Telugu Podupu Kathalu with Answers | తెలుగు పొడుపు కథలు

తెలుగు పొడుపు కథలు | 100+ Telugu Podupu Kathalu with Answers

తెలుగు పొడుపు కథలు మన ఆలోచనా శక్తిని పెంచే సరదా ప్రశ్నలు. ఈ పేజీలో 100+ తెలుగు పొడుపు కథలను వివిధ సెట్లలో, వాటి సమాధానాలతో చదవవచ్చు. పిల్లలు, విద్యార్థులు, కుటుంబ సభ్యులు కలిసి ఆడుకోవడానికి సులభమైనవి, ఆసక్తికరమైనవి, కొంచెం కష్టమైన పొడుపు కథలు కూడా ఇందులో ఉన్నాయి.

ముందుగా పొడుపు కథను చదివి జవాబు ఏమిటో ఆలోచించండి. ఆ తర్వాత సమాధానం చూడండి. మీకు నచ్చిన పొడుపు కథలను స్నేహితులు, పిల్లలతో పంచుకుని సరదాగా ఆడుకోవచ్చు.


 

ఈ పేజీలో 100+ తెలుగు పొడుపు కథలను వివిధ సెట్లలో, వాటి సమాధానాలతో చదవవచ్చు.

వివిధ సెట్లలోని తెలుగు పొడుపు కథలు, పిల్లల రిడిల్స్, ఫన్నీ రిడిల్స్ మరియు కష్టమైన పొడుపు కథలను ఇక్కడ చూడవచ్చు.

📚 Podupu Kathalu Set 1

తెలుగు పొడుపు కథల మొదటి భాగం. కుటుంబ సభ్యులు మరియు పిల్లలతో కలిసి ఆడుకునే సరదా ప్రశ్నలు.

👉 చదవండి

📚 Podupu Kathalu Set 2

ఆసక్తికరమైన తెలుగు పొడుపు కథలు మరియు జవాబులు.

👉 చదవండి

📚 Riddles with Answers in Telugu

మీ తెలివితేటలను పరీక్షించే ప్రశ్నలు.

  • కొందరు ఒక వ్యక్తిని ఒక చిన్న గదిలో బంధించారు . ఆ గది నుండి అతను బయటకు వెళ్ళడానికి ఒక చిన్న కిటికీ తప్ప ఎటువంటి దారి లేదు ఆ కిటికీ అతను నుంచున్న నేల నుంచి చాలా ఎత్తులో ఉంది .ఆ గదిలో అతనితోపాటు ఒక పార మాత్రమే ఉంది, అతనిని ఆ గదిలో రెండు రోజులు మాత్రమే బంధించాలని వారు నిర్ణయించారు తర్వాత అతనిని చంపి వేయాలని నిర్ణయించుకున్నారు . అతను ఆ గదిలో ఉన్న మట్టి నేలను తవ్వి సొరంగం చేసుకుని పారిపోదాం అంటే అది రెండు రోజుల కన్నా ఎక్కువ సమయం పడుతుంది.
    అతను అక్కడి నుంచి తప్పించుకుని పారిపోవడానికి మీరు ఏమన్నా సహాయం చేయగలరా….

👉 చదవండి

📚 Riddles in Telugu with Answers – Set 4

కొత్త తెలుగు రిడిల్స్ సేకరణ.

  • ఇద్దరు తండ్రులు, ఇద్దరు కొడుకులు ఒకరోజు చేపల వేటకు వెళ్లారు. వారు రోజంతా అక్కడే ఉన్నారు మరియు 3 చేపలను మాత్రమే పట్టుకున్నారు. వారిలో ఒక తండ్రి అన్నాడు, ఇవి చాలు మనందరికీ,ఒకొక్కరికి ఒక్కొక్కటి వస్తుంది అన్నాడు . ఇది ఎలా సాధ్యమవుతుంది?

👉 చదవండి

📚 Hard Riddles in Telugu for Adults– Set 5

పెద్దల కోసం ప్రత్యేకంగా రూపొందించిన కష్టమైన పొడుపు కథలు.

    1. ఒక వ్యక్తి ఒక క్లబ్ కి పార్టీకి వెళ్ళాడు కానీ అతనికి లోపలికి ప్రవేశించడానికి కావలసిన పాస్వర్డ్ తెలీదు.

