Telugu Stories for Elders
Contents
పట్టు విడుపు
Telugu Stories for Elders..
Story 1:
అనిరుధ్ 10th క్లాస్ చదువుతున్నాడన్న మాటే గాని చదువు మీద అస్సలు శ్రద్దే లేదు ఎంత సేపు టీవీ చూడడంక్రికెట్ ఆడడం అదీ కాదు అంటే ఫోన్ చూడడం , అనిరుధ్ ప్రవర్తన చూసి విసుగు పోయిన వాళ్ళ నాన్నకృష్ణ ఒకరోజు కొడుకుని పిలిచి చూడు … ఇకపై కూడా నువ్వు ఇలానే ప్రవర్తిస్తే ,చదువును నిర్ల్ష్యం చేస్తే నిన్ను హాస్టల్ లో జాయిన్ చేస్తాను అప్పుడు గాని నీకు మావిలువ తెలీదు అని మొదటి హెచ్చరిక జారీచేశాడు , కానీ..! అది విన్నాక కొడుకు మొఖంలో భయం కనపడగపోగా ఒక విచిత్రమైన నవ్వు చూసాడు . ఆ నవ్వుకి అర్థం వెతుకుతున్న కృష్ణ కి ముందుముందు ఏదో ప్రమాదం ముంచుకొస్తుంది అని, అనిరుధ్ ని దూరంగా హాస్టల్ లో ఉంచడం వల్ల ప్రయోజనం లేదని ,వాడు బాగా ముదిరిపోయాడని, వాడిని ఎట్టిపరిస్థితుల్లో వదల కూడదని నిశ్చయించుకున్నాడు.
మరుసటి రోజే ఆఫీస్ కి వెళ్లి తాను రేపటి నుండి సాయంత్రం ఐదున్నరకల్లా ఇంటికి వెళ్లిపోవాలని, ఏ పనున్నా అంతకుముందే చెప్పాలని రిక్వెస్ట్ చేసాడు . కృష్ణ మంచి పనిమంతుడు అయినందున ఏ పని పెండింగ్ పెట్టని వ్యక్తి అవ్వడం వలన వాళ్ళ సీనియర్ కూడా అందుకు అంగీకరించాడు.
సాయంత్రం కృష్ణ ఇంటికి వెళ్లే దారిలో ఒక కొత్త పుస్తకం కొనొక్కొని వెళ్ళాడు . ఇంటికి వెళ్లే సరికి అనిరుధ్ ఇంకా ట్యూషన్ నుండి
రాలేదు.
కృష్ణ గబగబా తయారయ్యి ఆ నోట్ బుక్ పై మై ఫస్ట్ ప్రయారిటీ అని రాసుకొని డేట్ వేసి ,అనిరుధ్ కోసం వెయిట్ చేస్తూ వున్నాడు . కొంత సేపటికి అనిరుధ్ వచ్చాడు, కొడుకుని చూస్తూ కృష్ణ రానాన్న.. ఇంత టైం అయిందేమిటి? అన్నాడు. ఇంత తొందరగా ఆఫీసు నుంచి వచ్చిన తండ్రి చూసి ఆశ్చర్యపోయిన అనిరుధ్ ఆలస్యం ఏమీ లేదు నాన్న రోజులాగే వచ్చాను అన్నాడు. కొంతసేపు కృష్ణ కూడా కొడుకుతో కలిసి టీవీ చూసి ఈరోజు ట్యూషన్ లో ఏం చెప్పారు స్కూల్లో చెప్పినవే చెప్పారా లేకపోతే కొత్తగా చెప్పారా అని అడిగాడు. అనిరుధ్ అయోమయంగా ఏమిటో! ఈరోజు నాన్న చాలా కొత్తగా ఉన్నాడు అనుకుంటూ,ఏమీలేదు … రోజులాగే జరిగింది చెప్పాను కదా అన్నాడు విసుగ్గా . అలా కాదురా ఒకసారి నీ పుస్తకాలు తీసుకురా అన్నాడు కృష్ణ
సరే.. ఎన్ని రోజులు చదివిస్తాడో నేను చూస్తాను అనుకుంటూ వెళ్లి పుస్తకాల సంచి తీసుకొచ్చి కృష్ణముందు పడేసాడు అనిరుద్ . కృష్ణ తన జేబులో నుంచి మొబైల్ ఫోన్ తీసి స్విచ్ ఆఫ్ చేసి పక్కన పడేసి అనిరుద్ డైరీ పట్టుకొని దానిలో ఈ రోజు ఏ ఏ పాఠాలు చెప్పారు దానిలో అనిరుద్ ఏమేమి చదివాడు అని అడుగుతూ అసలు ఎక్కడ వరకు చదివాడో తెలుసుకున్నాడు.
