Telugu Christian songs Lyrics
Spread the love

Telugu Christian songs Lyrics:

 

Contents

Jesus Song Lyrics Telugu

 

Enduko Nanninthaga Neevu Preminchithivo Deva Song Lyrics

ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా
అందుకో నా దీన స్తుతి పాత్ర
హల్లెలూయ యేసయ్య
నా పాపము బాప నరరూపి వైనావు
నా శాపము మాప నలిగి వ్రేలాడితివి
నాకు చాలిన దేవుడవు నీవే నా స్థానములో నీవే
ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితి దేవా

నీ రూపము నాలో నిర్మించి యున్నావు
నీ పోలిక లోనే నివశించమన్నావు
నీవు నన్ను ఎన్నుకొంటివి
నీ కొరకై నీ కృపలో
ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా

నా మనవులు ముందె
నీ మనసులో నెరవేరే
నా మనుగడ ముందె నీ గ్రంథములోనుండె
ఏమి అధ్బుత ప్రేమ సంకల్పం
నేనేమి చెల్లింతున్
ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా
అందుకో నా దీన స్తుతి పాత్ర
హల్లెలూయ యేసయ్య
ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా
అందుకో నా దీన స్తుతి పాత్ర
హల్లెలూయ యేసయ్య హల్లెలూయ యేసయ్య
హల్లెలూయ యేసయ్య


Telugu Christian songs lyrics

JESUS PICTURES

నడిపించు నా నావ – నడి సంద్రమున దేవ
నవ జీవన మార్గమున – నా జన్మ తరి ఇంప

1. నా జీవిత తీరమున – నా అపజయ భారమున
నలిగినా నా హృదయమును – నడిపించుము లోతునకు
నా ఆత్మా విరబూయ – నా దీక్ష ఫలింప
నా నావలో కాలిడుము – నా సేవ జేసుకోనుము //నడిపించు //
2. రాత్రంతయు శ్రమ పడినా – రాలేదు ప్రభు జయము
రహదారులు వెదకినాను – రాదాయే ప్రతిపలము
రక్షించు నీ సిలువ – రమణీయ లోతులలో
రతనాలను వేదకుటలో – రాజిల్లు నా పడవ //నడిపించు //
3. ఆత్మార్పణ చేయకయే – ఆశించితి నీ చెలిమి
అహమును ప్రేమించుచునే – అరసితి నీ కలిమి
ఆశ నిరాశాయే – ఆవేదనేదురాయే
ఆద్యాత్మిక లేమిగని – అల్లాడే నా వలలు //నడిపించు //
4. ప్రభు మార్గము విడచితిని – ప్రార్థించుట మానితిని
ప్రభు వాక్యము వదలితిని – పరమార్థము మరచితిని
ప్రపంచ నటనలలో – ప్రావిన్యమును బొంది
ఫల హీనుడని ఇపుడు – పాటింతు నీ మాట //నడిపించు //
5. లోతైన జలములలో – లోతైన వినబడు స్వరమా
లోబడుతాను నేర్పించి – లోపంబులు సవరించి
లోనున్న ఈవులలో – లోతైన నా బ్రతుకు
లోపించని యర్పనగా – లోకేష చేయుమయా //నడిపించు //
6. ప్రభు యేసుని శిష్యుడనై – ప్రభు ప్రేమలో పాదుకుని
ప్రకటింతును లోకములో – పరిశుద్దుని ప్రేమ కథ
పరమాత్మ ప్రోక్షణతో – పరి పూర్ణ సమర్పణతో
ప్రానంబును ప్రభు కొరకు – పానార్పనము చేతు //నడిపించు //


Ebenezer song lyrics in Telugu:

ఎబినేజరే – EBINEJARE SONG LYRICS

నేనును నా ఇంటి వారందరు
మానక స్తుతించెదను (2)
నీ కను పాప వలే నన్ను కాచి
నేను చెదరక మోసావు స్తోత్రం (2)