    అతను బయట నుంచుని ఏమన్నా పాస్వర్డ్ తెలుస్తుంది ఏమో చూద్దామని వచ్చే పోయే వ్యక్తులు ఎలా లోపలికి వెళుతున్నారో గమనిస్తున్నాడు . అప్పుడు ఒక వ్యక్తి వచ్చి డోర్ తట్టాడు అప్పుడు అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్ 12 అన్నాడు వ్యక్తి 6 అని బదులిచ్చాడు వెంటనే సెక్యూరిటీ గార్డ్ డోర్ ఓపెన్ చేసి అతన్ని లోపలికి పంపించాడు .
    అప్పుడు పాస్వర్డ్ కోసం ఎదురుచూస్తున్న వ్యక్తి తనకు విషయం ఏదో అర్థమైనట్లుగా వెళ్లి డోర్ తట్టాడు అప్పుడు సెక్యూరిటీ గార్డు 10 అన్నాడు అందుకు ఆ వ్యక్తి 5 అని జవాబు ఇచ్చాడు కానీ సెక్యూరిటీ గార్డు అతన్ని లోపలికి అనుమతించలేదు. ఎందుకు? అసలు అసలైన పాస్వర్డ్ ఏమిటి?

👉 చదవండి

📚 Riddles in Telugu for All with Answers – Set 6

అందరి కోసం అద్భుతమైన పొడుపు కథలు

  • నేను ఒక హృదయాన్ని నింపగలను ఇంకా ఒక గదిని కూడా నింపగలను ఇతరులు నన్ను కలిగి ఉంటారు కానీ ఇద్దరు కలసి ఉన్నప్పుడు నేను మాత్రం ఉండలేను ఎవరు నేను?

👉 చదవండి

📚 Riddles in Telugu for All with Answers – Set 7

మరికొన్ని రిడిల్స్ మీ కోసం

  • నేనెప్పుడూ నీ చుట్టూనే వుంటాను కానీ నువ్వునన్ను చూడలేవు ,నీలో ఎటువంటి కదలిక లేకపోయినా నిన్ను ముందుకు నడిపిస్తాను, నేనెవరు?

👉 చదవండి

📚 Comedy Podupu Kathalu

నవ్వించే మరియు ఆలోచింపజేసే తెలుగు పొడుపు కథలు.

  • చీమ:నీవయసెంత?
    ఏనుగు :5 సంవత్సరాలు
    చీమ:మరి ఎందుకు ఇంత పెద్దగా ఉన్నావ్ ?
    ఏనుగు : నేను కామ్ ప్లాన్ తాగుతాను
    ఏనుగు:మరి నీ వయసెంత?
    చీమ:25 ఇయర్స్
    ఏనుగు:మరి నువ్వెందుకు ఇంత చిన్నగా వున్నావ్?
    చీమ::నేను…

👉 చదవండి

📚 10 Podupu Kathalu in Telugu with Answers

పిల్లలు మరియు ప్రారంభ స్థాయి వారికి అనువైన పొడుపు కథలు.

  • నాకు కళ్ళు లేవు చెవులు లేవు నోరులేదు కానీ నేను చూడగలను వినగలను రుచి కూడా చెప్పగలను ,నా పేరేంటి?

👉చదవండి


తెలుగు పొడుపు కథలు – జవాబులతో

1.తవ్వినా రాను.. సముద్రంలో మునిగిపోను..
నలుగురికి పంచితే పెరుగుతాను..
నా వల్ల కొందరు లాభపడతారు.. నన్ను వాడక కొందరు నష్టపోతారు..
ఓర్పుతో కూడిన సాధనే నా నిధి.. ఇంతకీ ఎవరిని నేను?

2.ఒక 25 నుంచి ఎన్ని సార్లు 5 ను తీసివేస్తారు(subtract) ?

3.రెండు బాతులు వేరొక రెండు బాతులకు ఎదురుగా వున్నాయి . రెండు బాతులకు వెనుకగా ఇంకో రెండు బాతులు వున్నాయి
మళ్ళి రెండు బాతులకు ప్రక్కన ఇంకో రెండు బాతులున్నాయి … మొత్తం ఎన్ని బాతులున్నాయి ఇక్కడ?

