Telugu Kavithalu
Spread the love

Telugu Kavithalu

Contents

తెలుగు కవితలు

ఆకాశ చుక్కల్లో
ఆకొంగు చెంగుల్లో
జారే జల్లుల వాన
ఆ కరిమబ్బు మెరుపుల్లో
ఆ కాటుక రాకనుదోయిల్లో
మెరిసే మువ్వల వీణ
ఆ చుక్క చిక్క కాంతుల్లో
ఆ బుగ్గల సిగ్గు బంతుల్లో
తడిసే నామది కోన
ఆ తరు తిమ్మిరి గాలుల్లో
ఆ తనువు గ్రంధి గంధాల్లో
తనువే ఊగే వరిఊన
ఆ పాద ముసి ముద్రల్లో
ఆ పదము గమక గజ్జెల్లో
మనసే సరిగమ అనేన
ఆ చిత్తడి చిరు చినుకుల్లో
ఆ పుత్తడి చిన్నెల నవ్వుల్లో
పెదవులే కలువై విరిసేన
ఆ తుంటరి తూటి నడకల్లో
ఆ శృతిమేను ధనువంపుల్లో
నడకే మిణుగు మీనమేన
*********
#డా!! హనీఫ్చంద్ర MD…5-12-23
#జాతీయ విశిష్ఠ కవి రత్న సేవా రత్న
#విజయవాడ………9628733806

అక్షరమే ఆత్మీయంగా పలకరించే..!!
అక్షరాలు ఎప్పటికీ అలిసిపోవు
అనుభవాలతో నడుస్తుంటాయి
ఆత్మీయంగా పలకరిస్తూ
ఆలోచనలను పెంచుతుంటాయి…
నిత్యం ఆపేక్షలను అలవర్చుకుంటూ
అనుబంధాలను ముడేసుకుంటూ
గతాల వెంట పరుగులు పెడుతూ
ప్రాణ స్నేహితులారా ప్రయాణం సాగిస్తాయి..
బాంధవ్యాల చెట్టుకు ప్రేమ నీళ్లు పోస్తూ
జ్ఞాపకాల లెక్కల్లో నెమరువేస్తూ
మనసులోని వెలితి కనుమరుగు చేస్తూ
బాహాటంగానే బంధాన్ని ముడి పెడతాయి..
వ్యధలను కన్నీళ్ళ దోసిల్లో తీసేస్తూ
కలతలను కన్నీళ్ల రెప్పలతో మూసేస్తూ
వెలితి లేకుండా జీవితాన్ని సాగిస్తూ
మనసులో దాగిన అందాన్ని చూపుతాయి..
చీకటి రోజులను చెరిపేస్తూ
జీవిత తీరానికి ఆరాటపడుతూ
అలల పైన బ్రతుకు నృత్యము చేస్తూ
అలసిన గుండెపై ముత్యాల్లా వాలుతాయి..
మౌనం ఎన్నో మాటలు నేర్పించిన
మూగబోయిన మనసు సవ్వడి చేయదు
వినిపించే క్షణం గొంతులో కన్నీళ్లు వస్తే
అక్షరమే మానసిక ఒత్తిడిని దూరం చేస్తుంది..
కొప్పుల ప్రసాద్
నంద్యాల
9885066235

వెళ్తున్న భవిష్యత్ లోకి ….
(కవిత శీర్శిక )
మాటలు పడుకుంటూ
అనురాగం తెంచుకుంటూ
అనుభవాలు మూటకడుతూ
జ్ఞాపకాలు మోసుకుంటూ
బాధ్యతలు తీసుకుంటూ
శక్తిని నింపుకుంటూ
మంచిని పెంచుకుంటూ
గాయాలను పూడ్చుకుంటూ
ఎదురైనా వాడినల్లా నమ్ముకుంటూ
కొన్నిట్లో నలుగుకుంటూ
మరి కొన్నిట్లో పక్కకు జరుగుకుంటూ
నన్ను నేను ఓదార్చుకుంటూ
రేపటి గూర్చి ఆలోచించుకుంటూ
బాధలతో వేటాడుకుంటూ
కొన్నిటిని వదులుకుంటూ
నాకు నేనే సముదాయించుకుంటూ….
రచన
గడ్డం మనోజ్ కుమార్
తెలంగాణ గౌడ రచయితల సంఘము
రాష్ట్ర అధ్యక్షులు మరియు జనగామ రచయితల సంఘము సభ్యులు
సెల్ : 9394787331

 


నీ మతమేదని అడగకు
నీ మనసేమిటని అడుగు..
మనిషి నడకను చూడకు
వ్యక్తిలో నడతను చూడు..
గెలుపుని చూసి పొంగిపోకు
దానికై విలువలని వదిలేసావేమో చూడు..
నేను నేనని మిడిసిపడుతున్నావా
నీకెవరు మిగిలారో శోధించు..
యంత్రమల్లే సిరిమంత్రం పఠిస్తున్నావా
మనోనేత్రం తెరచి మనిషివని గుర్తు తెచ్చుకో..

