కాకి కథ నీతి కథ|Telivaina kaki story in Telugu writing|
Spread the love

Contents

కాకి కథ-1

కాకి కథ నీతి కథ|Telivaina kaki story in Telugu writing|

అనగనగా ఒక రోజు పెద్ద గాలి వాన రావడంతో ఒక తోటలో వున్న చెట్లు చాలా విరిగిపోయాయి ఆ చెట్లమీద నివాసముంటున్న పక్షుల గూళ్ళు కూడా రాలి పోవడం తో ఆ పక్షులు కొత్త గూళ్ళు వెతుక్కుంటూ చెరో దిక్కు వెళ్లిపోయాయి.
వాటిలో రాణి అనే ఒక కాకి మాత్రం ఒంటరిగా ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళింది, అది చాలా పక్షులు ఉన్న ఒక చిన్న అడవి అక్కడ చాలా నీటి కొలనులు కూడా వున్నాయి . ఆ ప్రదేశాన్ని చూస్తే రాణికి చాలా నచ్చింది ,ఇంక ఇక్కడే తన నివాసం ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకుంది .

వేరే పక్షులతో మాట్లాడదామని ప్రయత్నించింది కానీ ఒక్క పక్షికూడా రాణితో మాట్లాడడానికి ఇష్టపడలేదు సరి కదా వాటి పిల్లలతో రాణికి దూరంగా ఉండమని చెప్పాయి . అది వింటే రాణికి బాధగా అనిపించింది ,వెంటనే!! సరేలే రేపు నేనైనా నా పిల్లలతో కొత్తగా వచ్చిన వారితో మాట్లాడొద్దనే చెబుతానుకదా అనుకుంది .

ఆ కొత్త ప్రదేశంలో రాణి చాలా రోజులు ఒంటరిగానే గడిపింది ఎప్పటికైనా ఎవరన్నా తనతో మాట్లాడతారని ఆశతో…

ఒక రోజు రాణి ఒక చెట్టుమీద కూర్చొని ఉండగా ఒక చిన్న పక్షి పిల్ల నీటి కొలనులో పడిపోయింది అది ఎంత చిన్నదంటే దానికి ఈదడం కూడా రాదు… రాణి కంగారుగా చుట్టూ ప్రక్కలతా చూసింది ఎవరితోనైనా చెబుదామని, కానీ అది పక్షులు ఆహారం వేట కోసం వెళ్లే సమయం కావడం తో చుట్టూ ప్రక్కల ఎవ్వరూ లేరు .

కాకి కథ నీతి కథ….

రాణికి ఏమి చేయాలో పాలుపోలేదు నీటిలో దిగి పక్షి పిల్లని రక్షిద్దాం అంటే వేరే పక్షులు గుర్తుకు వచ్చి భయం వేసింది, ఏమో !! నేను ఈ పిల్లను నోట కరచి రక్షించే సమయంలో వేరే పక్షులు చూశాయి అంటే.. నేనే ఈ పక్షిపిల్లను ఏదో చేసాను అంటారు. అనుకుని ఒక్క క్షణం ఆగింది కానీ.. అప్పటికే ఆ పిల్ల నీటిలో మునిగి పోతుండడం చూసి అయ్యో!! ఎవ్వరు ఏమన్నా నన్ను ఇక్కడనుండి వెళ్ళి పోమన్నా నన్ను చంపినా కూడా పరవాలేదు ప్రస్తుతం ఈ పక్షిపిల్లని కాపాడం ముఖ్యం అనుకొని వెంటనే నీటిలో దిగి పక్షిని పైకి తీసుకు రావడానికి నోటకరచింది అంతే అంత సేపు కనుచూపు మేరలో కనబడని పక్షులు అన్నీ ఒక్కసారిగా వచ్చి రాణిని కోపంగా చూశాయి అంతే రాణి పై ప్రాణాలు పైకే పోయాయి.
వాటిలో బలమైన ఒక పక్షి రాణి వైపు వస్తూ మేము లేని సమయం చూసి మా పిల్లను తీసుకు పోదాం అనుకుంటున్నావా… అంటూ రాణిని తన బలమైన గోర్లతో రక్క బోయింది అంతలో అక్కడ చెట్టుపై చాలా సేపటినుండి దాక్కోనివున్న ఒక ముసలి పక్షి అక్కడికి వచ్చి ఆగండి ,నేను చాలా రోజుల నుండి ఈ కొత్త పక్షిని గమనిస్తూనే వున్నాను దీనివల్ల మనకు ఎటువంటి హాని లేదని నేను నిర్దారించుకున్నాను కానీ ఈ రోజు అది నీటిలో పడిన మన పిల్లను రక్షించిన విధానం చూసి దీనికి చాలా మంచి మనసు,దైర్యం కూడా ఉందని అర్థమైంది అంది.

