Telugu Birthday Songs Lyrics
Spread the love

 

Telugu Birthday Songs Lyrics in Telugu…

Contents

Puttina roju jejelu chitti papayi song lyrics in Telugu

Telugu Birthday Songs Lyrics….

Movie :Bangaru Kalalu (04 June 1974)
Director :Adurthi Subba Rao
Producer :D. Madhusudhana Rao
Singer :p.shusheela
Music :Saluri Rajeswara Rao
Lyrics :Krishnamacharyulu Dasarathi
Star Cast :ANR, Waheeda Rehman

పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి
పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి
నీకు ఏటేటా ఇలాగే పండగ జరగాలి
పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి

కళకళలాడే నీ కళ్ళు… దేవుడి ఇళ్ళమ్మా
కిలకిల నవ్వే నీ మోము… ముద్దుల మూటమ్మా
కళకళలాడే నీ కళ్ళు… దేవుడి ఇళ్ళమ్మా
కిలకిల నవ్వే నీ మోము… ముద్దుల మూటమ్మా
నీకోసమే నే జీవించాలి… నీవే పెరిగి నా ఆశలు తీర్చాలి

పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి
నీకు ఏటేటా ఇలాగే పండగ జరగాలి
పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి

ఆటలలో చదువులలో… మేటిగ రావాలి
మంచితనానికి మారుపేరుగా… మన్నన పొందాలి
ఆటలలో చదువులలో… మేటిగ రావాలి
మంచితనానికి మారుపేరుగా… మన్నన పొందాలి
చీకటి హృదయంలో… వెన్నెల కాయాలి
నా బంగారు కలలే… నిజమై నిలవాలి

పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి
నీకు ఏటేటా ఇలాగే పండగ జరగాలి
పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి

నచ్చినవాడు మెచ్చిన ప్రియుడు… నాధుడు కావాలి
నచ్చినవాడు మెచ్చిన ప్రియుడు… నాధుడు కావాలి
నీ సంసారం పూల నావలా సాగిపోవాలి
నీ తల్లి కన్నీరు పన్నీరు కావాలి
నిన్నే తలచి నే పొంగిపోవాలి

పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి
నీకు ఏటేటా ఇలాగే పండగ జరగాలి
పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి

Happy Happy Birthday lu song lyrics in Telugu

Movie :Suswagatham(1 January 1997)
Director :Bhimaneni Srinivasa Rao
Producer :R. B. Choudary
Singer :Nagoor Babu, Jayachandram, Manikiran
Music :S A Rajkumar
Lyrics :Shanmukha Sharma
Star Cast : Pawan Kalyan ,Devayani

 

హ్యాపీ హ్యాపీ బర్త్ డేలు మల్లి మల్లి చేసుకోగా
శుభాకాంక్షలందజేయుమా మిత్రమా
ఆపలేని స్వేచ్ఛ వుంది అందినంత ఛాన్స్ వుంది
అందుకోరా పుత్ర రత్నమా నేస్తమా

జీవితానికే అర్ధం ప్రేమని
మరిచిపోదు మా యవ్వనమే
ప్రేమ అన్నదే సర్వం కాదని
చాటుతుంది మా అనుభవమే

చిలిపి వయసు వరస తనకు తెలియదా
హ్యాపీ హ్యాపీ ఓ ఓ
హ్యాపీ హ్యాపీ బర్త్ డేలు మల్లి మల్లి చేసుకోగా
శుభాకాంక్షలందజేయుమా మిత్రమా

తెలియకడుగుతున్నలే కంప్యూటరేమంటుంది
పాటమెంత అవుతున్నా ఫలితం ఏమైంది
బోధపడని కంప్యూటర్ బదులన్నదే లేందంది
విసుగురాని న మనసే ఎదురే చూస్తోంది

ప్రేమకథలు ఎప్పుడైనా ఒకటే ఫ్రెండ్
ఆచితూచి ముందుకెళ్లు ఓ మై ఫ్రెండ్
అప్ టూ డేట్ ట్రెండ్ మాది టోటల్ చేంజ్
పాత నీతులింకా మాకు నో ఎక్స్చేంజి

ఫ్రెండ్లాంటి పెద్దవాడి అనుభవాల సారమే
శాసనాలు కావు నీకు సలహాలు మాత్రమే
కళను వదిలి ఇలాను తెలిసి నడుచుకో

హ్యాపీ హ్యాపీ
హ్యాపీ హ్యాపీ బర్త్ డేలు మల్లి మల్లి చేసుకోగా
శుభాకాంక్షలందజేయుమా మిత్రమా

నింగిలోని చుక్కలని చిటికేసి రమ్మనలేమా
తలచుకుంటే ఏమైనా ఎదురే లేదనమా
నెల విడిచి సామైతే టైం వేస్ట్ ర ఈ ధీమా
ముందు వెనుక గమనిస్తే విజయం నేది సుమా
రోజా నవ్వు రమ్మంటున్న రోజు కదా
తాకకుండా ఉఊరుకుంటే తప్పు కదా
నవ్వు కింద పొంచి వున్నా ముళ్ళు కదా
చూడకుండా చెయ్యి వేస్తె ఒప్పు కదా