Surendra Nath


Telugu Kavithalu…

స్త్రీ!!!
చిన్నప్పట్నుంచి వింటున్న పేరు,
ఒక అమ్మ గా , ఒక అక్క గా ,ఒక చెల్లిగా ,ఒక చెలిగా
మనిషి లో ఒక భాగమైన ఈ “షి” ఒక ప్రయాణం….ఒక ప్రమాణం
తనకన్ని తేదీలు గుర్తుంటాయి … తన పుట్టినరోజు తప్ప
అవును మరి
బతుగు పొగలతో ఆమె జీవితపు క్యాలెండరు మసి బారింది..
ఎక్కడున్నావమ్మా???
నీ బ్రతుకుని మాకు మెతుకులుగా తినిపించి పస్తులున్న పడతీ, ఎక్కడ నీ చిరునామా??
కట్నం కుమ్ములాటలో , ప్రేమ పేరు తో మరిగే విష కషాయం లో కరిగి ,
చెల్లదు అని కొట్టేసిన కేసు స్త్రీ!!!
అవును మరి , మనది “Mr. రాజ్యం ” !!.
రాముడు ఎన్ని యుద్ధాలు చేయాలో ??
అందరూ రావణాసురులే అంతటా….
ఒక్కటి మాత్రం నిజం ..
మనిషి గతం లో ” తను” ఉంది
వర్తమానం లో “తను” ఉంది
భవిష్యత్తు లో కూడా ఉంటూ
“అతను” లో అన్నీ “తను” అయిన విజేత ఈ వనిత…
యుగపురుషుడు ఒక్కడే ….
మిగతావాళ్ళందరూ స్త్రీ లే మరి…లెక్కకందనంతమంది..
సహనం చెలికత్తెగా , బాధలు అనే కలుపుమొక్కలను ఏరుతూ
కన్నీళ్ళతో చేసే బతుకు వ్యవసాయం స్త్రీ …
ఏరుతోంది పారేసుకున్న ధాన్యం కాదు..
మగవాడి పరువు తాలూకు గుర్తులు
అందుకే
స్త్రీ లేని ప్రపంచం
పేజీలు లేని పుస్తకం లాంటిది..
అక్షరాలు లేని భాష లాంటిది
అర్థం ఉండదు…..అనర్థం తప్ప….
అందుకే ….ఓ స్త్రీ !!
నీకు అభిమాన అభివందనం !!!
మమకార సిరి చందనం !!!!


మనకి మనం…
ఎంత మంచిగా ఉన్నా
ఎవరో ఒకరి కథలో
చెడ్డ వాళ్ళమే…
మన మనసు
గాయపడ్డ వాళ్ళమే!
అందుకే…
ఇతరులకు నచ్చాలని
‘నటిస్తూ’
బ్రతకడం కన్నా…
మనకు నచ్చినట్లు
మనం బ్రతికేయడం
మంచిది… కదా!!


Telugu Kavithalu…

ఓ మిత్రమా..
దక్కని బంధం కోసం
దిక్కులేని వాడిలా ఆలోచించకు.
జరిగిన గతాన్ని మరచి
మందున్న నీ గమ్యాన్ని చేరుకో..
భవిష్యత్తులో నిన్ను వద్దనుకున్న వాళ్ళే
నిన్ను చూసి తల దించుకొని ,
బ్రతుకుతారు..! –