ఎబినేజరే ఎబినేజరే
ఇంతకాలం కాచితివే
ఎబినేజరే ఎబినేజరే
నా తోడు వై నడచితివే

స్తోత్రం స్తోత్రం స్తోత్రం
కను పాప గా కాచితివి స్తోత్రం
స్తోత్రం స్తోత్రం స్తోత్రం
కౌగిలిలో దాచితివి స్తోత్రం (2)

ఎడారిలో ఉన్న నా జీవితమును
మెల్ల తో నింపితివి (2)
ఒక కీడైన దరిచేరక నను
తండ్రిగా దాచావు స్తోత్రం (2) ” ఎబినేజరే ”

ఆశలే లేని నాదు బ్రతుకుని
నీదు కృపతో నింపితివి (2)
నీవు చూపిన ప్రేమ ను పాడగా
పదములు సరిపోవు తండ్రి (2) ” ఎబినేజరే ”


దీవించ్చావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగామని
ప్రేమించావే నను ప్రాణంగా నీ కోసమే నను బ్రతకమని
దారులలో ఎడారులలో సెలయేరువై ప్రవహించుమయా
చికటిలో కారు చీకటిలో అగ్ని స్తంభమై నను నడుపుమయా

దీవించ్చావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగామని
ప్రేమించావే నను ప్రాణంగా నీ కోసమే నను బ్రతకమని

1. నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్య
నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్య
నా వంటరి పయనంలో నా జంటగా నిలిచాలే
నే నడిచే దారుల్లో నా తొడై ఉన్నావే (2)
ఊహలలో నా ఊసులలో నా ధ్యాస బాస వైనావే
శుద్ధతలో పరిశుధ్ధతలో నిను పోలి నన్నిల సాగమని

దీవించ్చావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగామని
ప్రేమించావే నను ప్రాణంగా నీ కోసమే నను బ్రతకమని

2. కొరతే లేవయ్యా నీ జాలి నాపై యేసయ్య
కొరతే లేదయ్య సమృధ్ధి జీవం నీవయ్మా
నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా
నా కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా (2)
ఆశలలో నిరాశలలో నేనున్నా నీకని అన్నావే
పోరులలో పోరాటంలో నా పక్షముగానే నిలిచావే

దీవించ్చావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగామని
ప్రేమించావే నను ప్రాణంగా నీ కోసమే నను బ్రతకమని


Telugu Christian songs lyrics…

ఎన్ని తలచినా ఏది అడిగినా
జరిగేది నీ చిత్తమే (2) ప్రభువా
నీ వాక్కుకై వేచియుంటిని
నా ప్రార్థన ఆలకించుమా (2) ప్రభువా

1.నీ తోడు లేక నీ ప్రేమ లేక
ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు (2)
అడవి పూవులే నీ ప్రేమ పొందగా (2)
నా ప్రార్థన ఆలకించుమా (2) ప్రభువా ||ఎన్ని||

2.నా ఇంటి దీపం నీవే అని తెలసి
నా హృదయం నీ కొరకై పదిలపరచితి (2)
ఆరిపోయిన నా వెలుగు దీపము (2)
వెలిగించుము నీ ప్రేమతో (2) ప్రభువా ||ఎన్ని||

3.ఆపదలు నన్ను వెన్నంటియున్నా
నా కాపరి నీవై నన్నాదుకొంటివి (2)
లోకమంతయూ నన్ను విడచినా (2)
నీ నుండి వేరు చెయ్యవు (2) ప్రభువా ||ఎన్ని||

4.నా స్థితి గమనించి నన్నూ ప్రేమించి
నా కొరకై కల్వరిలో యాగమైతివి (2)
నీదు యాగమే నా మోక్ష మార్గము (2)
నీయందే నిత్యజీవము (2) ప్రభువా ||ఎన్ని||


గతకాలమంత నీ నీడలోన

దాచావు దేవా వందనం
కృప చూపినావు కాపాడినావు
ఎలా తీర్చగలను నీ ఋణం
పాడనా నీ కీర్తన-పొగడన వేనోళ్ళన (2)
వందనం యేసయ్య-ఘనుడవు నీవయ్యా (2) ||గతకాలమంత ||