ముళ్ళు చూసి ఆగిపోతే పువ్వులింకా దాక్కున్నా
లక్ష్యమందకుండా లైఫుకార్ధంఇంకా ఉండునా
తెగువ తెలుపు గెలుపు మనకి దొరకగా

హ్యాపీ హ్యాపీ
హ్యాపీ హ్యాపీ బర్త్ డేలు మల్లి మల్లి చేసుకోగా
శుభాకాంక్షలందజేయుమా మిత్రమా
ఆపలేని స్వేచ్ఛ వుంది అందినంత ఛాన్స్ వుంది
అందుకోరా పుత్ర రత్నమా నేస్తమా

జీవితానికే అర్ధం ప్రేమని
మరిచిపోదు మా యవ్వనమే
ప్రేమ అన్నదే సర్వం కాదని
చాటుతుంది మా అనుభవమే

చిలిపి వయసు వరస తనకు తెలియదా
హ్యాపీ హ్యాపీ ఓ ఓ
హ్యాపీ హ్యాపీ బర్త్ డేలు మల్లి మల్లి చేసుకోగా
శుభాకాంక్షలందజేయుమా మిత్రమా

Telugu Birthday Songs Lyrics…

Sirulolikinche chinni navvule telugu lyrics

Movie: Yamaleela (28 April 1994)
Director: S V Krishna Reddy
Singers: S P Balasubramanyam, Chitra
Music: S V Krishna Reddy
Lyrics: Sirivennela Seetharama Sastry
Cast: Ali, Manju Bhargavi, Indraja, Kaikala Sathya Narayana
Producer: Achi Reddy

సిరులొలికించే చిన్ని నవ్వులే మని మాణిక్యాలు
చీకటి ఎరగని బాబు కన్నులే మాలాగని దీపాలు
బుడిబుడి నడకలా తప్పటడుగులే తరగని మాన్యాలు
చిటిపొటి పలుకుల ముద్దు మాటలే మా ధనధాన్యాలు

ఎదగాలి ఇంతకు ఇంతై ఈ పసికూన
ఏలాలి ఈ జగమంతా ఎప్పటికైనా
మహారాజుల జీవించాలి నిండు నూరేళ్లు

సిరులొలికించే చిన్ని నవ్వులే మని మాణిక్యాలు
చీకటి ఎరగని బాబు కన్నులే మాలాగని దీపాలు

జాబిల్లి జాబిల్లి జాబిల్లి మంచి జాబిల్లి జాబిల్లి జాబిల్లి

నాలో మురిపెంత పాలబువ్వై పంచని
లోలో ఆశలన్నీ నిజమయేలా పెంచని
మదిలో మచ్చలేని చందమావే నువ్వని
ఊరు వాడ నిన్నే మెచ్చుకుంటే చూడని

కలకాలము కనుపాపల్లె కాసుకొని
నీ నీడలో పసిపాపల్లె చేరుకొని

సిరులొలికించే చిన్ని నవ్వులే మని మాణిక్యాలు
చీకటి ఎరగని బాబు కన్నులే మాలాగని దీపాలు
బుడిబుడి నడకలా తప్పటడుగులే తరగని మాన్యాలు
చిటిపొటి పలుకుల ముద్దు మాటలే మా ధనధాన్యాలు

వేసా మొదటి అడుగు అమ్మ వేలే ఊతగా
నేర్చ మొదటి పలుకు అమ్మ పేరే ఆదిగా
నాలో అణువు అణువు ఆలయంగా మారగా
నిత్యం కొలుచుకొన అమ్మ రుణమే తీరగా

తోడుండగా నను దీవించే కన్నా ప్రేమ
కీడన్నదే కనిపించేనా ఎన్నడైనా

సిరులొలికించే చిన్ని నవ్వులే మని మాణిక్యాలు
చీకటి ఎరగని బాబు కన్నులే మాలాగని దీపాలు
బుడిబుడి నడకలా తప్పటడుగులే తరగని మాన్యాలు
చిటిపొటి పలుకుల ముద్దు మాటలే మా ధనధాన్యాలు

ఎదగాలి ఇంతకు ఇంతై ఈ పసికూన
ఏలాలి ఈ జగమంతా ఎప్పటికైనా
మహారాజుల జీవించాలి నిండు నూరేళ్లు

Happy birthday song lyrics English

Happy Birthday to you
Happy Birthday to you
Happy Birthday dear (name)
Happy Birthday to you.(2)

From good friends and true,
From old friends and new,
May good luck go with you,
And happiness too.

How old are you now?
How old are you now?
How old, How old
How old are you now?

 

More Song Lyrics:

Baby songs Lyrics

Hai Nanna Song Lyrics

Kushi Song Lyrics

 

error: Content is protected !!