మరణిస్తున్నాను … మన్నించు నేస్తం……
– జన్మంతా నీ చెంతే బతకాలనుకున్నా,
దైవేచ్చకు తల వంచి నే మరణిస్తున్నా. . . .
కలకాలం నీ వెంటే ఉండాలని ఉన్నా,
విదికి ఎదురు తిరగలేక నే కనుమూస్తున్నా. . . .
– నిను కానని నా మనసు ఉరకలు వేస్తుంది,
కనిపించే ప్రతి వారిని ఆరా తీస్తుంది,
ఏమైనా ఈ క్షనమే కలవాలంటుంది,
నీ నేస్తం ఇక లేడని చెప్పాలంటుంది. . . .
– అడగకనే నీ ఆశలు తీర్చాలనుకున్నా,
చెప్పకనే నా శ్వాసను వదిలేస్తూ ఉన్నా. . . .
నీ కల్లల్లో కన్నీటిని తుడవాలనుకున్నా,
నీ ముందుండీ కదలలేక శిలనై పొతున్నా. . . .
– నను విడిచిన నా ఆత్మ దిక్కులు చూస్తుంది,
ఏ దిక్కున నీవున్నా తప్పక రమ్మంది,
చివరిసారి నీ నవ్వును చూడాలంటుంది,
నవ్వలేని నిన్ను చూసి ఏడ్చాలంటుంది. . . .
– వాడిపోని పువ్వునై ఉండాలనుకున్నా,
రాలిపోయి నేలపైన శిలనై పడి ఉన్నా. . . .
వీడిపోని నీడనై నడవాలనుకున్నా,
కదలలేని కాయమై ,ఓ కలనై పోతున్నా. . . .
– గతియించిన నా దేహం నీ ముందే ఉంది,
నీ స్పర్శకు నోచుకోక కన్నీరౌతుంది,
ముందుకొచ్చి ముద్దిచ్చి సాగనంపు నేస్తం,
మనసారా కౌగిలించి కలత తీర్చు బందం. . . .
– అందరాని తీరాలకు నే అడుగులు వేస్తున్నా,
నీ అందమైన స్నేహాన్ని ఆస్వాదిస్తున్నా. . . .


ఆ అందాల ఆకాశం నన్ను చూసి అసూయపడుతుంది …!
ఆప్యాయంగా పలకరించే నీలాంటి ఆప్తుడు తనకు లేడని…,
ఆ చుక్కల్లోని చందమామ నన్ను చూసి చిన్నబోతుంది …!
చిరునవ్వుతో పలకరించే నీలాంటి చెలికాడు తనకు లేడని …,
ఆ ఏడురంగుల ఇంధ్రధనస్సు నన్ను చూసి నివ్వెరపోతుంది …!
ఎల్లప్పుడూ వెంట ఉండే నీలాంటి స్నేహితుడు తనకు లేడని …,
అందుకోలేనేమో ఆ ఆకాశాన్ని ,
అనుభవించగలను ఆ ఆనందాన్ని ,
అభిమానిస్తూ ఆమోఘమైన నీ స్నేహాన్ని…!!
చుట్టిరాలేనేమో ఆ చందమామని ,
చూడగలను ఆ చుక్కలలోకాన్ని,
ఆస్వాదిస్తూ చల్లనైన నీ చెలిమిని …!!
తాకలేనేమో ఆ ఇంధ్రధనస్సుని ,
శోధించగలను రంగురంగుల ప్రపంచాన్ని ,
సంతోషంతో సాగిపోతున్న నీ సావాసాన్ని…!!
కమనీయమైన నీ రూపాన్ని,
నా కనుపాపలలో దాచి,
కలకాలం కొలువుంచాలనుకున్నాను…!
కానీ కనిపించని కలయేదో వచ్చి,
నా కన్నీటితో దానిని తీసుకుపోయింది …!
మధురమయిన క్షణాలను,
మరపురాని జ్ఞాపకాలుగా,
నా మనసులో ముద్రించాలనుకున్నాను …!
కానీ మూగబోయిన మది భావం ,
మాటలురాక మౌనంతో వాటిని మోసుకుపోయింది…!
సరదాసరాగాల నీ స్నేహాన్ని,
సంతోషంతో సాగించాలనుకున్నాను…!
కానీ కరిగిపోతున్న కాలం ,
ఆ బంధాన్ని గతంగా తుడిచిపెట్టింది…!
వెక్కిరిస్తుంది ఈ వింతకాలం…
నేను ఒంటరినని…!!!
తనకు తెలీదేమో మరి…
నీ ప్రాణం నా చెంతనుండగా…
నేనెలా ఒంటరినౌతానని…!!!
తెలుసుకుంటుందా ఆ విషయం…!
మనమిద్దరమైనా మన ‘ప్రాణ’స్నేహం ఒకటేనని….