ఎన్నెనో అవమానాలెదురైనను
నీ ప్రేమ నన్ను విడచి పోలేదయ్యా
ఇక్కట్లతో నేను కృంగినను
నీ చేయి నను తాకి లేపెనయ్యా
నిజమైన నీ ప్రేమ నిష్కళంకము
నీవిచ్చు హస్తము నిండు ధైర్యము (2)
వందనం యేసయ్య ఘనుడవు నీవయ్యా (2) ||గతకాలమంత ||

మాటలే ముల్లుగా మారిన వేళ
నీ మాట నన్ను పలకరించేనాయ
నిందలతో నేను నిండిన వేళ
నీ దక్షిణ హస్తం నన్నుతాకేనాయ
నీ మాట చక్కటి జీవపు ఊట
మరువనెన్నడు నిన్ను స్తుతియించుట (2)
వందనం యేసయ్య ఘనుడవు నీవయ్యా (2) ||గతకాలమంత ||
వందనం యేసయ్య విభుడవు నీవయ్యా (2)


Nirantharam neethone jeevimchalane

నిరంతరం నీతోనే జీవించాలనే
ఆశ నన్నిల బ్రతికించుచున్నది } 2
నాప్రాణేశ్వరా యేసయ్యా
నా సర్వస్వమా యేసయ్యా|| నిరంతరం ||

చీకటిలో నేనున్నప్పుడు – నీ వెలుగు నాపై ఉదయించెను } 2
నీలోనే నేను వెలగాలని – నీ మహిమ నాలో నిలవాలని } 2
పరిశుద్ధాత్మ అభిషేకముతో – నన్ను నింపుచున్నావు – నీరాకడకై|| నిరంతరం ||

నీ రూపము నేను కోల్పోయినా – నీ రక్తముతో కడిగితివి
నీతోనే నేను నడవాలని – నీ వలెనే నేను మారాలని (2)
పరిశుద్ధాత్మ వరములతో – అలంకరించుచున్నావు – నీరాకడకై|| నిరంతరం ||

తొలకరి వర్షపు జల్లులలో – నీ పొలములోనే నాటితివి
నీలోనే చిగురించాలని – నీలోనే పుష్పించాలని (2)
పరిశుద్ధాత్మ వర్షముతో -సిద్ద పరచుచున్నావు – నీరాకడకై|| నిరంతరం ||


చాలునయ్యా చాలునయ్యా
నీ కృప నాకు చాలునయ్యా (2)
ప్రేమామయుడివై ప్రేమించావు
కరుణామయుడివై కరుణించావు (2)
తల్లిగ లాలించి తండ్రిగ ప్రేమించే (2)
ప్రేమా కరుణా నీ కృప చాలు (2) ||చాలునయ్యా||

1. జిగటగల ఊభిలో పడియుండగా
నా అడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా (2)
హిస్సోపుతో నన్ను కడుగుము యేసయ్యా
హిమము కంటెను తెల్లగ మార్చయ్యా
నీకేమి చెల్లింతు నా మంచి మేస్సీయా
నా జీవితమంతా అర్పింతు నీకయ్యా
ప్రేమా కరుణా నీ కృప చాలు (2) ||చాలునయ్యా||

2. బంధువులు స్నేహితులు త్రోసేసినా
తల్లిదండ్రులే నన్ను వెలివేసినా (2)
నన్ను నీవు విడువనే లేదయ్యా
మిన్నగ ప్రేమించి రక్షించినావయ్యా
నీకేమి చెల్లింతు నా మంచి మెస్సీయ
నీ సాక్షిగా నేను ఇలా జీవింతునయ్యా
ప్రేమా కరుణా నీ కృప చాలు (2) ||చాలునయ్యా||


Telugu Christian songs lyrics…

జ్యోతిర్మయుడా – నా ప్రాణ ప్రియుడా – స్తుతి మహిమలు నీకే …..