4.మీరు ఒక పర్వతం ఎక్కినప్పుడు దాని పై రెండు దారులు కనిపించాయి దానిలో ఒకటి ఆ పర్వతం రెండవవైపుకు తీసుకువెళ్తుంది రెండవదారి మిమ్మల్ని ప్రమాదం లో పడవేస్తుంది ఇప్పుడు మీకు అక్కడ వున్నా ఇద్దరు స్నేహితులు మాత్రమే సహాయం చేయగలరు ఎందుకంటే వారికి సరైన దారి తెలుసు కానీ వారిలో ఒకరు నీతిమంతులు(Honest ) ఒకరు అబద్దాలు మాత్రమే చెబుతారు. మీరు ఒకటే ప్రశ్న అడిగి వారినుండి సరైన దారి ఎలా తెలుసుకోగలరు ??

5.చింటూ వాళ్ళ చెల్లి ఒకటే గొడవపడుతున్నారు , వాళ్ళ గొడవ ఎలాఅన్నా ఆపాలని వాళ్ళ అమ్మ ఒక ఉపాయం వేసింది దాని ప్రకారం వాళ్ళిద్దరిని ఒకే పేపర్ మీద నుంచోపెట్టి ఒకరిని ఒకరు చూడకుండా ముట్టుకోకుండా చేసింది ,అది ఎలా !! చెప్పా గలరా ??

6.రేపు అనేది గురువారానికి నాలుగు రోజులు ముందైతే ,నిన్న అనేది ఏ రోజు అవుతుంది?? కొంచం కష్టం ఐనా ఆలోచించండి !!

7.కొన్ని నెలలలో 30 రోజులు కొన్ని నెలలలో 31 రోజులు ఉంటాయి ,మరి ఎన్ని నెలలలో 28 రోజులు ఉంటాయి ??

8.ఆ ఇంగ్లీష్ పదాన్ని తలక్రిందులుగా చదివినా ఒకేలా ఉంటుంది?? చెప్పండి చూద్దాం…

9.ఒక టాక్సీ డ్రైవర్ వన్ వే లో వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ పోలీస్ లు చూసారు ఐనా టాక్సీ డ్రైవర్ భయపడలేదు అంతే కాకుండా ట్రాఫిక్ పోలీస్ లు కూడా అతనిని ఆపలేదు ఎందుకో చెప్పండి??

10.నేను సూర్యునికన్నా ముందు వెళ్తున్నాను ,అయినా నా నీడ పడదు ?ఎవరు నేను !!

11.ఎడమనుండి కుడికి, కుడి నుండి ఎడమకు కదులుతూ ఉంటుంది ఏంటది ?

12.మీరు ఎంత వేగంగా పరిగెడితే దానిని పట్టుకోవడం అంట కష్టం … ఏంటది??

13.దాని పేరు చెబితేనే అది అంతమై పోతుంది!! ఏంటది మీరు తెలుసా??

14.ప్రతి రాత్రి మీరు చెప్పింది చెప్పినట్లు నేను ప్రతి ఉదయం చేస్తాను, అయినా కూడా మీతో తిట్లు తింటాను !! పాపం కదా నేనెవరో మీకు తెలుసా??

Scroll Down for Answers…..

 

 

 

 

 

 

 

Answers:

1.నేనే అండి జ్ఞానాన్ని (Knowledge)

2.ఒక్కసారే ,ఎందుకంటే ఒక్క సారి 25 ను subtract చేసాక అది 20 అవుతుంది కాబట్టి !!

3.మొత్తం 4 ,ఎందుకంటే అవి చతురస్త్రాకారమ్(square formation) లో ఏర్పడి వున్నాయి

4.మీరు వారిద్దరిని అడిగే ఒకటే ప్రశ్న … మీ ఫ్రెండ్ ఏమంటాడు? అని ….ఈ ప్రశ్న ఖచ్చింతంగా మీ సమస్య తీర్చుతుంది ఎందుకంటే ఒక వేళ సమాధానం Left Side అనుకుంటే … !!

మీరు అబద్దాలు చెప్పే వ్యక్తిని అడిగితే సమాధానం Left Side కాబట్టి ఖచ్చితంగా Right Side అంటాడు కానీ అతని ఫ్రెండ్ Honest కాబట్టి Left Side చెబుతాడు అంటాడు.

Honest Person తన ఫ్రెండ్ ఎలాగూ అబ్బడం చెబుతాడు కాబట్టి Right Side అంటాడు .

దీన్నిబట్టి మన సమాధానం దొరికినట్టే

5.ఆమె ఆ పేపర్ ని డోర్ క్రింద ఉంచి ,డోర్ కి ఒకవైపు వున్న పేపర్ పై ఒకరిని వెరొకవైపు ఇంకొకరిని ఉంచింది

6.శుక్రవారం.

