహంగా వున్నా రోజులలో ఎప్పుడూ దోషాలు మనకు అనిపించవు. ఆ స్నేహం తగాదాగా మారినప్పుడు మనకు అన్ని విషయాలందు తప్పులే కనుబడతాయి.
- అక్కరకు రాని చుట్టము
మ్రొక్కిన వరమీని వేల్పు, మోహరమున దా
నెక్కిన బారని గుఱ్ఱము
గ్రక్కున విడువంగ వలయు గదరా సుమతీ. !
భావం : అవసరానికి పనికిరాని చుట్టమును, నమస్కరించి వేడుకొన్నా కోరిక నెరవేర్చని భగవంతుడిని, యుద్ధసమయంలో ఎక్కినప్పుడు ముందుకు పరుగు తీయని గుర్రాన్ని వెంటనే విడిచిపెట్టవలయును.
- అడిగిన జీతం బీయని
మిడిమేలపు దొరను గొల్పి మిడుకుట కంటెన్
వడిగల ఎద్దుల గట్టుక
మడి దున్నుక బ్రతుక వచ్చు మహిలో సుమతీ!
భావం : అడిగినప్పుడు జీతము ఇవ్వని గర్వియైన యజమాని దగ్గర పనిచేయడం కంటే, నాగలికి వేగంగా పరుగెత్తే ఎద్దులను కట్టుకొని పొలాన్ని దున్నుకొని వ్యవసాయము చేసుకుని బతకడం ఉత్తమం.
For Vemana Padyaalu click this link:http://telugulibrary.in/vemana-padyalu-in-telugu-with-bhavam/
11 అప్పిచ్చు వాడు, వైద్యుడు
నెప్పుడు నెడతెగక బారు నేఱును ద్విజుడున్
జొప్పడిన యూర నుండుము
చొప్పడకునట్టి యూరు చొరకుము సుమతీ.!
భావం : అవసరానికి అప్పు ఇచ్చే స్నేహితుడు,రోగం వచ్చినప్పుడు వైద్యం చేసే వైద్యుడు, ఎండిపోకుండా ఎల్లప్పుడూ పారే ఏరు, శుభాశుభాలకు కర్మలు చేయించే బ్రాహ్మణుడు ఉండే ఊరిలో ఉండుము. ఈ సౌకర్యములు లేని ఊరిలో నివసింపకుము.
12.పుత్రోత్సాహము తండ్రికి
పుత్రుడు జన్మిచినపుడే పుట్టదు ,జనులా
పుత్రుని కనుగొని పొగడగ
పుత్రోత్సాహంబు నాడు పొందురా సుమతీ.!
భావం :తండ్రి కి పుత్రుడు జన్మించిన వెంటనే సంతోషం కలుగదు ,ప్రజలు ఆ కుమారుని చూసి మెచ్చిన రోజునే ఆ సంతోషం కలుగుతుంది.
- తలనుండి విషము ఫణికిని
వెలయంగా దోకనుండు వృశ్చికమునకున్
తలతోక యనక యుండును
ఖలునకు నిలువెల్లా విషము గదరా సుమతీ .!
భావం : పాముకి విషం తలలో ఉంటుంది, తేలుకి విషం తోకలో ఉంటుంది . కానీ మనుష్యునికి విషం శరీరమంతా ఉంటుంది .
- తనకోపమే తన శత్రువు,
తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబౌ
త న సంతోషమే స్వర్గము,
తన దుఃఖమే నరకమండ్రు తధ్యము సుమతీ. !
భావం :మనిషి యొక్క కోపమే తనకు శత్రువులా మారుతుంది,తన శాంతమే తనను రక్షిస్తుంది ,తన దయయే తనకు చుట్టమువలె సహాయం చేస్తుంది . తన ఆనందమే తనకు ఇంద్రలోక సౌఖ్యము. తన దుఖమే తనకు నరకమగును. ఇది నిజము.
- చీమలు పెట్టిన పుట్టలు
పాముల కిరవైన యట్లు పామరుడు దగన్
హేమంబు గూడ బెట్టిన
భూమీశుల పాలజేరు భువిలో సుమతీ. !
భావం :చీమలు నిర్మించినటువంటి పుట్టలు పాములకు నివాసమైనట్లు, అజ్ఞాని కూడబెట్టిన బంగారమంతా రాజుల వశమైపోవును.
- పాలను గలిసి జలములు
బాల విధంబుననే యుండు బరికింపంగా
బాల చవి జెఱచు గావున
బాలసుడగువాని పొందు వలదుర సుమతీ!
భావం :నీరు ,పాలలో కలిసినప్పుడు పాల వలెనే అది కనబడుతుంది కాని పాల రుచిని మాత్రము అది పాడు చేయును. అలాగే చెడ్డవానిని చేరదీసినచో వాడు మంచివాని వలె నటించును కానీ వాడు అసలైన మంచి వానిని పాడుచేస్తాడు .
[…] For Sumathi Sathakam please visit: Sumathi sathakam in Telugu with Bhavam […]
[…] Sumathi Sathakam with Bhavam: Sumathi sathakam […]
[…] Sumathi Sathakam with Bhavam: Sumathi sathakam […]