Contents
అసలు-నకిలీ
Telugu Stories
అనగనగా ఒక ఊరిలో రమణ అనే అబ్బాయి అతని తల్లిదండ్రులతో కలిసి జీవించేవాడు ,అతని తండ్రికి వున్న అనారోగ్యం కారణంగా చాలా రోజులుగా పని లేక వారి కుటుంబం చాలా దీనస్థితిలో ఉండేది అదే సమయంలో రమణ తండ్రి అకస్మాత్తుగా మరణించాడు . అప్పుడు రమణ తల్లి అతనికి ఒక బంగారు హారాన్ని ఇచ్చి ,బాబు… ఇది చాలా సంవత్సరాల నుండి మన వద్దనే ఉంది, దీనిని అమ్మి వచ్చిన డబ్బులతో మనకు కావాల్సిన వస్తువులు తీసుకొని రా అని కొడుకు చెపుతుంది .
అప్పుడు రమణ ఆ హారాన్ని తీసుకొని ప్రక్క ఊరిలో ఉన్న తన చిన్నాన్న ఐన బంగారు వ్యాపారి వద్దకు వెళ్లి జరిగిన విషయం అంతా చెప్పి హారాన్ని తీసుకొని ఎంతో కొంత డబ్బు ఇవ్వమని అడిగాడు. అప్పుడు రమణ చిన్నాన్న ఆ హారాన్ని నిశితంగా పరిశీలించి, రమణా … ఈ హారం చాలా విలువైనది , ప్రస్తుతం మార్కెట్లో ఈ హారానికి తగిన సొమ్ము మనం పొందలేము కాబట్టి ఈ హారానికి మంచి రేటు పలికే వరకు నీ వద్ద జాగ్రత్తగా ఉంచు ,అదీకాక నా దగ్గర పనిచేసే ఒక కుర్రవాడు ఈ మధ్యనే పని మానేసాడు, నీకు కనుక ఎటువంటి ఇబ్బంది లేకపోతే నువ్వు నాకు ఈ బంగారం వ్యాపారం సహాయంగా ఉండగలవా అని అడుగుతాడు , రమణ సరే అని ఒప్పుకొని తన చిన్నాన్న వద్ద పనిలో చేరిపోతాడు.
అతి తక్కువ కాలంలోనే రమణ బంగారం గురించి వజ్రాల గురించి నిశితంగా పరిశీలించి అసలు ఏది నకిలీ ,ఏది ఎంత విలువ చేస్తుంది అన్ని క్షుణ్ణంగా తెలుసుకుంటాడు .
రమణ నైపుణ్యం గురించి తెలిసిన చుట్టుపక్కల గ్రామాలు ప్రజలు ఎటువంటి బంగారం వివరాలు తెలుసుకోవాలి అన్నా రమణను సంప్రదించేవారు . ఆ విధంగా పనిలో నైపుణ్యం సంపాదించాడు రమణ .
ఒకరోజు….
చిన్నాన్న రమణ ని పిలిచి, రమణ… నువ్వు కొంతకాలం క్రితం తీసుకువచ్చిన ఆ హారాన్ని మళ్ళీ తీసుకు వస్తే దానికి ధర ఎంత ఉందో లెక్క చూద్దాం అని అంటాడు. అప్పుడు రమణ సరే అని ఇంటికి వెళ్లి హారాన్ని తీసి చూస్తే రమణ కి అది బంగారం కాదు అని అర్థం అవుతుంది . అప్పుడు రమణ ఆహారాన్ని తీసుకొని తన చిన్నాన్న వద్దకు వెళ్లి, ఇది నకిలీదని మీకు ముందు నుంచే తెలుసా అని అడుగుతాడు ,అందుకు చిన్నాన్న చిన్నగా నవ్వుతూ అవును నేను ముందే గుర్తించాను అని చెప్తాడు.
