Contents
Rich Boy Story
Stories in Telugu For Children
Telugu Chinna Pillala Kathalu Stories
అనగనగా ఒక ఊరిలో చాలా ధనవంతుడైన ఒక వ్యాపారి ఉండేవాడు, అతడు ఒకరోజు పక్క ఊరిలో ఉన్న మార్కెట్లో తన ఆవును అమ్ముదాం అనే ఉదేశ్యం తో తయారవుతూ ఉండగా అతని ఒక్కగానొక్క కొడుకు గోవింద్ వ్యాపారిని చూసి, నాన్నగారు ఈరోజు నేను ఆవుని అమ్ముకొని వస్తాను అని అంటాడు. అప్పుడు వ్యాపారి బాబు నువ్వు ఎప్పుడూ ఇటువంటి లావాదేవీలు చూడలేదు, చేయలేదు కదా… ఈసారి నాతోపాటు వచ్చి ఆ వ్యవహారం అంతా జాగ్రత్తగా చూసి నేర్చుకో, ఇంకొకసారి నువ్వు ఒక్కడివే వెళ్లి ఇటువంటి పనులు చేయవచ్చు అని అంటాడు.
ఆ మాట విని కోపం తెచ్చుకున్న గోవింద్ మీరు చేసేదేమి అంత పెద్ద విషయం కాదు, ఆ విషయాన్ని నేను మీతో పాటు వచ్చి నేర్చుకోవాల్సిన అవసరం లేదు… నాకు ఈ అన్ని పనులు చాలా సులభంగా వచ్చు అని తండ్రి దగ్గర గట్టిగా అంటాడు. అప్పుడు వ్యాపారి తన మనసులో ఎటువంటి అనుభవం లేకపోయినా నాకు అన్నీ తెలుసు అనే మూర్ఖత్వంలో ఉన్నాడు ఈసారి ఇతను ఒక్కడినే పంపిస్తాను!! అప్పుడు గాని వ్యాపారం చేయడం అంటే ఏమిటో తెలిసి వస్తుంది, జీవితంలో ఒక మంచి పాఠం నేర్చుకుంటాడు అనుకుంటూ కొడుకుని ఒక్కడినే ఆవు అమ్మడానికి వెళ్ళమంటాడు . అప్పుడు గోవింద్ చక్కగా తయారయ్యి ఒంటినిండా నగలు వేసుకొని తమ దగ్గర ఉన్న గుర్రాలలో అన్నిటికన్నా మంచిదాన్ని ఎంచుకొని దాని మీద ఎక్కి, మరొక చేత్తో ఆవును కట్టి ఉన్న తాడును పట్టుకొని సంతకు బయలుదేరాడు.
కొంత దూరం వెళ్లేసరికి ఒక ముగ్గురు దొంగలు గోవింద్ను గమనించి అతని దగ్గర ఉన్న బంగారాన్ని ఆవుని చూసి ఇతని దగ్గర నుంచి ఏదో విధంగా ఆవుని, గుర్రాన్ని ,బంగారాన్ని దొంగతనం చేద్దామని నిర్ణయించుకున్నారు. నెమ్మదిగా అతనికి తెలియకుండా ఆవుకి కట్టి ఉన్న తాడుని విప్పి ఆవును తీసుకొని ఒక దొంగ వెళ్ళిపోయాడు.
Telugu Chinna Pillala Kathalu Stories
కొంత దూరం వెళ్లేసరికి తాడు తేలికగా ఉండేసరికి ఆవు లేదని గమనించిన గోవింద్ వెంటనే గుర్రాన్ని దిగి ఆవును వెతకడం ప్రారంభించాడు, అంతలో రెండవ దొంగ వచ్చి బాబు.. నువ్వు దేని గురించి వెతుకుతున్నావు ఆవు గురించేనా నేను అటువైపు ఒక వ్యక్తి తెల్లావుని తీసుకొని వెళ్లడం చూశాను!! నీవు నీ గుర్రాన్ని ఇస్తే నేను తొందరగా వెళ్లి ఆ వ్యక్తిని ఆవుని తీసుకొని వస్తాను అని చెప్పి గోవింద్ తో చెప్పి గుర్రాన్ని తీసుకొని ఆవును వెతకడానికి వెళ్ళిపోయాడు.
ఎంతసేపటికి ఆ వ్యక్తి గాని గుర్రం గానీ ఆవు గాని రాకపోయేసరికి విషయం అర్థం చేసుకున్న గోవింద్ దిగాలుగా నడుచుకుంటూ వెళుతున్నాడు అంతలో మార్గమధ్యంలో ఒక బావి దగ్గర మూడోదొంగ కూర్చుని బాధపడుతున్నట్టు నటిస్తున్నాడు, అతను వచ్చి గోవింద్ తో బాబు నేను ఒక పెద్ద వజ్రాల వ్యాపారిని నీళ్లు కోసం బావిలో నీళ్లు తోడుతుంటే నా చేతిలో ఉన్న వజ్రాల సంచి బావిలో పడిపోయింది నాకేమో ఈతరాదు.. నువ్వు గనుక నాకు సహాయం చేస్తే నేను నీకు కొంత డబ్బు ఇస్తాను అని అంటాడు అందుకు గోవింద్ ,అవును ఇప్పుడు నా దగ్గర ఉన్న ఆవు గుర్రము కూడా పోయాయి నేను ఖాళీ చేతులతో ఇంటికి వెళ్తే నాన్నగారు నన్ను కోప్పడతారు ఇతనికి గనుక సహాయం చేసి కొంత డబ్బు తీసుకుంటే నాన్నగారి కోపాన్ని కొంచెం ఐనా తగ్గించిన వాడిని అవుతాను అనుకొని ,ఆ వ్యక్తితో నాకు 20 వరహాలు కావాలి అని అడుగుతాడు అందుకు ఆ వ్యక్తి సరే నీవు నీటిలోకి దిగేముందు ఒక పది వరహాలు ఇస్తాను వజ్రాలు సంచి వెతికి ఇచ్చాక మిగిలినవిస్తాను అని చెప్పి గోవింద్ తో చెప్తాడు.