7.అన్ని నెలలలో 28 రోజులు ఉంటాయి కదా!!

8.SWIMS

9.ఎందుకంటే అతను టాక్సీ డ్రైవేరే కానీ అతను టాక్సీలో వెళ్లడం లేదు నడచి వెళ్తున్నాడు .

10. గాలి.

11.నీ కన్ను

12.మన శ్వాస ,ఎంత వేగంగా పరిగెడితే శ్వాస అంట కష్టంగా ఉంటుంది

13.నిశ్శబ్దం

14.అలారం (గడియారం)


Telugu Podupu Kathalu Categories

👦 Kids Podupu Kathalu

పిల్లల కోసం సులభమైన మరియు సరదాగా ఉండే పొడుపు కథలు.

😂 Funny Podupu Kathalu

నవ్వించే మరియు వినోదాన్ని అందించే పొడుపు కథలు.

🧠 Hard Telugu Riddles

లోతుగా ఆలోచించేలా చేసే కష్టమైన రిడిల్స్.

🎯 Logic Riddles

లాజికల్ థింకింగ్‌ను పెంచే ప్రశ్నలు.

 


1. పొడుపు కథలు అంటే ఏమిటి? (What are Podupu Kathalu?)

పొడుపు కథలు అంటే ఒక వస్తువు, జంతువు, ప్రకృతి లేదా మన చుట్టూ కనిపించే ఏదైనా విషయాన్ని నేరుగా చెప్పకుండా, దాని లక్షణాలను తెలివిగా వివరిస్తూ అడిగే ప్రశ్నలు. వాటికి సరైన సమాధానం కనిపెట్టడం ఒక సరదా సవాలు.

ఇంగ్లీషులో వీటిని Riddles అంటారు. కానీ తెలుగు పొడుపు కథల ప్రత్యేకత ఏమిటంటే, వీటిలో ప్రాస, చమత్కారం, తెలుగు సంస్కృతి, జీవన విధానం అందంగా ప్రతిబింబిస్తాయి.

పొడుపు కథలకు సమాధానం చెప్పడాన్ని “విప్పడం” అని అంటారు. ఒక మంచి పొడుపు కథ వినేవారిని కాసేపు ఆలోచింపజేసి, సమాధానం తెలిసినప్పుడు ఆనందాన్ని కలిగిస్తుంది.


2. పిల్లలు పొడుపు కథలు ఎందుకు నేర్చుకోవాలి? (Why Should Children Learn Podupu Kathalu?)

ఇప్పటి పిల్లలు ఎక్కువ సమయం మొబైల్, టీవీ, వీడియో గేమ్స్‌తో గడుపుతున్నారు. అలాంటి సమయంలో పొడుపు కథలు వారికి సరదాతో పాటు మంచి నేర్చుకునే అనుభవాన్ని ఇస్తాయి.

✅ భాషా నైపుణ్యం (Language Skills)

కొత్త తెలుగు పదాలు, సామెతలు, ప్రాసలు నేర్చుకుని భాషపై మంచి పట్టు పెరుగుతుంది.

✅ ఆలోచనా శక్తి (Logical Thinking)

ప్రశ్నలోని చిన్న చిన్న సూచనలను గమనించి సరైన సమాధానం కనుగొనే అలవాటు ఏర్పడుతుంది.

✅ Creativity

ఒకే విషయాన్ని కొత్త కోణంలో ఆలోచించే సృజనాత్మకత పెరుగుతుంది.

✅ Memory Power

పొడుపు కథలు గుర్తుంచుకోవడం వల్ల జ్ఞాపకశక్తి మెరుగవుతుంది.

✅ Confidence

సరైన సమాధానం చెప్పినప్పుడు పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.


3. తెలుగు పొడుపు కథల రకాలు (Types of Telugu Podupu Kathalu)

తెలుగు పొడుపు కథలు అనేక రకాలుగా ఉంటాయి. కొన్ని ప్రకృతి గురించి ఉంటే, కొన్ని మన దైనందిన జీవితంలోని వస్తువులపై ఆధారపడి ఉంటాయి.