అప్పుడు రమణ ,మరి మీరు ఇది చాలా విలువ చేస్తుందని నాతో ఎందుకు అబద్ధం చెప్పారు అని అడుగుతే, చిన్నాన్న రమణా… నువ్వు ఈ హారం తీసుకొచ్చినప్పుడు మానసికంగా ఆర్థికంగా చాలా కుంగిపోయి ఉన్నావు అటువంటి సమయంలో నేను ఇది నకిలీది అని చెప్తే నువ్వు నన్ను తప్పుగా భావించే వాడివి, నేను నిన్ను మోసం చేస్తున్నాను అనుకునేవాడివి అందుకే నేను అప్పుడు ఆ విషయం చెప్పకుండా నిన్ను పనిలో పెట్టుకున్నాను. ఇప్పుడు నీకు అసలు ఏదో నకిలీ ఏదో కనిపెట్టగల నైపుణ్యం వచ్చింది పైగా నీవు ఆర్థికంగా కూడా స్థిరపడ్డారు కాబట్టి నీకు ఈ విషయం అర్థమైంది అని చెప్తాడు.
చిన్నాన్న మాటల్లో అర్ధాన్ని తెలుసుకున్నరమణ అతనికి కృతజ్ఞతలు తెలుపుతాడు.
నీతి : కష్టం, మంచి ఏదో చెడు ఏదో గుర్తించగలిగే విజ్ఞతను చంపివేస్తుంది. కాబట్టి ఆవేశం లో ఏ నిర్ణయంతీసుకో కూడదు\ఎవరి పైన ఒక అభిప్రాయానికి రాకూడదు.
For more moral stories please click here
సుఖం-కష్టం
Telugu Storie
ఒక కిరాణా కొట్టు వ్యాపారి ఒక రోజు తన కొట్టు లో తేనె అమ్ముతుండగా తేనె సీసా చేజారి పోయి నేల మీద పడి పోతుంది. అతను సాధ్యమైనంత వరకూ క్రింద పడ్డది అంతా తీస్తాడు కానీ కొంత నేల మీద అలా పడిపోయి ఉంటుంది . కొంతసేపటికి కొన్ని చీమలు దానిని చూసి దాని దగ్గరికి వచ్చి , తేనె చాలా తియ్యగా ఉండడంతో అవి అక్కడి నుంచి కదలకుండా ఒకేచోట వుండి మొత్తం కడుపునిండా తింటాయి .
వాటిని చూసి ఈగలు కూడా అక్కడ చేరతాయి ,అవి అన్నీ ఆత్రంగా తేనెను తింటూ ఉంటాయే గాని ,తేనె తినడం వలన వాటి బరువు పెరిగి పోతుందని ఎగరాలేమని గ్రహించవు ,పైగా తేనెకు వుండే అంటుకునే తత్త్వం వలన ఈగల రెక్కలు అన్ని దానిలో పూర్తిగా అంటుకు పోతాయి అందువలన అవి ఎగరడానికి ఎంత ప్రయత్నించినా ఎగర లేక అక్కడే చచ్చిపోతాయి .
ఎన్ని చచ్చి పడున్నా పట్టించుకోకుండా మిగిలిన వేరే ఈగలు చీమలు మళ్ళీ మళ్ళీ వచ్చి తేనెను తింటూ ఉంటాయి,చచ్చి పోతూవుంటాయి .
కొంత సేపటికి వాటిని చూసిన వ్యాపారి “మనుషులు తమ సుఖం కోసం అపాయం అని తెలిసినా ఏ విధంగా సౌఖ్యాలకు అలవాటు పడతారో అదే విధంగా చచ్చి పోతాం అని తెలిసినా ఇవి తేనె దగ్గరకు రావడం ఆపడం లేదు” అనుకుంటాడు .
నీతి : సుఖం(సౌకర్యాలు) వెంట కష్టం వస్తుంది .
(ప్రస్తుతమున్న ఈ టెక్నాలజీ లు మనకు చాలా సౌకర్యాలను ఇస్తున్నాయి కానీ మన మానసిక మరియు శారీరక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి . ఆ విషయాన్నీ మనం ఇప్పటికన్నా గుర్తిస్తే మంచిది.
ఈ విషయాన్ని చిన్నపిల్లలకు అర్థం అయ్యేవిదంగా చెప్పాలని ఈ కథ)