Telugu Kavithalu…

నేను మండే మట్టి బెడ్డను..!!
మండే మట్టి బెడ్డనైనా
చల్లని నీడనిచ్చే చెట్టును సృష్టించా
పలచని గడ్డిపరకలను మొలిపించి
నేలపై ధ్వజస్తంబాలుగా నిలబెట్టా..!!
నిన్నటి చిరు మొలకను
నేడు గర్జించే మహా వృక్షాలుగా పెంచాను
ప్రతిఘటిస్తున్న కబంధహస్తాలను
తెల్లబోయేలా చేస్తూ ముందుకు సాగాను..!!
మబ్బులతో కలిసి ప్రయాణం చేస్తూ
సూర్యుని కట్టేసుకున్నాను
పెత్తనం చేసే ఆకాశాన్ని
చల్లని కబురుతో చుట్టేసుకున్నాను…!!
కుత్తుక నిండా నీరును బిగపట్టి
నాపై ప్రాణులకు అమృతాన్ని పోశాను
కాలుష్య విషయాన్ని దిగమింగి
గరళం కంఠంతో జీవనం సాగిస్తున్నా..!!
సూక్ష్మమైన విత్తనానికి విశ్వరూపం ఇచ్చిన
బక్క పలచ ప్రాణికి ఆత్మవిశ్వాసం పోసినా
అంతస్తుల పునాదులకు బలం చేకూర్చి
చారిత్రక కట్టడాలై జగతిలో విరాజిల్లిన…!!
నన్ను నమ్ముకున్నోడు రైతు రాజు
నన్ను అమ్ముకున్నోడు శ్రీమంతుడు
నన్ను కాపాడుకుంటే ఆరోగ్యవంతుడు
నా ప్రాణాలు తీస్తే ప్రళయమే సృష్టిస్తా… !!
కొప్పుల ప్రసాద్
నంద్యాల
9885066235


నా మాటలే నాతో నిత్య ప్రయాణం..!!
మాటలు నాతో పాటు నడుస్తాయి
వృద్ధుల్లా కొన్ని నిదానంగా
పిల్లల్లా కొన్ని పరిగెత్తుతూ
ప్రతినిత్యం చెయ్యి పట్టి తోడుగా వస్తాయి…
మనసు రెక్కల్లో ఎగురుతూ
లాంతర్లు వెలుగులో దారులు చూపిస్తూ
అమావాస్య చీకటిలో చుక్కల రంగవల్లి రుద్ది
పాలపుంతలో కనిపించే సూర్య గోళంలా..
గొంగళి పురుగు సీతాకోకచిలుకలా కదిలినట్లు
మిణుగురు పురుగులు చీకటి చీల్చినట్లు
నల్లటి నీడలో మనిషి పెరిగినట్లు
కప్పుకున్న దుప్పటి తొలగినట్లుగా తోస్తాయి..
వనంలో పువ్వులు పలకరించే
మకరందాన్ని సేకరించి అందించే
నింగి జాబిల్లి పండు వెన్నెలను కురిపించే
నా మాట అడవి మొగ్గ ఆనందంతో వికసించే..
చక్కగా నిలబడి ధైర్యం నింపే
నాతో నడుస్తూ కవితలు అల్లి చూపించే
అంతరంగాన్ని ఆవిష్కరించే
అనంత గమ్యాలకు పాటలు పాడుతూ సాగెను…
సుప్రభాతములలో సూర్య కిరణమై వచ్చే
పక్షి గూడును కదిలించి రాగాలు పలికించే
అడుగుల శబ్దములు ఆశలు నింపి
జగతి ప్రయాణంలో పదనిసలు పలికించే..
చెయ్యి పట్టి పలకను దిద్దినప్పుడు తోడుండె
అమ్మ కౌగిట్లో గోరుముద్దల్లా ఊరించే
ఊరగాయ పచ్చళ్ళ పాత రుచులను అందించే
ముఖ్య గమనంలో అక్షర నిధిలా తోడు నిలిచే..
కొప్పుల ప్రసాద్
నంద్యాల
9885066235

 

 

 

 

Vemana Padyam

Sumati Sathakam

Riddles in Telugu

నాకు నచ్చిన కవితలు కొన్ని సేకరించి ఇక్కడ ఉంచుతున్నాను మీకోసం … రచయితలు ఎవరో మీకు తెలిస్తే వారి పేరు చెప్పగలరు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!