కాబట్టి ఇక మీదట మన మందరం దీనిని(రాణి) కూడా మన కుటుంబం లో చేర్చుకుందా అని చెప్పింది.

ముసలి పక్షి మాటలు విని విషయం అర్థం చేసుకున్న మిగిలిన పక్షులు అన్ని రాణి దగ్గరకు వచ్చి కృతఙ్ఞతలు చెప్పాయి ఆనందంగా రాణిని తమ గుంపులో చేర్చుకున్నాయి.

ఆ విధంగా రాణి తన మంచి మనసుతో ఒక చక్కటి కుటుంబాన్ని పొందింది.


కాకి కథ-2

కాకి కథ నీతి కథ|Telivaina kaki story in Telugu writing|

అనగనగా రామవరం అనే ఊరిలో వుండే రైతులకు ఒక సమస్య వచ్చింది.అదేంటంటే…

ఆ ఊరిలో వున్న ఎలుకలు అన్ని వచ్చిన వారి పంటను నాశనం చేస్తున్నాయి . ఈ సమస్య నుండి ఎలా బయటపడాలో తెలియని వూరి రైతులు అందరూ ఆలోచిస్తుండగా… వారిలో ఒక రైతుకి ఒక ఆలోచన వచ్చింది, మనం మన చిన్నప్పటి నుండి కాకులను చాలా తెలివైనవని వాటికి అవసరమైతే ఏమైనా చేయాడానికి వెనుకాడని వింటున్నాం కదా…

యిప్పుడు మనము వాటి సహాయంతో ఈ ఎలుకల బారినుండి ఏమన్నా బయటపడగలమేమో ఒక్కసారి ఆలోచించండి అన్నాడు .

అప్పుడు మిగిలిన వారందరు కూడా అవును మనం కాకుల సహాయం తీసుకుందాం అన్నారు.అందరు కలసి కాకుల దగ్గరకు వెళ్ళి వారు ఎలుకల వల్ల ఎదుర్కొంటున్న సమస్య గురించి చెప్పారు . అప్పుడు కాకులు మీరు ఎంతో కాలంగా మా అందరికి అవసరమైన ఆహారం పండిస్తున్నారు దానివలన మేము అందరం ఇంత ఆనందంగా వున్నాం అటువంటి మీకు మేము తప్పకుండా సహాయం చేస్తాం అన్నాయి.

కాకి కథ నీతి కథ

మరుసటి రోజు కాకులన్ని ఎలుకలు వుండే కలుగులు దగ్గరకు వెళ్లి పెద్ద పెద్దగా అరవడం మొదలు పెట్టాయి వాటి అరుపులు విని భయపడిన ఎలుకలు బయటకి వస్తే కాకులు వాటిని తినేస్తాయేమో అని బయటకు రాకుండా కలుగులోనే దాక్కున్నాయి.
అది చూసిన కాకులు ఇక సమస్య తీరిపోయింది అనుకోని అక్కడనుండి వాటి గూటికి వెళ్లి పోయాయి.

మరుసటి రోజు వచ్చి చూసే సరికి మళ్ళీ సమస్య మొదటికి వచ్చింది అని అర్థమైంది.
ఈ సారి ఇంకొంచం గట్టిగ ప్రయత్నించాలని నిర్ణయించుకున్న కాకులు ఎలుకల కలుగుల చుట్టూ పదునైన ముళ్లపొదలు ఉంచాయి … వాటిని దాటి బయటకి రాలేని ఎలుకలు వేరే దారిలేక ఇంకో మార్గం చేసుకొని ఊరి బయటకు పరిగెట్టాయి.

కాకులు చేసిన మేలుకు ఆ ఊరివారు కాకులకు మంచి ఆహారం అందేలాగా జొన్న కంకులను పొలంలో కట్టారు.

 

నీతి :అప్పుడప్పుడూ చెడ్డ ఆలోచనలు కూడా మంచి పని కోసం అవసరానికి వస్తాయి.

 

మనకు ఎన్నో నీతి కథలు తెలుసు అందులో తెలివిగల కాకి తన తెలివితో తన సమస్య నుండి ఎలా బయటపడిందో కూడా తెలుసు , మీకు ఆ కథ కాకి కథ తెలియక పోతే క్రిందవున్నLink Press చేయండి.

 

For more Crow stories please visit: Chandamaama kathalu

For Old/Famous/Known Stories please visit: Famous stories

Please visit this link for “Chinna Pillala Neetikathalu” in Telugu to read :చిన్న పిల్లల నీతికథలు 

కాకి కథ నీతి కథ|Telivaina kaki story in Telugu writing|

 

 

 

మంచి కథ అనేది పిల్లలలో ఆలోచనా శక్తిని పెంచుతుంది,ఏది చెడో ఏది మంచో తెలియచేస్తుంది .

అందుకే తప్పని సరిగా పిల్లలకు నీతికథలు పరిచయం చేయండి..

 

 

error: Content is protected !!