రకం ఉదాహరణ
🌿 ప్రకృతి పొడుపు కథలు ఆకాశం, చంద్రుడు, నక్షత్రాలు
🥭 పండ్లు & కూరగాయలు మామిడి, పనస, కొబ్బరికాయ
👁️ శరీర భాగాలు కళ్ళు, చెవులు, పళ్ళు
🏡 ఇంటి వస్తువులు దీపం, గడియారం, అద్దం
🐄 జంతువులు ఆవు, గుర్రం, కోడి
😂 Funny Podupu Kathalu నవ్వించే చమత్కార ప్రశ్నలు
🧩 Hard Riddles పెద్దలకు సవాలుగా ఉండే పొడుపు కథలు

4. పొడుపు కథల వల్ల కలిగే ప్రయోజనాలు (Benefits of Podupu Kathalu)

పొడుపు కథలు కేవలం వినోదం మాత్రమే కాదు. ఇవి పిల్లల మానసిక వికాసానికి ఎంతో ఉపయోగపడతాయి.

  • ✔️ Logical Thinking మెరుగవుతుంది.
  • ✔️ Problem Solving Skills పెరుగుతాయి.
  • ✔️ Memory Power బలపడుతుంది.
  • ✔️ Observation Skills అభివృద్ధి చెందుతాయి.
  • ✔️ Communication Skills మెరుగవుతాయి.
  • ✔️ Creativity పెరుగుతుంది.
  • ✔️ తెలుగు భాషపై ఆసక్తి పెరుగుతుంది.

5. తెలుగు సంస్కృతిలో పొడుపు కథల ప్రత్యేకత

పొడుపు కథలు మన తెలుగు సంస్కృతిలో ఒక ముఖ్యమైన భాగం. ఒకప్పుడు గ్రామాల్లో రాత్రి భోజనం తర్వాత కుటుంబ సభ్యులంతా కలిసి కూర్చొని పొడుపు కథలు చెప్పుకునేవారు. అలా వినోదంతో పాటు జ్ఞానం కూడా పంచుకునేవారు.

వ్యవసాయం, ప్రకృతి, జంతువులు, పండుగలు, కుటుంబ విలువలు వంటి ఎన్నో విషయాలు ఈ పొడుపు కథల్లో దాగి ఉంటాయి. అందుకే ఇవి కేవలం ఆటలు కాదు, మన సంస్కృతిని తరువాతి తరాలకు అందించే గొప్ప సంప్రదాయం.


6. తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

❓ పొడుపు కథలు ఏ వయస్సు వారికి ఉపయోగపడతాయి?

5 సంవత్సరాల వయస్సు నుండి పెద్దల వరకు అందరూ పొడుపు కథలను ఆస్వాదించవచ్చు. పిల్లలకు ఇవి ఆలోచిస్తూ నేర్చుకునే సరదా సాధనంగా ఉపయోగపడతాయి.


❓ పొడుపు కథలు పిల్లలకు ఎలా ఉపయోగపడతాయి?

పిల్లల్లో Thinking Skills, Memory Power, Language Skills, Creativity, Problem Solving Ability పెంచడంలో పొడుపు కథలు ఎంతో సహాయపడతాయి.


❓ తెలుగు పొడుపు కథలను ఎలా ప్రాక్టీస్ చేయాలి?

ప్రతిరోజూ 5–10 పొడుపు కథలు చదవడం, కుటుంబ సభ్యులతో ప్రశ్నలు అడిగి సమాధానాలు చెప్పించడం, స్నేహితులతో Quiz లాగా ఆడడం ఉత్తమ మార్గం.


❓ ఈ పేజీలో ఏమి లభిస్తుంది?

ఈ పేజీలో 100+ తెలుగు పొడుపు కథలను వివిధ సెట్లలో, వాటి సమాధానాలతో చదవవచ్చు.

Funny, Hard, Kids, Riddles with Answers వంటి అనేక Categories ఒకేచోట లభిస్తాయి.


More Telugu Stories

📖 తెలుగు నీతి కథలు

📚 పంచతంత్ర కథలు

🦚 శ్రీకృష్ణ కథలు

🤝 స్నేహ కథలు


 

ముగింపు

తెలుగు పొడుపు కథలు వినోదంతో పాటు జ్ఞానాన్ని అందించే అద్భుతమైన సంపద. పిల్లలు, విద్యార్థులు మరియు పెద్దలు అందరూ ఈ పొడుపు కథల ద్వారా తమ ఆలోచనా శక్తిని మరియు తెలివితేటలను పెంపొందించుకోవచ్చు. మీకు నచ్చిన పొడుపు కథలను స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో పంచుకోండి.

 

2 thoughts on “100+ తెలుగు పొడుపు కథలు with Answers | Telugu Riddles”

Comments are closed.

error: Content is protected !!