గోవింద్…
బావిలో కి దిగుతుండగా మూడవ దొంగ నీవు నీటిలో దిగితే నీ ఒంటి మీద ఉన్న బట్టలు అన్ని బురద అయిపోతాయి అని అనగానే గోవింద్ ఏమాత్రం ఆలోచించకుండా తన ఒంటి మీద ఉన్న నగలు బట్టలు అన్ని తీసి బావి గట్టు మీద పెట్టి నీటిలోకి దిగుతాడు. ఎంత వెతికినా దానిలో చెత్తాచెదారం తప్ప ఏమీ దొరకకపోయేసరికి ఇదంతా పైన ఉన్న వ్యక్తి పథకం అని తెలుసుకొని పైకి వచ్చేసరికి అక్కడ గోవింద్ దుస్తులు గాని నగలు గాని కనబడవు తాను పూర్తిగా మోసపోయానని అర్థం చేసుకొని. అలాగే ఒంటిమీద ఒక అంగీ తో మాత్రమే ఇంటికి బయలుదేరుతాడు, దారిలో చూసిన వారందరూ అవహేళనగా నవ్వుతూ ఉంటారు ఐనా గోవింద్ అలాగే సిగ్గుపడుతూ ఇంటికి వెళ్లి తన నాన్నగారికి జరిగిన విషయం అంతా బాధపడుతూ చెప్తాడు అప్పుడు వ్యాపారి ,అందుకే ఎప్పుడూ “పెద్దలు చెప్పిన మాట వినాలి పెద్దలు చెప్పిన మాట వినకపోతే జీవితంలో చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది” అని కొడుకుతో చెప్పి కొడుకుని దగ్గరికి తీసుకుంటాడు.
King Midas story
Stories in Telugu For Children
అనగనగా ఒక రాజు ఉండేవాడు ఆయన పేరు మిడాస్, ఆయనకి ఎక్కువ సంపాదించాలని ఆశ చాలా ఉండేది. ఎప్పుడూ ఏ విధంగా డబ్బు సంపాదించాలి దాన్ని ఎలా దాచుకోవాలని ఆలోచనలోనే ఉండేవాడు. ఒకసారి మిడాస్ చాలా రోజులు ప్రార్థించడం వల్ల ఒక దేవత ప్రత్యక్షమైంది,ఆమెను మిడాస్ ఒక కోరిక కోరాడు అదేంటంటే తను ఏది ముట్టుకున్న అది బంగారంగా మారిపోవాలని కోరుకున్నాడు. అది విన్న దేవత సరి నీవు కోరుకునే విధంగానే జరుగుతుంది అని అతనికి వరమిచ్చి మాయమైపోయింది .
మరుక్షణం నుంచి మిడాస్ ఏం పట్టుకున్న బంగారంగా మారిపోయేది అదంతా చూసి మిడాస్ కు చెప్పలేనంత ఆనందం కలిగింది . కొంతసేపటికి అతనికి దాహంగా ఉండడం నీరు తాగుదాం అనే ఉద్దేశంతో అతను గ్లాసుని పట్టుకొనేసరికి గ్లాసు దానిలో ఉన్న నీరు కూడా బంగారం గా మారిపోయింది,మిడాస్కు విషయం అర్థం కాలేదు.
ఆ రోజు నుంచి అతను తిండికి పూర్తిగా దూరమయ్యాడు అంతేకాక అతను పట్టుకున్న ప్రతి వస్తువు ప్రతి జీవి ప్రతి మనిషి బంగారంగా మారిపోయేవారు ఇదంతా చూసిన మిడాస్ కి చాలా బాధగా అనిపించింది. ఒక చోట కూర్చొని బాధపడుతూ ఉంటే అంతలో అతని ప్రియమైన ఒక్కగానొక్క కూతురు మిడాస్ దగ్గరికి వచ్చి అతనిని హత్తుకోగానే ఆమె కూడా బంగారంగా మారిపోయింది.
తన కూతురిని ఆ విధంగా చూసిన మిడాస్ తట్టుకోలేక ఏడుస్తూ దేవతకై మళ్ళీ ప్రార్థించాడు, కొన్ని రోజులకు ఆమె ప్రత్యక్షమై ఏం కావాలని అడగగా నా వరాన్ని తీసేసుకోమని ఇంతసేపు ఇంతకాలం తనవల్ల బంగారంగా మారిన ప్రతి వస్తువుని తిరిగి మామూలు స్థితికి వచ్చేలా చేయమని ప్రార్థించాడు. అప్పుడు దేవత సరే అని అతనికి ఒక నీటిని ఇచ్చింది మిడాస్ ఆ జలాన్ని బంగారం గా మారిన ప్రతి వస్తువు మీద వ్యక్తుల మీద చల్లడంతో వాళ్లందరూ మామూలుగా మారిపోయారు.
అప్పటినుంచి మిడాస్ మనుషులు ఇచ్చే ఆనందాన్ని ఏ బంగారం ఇవ్వలేదని తెలుసుకున్నాడు .
For more stories please visit: akbar birbal stories
Telugu Chinna Pillala Kathalu Stories