జ్యోతిర్మయుడా – నా ప్రాణ ప్రియుడా – స్తుతి మహిమలు నీకే …..
నా ఆత్మలో అనుక్షణం – నా అతిశయము నీవే
నా ఆనందము నీవే – నా ఆరాధన నీవే….. – 2 ” జ్యోతి”

నా పరలోకపు తండ్రీ – వ్యవసాయకుడా
నీ తోటలోని ద్రాక్షావల్లితో – నను అంటుకట్టి స్థిరపరిచావా

నా పరలోకపు తండ్రీ – నా మంచి కుమ్మరి
నీ కిష్టమైన పాత్రను చేయ నను విసిరేయక సారెపై ఉంచావా

నా తండ్రి కుమార – పరిశుద్ధాత్ముడా
త్రీయేక దేవా – ఆది సంభూతుడా నిన్ను నేనేమని ఆరాధించెద


గతకాలమంత నీ నీడలోన

దాచావు దేవా వందనం
కృప చూపినావు కాపాడినావు
ఎలా తీర్చగలను నీ ఋణం
పాడనా నీ కీర్తన-పొగడన వేనోళ్ళన (2)
వందనం యేసయ్య-ఘనుడవు నీవయ్యా (2) ||గతకాలమంత ||

ఎన్నెనో అవమానాలెదురైనను
నీ ప్రేమ నన్ను విడచి పోలేదయ్యా
ఇక్కట్లతో నేను కృంగినను
నీ చేయి నను తాకి లేపెనయ్యా
నిజమైన నీ ప్రేమ నిష్కళంకము
నీవిచ్చు హస్తము నిండు ధైర్యము (2)
వందనం యేసయ్య ఘనుడవు నీవయ్యా (2) ||గతకాలమంత ||

మాటలే ముల్లుగా మారిన వేళ
నీ మాట నన్ను పలకరించేనాయ
నిందలతో నేను నిండిన వేళ
నీ దక్షిణ హస్తం నన్నుతాకేనాయ
నీ మాట చక్కటి జీవపు ఊట
మరువనెన్నడు నిన్ను స్తుతియించుట (2)
వందనం యేసయ్య ఘనుడవు నీవయ్యా (2) ||గతకాలమంత ||
వందనం యేసయ్య విభుడవు నీవయ్యా (2)


JESUS PICTURES

ప్రార్ధన వలనే పయనము – ప్రార్ధనే ప్రాకారము
ప్రార్ధనే ప్రాధాన్యము – ప్రార్ధన లేనిదే పరాజయం (2)
ప్రభువా ప్రార్ధన నేర్పయ్యా – ప్రార్ధించకుండా నే ఉండలేనయ్యా (2)]
నీ పాదాలు తడపకుండా – నా పయనం సాగదయ్యా (2) || ప్రార్ధన వలనే ||

1. ప్రార్ధనలో నాటునది పెల్లగించుట అసాద్యము –
ప్రార్ధనలో పోరాడునది పొందకపోవుట అసాద్యము (2)
ప్రార్ధనలో ప్రాకులాడినది పతనమవ్వుట అసాద్యము (2)
ప్రార్ధనలో పదునైనది పనిచెయ్యకపోవుట అసాద్యము (2) || ప్రభువా ప్రార్ధన ||

2. ప్రార్ధనలో కన్నీళ్లు కరిగిపోవుట అసాద్యము –
ప్రార్ధనలో మూలుగునది మరుగైపోవుట అసాద్యము (2)
ప్రార్ధనలో నలిగితే నష్టపోవుట అసాద్యము (2)
ప్రార్ధనలో పెనుగులాడితే పడిపోవుట అసాద్యము (2) || ప్రభువా ప్రార్ధన ||


సర్వోన్నతుడా – నీవే నాకు ఆశ్రయదుర్గము

సర్వోన్నతుడా – నీవే నాకు ఆశ్రయదుర్గము -2
ఎవ్వరులేరు – నాకు ఇలలో -2
ఆదరణ నీవెగా -ఆనందం నీవెగా -2

నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట – నిలువలేరని యెహోషువాతో -2
వాగ్దానము చేసినావు – వాగ్దానా భూమిలో చేర్చినావు -2 ॥ సర్వో ॥

నిందలపాలై నిత్య నిబంధన – నీతో చేసిన దానియేలుకు -2
సింహాసనమిచ్చినావు – సింహాల నోళ్లను మూసినావు -2 ॥ సర్వో ॥

నీతి కిరీటం దర్శనముగా – దర్శించిన పరిశుద్ధ పౌలుకు -2
విశ్వాసము కాచినావు – జయజీవితము నిచ్చినావు -2 ॥ సర్వో ॥


Raja Nee Sannidhilo Lyrics In Telugu

రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్య
మనసారా ఆరాధిస్తు బ్రతికేస్తానయ్య
నేనుండలేనయ్య నే బ్రతుకలేనయ్య
నీవే లేకుండా నేనుండలేనయ్య
నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్య

నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం
ఆరాధించుకొనే విలువైన అవకాశం
కోల్పోయినవన్ని నాకు ఇచ్చుటకును
బాధల నుండి బ్రతికించుటకును
నీవే రాకపోతే నేనేమైపోదునో

ఒంటరి పోరు నన్ను విసిగించిన
మనుషులెల్లరు నన్ను తప్పుపట్టినా
ఒంటరివాడే వేయి మంది అన్నావు
నేనున్నానులే భయపడకు అన్నావు
నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్య

ఊపిరాగేవరకు నీతోనే జీవిస్తా
ఏ దారిలో నడిపిన నీ వెంటే నడిచోస్తా
విశ్వానికి కర్త నీవే నా గమ్యము
నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము
నిన్ను మించిన దేవుడే లేడయ


Telugu jesus songs lyrics…

చాటించుడి మనుష్యజాతి కేసు నామము
చాటించుడి యవశ్యమేసు – ప్రేమసారము
జనాదులు విశేష రక్షణ సునాదము – విను పర్యంతము
చాటుదాము చాటుదాము – చాటుదాము చాటుదాము
చాటుదాము చాటుదాము శ్రీయేసు నామము

కన్నీళ్ళతో విత్తెడు వార లానందంబుతో
నెన్నడు గోయుడు రనెడి వాగ్ధత్తంబుతో
మన్నన గోరు భక్తులారా నిండు మైత్రితో మానవ ప్రేమతో
చాటుదాము చాటుదాము – చాటుదాము చాటుదాము
చాటుదాము చాటుదాము – చక్కని మార్గము

సమీపమందు నుండునేమో చావు కాలము
సదా నశించిపోవువారికీ సుభాగ్యము
విధంబు జూపగోరి యాశతోడ నిత్యము విన్పించు చుందము
చాటుదాము చాటుదాము – చాటుదాము చాటుదాము
చాటుదాము చాటుదాము – సత్య సువార్తను


Idhi Subhodayam song lyrics in Telugu

ఇది శుభోదయం – క్రీస్తు జన్మదినం
ఇది లోక కళ్యాణం
మేరి పుణ్యదినం – (2)

రాజులనేలే రారాజు వెలసె పశువుల పాకలో
పాపుల పాలిట రక్షకుడు నవ్వెను తల్లి కౌగిలిలో
భయము లేదు మనకిలలో
జయము జయము జయమహో ||ఇది||

గొల్లలు జ్ఞానులు ఆనాడు ప్రణమిల్లిరి భయ భక్తితో
పిల్లలు పెద్దలు ఈనాడు పూజించిరి ప్రేమ గీతితో
జయనాదమే ఈ భువిలో
ప్రతిధ్వనించెను ఆ దివిలో ||ఇది||


 

 

TELUGU BIRTHDAY SONGS LYRICS IN TELUGU

error: Content is protected !!