భోజనం సమయం చేసే సమయంలో కొడుకుతో తన ఫ్రెండ్స్ విషయాలు అడుగుతూ పూర్తిగా సమయా న్నంతా కొడుకుతో గడిపాడు కృష్ణ.
Telugu Stories for Elders
ఉదయాన్నే …
నిన్న విషయాన్ని గుర్తు చేసుకొని అనిరుధ్ ,బాబోయ్!! నాన్న ఏంటి ఇలా నా వెనకాల పడ్డాడు ఈరోజు నుంచైనా మామూలుగా ఉంటే బాగుండు అనుకున్నాడు,… కానీ తన ఆశ నిరాశే అని అనిరుద్ కి తరువాత తెలిసింది .
ఆ రోజు నుంచి కృష్ణ ఏ రోజు వదలకుండా అనిరుధ్ వెంట పడుతూనే ఉన్నాడు ,అనుకోని విధంగా అనిరుధ్ మార్కుల్లో కూడా చాలా వ్యత్యాసం కనబడింది మార్కులు రోజురోజుకీ పెరుగుతూ వచ్చాయి కానీ అనిరుధ్ మనసులో తండ్రి మీద కోపం మాత్రం పెరిగిపోతూ ఉంది.
అనిరుధ్ అనుకున్న విధంగానే మంచి మార్కులతో టెన్త్ క్లాస్ లో పాస్ అయ్యాడు అదేవిధంగా ఇంటర్లో కూడా మంచి మార్కులు సాధించాడు. తండ్రి కోరుకున్నట్టే అనిరుధ్ కూడా మంచి ఇంజనీరింగ్ కాలేజీలో సీటు తెచ్చుకొని బాగా సెటిల్ అయ్యాడు.
చాలా సంవత్సరాలు గడిచాయి …
అనిరుధ్ తన ఉద్యోగంలో చాలా బిజీ అయిపోయాడు బాగా సంపాదిస్తున్నాడు ,కానీ కొడుకు వెనకాల పడుతూ.. కొడుకుని చదివిస్తూ… కొడుకుకు తో ఏంతో సమయం గడుపుతూ వుండే కృష్ణకు మాత్రం కొడుకు చాలా అలవాటైపోయాడు కొడుకు దూరంగా ఉంటే చాలా బాధగా అనిపిస్తుంది.
అనిరుధ్ కి మాత్రం హమ్మయ్య! నాన్న చుట్టుపక్కల లేడు ప్రశాంతంగా ఉండొచ్చు అనే భావనలో బతికేస్తూ.. ఉన్నాడు.
తన తండ్రి తనకోసం ఎంత తపనపడ్డాడో ఎంత త్యాగం చేశాడో ఎంత సమయాన్ని తన గురించి వెచ్చిచ్చాడు అనిరుధ్ కి తాను తండ్రి అయ్యా కన్నా తెలిసోస్తుందేమో చూడాలి.
చాలామంది జీవితంలో పట్టు విడుపు ఉండాలంటారు కానీ.. కొన్ని సందర్భాల్లో పట్టిన పట్టు వదలకుండా సాధించుకోవడంలోని జీవితానికి సార్ధకత ఉంటుంది.
Gummad.Sireesha
Telugu Stories for Elders…
Story 2:
రతిక ఇంటిలో నుండి బయటకు వస్తూనే సింధు వాళ్ళ ఇంటి డోర్ మూసి ఉండడం చూసి నిరాశగా ఇంటిలోకి వెళ్ళిపోయింది . అస్సలు అలా జరుగకుండా ఉంటే ఎంత బాగుండేది! నేను కూడా బుద్ధిలేకుండా అలా బిహేవ్ చేయకుండా ఉండవలసింది అనుకుంటూ పదోరోజుల క్రిందట జరిగిన విషయాన్నీ గుర్తుచేసుకుంది .
ఆ రోజు సంక్రాంతి సింధు వాళ్ళ ఫామిలీ మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము ,అందరం కలసి ఒకే కలర్ డ్రెస్ లు వేసుకొని అపార్ట్మెంట్ అంతా మాట్లాడు కొనేంత హడావిడిగా ఫోటోలు దిగాము ఇన్స్టాగ్రాం రీల్స్ చేసాము . ఆ రోజు సాయంత్రం కాలనీ లో జరిగిన ముగ్గుల పోటీలో చాలా హ్యాపీ గా పాల్గొన్నాము ,నా ముగ్గు బాగుండడంతో నాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది సింధుకి ఏ ప్రైజ్ రాలేదు అయినా కూడా నాకు కంగ్రాట్స్ చెబుదామని వచ్చిన సింధుని మా పదేళ్ళ బాబు లూజర్ ఆంటీ కి జై !! అన్నాడు . వాడు అందరితో అలాగే సరదాగా మాట్లాడుతాడు ఆ విషయం ఐదేళ్లుగా మాతో కలసి మెలసి ఉంటున్న సింధు కి తెలుసు అయినా కూడా ,ఆ మాటతో కోపం వచ్చినట్టుంది వెంటనే వాడిని ఒక దెబ్బవేసింది గట్టిగా . చుట్టూ అందరూ ఉండడం తో సిగ్గుపడిన వాడు ఏడవడం మొదలు పెట్టాడు . వాడి ఏడుపు చూసి నాకు వెంటనే కోపం వచ్చింది “ఏం సింధు నీకు పిచ్చి పట్టిందా” అన్నాను ,ఆ మాటకు వెంటనే సింధు “అవును నేను పిచ్చిదాన్నే నాతో మాట్లాడకు అని ఘద్గదమైన స్వరం తో చెప్పి అక్కడనుండి వెళ్లి పోయింది .
అప్పటినుండి…
మాకు మాటలు లేవు ,అసలే ఓడిపోయానన్న బాధలో వున్న సింధుని అందరిముందు లూజర్ అనడం మా వాడి తప్పయితే … వాడి మనస్తత్వం తెలిసీ వాడిని కొట్టడం సింధు తప్పు … దీనిలో ఇద్దరం దోషులమే
కానీ మాట్లాడకుండా ఉండడం చాలా కష్టంగా బెంగగా వుంది నాకు ,ఈ రోజు ఎలాయినా సింధుతో మాట్లాడదాం అని నిశ్చయించుకున్నాను కానీ ప్రొద్దుటనుండి డోర్ మూసేవుంది ఎందుకో తెలవడం లేదు,
ఇంతలో పనిఅమ్మాయి వచ్చింది ‘అమ్మా మీకు తెలుసా సింధమ్మకు ఏదో వైరల్ జ్వరం వచ్చిందంటే ‘ వాచ్ మెన్ చెప్పాడు అంది. ఆ మాటవింటునే చాలా బాధ అనిపించింది, వెంటనే ఏమీ ఆలోచించకుండా సింధు వాళ్ళ ఇంటి డోర్ కొట్టాను ,డోర్ ఓపెన్ చేసి ఎదురుగా నీరసంగా నుంచొని వుంది సింధు , తన చేయి పట్టుకొని ఏం! సింధు జ్వరం వస్తే కనీసం చెప్పవా.. చూడు ఎంత నీరసం అయిపోయావో అన్నాను అంతే ,ఒక్క సారిగా నన్నుపట్టుకొని ఏడవడం మొదలు పెట్టింది ,sorry అక్క నేను మీ బాబుని అలా కొట్టకుండా ఉండవలసింది అని ,
నాకూ కూడా కళ్ళలో నీళ్లు తిరిగాయి ,ఊరుకో సింధు.. వాడికి అప్పుడప్పుడు అలా దెబ్బలు పడాలి అప్పుడు గాని మాటవిన్నడు వెధవ అన్నాను .
అప్పుడు కొంచం నవ్వింది …
ఆ క్షణం నుండి మా స్నేహం షరామామూలే ఈ సారి ఇంకొంచం దృడంగా (అప్పుడప్పుడూ దూరం కూడా బంధాన్ని బలపరుస్తుందంటే ఇదే ఏమో… )
పట్టు విడుపు ఉండాలి అంటారు అందుకే మరి!!
Gummad.Sireesha